
బొద్దుగా ఉన్నాడు, ఫీల్డింగ్ కు పనికిరాడంటూ విమర్శలు.. కళ్లు చెదిరేక్యాచ్ తో ఇచ్చిపడేసిన బుడ్డోడు
Vaibhav Sooryavanshi catch video: శ్రీలంక వేదికగా జరుగుతోన్న ట్రై-నేషన్ సిరీస్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సూపర్ ఫీల్డింగ్‌తో మెప్పించాడు. ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గాల్లోకి ఎగిరి అతను అందుకున్న 'ఫ్లయింగ్ క్యాచ్' సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇటీవల కాలంలో తన ఫిట్‌నెస్‌పై విమర్శలు గుప్పించిన వారికి ఈ అద్భుతమైన క్యాచ్‌తో వైభవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇటీవలే శ్రీలంక ఆటగాడు విషెన్ హలంబాగేతో జరిగిన గొడవ కారణంగా వైభవ్ సూర్యవంశీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. మైదానంలో ప్రవర్తించిన తీరుపై ఫ్యాన్స్, విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి ఒత్తిడి సమయాల్లో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ యువ క్రికెటర్‌కు బాగా తెలుసు. ఆఫ్ఘనిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో 38 పరుగులు మాత్రమే చేసి అవుటైనప్పటికీ, సెకండ్ హాఫ్‌లో తన అదిరిపోయే ఫీల్డింగ్‌తో స్టేడియాన్ని హోరెత్తించాడు. గాల్లో అద్భుతం.. ఆ క్యాచ్ చూస్తే మైండ్ బ్లాకే! ఆఫ్ఘనిస్తాన్-ఏ ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేళ ఈ అద్భుతం జరిగింది. 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ జట్టుకు అన్షుల్ కాంబోజ్ గట్టి షాక్ ఇచ్చాడు. కాంబోజ్ వేసిన ఫుల్-లెంత్ డెలివరీని ఆఫ్ఘన్ బ్యాటర్ ఖలీద్ తనివాల్ అద్భుతమైన ఫ్లిక్ షాట్ ఆడాడు. ఆ బంతి ఇన్ఫీల్డ్ దాటి బౌండరీ వైపు దూసుకెళ్తుందని అందరూ భావించారు. కానీ అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ అసాధారణమైన రిఫ్లెక్సెస్తో, సరైన టైమింగ్‌తో గాల్లోకి ఎగిరాడు. మొదట బంతి చేతిలో పడి కాస్త పక్కకు తప్పుకున్నా, ఏమాత్రం పట్టుదల కోల్పోకుండా వెనక్కి పరిగెత్తుతూ పూర్తి స్ట్రెచ్‌తో డైవ్ చేసి క్యాచ్‌ని పూర్తి చేశాడు. బౌలర్ వేసిన బంతి కంటే వైభవ్ పట్టిన ఈ 'సూపర్ మ్యాన్' క్యాచ్‌కే మైదానంలో ఎక్కువ చప్పట్లు వచ్చాయి. ఫిట్నెస్ విమర్శకులకు బ్యాట్‌తో కాదు.. క్యాచ్‌తో సమాధానం! ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్