
Varun Tej: మెగా వారసుడిక్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్
Varun Tej: మెగా వారసుడి క్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Varun Tej: మెగా వారసుడి క్యూట్ ఫొటోలు రివీల్.. కొడుకుపై వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Varun Tej Son | వరుణ్ తేజ్-లావణ్య కొడుకు వాయువ్ ఫేస్ రివీల్.. ఫస్ట్ బర్త్‌డేకే మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్!

Varun Tej: కుమారుడి ఫస్ట్ బర్త్ డే.. ఎట్టకేలకు వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

వరుణ్ తేజ్ నటించిన హిట్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి డిజిటల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది

ఆగస్ట్ (August 2026) మొదటివారంలో కొరియన్ కనకరాజు, డీసీ, జీడీ నాయుడు, కేజేక్యూ, అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “కొరియన్ కనకరాజు” క్లీన్ హిట్ అనిపించుకుంది. పరిమిత బడ్జెట్ లో తీయడం, మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చింది. వరుణ్ తేజ్ ఈ మూవీతో గట్టెక్కాడు. మిగతా సినిమాల్లో “డీసీ”కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తక్కువ రేటుకు అమ్మకాలు సాగడంతో బయ్యర్లకు బాగానే డబ్బులొచ్చాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రెండో వారంలో “విశ్వనాధ్ అండ్ సన్స్,” పళ్ల బురుసు, పాంచాలి పంచ భర్తృక, అగథ, మకుటం, హుషార్ పిట్టలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో “విశ్వనాధ్ అండ్ సన్స్” సినిమా సూపర్ హిట్టయింది. తమిళ్ లో కంటే తెలుగులో మంచి వసూళ్లు సాధించింది ఈ చిత్రం. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన పళ్ల బురుసుతో పాటు మిగతా సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎమ్మెస్ రాజు తీసిన అగధ చిత్రం కూడా ఆడకపోగా.. విశాల్ చేసిన మకుటం కూడా ఫ్లాప్ అయింది. సురేశ్ బాబు రిలీజ్ చేసిన హుషార్ పిట్టలు సినిమాకు ఏపీలో కొన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు వచ్చాయి. మూడో వారంలో ఇరుముడి, ఖలీఫా, సర్దార్ సర్వాయి పాపన్న, అమీర్ లోగ్, రెడ్ బ్యాగ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. రవితేజ నటించిన “ఇరుముడి” బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. నాలుగో వారంలో టాక్సిక్, కికు చిరంజీవి, హాయ్ సినిమాలు రిలీజ్ అవ్వగా.. యశ్ నటించిన “టాక్సిక్” సినిమా డిజాస్టర్ అయింది. మొదటి వారం 280 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినప్పటికీ, సినిమా ఎక్కడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేదు. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇలా ఆగస్ట్ లో ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వగా, 2 సినిమాలు హిట్

సెప్టెంబర్ మొదటి వారంలో వినోదాన్ని అందించడానికి వివిధ డిజిటల్ వేదికలు సిద్ధమయ్యాయి. ఈ వారం సెప్టెంబర్ 1 నుండి 6 వరకు ప్రేక్షకులను అలరించేందుకు విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు మరియు సిరీస్‌లు ఓటీటీలో అడుగుపెడుతున్నాయి. థ్రిల్లర్, కామెడీ, హారర్ మరియు కోర్ట్‌రూమ్ డ్రామా వంటి వైవిధ్యమైన శైలులలో ఈ లైనప్ రూపుదిద్దుకుంది. కుటుంబ సమేతంగా చూడటానికి మరియు ఒకేసారి వరుసగా వీక్షించడానికి అనువైన అనేక శీర్షికలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 3న తాప్సీ పన్ను నటించిన గాంధారి చిత్రం ప్రసారం కానుంది. కిడ్నాప్ అయిన తన కుమార్తెను వెతుక్కుంటూ చూపు కోల్పోయిన ఒక తల్లి చైల్డ్ ట్రాఫికింగ్ మాఫియాతో చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీనితో పాటు ఆగస్టు 7న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన వరుణ్ తేజ్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు సెప్టెంబర్ 4న రానుంది. అనంతపురం కనకరాజు శరీరంలోకి కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ప్రవేశించే కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇదిలా ఉండగా జూలై 10న థియేటర్లలో సందడి చేసిన అజయ్ దేవగన్ మరియు సంజయ్ మిశ్రా ల కామెడీ చిత్రం ధమాల్ 4 కూడా సెప్టెంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. గుప్తనిధి వేట మరియు గందరగోళం చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచుతుంది. దీనితో పాటు ద జెంటిల్మెన్ సీజన్ 2 కూడా సెప్టెంబర్ 3న ప్రసారానికి సిద్ధంగా ఉంది. మరొక ప్రముఖ సంస్థ సోనీ లివ్ లో కుంచాకో బోబన్ నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ఉన్మాదం సెప్టెంబర్ 4న అందుబాటులోకి రానుంది. జూలై 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఒక పాత కేసు తిరిగి తెరుచుకోవడంతో ఒక పోలీసు అధికారి జీవితంలో వచ్చే మార్పుల చుట్టూ తిరుగుతుంది. ఫలితంగా క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలను

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని “పివిఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్” ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయనున్నారు.ఈ రోజు హైదరాబాద్ లో ఈ చిత్ర ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సుమన్ మాట్లాడుతూ ఇందులో వితిక చేసిన క్యారెక్టర్ కోసం ఓ పెద్ద ఆర్టిస్ట్ చుట్టూ డైరెక్టర్ చాలా ఏళ్లు తిరిగాడు. సినిమా చూశాక నాలాగే మీరు ఫీల్ అవుతారు, ఆమె అన్‌లక్కీ అండ్ వితిక లక్కీ అని. ఇందులో హీరోగా చేసిన నటరాజ్ నా మిత్రుడు, తెలుగులో ఎన్నో సినిమాల్లో విలన్‌గా చేసిన సత్య కొడుకు. ఈ సినిమా మీద నేను ఎందుకు నమ్మకంగా ఉన్నాను అంటే, డైరెక్టర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాడు. నిజానికి డెబ్యూ డైరెక్టర్‌కి ఆ ‘నో కాంప్రమైజ్’ అనే మైండ్‌సెట్ ఉండాలి, అప్పుడే మంచి చిత్రాలు వస్తాయి. ఆర్టిస్ట్ శివ పెర్ఫార్మెన్స్ చూస్తే భయమేస్తుంది. ఆ సీన్స్ నిజానికి ఏ ఆర్టిస్ట్ చేయడానికీ ధైర్యం చేయలేడు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తే, తమిళ విజయ్ పొలిటికల్ కెరీర్‌ను పోలి ఉన్నాయి ఏంటి అనుకుంటారు. కానీ నిజానికి ఆయన సీఎం అవ్వకముందే ఈ సినిమా చేశాము. ఇలా గతంలో ‘నేటి భారతం’ లాంటి సినిమాలు టి. కృష్ణ గారు చేసేవారు. ఆయనలాగే ఈ డైరెక్టర్ కూడా చాలా దూరదృష్టితో యూత్ డ్రగ్స్‌కు బానిస కావడం, రాజకీయ నాయకులకు మంచి మెసేజ్ ఇచ్చే సీన్స్‌తో ఈ సినిమా తీశారు. నిజానికి సినిమా వ్యాపారం అంటే లాస్ అని

నటి వితికా షేరు రీసెంట్గా బ్లాక్ శారీలో (నలుపు చీరలో) ఓ సినిమా ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ట్రెడిషనల్ లుక్‌లో ఆమె చాలా అందంగా కనిపిస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) హైదరాబాద్ : హైటెక్స్‌లో హిమ్టెక్స్ ప్రదర్శన (ఫొటోలు) స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు) చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు) విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు తాళలేక చిన్నారి మృతి అబ్బా.. కొడుకులకు ఫైనల్ వార్నింగ్.. DSC కుంభకోణంలో సంచలన నిజాలు రజినీకాంత్ ‘ధర్మన్’ సినిమాలో విలన్‌గా నటించనున్న రామ్ పోతినేని? జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు యువతిని కారుతో ఢీ కొట్టి చంపిన జనసేన MP కొడుకు అసలేం జరిగింది?

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అన్నయ్య, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి వెండితెరపై కనిపించాలన్న తన కోరికను బయటపెట్టారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’తో మంచి సక్సెస్‌ను అందుకున్న ఆయన.. ఈ సినిమా సక్సెస్‌తో పాటు తన కెరీర్, రాబోయే ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో కొంత ఒత్తిడికి గురైనట్లు ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తెలిపారు. అయితే ‘కొరియన్ కనకరాజు’కు ప్రేక్షకుల నుంచి లభించిన స్పందనతో ఇప్పుడు ఎంతో రిలీఫ్‌గా ఉందన్నారు. నటుడిగా ఒకే తరహా జానర్‌కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని.. విభిన్న పాత్రల్లో నటిస్తూ తనను తాను నిరూపించుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా తర్వాత ఓటీటీ ప్రభావం పెరిగినప్పటికీ.. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పుడు వారికి పూర్తిస్థాయి వినోదాన్ని అందించడం చాలా ముఖ్యమని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చిన తర్వాత తమ ఒత్తిళ్లను మరిచిపోయేలా సినిమా ఉండాలని అభిప్రాయపడ్డారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ గురించి కూడా వరుణ్ తేజ్ మాట్లాడారు. గతంలో తాను నటించిన ‘గని’లో క్రీడలతో పాటు పలు అంశాలను కలపడం వల్ల కథ కొంత గందరగోళంగా అనిపించిందని అంగీకరించారు. అయితే ‘బరి’ మాత్రం పూర్తిగా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా అని, ఇందులో స్టోరీ ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంటుందని వెల్లడించారు. ఈ సినిమా ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అభిమానుల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో ఓ రొమాంటిక్ చిత్రానికి అంగీకరించినట్లు వరుణ్ తేజ్ తెలిపారు. తన వయసుకు తగ్గ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని, రొటీన్ లవ్ స్టోరీలకు భిన్నమైన శైలిలో ఈ సినిమా ఉంటుందని వెల్లడించారు. రామ్ చరణ్‌తో కలిసి సినిమా

