
పంజాగుట్టశ్మశానవాటికలో శిశువు మృతదేహం అదృశ్యం
Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో శిశువు మృతదేహం అదృశ్యం ఈ వార్తకు సంబంధించిన

Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో శిశువు మృతదేహం అదృశ్యం ఈ వార్తకు సంబంధించిన

Jagtial Twins Adoption : కన్న తల్లి చనిపోయింది.. పుట్టిన కవల శిశువులను పోషించే శక్తి తండ్రికి లేదు.. దీన్నే ఆసరాగా చేసుకుని శిశువుల విక్రయానికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో చోటుచేసుకుంది. జిల్లాల్లో కవల శిశువుల దత్తత వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కన్నతల్లి మృతిచెందాక పిల్లల సంరక్షణ బాధ్యత తండ్రిపై పడింది. అయితే, ఆయన నిస్సహాయతను ఆసరాగా చేసుకుని శిశువులను దత్తత పేరుతో విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తల్లి గంగజల మృతి : వివరాల్లోకి వెళితే.. రాయికల్ మండలానికి చెందిన గంగజల కవల శిశువులకు జన్మనిచ్చింది. కొద్దికాలానికే ఆమె మృతిచెందింది. తల్లి ప్రేమను పొందకముందే కోల్పోయిన ఇద్దరు చిన్నారుల పోషణ బాధ్యత తండ్రి సాయిలుపై పడింది. ఆర్థిక పరిస్థితులు, పిల్లల సంరక్షణ భారంగా మారడంతో సాయిలు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కానీ, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న ఓ మహిళ పిల్లలను దత్తత ఇవ్వాలని తండ్రిని ఒప్పించినట్లు తెలిసింది. ఇద్దరు కవల శిశువులను రెండు వేర్వేరు కుటుంబాలకు దత్తత పేరుతో అప్పగించేలా ఒప్పందం కుదిర్చారు. ఇందుకు సంబంధించి డబ్బులు తీసుకున్నారనే ఫిర్యాదు పోలీసులకు అందినట్లు తెలుస్తోంది. Read Also : KTR : షెల్ కంపెనీల బాగోతం బయటపెడతాం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి రావడంతో తండ్రి సాయిలుతో పాటు పిల్లలను దత్తత తీసుకున్నట్లు చెబుతున్న రెండు కుటుంబాలు, నోటరీ చేసిన న్యాయవాదిపై రాయికల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పిల్లల దత్తత చట్టబద్ధంగా జరిగిందా? నిబంధనలు పాటించారా? డబ్బుల లావాదేవీలు జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దత్తత చట్ట ప్రకారమే జరగాలి : అధికారుల ప్రకారం.. చిన్నారుల దత్తత ప్రక్రియ చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగానే జరగాలన్నారు. పిల్లల సంరక్షణ, భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదిఏమైనా, తల్లిని
హైదరాబాద్ పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల మృతి చెందిన ఆరు నెలల పసికందును పూడ్చి పెట్టగా.. ఆ మృతదేహం అదృశ్యమైన ఘటన సంచలనంగా మారుతోంది. ఒకే రోజు వ్యవధిలో కవల పిల్లలను కోల్పోయిన కుటుంబానికి ఈ ఘటన మరింత విషాదాన్ని మిగిల్చింది. పూడ్చిపెట్టిన చిన్నారి మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురై పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.చార్మినార్ పరిధిలోని ఘన్సీబజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవల పిల్లలు జన్మించారు. పుట్టినప్పటి నుంచే ఆ కవలలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా.. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కవలల్లో ఒక పసికందు శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు శిశువు మృతదేహాన్ని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని పంజాగుట్ట హిందూ శ్మశానవాటికకు తీసుకెళ్లి ఖననం చేశారు.అయితే.. ఆ తర్వాతి రోజే ఆ కుటుంబాన్ని మరో విషాదం వెంటాడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో కవల కూడా ఆదివారం రాత్రి మృతి చెందింది. దీంతో సోమవారం కుటుంబ సభ్యులు రెండో పసికందు అంత్యక్రియల కోసం అదే శ్మశానవాటికకు వెళ్లారు. మొదటి చిన్నారిని పూడ్చిన ప్రదేశంలో గుంత తవ్వి ఉండటాన్ని వారు గుర్తించారు. ఆ గుంతలో చిన్నారి మృతదేహం కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.పూడ్చిపెట్టిన చోట తమ బిడ్డ మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులతోపాటు.. బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శ్మశానవాటిక సిబ్బందిని నిలదీస్తూ తమ బిడ్డ మృతదేహం ఏమైందని ప్రశ్నించారు. అయితే వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. శ్మశానవాటికలో పనిచేస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జగన్ అలియాస్ బాబా, ప్రసాద్, మల్లేష్, జోసెఫ్ కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు

ఎల్‌నినో దెబ్బతో ఈసారి వర్షాలు తగ్గుముఖం పడతాయేమోనన్న ఆందోళనల్లో ఉన్న దేశ ప్రజలకు, రైతాంగానికి వాతావరణ శాఖ అత్యంత తీపి కబురుందించింది. వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలు రుతుపవనాలను బలహీనపరుస్తున్నప్పటికీ, భారతీయ వాతావరణంలో ఏర్పడిన రెండు శక్తివంతమైన అల్పపీడనాలు వర్షాలకు సరికొత్త ఊపిరిని ఊదాయ్. ఈ జంట అల్పపీడనాల ప్రభావంతో రానున్న కొద్దిరోజుల పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షభారీగా దంచికొట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అల్పపీడనాల జోడు గుర్రాల స్వారీదక్షిణ పశ్చిమ ఉత్తరప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఒక అల్పపీడనం స్థిరపడగా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ , ఉత్తర ఒడిశా తీరంలో మరొక అల్పపీడనం బలంగా రూపుదిద్దుకుంది. ఈ రెండు వ్యవస్థలు ఒకదానికొకటి తోడై వాతావరణంలోకి భారీగా తేమను లాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు నుంచి ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనిస్తున్న ఈ అల్పపీడనాల ప్రభావంతో మధ్య, తూర్పు భారత దేశంలో వర్షాల విస్తృతి భారీగా పెరగనుంది.El Nino: వర్షాల రాజధానికే వానలు కరువు! కరుణించని మేఘమాలికలుఏ ఏ రాష్ట్రాల్లో వర్షాల ఉద్ధృతి?వాతావరణ శాఖ (IMD) ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటి ప్రభావం కేవలం తూర్పు రాష్ట్రాలకే పరిమితం కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తరాదికి కూడా విస్తరించనుంది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ తో పాటు తూర్పు రాజస్థాన్‌లో వానలు విపరీతంగా పడతాయని అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే, తీరప్రాంత కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ముసురు పట్టి జోరుగా వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.Super El Nino : ఎల్‌నినోను ఢీకొడుతున్న ఇండియన్ ఓషన్ డిపోల్ఒకవైపు పసిఫిక్ సముద్రంలో ఉద్భవిస్తున్న ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాల మందగమనం జరుగుతున్నప్పటికీ, హిందూ మహాసముద్రంలో ఏర్పడుతున్న సానుకూల ఇండియన్ ఓషన్ డిపోల్ (Positive IOD)

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 24 ఏళ్ల కవల సోదరీమణులు అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించారు. తమ నుంచి సెల్‌ఫోన్‌ను అపహరించిన దుండగుడిని బైక్‌పై వెంబడించి, కిందపడినా మొక్కవోని ధైర్యంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరి సాహసాన్ని గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ యువతులను ప్రత్యేకంగా సన్మానించారు.న్యాయ విద్య అభ్యసిస్తున్న ఆ ఇద్దరు సోదరీమణులు శనివారం తమ వాహనంపై కళాశాలకు వెళుతున్నారు. పరావ్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే, వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఒక వ్యక్తి వారిలో ఒకరి చేతిలో ఉన్న ఫోన్‌ను లాక్కొని పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన ఆ యువతులు నిందితుడిని వెంబడించారు. వారు సాయం కోసం కేకలు వేసినప్పటికీ సమీపంలోని వారు ఎవరూ వెంటనే స్పందించలేదు.ఫూల్‌బాగ్ చౌక్ సమీపంలోకి రాగానే, ఎదురుగా వస్తున్న ఒక టెంపో కారణంగా నిందితుడి బైక్‌తో పాటు యువతుల వాహనం వేగం కూడా తగ్గింది. ఈ క్రమంలో రెండు వాహనాలు ఢీకొనడంతో నిందితుడితో పాటు సోదరీమణులు కూడా కిందపడిపోయారు. తమకు గాయాలైనప్పటికీ లెక్కచేయకుండా, పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఆ దొంగను పట్టుకున్నారు. అనంతరం తమ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని పంజాబ్‌కు చెందిన మన్ప్రీత్గా గుర్తించారు. నిందితుడు గతంలోనూ ఇటువంటి నేరాలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్వాలియర్ ఎస్ఎస్పీ ధర్మవీర్ సింగ్ యాదవ్ ఆ సోదరీమణులను తన కార్యాలయానికి పిలిచి సన్మానించారు. నేరాల నియంత్రణలో పౌరుల అప్రమత్తత ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా