
అమెరికాలో భార్యను చంపి బాత్రూండ్రామా ఆడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం బెల్వ్యూ (సియాటెల్ సమీపంలో)లో గతేడాది అక్టోబరులో చోటుచేసుకున్న భారతీయ మహిళ రాజిత సబ్బినేని (27) అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఆమె భర్త, ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అవినాశ్ నార్నే (30) ప్రణాళికాబద్ధంగా భార్యను గొంతునులిమి హత్య చేసినట్లు కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం నిర్ధారించింది. ఈ మేరకు జులై 1న అతడిపై ఫస్ట్-డిగ్రీ మర్డర్ అభియోగాలు మోపి, అరెస్ట్ చేసి కింగ్ కౌంటీ జైలుకు తరలించారు. కోర్టు అతడికి 5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 41 కోట్లు) భారీ బెయిల్ మొత్తాన్ని విధించింది.గతేడాది అక్టోబర్ 27 రాత్రి అవినాశ్ పోలీసులకు ఫోన్ చేసి, తన భార్య బాత్రూమ్లో లోపల లాక్ చేసుకుని బయటకు రావడం లేదని ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, రాజిత అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె గొంతునులమడం వల్లే (అస్ఫిక్సియా) ఊపిరాడక చనిపోయిందని తేలింది. తాము 2025 జూన్‌లోనే వివాహం చేసుకున్నామని, తాను బయటకు వెళ్లి వచ్చేసరికి భార్య బాత్రూమ్లో ఉందని అవినాశ్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే, పోలీసులు అతడి డిజిటల్ ఆధారాలను పరిశీలించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అపార్ట్మెంట్ 'స్మార్ట్ లాక్' డేటాను తనిఖీ చేయగా, అవినాశ్ బయటకు వెళ్లిన సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని స్పష్టమైంది. అంతేకాకుండా