మెగా కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ (Varun Tej) ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. తెరపై తన నటనతో అభిమానులను అలరిస్తున్న వరుణ్ తేజ్ కు, కెమెరా వెనుక నిలబడి యాక్షన్ చెప్పాలనే బలమైన కోరిక ఉండేదట. అందరిలాగే హీరో కావాలనే కలతో ఇండస్ట్రీకి రాలేదని, ముందుగా ఒక దర్శకుడిగా రాణించాలనే లక్ష్యంతోనే తాను సినీ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆయన స్వయంగా ఒక సందర్భంలో పంచుకున్నాడు. దర్శకత్వంపై ఉన్న అమితమైన ఆసక్తితోనే వరుణ్ తేజ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఒక సినిమాను తెరకెక్కించడం, తెరపై కథను దృశ్య రూపంలో ఆవిష్కరించడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అయితే, కుటుంబ వాతావరణం, తోటి నటుల విజయాలు, పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన నటన వైపు అడుగులు వేయాల్సి వచ్చింది. అలా దర్శకుడిగా మారాల్సిన వ్యక్తి, హీరోగా మారి తొలి సినిమా ‘ముకుంద’తో ప్రేక్షకులను పలకరించారు. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, తనలోని డైరెక్టర్ మాత్రం ఎప్పుడూ సజీవుగానే ఉన్నాడని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. తన అన్నయ్య రామ్ చరణ్‌తో కలిసి పనిచేయాలనే బలమైన కోరిక తనలో ఉందని వరుణ్ తేజ్ మనసులో మాట బయటపెట్టాడు. ఒకవేళ భవిష్యత్తులో తాను దర్శకత్వం వైపు అడుగులు వేస్తే, రామ్ చరణ్‌ను హీరోగా పెట్టి ఒక అద్భుతమైన సినిమాను తీయాలనే ఆలోచన ఉందంటున్నాడు. రీసెంట్ గా ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో హిట్ కొట్టాడు ఈ మెగా హీరో

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి కొత్త ట్యాలెంట్ ని వెతికి పట్టుకోవడంలో, కొత్త కథలని తయారు చేయించుకోవడంలో ఎంతో అనుభవం ఉంది. తన కెరీర్ బిగినింగ్ నుంచి దిల్ రాజు కథపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఒక కథ నచ్చి అది వర్కౌట్ అవుతుంది అనిపిస్తే దిల్ రాజు వదిలిపెట్టరు. అందుకే దిల్ రాజుకి ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువ. మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు రిజెక్ట్ చేసిన కథతో దిల్ రాజు సూపర్ హిట్ కొట్టి చూపించారు. దీని గురించి దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హ్యాపీ డేస్ టైం నుంచి శేఖర్ కమ్ములతో పరిచయం ఉంది. హ్యాపీడేస్ చిత్రాన్ని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి రిలీజ్ చేశారు. ఆ సినిమాకి మంచి పబ్లిసిటీ లభించడంలో దిల్ రాజు స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయింది. హ్యాపీడేస్ రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల చిత్రం ఖరారైంది. ఆ సినిమానే ఫిదా. ఈ చిత్రం విషయంలో తెరవెనుక చాలా కసరత్తు, పరిణామాలు చోటు చేసుకున్నాయి అని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ఫిదా స్టోరీ లైన్ విన్నప్పుడు ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. శేఖర్ కమ్ముల ఈ కథని ఎలాగైనా స్టార్ హీరోతోనే చేయాలి అనే పట్టుదలతో ఉన్నారు. నేను ఎంటర్ కావడానికి ముందే మహేష్ బాబుకి కథ వినిపించారు. మహేష్ కి కథ నచ్చింది. కానీ తన ఇమేజ్ కి సరిపోతుందా అనే డౌట్ తో పక్కన పెట్టారు. నేను ఎంటర్ అయ్యాక రాంచరణ్ కి కథ వినిపించాం. చరణ్ వద్ద కూడా అదే సిట్యుయేషన్. అల్లు అర్జున్ కూడా విని బావుంది అని అన్నారు. కానీ ఒక స్టార్ హీరోకి సరిపడే అంశాలు ఈ సినిమాలో

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా `కొరియన్ కనకరాజు` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. దీన్ని కామెడీ హర్రర్, థ్రిల్లర్‌గా ఆయన రూపొందించారు. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్, టెంపర్ వంశీ ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ చిత్రం తెరకెక్కింది. ఆగస్ట్ 7న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా 13రోజులు పూర్తి చేసుకుంది. ఇంకా థియేటర్లో రన్ అవుతుంది. 13వ రోజు ఎంత కలెక్షన్లని రాబట్టింది, ఇప్పటి వరకు టోటల్‌గా ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే. ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కేవలం రూ.12కోట్ల థియేట్రికల్ బిజినెస్‌తో విడుదలైన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కాకపోతే పెద్ద స్థాయిలో సినిమా వసూళ్లని కలెక్ట్ చేస్తుందని భావించారు. కానీ ఆ స్థాయిలో చేయలేకపోయింది. వంద కోట్ల వరకు వెళ్లలేకపోయింది. ఈ మూవీ 13 రోజుల్లో మొత్తంగా రూ.31.75కోట్లు రాబట్టింది. బుధవారం దీనికి రూ.25లక్షలు మాత్రమే వచ్చాయి. మంగళవారంతో పోల్చితే మూడు లక్షలు తగ్గాయి. ఇది సినిమా థియేట్రికల్ గా క్లోజ్ అవుతుందనేదానికి సంకేతంగా చెప్పొచ్చు. మహా అయితే ఈ వారాంతం వరకు ఆడుతుంది. ఆ తర్వాత ఎత్తేయాల్సి వస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ సినిమా 10 రోజులకే రూ.50కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ లెక్కన ఇప్పటి వరకు మరో కోటి, రెండు కోట్లు యాడ్ చేసి ఉంటారు. చిత్ర బృందం అధికారిక లెక్కల ప్రకారం ఇది దాదాపు రూ.52కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో వెళ్తుంది. ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం దీనికి నాలుగైదు కోట్ల లాభాలు వచ్చి ఉంటాయి. అదే టీమ్ లెక్కల ప్రకారం పది కోట్లకుపైగానే లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కొరియన్ కనకరాజు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన సోలో విజయం కాబట్టి కనకరాజు మూడ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వరుణ్ మాట్లాడుతు ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ ని కోరుకుంటున్నారనే విషయం బాగా అర్థమైందని చెప్పుకొచ్చాడంటే తన అప్ కమింగ్ సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ఉండబోతున్నాడో తెలుస్తుంది. వరుణ్ తేజ్ అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే తన సోదరి నీహారిక నిర్మాణ సారధ్యంలో కమిటి కర్రోళ్ళు డైరెక్టర్ తో 'బరి' మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన లిస్ట్ లో తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్ సృష్టించిన స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో ఓ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోబోతుంది. ఇటీవలే "కొరియన్ కనకరాజు" చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని పూర్తి జోరు మీదున్న వరుణ్ తేజ్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రొటీన్ మాస్, యాక్షన్ సినిమాల బాటలో వెళ్లకుండా, కథాంశంలో వైవిధ్యం ఉన్న ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తూ సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే కార్తీక్ సుబ్బరాజ్‌తో కలిసి ఓ విభిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన మూస ధోరణిలో, రెగ్యులర్ ఎమోషన్స్‌తో సాగుతుంటాయి. కానీ, ఈ సినిమా మాత్రం దానికి నూటికి నూరు శాతం భిన్నంగా ఉండబోతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. తన ప్రస్తుత వయస్సుకు, మెచ్యూరిటీకి సరిగ్గా సరిపోయే ఒక పరిణతి చెందిన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కనుందని వరుణ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. ఇది రొటీన్ లవ్ స్టోరీలా కాకుండా, ప్రేక్షకులు అస్సలు ఊహించని కొత్త కోణంలో సాగుతుందని, కథనంలో ఉండే వినూత్న ట్విస్టులు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్తీక్

కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇటీవల కొరియన్ కనకరాజు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej ) తన తదుపరి సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ముందు నుంచి విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న ఆయన మరోసారి అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj)తో కలిసి ఓ రొమాంటిక్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా తన వయసుకు తగ్గ ప్రేమకథగా ఉంటుందని వరుణ్ తేజ్ వెల్లడించారు. అయితే ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ (Love Story) లా ఉండదని, తన వయసుకు సరిపోయే ప్రేమకథను కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించనున్నారని పేర్కొన్నారు. ఈ కథ చాలా భిన్నంగా ఉండబోతుందని తెలిపారు. ఇదిలాఉంటే.. కార్తీక్ సుబ్బరాజ్ మొదటి నుంచి కొత్త తరహా కథనం, టేకింగ్‌తో అగ్ర దర్శకులు రాజమౌళి, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ, సుకుమార్, వెట్రి మారన్ వంటి దిగ్గజ దర్శకుల జాబితాలో పేరు గడించాడు. తన సినిమాల్లో విభిన్నమైన కథనం, ప్రత్యేకమైన పాత్రలను చూపించడంలో పేరుగాంచిన అలాంటి దర్శకుడితో వరుణ్ తేజ్ లవ్ స్టోరీ చేయనుండటం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. చాలామంది షాక్ కూడా అవుతున్నారు. కాగా.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, హీరోయిన్, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ తదితర విషయాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ గతంలోనూ జానర్ పరంగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ తో చేయబోయే ఈ డిఫరెంట్ లవ్ స్టోరీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది

తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మెగా జంట వరుణ్ తేజ్(VarunTej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) జంట బుధవారం హైదరాబాద్‌లోని తాడ్‌బండ్ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని (Shree Tadbund Veeranjaneya Swami Temple) సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ నరేందర్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలను సాదరంగా ఆహ్వానించి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ దంపతులు మాట్లాడుతూ.. ఎంతో మహిమగల వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిని చూసేందుకు ఆలయం వెలుపల అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన హీరోహీరోయిన్లతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడంతో అక్కడ సందడి నెలకొంది

ఇంటర్నెట్ డెస్క్: ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju)తో హిట్ అందుకున్నారు టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. సినిమాల ఎంపిక, రాబోయే ప్రాజెక్ట్స్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అన్న రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనుందని వెల్లడించారు. ‘‘ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ తర్వాత ప్రశాంతంగా ఉన్నాను. గత 5 ఏళ్లుగా సరైన విజయం దక్కలేదు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించడం సంతోషంగా ఉంది. మొదటి నుంచి నేను ఒకే జానర్ సినిమాలు తీయకూడదని నిర్ణయించుకున్నా. ఒక నటుడు ఏ క్యారెక్టర్లోనైనా, ఏ జానర్లోనైనా ఇమడగలగాలి. కోవిడ్‌లో ఓటీటీ కంటెంట్ చాలా చూశాను. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలు చేయాలని అప్పుడే అర్థమైంది. వాళ్లు థియేటర్లో సినిమా చూసి, నవ్వుతూ.. ఒత్తిడి, టెన్షన్లు మర్చిపోవాలి. అదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు. ‘గని’ ఫెయిల్ అయ్యాక మళ్లీ స్పోర్ట్స్ డ్రామా ఎందుకు? అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘గని’లో అన్నీ కలిపి గందరగోళం చేశాం. ఈసారి ‘బరి’ చాలా రూటెడ్‌గా, హైపర్-ఫోకస్డ్గా ఉంటుంది’ అని స్పష్టం చేశారు. నిహారిక గురించి మాట్లాడుతూ.. ‘మేం ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ‘బరి’ (Bari) ఐడియా తనే ఇచ్చింది. నచ్చడంతో ఓకే చెప్పా. యంగ్, ప్యాషనేట్ టీమ్‌తో వర్క్ చేయడం కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక రొమాంటిక్ సినిమాకు కూడా ఓకే చెప్పా. ఇది నా వయసుకి సూట్ అయ్యే లవ్ స్టోరీ. ఇతర ప్రేమకథా చిత్రాలతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. ‘‘ చరణ్ అన్నయ్య పెద్ద స్టార్. ఆయన సినిమాలపై పెట్టే ఎఫర్ట్ చూసి నేను కూడా అలా అవ్వాలని అనుకుంటాను. ప్రతీ యాక్టర్‌కి పోలికలు ఉంటాయి. దాన్ని పాజిటీవ్‌గా తీసుకోవాలి. చరణ్ అన్నతో ఒక సినిమా చేయాలని ఉంది. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. నేను ఇండస్ట్రీకి డైరెక్టర్ కావాలనే వచ్చాను

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఓటిటిలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్, సెప్టెంబర్ 10 లేదా 11 తేదీలలో ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. దర్శకుడు మెర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం, వరుణ్ తేజ్ కెరీర్లో ఒక బలమైన హిట్‌గా నిలిచింది. వరుస పరాజయాల తర్వాత ఈ సినిమాతో వరుణ్ తేజ్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కామెడీ ట్రాక్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ఈ చిత్రం ₹50 కోట్ల వసూళ్లను దాటేసి రికార్డు సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రానికి ఇది భారీ విజయం అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కూడా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. దాదాపు ₹26 కోట్ల భారీ మొత్తానికి ఈ హక్కులు అమ్ముడైనట్లు సమాచారం. థియేటర్లలో భారీ సక్సెస్ సాధించడంతో, ఓటిటి విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫలితంగా, సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వద్దే కూర్చుని కొరియన్ కనకరాజు కామెడీని ఆస్వాదించేందుకు నెటిజన్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా, కొరియన్ కనకరాజు తన అద్భుతమైన కథాంశంతో థియేటర్ల తర్వాత డిజిటల్ తెరపై కూడా సందడి చేయనుంది. కామెడీ మరియు హారర్ కలబోతగా

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇప్పుడాయన నటించిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ఒకరు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా.. తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్‌ను ఎంచుకున్నారు. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ లవ్‌స్టోరీలు, యాక్షన్ థ్రిల్లర్లు, స్పేస్ అడ్వెంచర్, బాక్సింగ్ డ్రామా, పేట్రియాటిక్ సినిమాలు ఇలా జోనర్ ఏదైనా సరే తనదైన నటనతో వైవిధ్యం చాటుకుంటూ వస్తున్నారు. అయితే, వరుణ్ గత మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో వరుణ్‌కి ఎప్పుడెప్పుడు హిట్ వస్తుందా? అని అటు ఫ్యామిలీ, ఇటు ఫ్యాన్స్ ఎంతగానో వేచి చూస్తున్నారు. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా ఆయన నటించిన సరికొత్త ఇండో-కొరియన్ హారర్-కామెడీ డ్రామా ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సంచలన విజయాన్ని నమోదు చేసి, థియేటర్ల వద్ద కలెకన్ల సునామీ సృష్టిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఆగస్ట్ 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలుపుతూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీకెండ్స్‌లోనే కాకుండా వీక్డేస్లోనూ ఈ సినిమా కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తూ.. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఒక మైలురాయిలా నిలిచిందీ చిత్రం. ఇక ‘కొరియన్ కనకరాజు’ కథ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండ గ్రామానికి చెందిన కనకరాజు అనే పల్లెటూరి కుర్రాడి శరీరంలోకి ఊహించని

ఒకప్పుడు మీనా .. రంభ .. నగ్మా వంటి బొద్దుగా ఉన్న బ్యూటీలు తెలుగు తెరను ఒక ఊపు ఊపేశారు. స్టార్ హీరోలతో కలిసి వరుస విజయాలను అందుకుంటూ, తమ కెరియర్ ను పరుగులు తీయించారు. అలా కాస్త బొద్దుగా కనిపిస్తూ .. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఈ మధ్య కాలంలో యూత్ ను ఆకట్టుకున్న బ్యూటీగా రితికా నాయక్ కనిపిస్తుంది. 'మిరాయ్' సినిమాలో ఈ సుందరిని చూసిన కుర్రాళ్లు, థియేటర్స్ దగ్గరే మనసులు పోగొట్టుకున్నారు. ఈ ముద్దుగుమ్మ నెలకో సినిమా చేస్తే బాగుండునే అనుకున్నారు. కానీ 'మిరాయ్' మాదిరిగానే తనకి బాగా నచ్చే కంటెంట్ కోసం రితికా ఎదురుచూస్తూ వచ్చిందనే విషయం, 'కొరియన్ కనకరాజు' రిలీజ్ తరువాతనే అర్థమవుతోంది. రీసెంటుగా విడుదలైన ఈ సినిమా, అనూహ్యమైన రెస్పాన్స్ ను అందుకుంది. కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న వరుణ్ తేజ్ కి ఈ సినిమా ఫలితం ఊరటను ఇచ్చింది .. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమాలోను నటన పరంగా .. గ్లామర్ పరంగా రితికా మంచి మార్కులు కొట్టేసింది. అందానికి అదృష్టం తోడైతే ఇలాగే ఉంటుందని అనిపించింది. కొంత కాలంగా టాలీవుడ్ లో హీరోయిన్స్ వైపు నుంచి సందడి తగ్గిందనే చెప్పాలి. ఒకటి రెండు సినిమాలు చేసుకుపోతున్నారే తప్ప, నిలకడగా ఎవరూ సక్సెస్ లు సాధించలేకపోతున్నారు. టాప్ త్రీ .. టాప్ 5 అంటూ గతంలో మాదిరిగా ఒక జాబితా చూసుకుంటే, ఎవరూ కనిపించని ఒక గందరగోళం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరో భారీ హిట్

మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ని పలకరించారు. ఆయన మొదటి సారి హర్రర్, థ్రిల్లర్, కామెడీ కాన్సెప్ట్ తో `కొరియన్ కనకరాజు` మూవీ చేశారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన చిత్రమిది. దీనికి ముందు అటు వరుణ్ తేజ్, ఇటు మేర్లపాక గాంధీకి హిట్లు లేవు. దీంతో వీరిద్దరు ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఈ మూవీని చేశారు. చాలా కసితో చేశారని చెప్పొచ్చు. ఆ కసి సినిమాలో కనిపిస్తుంది. ఆగస్ట్ 7న `కొరియన్ కనకరాజు` మూవీ విడుదలైంది. కామెడీ అంశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో సినిమా జనాలకు కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా సత్య కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఇంకా చెప్పాలంటే సినిమాకి నిజమైన హీరో అయనే అని చెప్పొచ్చు. అంతగా సినిమాని నడిపించాడు. వరుణ్ కి హిట్ రావడానికి కారకుడయ్యాడు. అలాగే మేర్లపాక గాంధీ టేకింగ్, రైటింగ్, మ్యూజిక్ వంటివన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. మొత్తంగా వరుణ్ తేజ్ హిట్ కొట్టారు. బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఇక ఈ మూవీ విడుదలై పది రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయి. ఎంత లాభాలు సాధించిందనేది చూస్తే. `కొరియన్ కనకరాజు` మూవీకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, థియేట్రికల్ బిజినెస్ రూ.12కోట్లు అని సమాచారం. నాన్ థియేట్రికల్‌గానే దీనికి రూ.26కోట్ల వరకు వచ్చిందట. దీంతో పన్నెండు కోట్లని థియేట్రికల్‌గా నిర్ణయించారు. ఈ లెక్కన ఈ మూవీ మొదటి వారాంతంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు లాభాల దిశగా వెళ్తోంది. ఈ సినిమాకి పదిరోజుల్లో రూ.31.15కోట్లు వచ్చాయి. అంటే రూ.16కోట్ల షేర్ వచ్చింది. నాలుగు కోట్లకుపైగానే లాభాలు పొందింది. ఈ

