శ్రీవారి భక్తులను మోసగిస్తున్న 249 నకిలీ వెబ్ సైట్లు గుర్తింపు.. అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
నకిలీ వెబ్సైట్ల గురించి తిరుమల శ్రీవారి భక్తులను టీటీడీ మరోసారి అప్రమత్తం చేసింది. గదుల కేటాయింపు పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ.. పోస్టర్లు, తప్పుడు హామీలతో భక్తులను మోసం చేస్తున్న 249 నకిలీ వెబ్సైట్లను ఈ సంవత్సరం ఇప్పటివరకు గుర్తించినట్లు టీటీడీ తెలిపింది. ఆ ఫేక్ వెబ్సైట్లను తొలగించామని.. రెండు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసినట్లు తెలిపింది. ఆన్లైన్లో టీటీడీ పేరుతో కనిపించే నకిలీ వెబ్సైట్లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులను హెచ్చరించింది. శ్రీవారి దర్శనం, వసతి, సేవలు, టోకెన్ల విషయాల్లో దళారులను నమ్మి మోసపోవద్దని.. తిరుమలకు సంబంధించిన అన్ని సేవలు, నిబంధనలు, మార్గదర్శకాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.దర్శనం, గదుల కేటాయింపు అంటూ మోసాలకు పాల్పడుతున్న దళారులపై ఈ ఏడాది ఇప్పటివరకు 30 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన 43 మంది టీటీడీ ఉద్యోగులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. తిరుమలకు వచ్చే భక్తులు తమ సూచనలు, నిబంధనలు పాటిస్తూ.. భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని సూచించింది.ఇక తిరుమలకు వచ్చే వెంకన్న భక్తులు తమ వెంట తీసుకువచ్చే వస్తువులపైనా టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమలకు వచ్చే వాహనాల్లో నిషేధిత వస్తువులను తరలించకుండా అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. నిషేధిత వస్తువులను గుర్తిస్తే.. అలిపిరి టోల్గేట్ స్కానింగ్ కేంద్రం వద్దనే సీజ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు అలిపిరి వద్ద 261 డ్రోన్లు, 105 మెటా స్మార్ట్ గ్లాసెస్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమల క్షేత్రంలో భద్రత, గోప్యతను దృష్టిలో పెట్టుకుని శ్రీవారి భక్తులు.. డ్రోన్లు, స్మార్ట్ గ్లాసెస్ వంటి రికార్డింగ్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని విజ్ఞప్తి చేసింది.తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోందన్న టీటీడీ.. పరిమితికి మించి వస్తున్నప్పటికీ, భక్తులకు