Varshini Vs Shalini : మీదమీదకు వెళ్లిన వర్షిణి, షాలినీ.. కొట్టుకునేలానే ఉన్నారే?
Bigg Boss Telugu 10 Day 8 Promo 2 బిగ్ బాస్ రెండో వారంలో నామినేషన్స్‌లో గొడవలు భారీ స్థాయిలోనే జరిగేట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వదిలిన ప్రోమోని గమనించినా, తాజాగా రిలీజ్ చేసిన రెండో ప్రోమోని చూసినా త్రిగుణ్ వర్సెస్ మిగతా హౌస్ మేట్స్ అన్నట్టుగా సాగింది. ఇక ఈ రెండో ప్రోమోలో వర్షిణి, షాలినీ ఒక స్టెప్ ముందుకు వేసినట్టుగా కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు వెళ్లి కొట్టుకునేలా బిల్డప్ ఇచ్చారు. మధ్యలో శ్రిష్టి వచ్చి ఈ ఇద్దరినీ దూరం చేసింది.