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకులకు వరుస విజయాలు సాధించడం చాలా అవసరం. సరైన విజయం లేకపోతే అభిమానుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇటీవలే అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో మంచి విజయం సాధించి తన కెరీర్‌ను మళ్లీ బలమైన బాటలో నిలబెట్టారు. ఇప్పుడు అదే రీతిలో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కనక రాజు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. గత కొంతకాలంగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ ఈ విజయంతో పెద్ద ఊరట చెందారు. వరుసగా వచ్చిన పరాజయాలు మెగా బ్రాండ్ ఇమేజ్‌పై కొంత ప్రభావం చూపినప్పటికీ ఆయన ధైర్యంగా ముందుకు సాగారు. కొరియన్ కథాంశం ప్రేరణతో తెరకెక్కిన కనక రాజు సినిమాతో ఇప్పుడు వరుణ్ తేజ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నారు. ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం విజయవంతమైంది. ప్రారంభ మూడు రోజుల్లోనే ఈ సినిమాకు అత్యంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయని సమాచారం అందుతోంది. దీంతో ఈ హారర్ కామెడీ డ్రామా చిత్రం వేగంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం వరుణ్ తేజ్ కెరీర్‌కు ఎంతో ప్లస్ పాయింట్‌గా మారింది. ఫలితంగా అటు అఖిల్ ఇటు వరుణ్ తేజ్ ఇద్దరూ ఒకే సమయంలో విజయాలు సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో ఒక్క మంచి విజయం హీరోలకు మరో ఐదారు ఏళ్ల పాటు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాని తన కెరీర్‌ను చిన్నగా ప్రారంభించి ప్యారడైజ్ చిత్రంతో 200 కోట్ల క్లబ్లో చేరిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మెగా

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో, సీఎం విజయ్ తో త్రిష పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై చాలా కథనాలు వైరల్ అవుతున్నాయి. కొందరు నేతలు, నటులు ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కావాలనే త్రిష పేరును వివాదాల్లోకి లాగుతున్నారు. కానీ ఈ వ్యాఖ్యలపై త్రిష స్పందించకుండా, తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఆగస్టు 7న వరల్డ్ వైడ్ థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మెగా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. వైజాగ్‌లో ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ తీసుకున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది. ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ గాంధీ, నేను ఈ సినిమాకు ఫ్రెండ్స్‌లా కలిసి పనిచేశాం. అదే ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ఒక కారణమని అనుకుంటున్నాను. మళ్లీ కలిసి పనిచేయాలని ఉంది. మా నిర్మాతలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మా విజన్ ని సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. మా కొరియోగ్రాఫర్స్, ఫైట్ మాస్టర్స్ అందరికీ పేరుపేరునా బిగ్ థ్యాంక్స్. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమాకు బిగ్ పిల్లర్. మురళీధర్ గౌడ్ గారు, సునీల్ అన్న, రేవంత్ ఇలా మా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రితిక మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను. సత్య ఈ సినిమాతో చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా డెడికేషన్ ఉన్న యాక్టర్. చిరంజీవి గారు చెప్పినట్టు ఈ సినిమాకు తను బిగ్గెస్ట్ ఎసెట్. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మిన నా భార్య లావణ్యకు చాలా థ్యాంక్స్. మా అమ్మ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వరకు క్యూ లైన్లు కొనసాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. శ్రావణ మాసం తో పాటుగా వరుస సెలవుల వేళ భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలి వస్తున్నారు. ఈ నెలలో తిరుమలలో రెండు సార్లు గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. అదే విధంగా రెండు సార్లు జరిగే బ్రహ్మోత్సవాల వేళ టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సమస్యల పరిష్కారినికి మరో యాప్ అందుబాటులోకి తీసుకొస్తోంది.తిరుమలలో వచ్చే నెల 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందు కోసం టీటీడీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. భక్తులకు వసతి.. దర్శనం తో పాటుగా సౌకర్యాల కల్పన పైన కీలక అధికారులు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందు లో భాగంగా సమీక్ష చేసారు. తిరుమలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారు. తిరుమల పవిత్రతకు, స్వచ్ఛతకు మారుపేరుగా నిలిచేలా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారు. ఇందుకోసం అవసరమైన మెటీరియల్స్, ఆధునిక యంత్రాల వినియోగంపై కూడా చర్చించినట్లు వివరించారు.తిరుమల వచ్చే శ్రీవారి భక్తులకు TTD బిగ్ అలర్ట్ - ఇవి తప్పని సరిగా పాటించండి..!!బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లుఅదే విధంగా తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా నందకం యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్‌టైమ్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు. తిరుమల లో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్ ద్వారా గుర్తించి, సంబంధిత సిబ్బందికి సమాచారం అందించి, సమస్యను తక్షణమే పరిష్కరించే
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ.. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనకబడిపోయిన వరుణ్.. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అయితే గత ఏడేళ్లుగా సినిమాలు ఆశించి స్థాయిలో ఆడకపోవడంతో బాధ పడ్డానని, తాను మళ్లీ హిట్ కొడతానని అనుకోలేదని వరుణ్ చెబుతున్నారు.శుక్రవారం సాయంత్రం వైజాగ్ లో 'కొరియన్ కనకరాజు' మెగా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ''కొరియన్ కనకరాజు సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు వైజాగ్ తో మంచి అనుబంధం ఉంది. నా యాక్టింగ్ శిక్షణ అంతా ఇక్కడ మా సత్యానంద్ గారి యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో చేశాను. మళ్ళీ ఇక్కడికి రావడం, ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా హ్యాపీగా ఉంది. ఒక సినిమా సక్సెస్ వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఈ సినిమాలో పని చేసిన మా టీంలోని ప్రతి ఒక్కరికి నేను థాంక్స్ చెప్తున్నా'' అని అన్నారు.''గాంధీ, నేనూ.. డైరెక్టర్ హీరోలా కాకుండా ఇద్దరు ఫ్రెండ్స్ లాగా పని చేసాం. అదే ఈరోజు ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి కారణమని అనుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా కలిసి సినిమా చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ థాంక్యూ సో మచ్. సినిమాకి పనిచేసిన వారందరికీ పేరు పేరునా పెద్ద థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ 'ఓజీ' నుంచి దుమ్ము లేపుతున్నాడు. నాకు OG లెవెల్ వద్దులే కానీ, ఎంతో కొంత ఇవ్వమని తమన్ ని అడిగాను. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకి పిల్లర్ గా నిలిచాడు. రితికా

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Vishwambhara Release Line Clear: యూవీ క్రియేషన్స్ తెలుగులో తన కంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ఈ ఇయర్ ఈ బ్యానర్ నుంచి విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత డాక్టర్ రాజశేఖర్, శర్వానంద్‌లు హీరోగా నటించిన ‘బైకర్’ మూవీకి క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చినా.. కమర్షియల్‌గా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాతో 6 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్‌కు సోలోగా హిట్ దక్కింది. ఈ చిత్రం ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మించింది. గతంలో అనుష్క ‘ఘాటి’ సినిమా కూడా వీళ్ల కాంబినేషన్లో తెరకెక్కడం విశేషం. మధ్యలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’, ‘గాండీవధారి అర్జున’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, మట్కా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్‌గా నిలిచాయి. తాజాగా గత శుక్రవారం విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ సినిమా మూడు రోజుల్లో వాల్యూ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా 6 రోజుల్లో 16 కోట్ల షేర్ (రూ.30 కోట్ల గ్రాస్)ను కలెక్ట్ చేసి హిట్ అనిపించుకుంది. మొత్తంగా రూ. 2.5 కోట్ల లాభాలను థియేట్రికల్‌గా అందుకుంది. ఈ సినిమా

వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన మూవీ `కొరియన్ కనకరాజు`. సత్య కామెడీ హైలైట్‌గా సాగిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. `కొరియన్ కనకరాజు` మూవీ ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఆరో రోజు దీనికి రూ.1.70కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఐదో రోజుతో పోల్చితే 17శాతం డ్రాప్ కనిపిస్తుంది. అయినా వసూళ్లు స్టడీగా ఉన్నాయని చెప్పొచ్చు. వీక్ డేస్‌లో ఈ మూవీకి ఈ స్థాయిలో ఉండటం విశేషమనే చెప్పాలి. అయితే వరుణ్ తేజ్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మంచి రివ్యూస్ వచ్చాయి. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ మొదటి వారంలోనే ఇంతటి భారీగా డ్రాప్ కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా వెళ్తుందని భావించారు. కానీ చూడబోతుంటే, యాభై కోట్ల వద్దే ఆగిపోయేలా ఉంది. ఇక `కొరియన్ కనకరాజు`కి ఇప్పటి వరకు ఎంత వచ్చాయనేది చూస్తే, సాక్నిల్క్ లెక్కల ప్రకారం రూ.25.54కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో ఇండియాలో రూ.21కోట్ల గ్రాస్, రూ.18.22కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో రూ.4.60కోట్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ ముప్పై కోట్లు కూడా దాటలేదు. ఇతర ట్రేడ్ సైట్ల లెక్కల ప్రకారం మరో మూడు కోట్లు అదనంగా చూపిస్తున్నాయి. అంటే రూ.28కోట్ల వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్ రూ.38కోట్లు, ఇప్పటి వరకు నాన్ థియేట్రికల్ గా రూ.26కోట్లు వచ్చాయి. దీంతో రూ.12కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైన ఈ మూవీకి ఇప్పటికే సుమారు రూ.14కోట్ల షేర్ వచ్చింది

