
వదంతి-2.. టాప్ట్రెండింగ్ లో ఉన్న మిస్టరీక్రైమ్థ్రిల్లర్ ఎలా ఉంది
Vadhandhi Season 2 Web Series || వెబ్‌సిరీస్: వదంతి-2; నటీనటులు: శశికుమార్, యశ్వంత్, అనఘ, అపర్ణా దాస్, రేవతి శర్మ, వివేక్ ప్రసన్న తదితరులు; దర్శకత్వం: ఆండ్రూ లూయిస్; నిర్మాతలు: పుష్కర్, గాయత్రి; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో తమిళంలో ఎస్. జె. సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మర్డర్ మిస్టరీ సిరీస్ ‘వదంతి’కి కొనసాగింపుగా ఇటీవల వచ్చిన వెబ్‌సిరీస్ ‘వదంతి సీజన్ 2’. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టాప్‌లో కొనసాగుతోంది. అంతలా ఓటీటీ ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఏమున్నాయి? తొలి సీజన్‌ను మించి ఆకట్టుకునేలా ట్విస్ట్‌లు ఉన్నాయా? vadhandhi season 2 story || చెన్నై నుంచి మదురైకి ఎనిమిది వరుసల రహదారి నిర్మాణ పనుల కోసం భూమి పూజ చేసి మట్టి తీస్తుండగా ఓ అస్థిపంజరం బయటపడుతుంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మొదలవుతుంది. జిల్లా ఎస్పీగా ఉన్న రతికా నాయర్ (అనఘ)ను ఈ కేసును విచారించాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. నీతి, నిజాయతీలకు మారుపేరైన పోలీస్ ఆఫీసర్ మూసా రాజా (శశికుమార్) ట్రాక్ రికార్డు చూసి ఎస్పీ రతిక అతడికి ఈ కేసును విచారించే బాధ్యతను అప్పగిస్తారు. తన స్నేహితుడు, పోలీస్ ఆఫీసర్ అయిన రామర్ (వివేక్ ప్రసన్న)తో కలిసి మూసా ఈ కేసు విచారణ మొదలు పెడతాడు. అస్థిపంజరం లభ్యమైన ప్రదేశంలోనే తవ్వకాలు జరపగా, ఈసారి ఒక చేయి బయటపడుతుంది. దానికున్న వెండి బ్రేస్లెట్ ఆధారంగా ఆ రెండు మృతదేహాలు మణి (యశ్వంత్) ప్రేయసి నీలవతి (రేవతి శర్మ), సోదరి వెన్బా (దీపిక ఆనంద్)గా గుర్తిస్తారు. వారిద్దరినీ చంపాడన్న ఆరోపణలతో మణి అప్పటికే రిమాండ్ ఖైదీగా ఉంటాడు. లభించిన ఆధారాలతో కోర్టు మణికి యాజ్జీవ శిక్ష విధిస్తుంది. అయితే, ఈ హత్యలు మణి చేయలేదని మూసా రాజా బలంగా నమ్ముతాడు. మరి అతడు అనుకున్నది నిజమేనా? ఈ హత్యలు చేసింది