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తక్షణమే వరుణయాగం నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో లోకకల్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఎన్నో వైదిక కార్యక్రమాలు, హోమాలు, యాగాలు నిర్వహించామని భూమన గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీటీడీ పాలకులు వేద, వైదిక సంప్రదాయాలను, శతాబ్దాల ఆచారాలను పూర్తిగా పక్కనపెట్టి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కేవలం వీఐపీ సేవలకే ప్రాధాన్యం ఇస్తూ, ధార్మిక కార్యక్రమాలను తిలోదకాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు బుద్ధి తెచ్చుకుని, సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రజాక్షేమం కోసం వెంటనే మేల్కొని వరుణయాగం చేపట్టాలని భూమన డిమాండ్ చేశారు

వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ మంచి విజయం సాధించడంతో.. మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరైన చిరంజీవి చిత్రబృందపై ప్రశంసలు కురిపించారు. ‘లెనిన్' విజయంతో జోరు మీదున్న అఖిల్ అక్కినేని తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. డైరెక్టర్ పవన్ సాదినేని చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ కాంబోపై అధికారిక ప్రకటన రానుంది. ‘బలగం’ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళబురుసు’ ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేశారు. తెలంగాణ గ్రామీణ నేపథ్య కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్ నటిస్తోన్న కామెడీ జానర్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ విడుదలైంది. చంద్ర మోహన్ చింతాడ తెరకెక్కించిన ఈ మూవీ గ్యాప్ లేకుండా నవ్విస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి. Jani Master: తప్పులు జరిగాయి.. దయచేసి క్షమించండి త్రిషను డిప్యూటీ సీఎంగా ఎప్పుడు చేస్తారు? మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు Dhanush Vs Vijay: ధనుష్‌పై.. విజయ్ సర్కారు నిఘా

చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత తన తమ్ముళ్లు వాళ్ల పిల్లలు, తన తనయుడితో పాటు కూతుర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. దాంతో అతి పెద్ద సి నిమా కుటుంబంగా మెగా ప్యామిలీ టాలీవుడ్ లోపేరు తెచ్చుకుంది. అయితే వీళ్లంతా సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ఉన్న టైమ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ గ్రూప్ కు లీడర్ గా ఉండేవారు. పవన్ కూడా హీరో అవ్వకముందు చిరంజీవి ఇంట్లోనే ఉంటూ చదువుకునేవారు. అప్పుడు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సుస్మిత, వీళ్లంతా చాలా చిన్న పిల్లలు కావడంతో పవన్ వారిని ఒక ఆట ఆడుకునేవారట బ్లాక్ మెయిల్ కూడా చేసేవారట. రీసెంట్ గా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ ఈవెంట్ ఒకటి జరిగింది. దానికి చిరంజీవి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. ఈవెంట్ లో వరుణ్ చిన్ననాటి పోటో ఒకటి స్క్రీన్ పై చూపించారు. అందులో పవన్ కళ్యాన్ కాళ్లు పట్టుకుని వరుణ్ తేజ్ కనిపించారు. పవన్ అభయంఇస్తున్నట్టు కనిపించారు. ఈ ఫోటోగురించి మాట్లాడుతూ.. ''పవన్ బాబాయ్ ఏదో ఒక అవసరం కోసం ఇలా బ్లాక్ మెయిట్ చేసేవారు. డబ్బులు కావచ్చు.. ఏదైనా కావచ్చు..మేం కూడా ఏదో అవసరం కోసంమే అలా కాళ్లు పట్టేవాళ్లు.. అప్పుడు చాలా సరదాగా ఉండేది'' అని వరుణ్ తేజ్ అన్నారు. వరుణ్ ను మాత్రమే కాదు గతంలో రామ్ చరణ్ ను కూడా పవన్ కళ్యాణ్ ఇలానే బ్లాక్ మెయిల్ చేసేవారు. గతంలో ఈ విషయాన్ని ఇంటర్యూలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఒప్పుకున్నారు. పవన్-చరణ్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీరోలు కాకముందు బాబాయ్ అబ్బాయిలా కాకుండా మంచి ఫ్రెండ్స్ లా ఉండేవారట వీరు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు రామ్ చరణ్ దగ్గర అప్పు తీసుకున్నాడు! ఇది నిజమే. కానీ ఈ సంఘటన చాలా రోజుల క్రింతం జరిగింది. అప్పటికి పవన్ సినిమాల్లోకి రాలేదు

కొరియన్ కనకరాజు సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలో వరుణ్ తేజ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని, చిరంజీవి బాటలోనే నడుస్తానని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం ఇప్పటికే 30 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి దూసుకుపోతోంది. ఈ సక్సెస్ వేడుకలో పాల్గొన్న వరుణ్ తేజ్, తన కెరీర్ ఎదుగుదలలో చిరంజీవి పాత్రను గుర్తు చేసుకున్నారు. నటనలో తనకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని, చిరంజీవి సూచనలను మాత్రమే పాటిస్తానని ఆయన పేర్కొన్నారు. దీంతో కుటుంబ సభ్యుల ఆశయాలను నిజం చేయాలన్న తన తపనను వరుణ్ తేజ్ వేదికపై వెల్లడించారు. పెదనాన్న చిరంజీవి పరువు తీయకుండా మంచి సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ, పవన్ కళ్యాణ్ మరియు రామ్ చరణ్ కళ్ళలో ఆనందం చూడటమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను వరుణ్ తేజ్ ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. ఆగస్టు 22 అంటే తన చిన్నప్పటి నుంచి నేషనల్ హాలిడే లాంటిదని, ఆ రోజు స్కూల్‌కు వెళ్లనని నాన్నతో మొండికేసేవాడినని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడు వెంటనే తనను పెదనాన్న చిరంజీవి ఇంటికి పంపించేవారని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను, తన సినిమా సక్సెస్‌తో కలిపి ఘనంగా జరుపుకుంటామని వరుణ్ తేజ్ ప్రకటించారు. చిరంజీవి స్ఫూర్తితోనే తాను ముందుకు సాగుతున్నానని, ఆయన ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం వ్యక్తం చేశారు. వరుణ్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన

వరుణ్ తేజ్‌కి హిట్ లేక చాలా కాలం అవుతుంది. `తొలి ప్రేమ` తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. వరుసగా పరాజయాలు చవి చూశారు. ఇన్నాళ్లపాటు ఆయన స్ట్రగుల్ అయ్యాడు. కానీ ఇన్నాళ్ల కష్టం, స్ట్రగుల్స్ అన్నీ పోయాయి. `కొరియన్ కనకరాజు`తో ఆయన ఎట్టకేలకు హిట్ కొట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. రితిక నాయక్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. యూవీక్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదలైన విషయం తెలిసిందే. కామెడీ ప్రధానంగా సాగిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. కొంత థ్రిల్లర్ ఎలిమెంట్లు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. సత్య కామెడీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మొత్తంగా వరుణ్ తేజ్‌కి హిట్‌ని అందించింది. ఈ మూవీ థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది. అయితే తొలి వీకెండ్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావడం విశేషం. రూ.38కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీకి నాన్ థియేట్రికల్‌గా రూ.26కోట్లు వచ్చాయట. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో మంచిగానే వచ్చాయి. ఇక థియేట్రికల్‌గా దీనికి రూ.12కోట్ల బిజినెస్ అయ్యింది. మూడు రోజుల్లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దాటింది. ఇప్పుడు లాభాల్లో వెళ్తుంది. సినిమా విడుదలై ఐదు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దీనికి నలభై కోట్లు దాటినట్టు చిత్ర బృందం చెప్పింది. కానీ సాక్నిల్క్ వంటి ట్రేడ్ సైట్ల ప్రకారం ఐదు రోజుల్లో దీనికి రూ.24కోట్లు వచ్చినట్టు సమాచారం. మంగళవారం దీనికి కోటిన్నర మాత్రమే వచ్చాయి. సోమవారంతో పోల్చితే సగమే వచ్చాయి. అంటే 50శాతం కలెక్షన్లు పడిపోయాయి. `కొరియన్ కనకరాజు` మూవీకి ఇండియాలో రూ.19.25కోట్ల గ్రాస్, రూ.16.74కోట్ల నెట్ వచ్చాయి. ఓవర్సీస్లో నాలుగున్నర కోట్లు వచ్చాయి. ఇలా ఈ మూవీకి రూ.13కోట్ల వరకు షేర్

మంచి కంటెంట్ మరియు హెల్దీ ఎంటర్టైన్మెంట్ అందిస్తే ప్రేక్షకులు కుటుంబసమేతంగా థియేటర్లకు ఖచ్చితంగా వస్తారని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు ఇంజనీర్ అయితే హీరో వరుణ్ తేజ్ ఐరన్ పిల్లర్ లాంటివాడని చిరంజీవి కొనియాడారు. కమెడియన్ సత్య నటన కాంక్రీట్ లాంటి ఉనికి అని వ్యాఖ్యానించారు. సత్య నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, కేవలం అతని కోసమే ఈ సినిమాను మళ్లీ చూడాలనిపిస్తుందని తెలిపారు. కథానాయిక రితికా నాయక్ గ్లామర్ మరియు మురళీధర్ గౌడ్ సహజ నటన సినిమాకు అదనపు బలంగా నిలిచాయని పేర్కొన్నారు. చిన్న మరియు మధ్యతరహా సినిమాలు థియేటర్లలో ఆడటం లేదనే వాదనలను చిరంజీవి పూర్తిగా తోసిపుచ్చారు. ఇటీవల కాలంలో చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం, లేనిన్ మరియు కొరియన్ కనకరాజు సినిమాలు వరుసగా విజయాలు సాధించాయని గుర్తు చేశారు. కొత్తతనంతో కూడిన కథలను ప్రేక్షకులు ఎల్లప్పుడూ ఆదరిస్తారని ఈ విజయాలు నిరూపించాయని చెప్పారు. దీంతో చిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమా దర్శకులకు ఒక కీలకమైన సలహా ఇచ్చారు. నిర్మాతలు వెచ్చించే ప్రతి రూపాయికి విలువ ఇస్తూ పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీయాలని సూచించారు. కథ బలంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని స్పష్టం చేశారు. ఫలితంగా సినిమా విజయం సాధించి అనేక మంది సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు. ఆగస్టు 7న విడుదలైన కొరియన్ కనకరాజు చిత్రం అనంతపురం నేపథ్యంతో కొరియన్ మూలాలు కలిసిన హారర్ కామెడీగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. వరుణ్ తేజ్ విభిన్నమైన

చిత్ర పరిశ్రమ సుభిక్షంగా ఉండాలంటే దర్శకులందరూ పరిమిత వ్యయంతో (బడ్జెట్లోనే) చిత్రాలను రూపొందించాలని మెగాస్టార్ చిరంజీవి ఆకాంక్షించారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత వెచ్చించే ప్రతి రూపాయికి దర్శకుడు బాధ్యత వహించాలని, సినిమా నిర్మాణ వ్యయంపై నియంత్రణ ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.సినిమా ఫలితాన్ని బడ్జెట్ నిర్ణయించదని, కేవలం కథాబలమే (కంటెంట్) ప్రధానమని చిరంజీవి స్పష్టం చేశారు. "కథ బలంగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఒక సినిమా సాధించే విజయం ఎంతో మంది సినీ కార్మికుల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది" అని ఆయన పేర్కొన్నారు.‘కొరియన్ కనకరాజు’ సాధించిన విజయంపై చిరంజీవి చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు మేర్లపాక గాంధీని ఆయన ప్రశంసించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ నటుడిగా ఎంతో వైవిధ్యం కనబరిచారని కొనియాడారు. ఈ వేడుకలో కథానాయకుడు వరుణ్ తేజ్, నిర్మాత నాగబాబు, దర్శకులు క్రిష్, మేర్లపాక గాంధీ తదితరులు పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు

వరుణ్‌తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘కొరియన్ కనకరాజు’ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు ‘‘ఒక సినిమా విజయం ఎంతో మంది జీవితాల్లో ఆనందాన్నిస్తుంది. ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) సక్సెస్ ఈ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సక్సెస్ క్రెడిట్ దర్శకుడు మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi)కి దక్కుతుంది. వరుణ్‌తేజ్ (Varun Tej) ఈ సినిమా ద్వారా నటుడిగా గొప్ప వైవిధ్యం చూపించాడు. ఈ ద్వితీయార్థం ‘పెద్ది’ విజయంతో మొదలై.. ‘మా ఇంటి బంగారం’, ‘చెన్నై లవ్‌స్టోరీ’, ‘కొరియన్ కనకరాజు’తో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా పరిణామాన్ని నిర్దేశించేది బడ్జెట్ కాదు. కంటెంట్ మాత్రమే. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వస్తారు. ఇండస్ట్రీ కళకళలాడాలంటే దర్శకులంతా పరిమిత బడ్జెట్లోనే సినిమాలు తీయాలి. అలాగే నిర్మాతలకు, వారు పెట్టే ప్రతీ పైసాకు డైరెక్టర్ విలువ ఇవ్వాలి’ అని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్’లో చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘మెగా ఫ్యాన్స్‌కు మంచి సినిమా ఇవ్వాలనే నా ఆలోచన ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా ఉంది’ అని వరుణ్‌తేజ్ చెప్పారు. ‘ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని నిర్మాత నాగబాబు తెలిపారు. ‘వరుణ్‌తేజ్, మేర్లపాక గాంధీ కష్టానికి దక్కిన గొప్ప ఫలితం ఈ విజయం’ అని దర్శకుడు క్రిష్ పేర్కొన్నారు. ‘వరుణ్ తేజ్ ఈ సినిమాకు ప్రతీ విషయంలో బ్యాక్‌బోన్‌గా నిలిచారు. ఆయనతో మరోసారి పనిచేయాలని కోరుకుంటున్నాను’ అని మేర్లపాక గాంధీ చెప్పారు

వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) మంచి కలెక్షన్లు అందుకుంటున్న నేపథ్యంలో చిత్ర బృందం మెగా బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ప్రేక్షకులే అసలైన కారణం: ఒక సినిమా విజయం సాధిస్తే నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా ఎంతోమందిలో ఆనందం నింపుతుందని చిరంజీవి అన్నారు. ‘కొరియన్ కనకరాజు’ను ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు తలవంచి ధన్యవాదాలు చెప్పడం ప్రతి ఒక్కరి బాధ్యత. మేర్లపాక గాంధీకి ప్రత్యేక ప్రశంసలు: ఈ సినిమా విజయానికి దర్శకుడు మేర్లపాక గాంధీ ప్రధాన కారణమని చిరంజీవి అన్నారు. సాధారణంగా హారర్ కామెడీ చిత్రాలు చాలా వచ్చినప్పటికీ, ఇందులో కొరియన్ ఫ్లేవర్, ఆ దేశ సంస్కృతిని కథలో భాగం చేయడం మంచి ఆలోచన. అదే మొదటి సక్సెస్. మా బుడ్డోడు సక్సెస్: వరుణ్ తేజ్ మొదటి నుంచీ విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటున్నాడు. ‘ముకుంద’, ‘కంచె’, ‘అంతరిక్షం’ వంటి సినిమాల్లో వైవిధ్యం చూపించాడని, నటుడిగా తనను తాను నిరూపించుకునే తపన అతనిలో ఉంది.‘ఇది వరుణ్ సక్సెస్ కాదు.. మా బుడ్డోడు వాయుతేజ్ సక్సెస్. ఈ విజయాన్ని వాయు ఖాతాలో వేయాలి. సత్యకు ప్రత్యేక అభినందనలు: సినిమాలో సత్య అద్భుతంగా నటించాడని చిరంజీవి ప్రశంసించారు. తన నటనతో సినిమా మరోసారి చూడాలనిపించేలా చేశాడని అన్నారు. నా అభిమాని ఈ రేంజ్ కి ఎదగడం నాకు గర్వంగా ఉంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు: 2026 రెండో అర్ధభాగం ‘పెద్ది’ విజయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం’, ‘చెన్నై లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తన తదుపరి సినిమా టీజర్‌పై అప్డేట్: తమన్‌తో కలిసి తాను చేస్తున్న సినిమా టీజర్ తన పుట్టినరోజైన ఆగస్టు 22న విడుదల కానుందని చిరంజీవి తెలిపారు

మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి `మెగా158` అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే సంక్రాంతి కానుకగా దీన్ని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనే ప్రయత్నాల్లో టీమ్ ఉంది. ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ మూవీ సంక్రాంతికి వస్తుందని చెప్పారు. ఈ ఏడాది చిరంజీవి `మన శంకర వర ప్రసాద్ గారు` మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు చిరంజీవి. కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లని సాధించింది. దీంతో ఇప్పుడు బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఈ కాంబినేషన్లో గతంలోనే `వాల్తేర్ వీరయ్య` సినిమా వచ్చింది. అది కూడా రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. పెద్ద హిట్‌నిచ్చింది. ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడంతో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు చిరంజీవి. ఈ మూవీ టైటిల్ లీక్ చేశాడు. చిరు లీక్స్ లో భాగంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈసందర్భంగా సినిమా టైటిల్, టీజర్ రాబోతుందని తెలిపారు. థమన్ ప్రస్తుతం దానికి వర్క్ చేస్తున్నారట. `కొరియన్ కనకరాజు` మూవీ సక్సెస్ ఈవెంట్లో ఈ విషయాన్ని పంచుకున్నాడు చిరంజీవి. థమన్ తో మాట్లాడుతూ, ఈ నెల 22న టైటిల్ రివీల్ చేస్తున్నారుగా అన్నాడు చిరంజీవి, అవును సార్ అన్నాడు థమన్. టీజర్ లో వేస్తున్నారుగా అంటే అవును సార్, టీజర్ ఇస్తున్నారుగా అంటే అవును అన్నాడు. ఈ క్రమంలోనే టైటిల్ `కదిరి.. `లానే ఉంటుంది కదా అంటూ టైటిల్ లీక్ చేశారు చిరు. ఈ మూవీకి కదిరి అనే పేరుతో టైటిల్ పెట్టబోతున్నట్టు చిరు హింట్ ఇచ్చాడు. అయితే ఇది ఆయన నోరు జారడం కాదు, కావాలనే హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో టైటిల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. `కదిరి` అని వదిలేశారు

Chiranjeevi : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక ఎప్పుడు ఫంక్షన్ పెడతారు, రావాలి అనుకున్నాను. వరుణ్ వచ్చి డాడీ మీరు రావాలి అనగానే తప్పకుండా వస్తాను అని చెప్పాను. ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ మొదట్నుంచి కూడా సేఫ్ జోన్ కాకుండా రిస్క్ అయినా వెరైటీగా, డిఫరెంట్ పాత్రలతో వస్తున్నాడు. వైవిద్యం చూపిస్తూ కొత్త గెటప్స్ తో వస్తున్నాడు. ఆర్టిస్ట్ గా నిలబడాలి అని చూస్తున్నాడు కానీ గబగబా సినిమాలు చేయాలి, డబ్బులు సంపాదించాలి అని చూసుకోవట్లేదు. వరుణ్ ఆలోచన విధానం, అతను ఎంచుకున్న జోనర్స్ బాగున్నాయి. ఈ క్రమంలో అతను చేసిన అన్ని సినిమాలు హిట్ అవ్వకపోవచ్చు కానీ అతను నటనలో ఎపుడూ ఫెయిల్ అవ్వలేదు. ఇదే ధైర్యంతో ఇలాగే కొత్త కథలతో ముందుకు వెళ్ళు. ఇది వరుణ్ సక్సెస్ అని చెప్పినా ఇది వరుణ్ తనయుడు వాయువ్ ఖాతాలో వెయ్యాలి. నీ లక్కీ చామ్ వాయువ్. ఈ సినిమా హిట్ అవ్వడానికి సత్య ముఖ్య కారణం. సత్య కోసం ఈ సినిమాను ఇంకోసారి చూసాను. సత్య కామెడీ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. నువ్వు నా అభిమాని అని చెప్పావు. నా అభిమాని ఇంత సక్సెస్ అయినందుకు గర్వపడుతున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి తర్వాత సినిమాలు హిట్ అవ్వలేదు. చాలా డ్రై గా ఉంది థియేటర్స్ అనుకున్నప్పుడు పెద్ది నుంచి మొదలయి మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్

Nagababu : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా తెరకెక్కిన కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది ఈ సినిమా. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి నాగబాబు కూడా వచ్చారు. నాగబాబు ఈ ఈవెంట్లో మాట్లాడుతూ.. మేము ఎవరమైనా సరే ఇవాళ ఇక్కడ స్టేజిపై ఇలా ఉన్నామంటే కారణం అన్నయ్య. మా అందరికి ప్రాణవాయువు లాంటి వాడు అన్నయ్య. నేను కానీ, మా పవన్ కళ్యాణ్ కానీ, చరణ్, వరుణ్, తేజ్, వైష్ణవ్.. ఇలా ఎంతమంది ఉన్నా మా అన్నయ్య లాంటి వ్యక్తి ఆశీర్వాదం, ఆయన బలం మా వెనక ఉన్నప్పుడు ఇది సాధ్యమైంది. ఆయనకు మేము ఏమి తిరిగి చేయలేము. ఆయనే మాకు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు నాకంటే ఎక్కువగా వరుణ్ ని ఎత్తుకున్నది అన్నయ్యే. అన్నయ్య అప్పుడు చేసిన సినిమా ప్రివ్యూలకు వరుణ్ ని తీసుకెళ్లేవారు. వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, వరుణ్ తక్కువ మాట్లాడినా వరుణ్ – అన్నయ్య చాలా మాట్లాడుకుంటారు. సినిమా మేకింగ్ గురించి మాట్లాడుకుంటారు. అన్నయ్య వరుణ్ ని బాగా చూసుకుంటాడు. అన్నయ్య అందర్నీ ఒకేలా చూస్తాడు. ఇవాళ్టికి కూడా మాకు ఒక సమస్య వస్తే మా కోసం నిలబడతాడు. లవ్ యు అన్నయ్య. మా అన్న ఆశీర్వాదం, పవన్ కళ్యాణ్ బలం మాకు ఉన్నంత కాలం ఇండస్ట్రీలో మేము సక్సెస్ సాధిస్తామని నమ్మకం ఉంది అని అన్నారు

Varun Tej : వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమా ఇటీవల ఆగస్టు 7న థియేటర్స్ లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. నేడు కొరియన్ కనకరాజు మెగా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించగా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. నాకు సినిమాకు తప్ప వేరే ఏం తెలియవు. నేను చిరంజీవి గారు చెప్పినవి ఫాలో అవుతాను. మా పెదనాన్న పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు అనుకుంటాను. మా అమ్మ, నాన్న గర్వంగా ఫీల్ అవ్వాలి. మా కళ్యాణ్ బాబాయ్, చరణ్ అన్న కళ్ళల్లో సంతోషం చూడాలి. చిన్నప్పట్నుంచి నాకు ఆగస్టు 22 అంటే నేషనల్ హాలిడే. చిన్నప్పుడు నాన్న దగ్గరకు వెళ్లి ఆ రోజు స్కూల్ కి వెళ్ళను అని చెప్పేవాడిని. వెంటనే పెదనాన్న ఇంటికి పంపించేసేవారు. ఈసారి పెదనాన్న పుట్టిన రోజు ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ తో ఉంటుంది అని అన్నారు
గతేడాది దసరా పండగ ముందు వరకూ మెగా హీరోల బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగాలేదనే చెప్పాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకూ.. అందరికీ వరుస ఫ్లాపులు పడ్డాయి. మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న సినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అయితే విజయదశమి తర్వాత మెగా ఫ్యామిలీ దశ దిశ మారింది. అప్పటి నుంచి మెగా హీరోల నుంచి వస్తున్న చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకున్నాయా లేదా అనేది పక్కన పెడితే.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా చేశాయి.పవన్ కళ్యాణ్ OG సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్లు అందుకున్నారు. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద విజయాన్ని దక్కించుకున్నారు. ప్రాంతీయ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ‘పెద్ది’ చిత్రంతో రామ్ చరణ్ కూడా భారీ వసూళ్లు సాధించారు. ఇప్పుడు లేటెస్టుగా వరుణ్ తేజ్ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కారు. చాలా ఏళ్లుగా హిట్టు కోసం కష్టపడుతున్న వరుణ్.. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఎట్టకేలకు మంచి సక్సెస్ సాధించారు. తన కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టారు.ఇలా నలుగురు మెగా హీరోలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటారు. ఇక మిగిలింది ఇద్దరు మెగా మేనల్లుళ్లు మాత్రమే. సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' సినిమా నిరాశపరిచింది. ఆ మూవీ వచ్చి మూడేళ్లు అవుతోంది. తేజ్ ప్రస్తుతం 'సంబరాల ఏటి గట్టు' అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. లాస్ట్ ఇయర్ దసరాకే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి

హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: క్రీడా స్ఫూర్తితో ఉద్యోగుల్లో ఉత్సాహం, టీమ్ స్పిరిట్‌కు ప్రోత్సాహమని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఎన్పీడీసీఎల్లో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి మంగళవారం హనుమకొండ రెడ్డిపురంలోని క్రికెట్ గ్రౌండ్ లో ఉద్యోగులు, క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఉద్యోగులతో కలిసిమెలిసి క్రికెట్ ఆడిన సీఎండీ, క్రీడాకారులను అభినందిస్తూ వారిని మరింత ఉత్సాహపరిచారు. ఉద్యోగులతో స్నేహపూర్వక వాతావరణంలో గడిపారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం, పరస్పర అనుబంధం, నాయకత్వ లక్షణాలు, సమన్వయం, టీమ్ స్పిరిట్ ను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సీఎండీ అన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి ఒక టీమ్ గా సమైక్య భావంతో పనిచేయాలని, ఉద్యోగుల ఆరోగ్యం సంస్థ తరఫున మరింత ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎండీ తెలిపారు. సీఎండీ స్వయంగా క్రీడల్లో పాల్గొనడం ఉద్యోగులు, క్రీడాకారుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా ఉద్యోగులు, క్రీడాకారులు సీఎండీతో కలిసి క్రీడల్లో పాల్గొనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు

హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11 : క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యుత్ ఉద్యోగులలో మానసిక ఉల్లాసం, పరస్పర అనుబంధం పెంపొందుతాయని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఏ సర్కిల్ జట్టు గెలిచినా అది మన సంస్థ విజయమేనని, ఉద్యోగులందరూ ఒకే కుటుంబంలా భావించి క్రీడా స్ఫూర్తితో, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీపడాలన్నారు. మంగళవారం నార్తరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో రెండురోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడాపోటీలను ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా, ఉద్యోగుల మానసిక ఒత్తిడిని తగ్గించి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని వెల్లడించారు. సంస్థలో శ్రమించే ప్రతి ఉద్యోగీ క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. సంస్థలోని ఉద్యోగులందరూ ఒక్కటై పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్‌రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు, స్పోర్ట్స్ కమిటీ మెంబర్లు మాధవరావు, వేణు బాబు, హేమంత్‌కుమార్, స్పోర్ట్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, సభ్యులు ప్రేమ్‌కుమార్, యాకుబ్‌పాషా పాల్గొన్నారు

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు! ఈ వార్తకు సంబంధించిన

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ కొరియన్ కనకరాజు. రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. వరుణ్ తేజ్ 6 ఏళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఎట్టకేలకు కొరియన్ కనకరాజు చిత్రంతో వరుణ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చారు. కంబ్యాక్ కూడా మామూలుగా లేదు. కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తయింది. ఆరేళ్ళ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్లీన్ హిట్ అందుకున్నారు. కొరియన్ కనకరాజు మూవీ 4 రోజుల కలెక్షన్స్ వివరాలు ఇప్పుడు చూద్దాం. నాల్గవ రోజు మండే టెస్ట్ ని కొరియన్ కనకరాజు చిత్రం విజయవంతంగా పాస్ అయింది. కేవలం ఆన్లైన్ బుకింగ్స్ మాత్రమే నాలుగవరోజు సోమవారం 70 వేలుగా నమోదయ్యాయి. ఇది సాలిడ్ హోల్డ్ అనే చెప్పాలి. మూడు రోజుల్లో 35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం 4వ రోజు పూర్తయ్యే సరికి దాదాపు 40 కోట్ల గ్రాస్ కి చేరుకుంది. కలెక్షన్ లో ఎక్కువ డ్రాప్ కనిపించలేదు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 13 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మూడు రోజుల్లోనే 12 కోట్లపైగా షేర్ సాధించి 90 శాతానికి పైగా రికవరీ సాధించింది. ఇక నాలుగోరోజు వరల్డ్ వైడ్ గా 2.28 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ చిత్రం దీనితో సక్సెస్ ఫుల్ గా బ్రేక్ ఈవెన్ సాధించి వరుణ్ తేజ్ కి 6 ఏళ్ళ తర్వాత క్లీన్ హిట్ గా నిలిచింది. ఇన్నేళ్ళుగా సరైన బాక్సాఫీస్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ కి కొరియన్ కనకరాజు చిత్రం బిగ్

టీమిండియాను వరుస గాయాల సమస్య కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఒక్కొక్కరిగా గాయాల బారిన పడుతుండటంతో భారత జట్టు ప్రాక్టీస్ క్యాంప్ హాస్పిటల్ వార్డులా మారిపోయింది. ఏకంగా ఒక బలమైన జట్టునే నిర్మించేంత మంది ఆటగాళ్లు గాయపడటంతో బీసీసీఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు చేరుకుని, సిఓఈ హెడ్ వివిఎస్ లక్ష్మణ్‌తో అత్యవసరంగా భేటీ కావడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని రిహాబ్ సెంటర్లో ఉన్న ఆటగాళ్ల జాబితా చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బుమ్రా మోకాలి వాపు సమస్యతో ఇబ్బంది పడుతుంటే, సాయి సుదర్శన్ బొటనవేలి నొప్పితో బాధపడుతున్నారు. ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి వంటి కీలక ఆటగాళ్లు వివిధ రకాల గాయాల బారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆటగాళ్లను పూర్తి ఫిట్నెస్ సాధించకముందే మైదానంలోకి దించడంపై సెలెక్షన్ కమిటీకి, స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ అత్యవసర సమావేశానికి దారితీసింది. స్పోర్ట్స్ సైన్స్ విభాగానికి శాశ్వత హెడ్ లేకపోవడం, ఆటగాళ్లు సరైన ఫిట్నెస్ ప్రమాణాలు పాటించకపోవడంపై బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. హర్షిత్ రాణా ఓవర్ వెయిట్‌తో కనిపించడం, నితీష్ రెడ్డి బౌలింగ్ వేగం పెంచే క్రమంలో గాయపడటం చర్చనీయాంశమైంది. మరోవైపు బుమ్రా, సాయి సుదర్శన్‌ల లభ్యతపై వైద్య బృందం, సెలెక్టర్ల మధ్య అస్పష్టత నెలకొనడంతో ఇకపై తొందరపడి ఆటగాళ్లను మైదానంలోకి దించకూడదని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వయసుతో మీకేం పని? వైభవ్ సూర్యవంశీపై బ్రెట్ లీ ప్రశంసలు గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్న దానిని చూసి.. కాపరులు పరుగో పరుగు సామాన్యుడికి మరో షాక్.. సెప్టెంబర్‌లో
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘ కొరియన్ కనకరాజు ’ థియేటర్లలో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ ఎంటర్టైన్మెంటట్తో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ విషయాన్ని ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా అన్ని ప్రధాన థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటంతో బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర కొనసాగుతోంది.* బాక్సాఫీస్ వద్ద 'కొరియన్ కనకరాజు' రచ్చ.. మూడే మూడు రోజుల్లో బ్రేక్ఈవెన్రాయలసీమలోని అనంతపురం జిల్లా పెనుగొండ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది. ఊరిలో చెక్కభజన గ్రూప్ నడిపే కనకరాజు (వరుణ్ తేజ్), తన బెస్ట్ ఫ్రెండ్ కిష్టప్ప (సత్య)తో కలసి సరదాగా కాలం గడిపేస్తుంటాడు. కియా కార్ల ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఎప్పటికైనా కొరియా వెళ్లాలని కలలు కనే చైత్ర ( రితికా నాయక్ )ను చూసి కనకరాజు తొలిచూపులోనే లవ్‌లో పడతాడు. అనూహ్యంగా కనకరాజు శరీరంలోకి ఒక కొరియన్ వ్యక్తికి సంబంధించిన ఆత్మ ఎంటర్ అవుతుంది. ఆ ఆత్మ ప్రవేశించిన తర్వాత కనకరాజు జీవితం ఎలా మారింది?.. ఆ కొరియన్ ఆత్మ బారి నుండి అతను ఎలా బయటపడ్డాడు? అనే ఇంట్రస్టింగ్ పాయింట్‌ని ఫుల్ లెంగ్త్ హ్యూమర్‌తో స్క్రీన్ పైన ఆవిష్కరించారు.వీకెండ్ బాక్సాఫీస్ కలెక్షన్ల రన్ఆగస్టు 7న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ప్రీమియర్స్ వసూళ్లతో కలుపుకుని ఫస్ట్ డే రూ. 10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన కనకరాజు, సెకండ్ డే శనివారం నాటికి రూ. 23.6 కోట్లకు చేరుకున్నాడు. ఆదివారం కలెక్షన్స్ మరింతగా పుంజుకోవడంతో ఫస్ట్ వీకెండ్
నాగార్జునసాగర్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులకు మరోసారి ప్రత్యేక జ్ఞాపకాలను గుర్తుచేసిన ప్రదేశం. విజయపురిలో సోమవారం నిర్వహించిన మహా వరుణయాగం ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి తన సతీమణి గీతతో కలిసి హాజరయ్యారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ యాగంలో మధ్యాహ్నం 3.24 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాన్ని నిర్వహించారు. అనంతరం యాగ ప్రదక్షిణం, పుణ్యాహవాచనం, అంకురార్పణ, రుష్యశృంగ పూజ తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతితో మహా వరుణయాగం సంపూర్ణమైంది. యాగం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సతీసమేతంగా నాగార్జునసాగర్ జలాశయాన్ని పరిశీలించారు.రేవంత్ రెడ్డి, గీత దంపతులకు నాగార్జున సాగర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. వారి ప్రేమకథ నాగార్జునసాగర్ నుంచే మొదలైంది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో సీఎం రేవంత్, సతీమణి గీత వెల్లడించారు. ఇంటర్ చదువుతున్న సమయంలో నాగార్జునసాగర్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డికి గీతతో అక్కడే తొలి పరిచయం ఏర్పడింది. గీత కజిన్‌కు రేవంత్ ఫ్రెండ్ కాగా.. ఆ సమయంలో టూర్ కోసం వీరు నాగార్జున సాగర్ వెళ్లారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది.ముందు వీరి పెళ్లికి గీత తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. చివరకు అందర్నీ ఒప్పించి 1992లో పెద్దల అంగీకారంతో రేవంత్ రెడ్డి, గీత వివాహం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో సోమవారం నాగార్జునసాగర్ వద్ద రేవంత్‌రెడ్డి, గీత కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రేవంత్ అభిమానులు గతంలో దిగిన ఫోటోను, ప్రస్తుత ఫొటోను షేర్ చేస్తూ.. '34 ఏళ్ల తర్వాత అదే చోట, అదే ప్రేమ. కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగుతాయి.. కానీ కొన్ని పరిచయాలు మాత్రం జీవితాంతం మనతోనే నడుస్తాయి. 34 ఏళ్ల క్రితం నాగార్జునసాగర్ వద్ద అనుకోకుండా మొదలైన ఒక పరిచయం.. కాలంతో పాటు బంధంగా మారి, ప్రేమగా మారి, జీవిత

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, జలాశయాలు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం 'మహా వరుణ యాగం' నిర్వహించింది. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణా తీరంలో ఉన్న విజయ విహార్ వేదికగా ఈ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు. యాగం ముగింపు సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా ఉండటం, ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ యాగానికి శ్రీకారం చుట్టింది. ఉదయం నుంచి సాగిన ఈ క్రతువులో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన 108 మంది రుత్విక్కులు, వేద పండితుల పర్యవేక్షణలో 11 హోమ గుండాలతో ఈ యాగాన్ని వైభవంగా నిర్వహించారు.ప్రస్తుతం నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా, కేవలం 145.65 టీఎంసీల మేర మాత్రమే నీరు నిల్వ ఉంది. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం ఇది సుమారు 518 అడుగుల వద్దే కొనసాగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి జలాశయం నిండుకుండలా ఉందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, చెరువులు నిండి అన్నదాతల పంటలు పచ్చగా ఉండాలన్న సంకల్పంతో ఈ యాగం నిర్వహించినట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
.webp)
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను ప్రార్థిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య నాగార్జునసాగర్‌లో ఈ యాగాన్ని నిర్వహించారు. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహారం వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన మహా వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. మంత్రి ఉత్తమ్ దంపతులతో కలిసి యాగంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలను ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహం కోసం వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతోనే మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భారతీయ సంస్కృతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని యాగాలు, యజ్ఞాలు, పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతూనే.. వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే సంప్రదాయాలను గౌరవిస్తున్నామని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదయ్యేలా వరుణదేవుని అనుగ్రహం కోసం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వరుణదేవుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని ఆకాంక్షించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, కుంట జలకళను సంతరించుకోవాలని కోరుకున్నారు. భూగర్భ జలాలు పెరిగి, పంటలు పుష్కలంగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ప్రార్థించారు. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ మహా వరుణయాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి