
ఏఐ కంపెనీలు సూపర్ ఇంటెలిజెన్స్‌ను సృష్టిస్తున్నాయి!
Google DeepMind researcher: కృత్రిమ మేధ (Artificial intelligence) వేగంగా మార్పు చెందడంపై తీవ్ర ఆందోళన ఏర్పడుతోంది.

Google DeepMind researcher: కృత్రిమ మేధ (Artificial intelligence) వేగంగా మార్పు చెందడంపై తీవ్ర ఆందోళన ఏర్పడుతోంది.

Apple Watch Ultra 4.. సాహస యాత్రలు, రన్నింగ్, జిమ్ వంటి యాక్టివిటీలను ఇష్టపడేవారికి Apple నుంచి మరో ప్రీమియం గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది. బలమైన టైటానియం బాడీ, అత్యంత ప్రకాశవంతమైన డిస్ప్లే, మెరుగైన హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో Apple Watch Ultra 4 భారత మార్కెట్లో అడుగుపెట్టింది. భారీ బ్యాటరీ బ్యాకప్ కూడా దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఘోర విపత్తు నేపథ్యంలో, ఇస్రో-నాసా సంయుక్తంగా రూపొందించిన 'నైసర్' ఉపగ్రహం పనితీరుపై వచ్చిన విమర్శలు నిరాధారమని తేలింది. విపత్తును ముందుగా హెచ్చరించడంలో ఈ శక్తిమంతమైన శాటిలైట్ విఫలమైందన్న ఆరోపణలను తాజా విశ్లేషణలు పటాపంచలు చేశాయి. విపత్తు సంభవించడానికి కొన్ని వారాల ముందే నైసర్ స్పష్టమైన హెచ్చరిక సంకేతాలను పంపిందని వెల్లడైంది.చైనాలోని చాంగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి జెన్షియాంగ్ లియు, నైసర్ చిత్రాలను విశ్లేషించి ఈ కీలక విషయాలను వెల్లడించాడు. విపత్తు సంభవించడానికి కొన్ని వారాల ముందే ప్రమాదకర ప్రాంతంలోని పర్వత వాలులో భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు అతడు గుర్తించాడు. అక్కడి మంచు, రాతి పొరలు తీవ్ర ఒత్తిడికి గురై, ఆ ప్రాంతం ఏకంగా కొన్ని మీటర్ల మేర పక్కకు జరిగినట్లు తేలింది. ఈ కదలికలు ఒకేచోట కేంద్రీకృతం కావడం, రాబోయే కొండచరియల విపత్తుకు స్పష్టమైన సంకేతమని లియు తన విశ్లేషణలో పేర్కొన్నాడు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) సంయుక్తంగా ఈ 'నైసర్' (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశాయి. ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించి, హెచ్చరికలు జారీ చేసే లక్ష్యంతో దీన్ని గత ఏడాదే ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన భూ పరిశీలన ఉపగ్రహాల్లో ఒకటి. మేఘాలు, వర్షం, పొగమంచు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ పగలు, రాత్రి తేడా లేకుండా స్పష్టమైన చిత్రాలను తీయగల రెండు సింథటిక్ అపెర్చర్ రాడార్లను (ఎల్-బ్యాండ్, ఎస్-బ్యాండ్) కలిగి ఉన్న తొలి శాటిలైట్ ఇదే.ఈ వివరాల

రోజుకు ఐదు నిమిషాలు.. అంతే పని. కానీ నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి! ఈ మాట వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కాలేజీ రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఓ యువకుడు. స్నేహితులు కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐదు నిమిషాల పని అంటే ఐదు నిమిషాలే.. ఆ సమయంలో ఏం ఆలోచించాలో నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన ఓ చిన్న పరికరానికి దారి తీసింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.ఆ యువకుడే మసయోషి సన్. నేడు సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. 2026 సెప్టెంబరు 1 నాటికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద 63.2 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.3 లక్షల కోట్లు. కానీ ఈ స్థాయికి ఆయన ప్రయాణం మాత్రం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీలో ఓ విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలైంది.ఐదు నిమిషాల ఆలోచన..1970ల చివర్లో బెర్క్లీలో ఆర్థికశాస్త్రం చదువుతున్న సన్ తనకు తానే ఓ సవాల్ విసిరుకున్నారు. రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఓ వినూత్న ఆదాయ మార్గం కోసం ఆలోచించారు.ఆ ఐదు నిమిషాల్లో ఓ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ ఆలోచన వచ్చింది. బెర్క్లీలోని పరిశోధకులు, ప్రొఫెసర్ ఫారెస్ట్ మోజర్ సహకారంతో దాన్ని అభివృద్ధి చేశారు. చివరకు ఆ పరికరాన్ని జపాన్‌కు

ఎటు చూసినా తుపాకులతో కాపలా కాసే బలగాలు.. రెప్పపాటు కాలం కూడా కన్ను మూయని నిఘా నేత్రాలు.. సాధారణ పౌరుడు అడుగు పెట్టాలన్నా వేల ప్రశ్నలు ఎదురయ్యే అత్యంత కట్టుదిట్టమైన మిలిటరీ జోన్! అలాంటి హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్ స్థావరంలో ఎవరూ ఊహించని దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. శత్రువుల గుండెల్లో నిద్రపోయే ఆర్మీ అధికారుల స్థావరంలో చొరబడిన కొందరు కళ్లుచేదిరే చోరీకి ఒడిగట్టారు. పకడ్బందీ భద్రత ఉండే ఆయుధాగారంలోకే జొరబడి ఏకంగా 12 ప్రమాదకర తుపాకులను మాయం చేయడం ఇప్పుడు రక్షణ రంగాన్ని షాక్‌కు గురిచేస్తోంది.ఏకే-47లతో సహా ఆయుధాలు గాయబ్!ఈ చోరీ సాదాసీదాగా జరగలేదు. అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉండే వెపన్స్ స్టోర్ రూమ్ తలుపుల తాళాలను అత్యంత చాకచక్యంగా పగలగొట్టారు. క్షణాల వ్యవధిలో 4 అత్యాధునిక ఏకే-47 రైఫిళ్లు, 6 పిస్టళ్లు, ఒక ఇన్సాస్ (INSAS) రైఫిల్‌తో పాటు మరో కీలక తుపాకీని ఊడ్చేశారు. వాటితో పాటు వాటిలోకి వాడే బుల్లెట్లను కూడా పట్టుకెళ్లారు. పొద్దున్నే డిపో తెరిచి చూసిన సైనిక సిబ్బందికి ఖాళీగా ఉన్న స్టాండ్లను చూసి దిమ్మతిరిగిపోయింది. ఆర్మీ స్థావరంలోనే ఈ స్థాయిలో ఆయుధాలు మాయమవ్వడం జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపుతోంది.AK 203: ఆర్మీని శాసించబోతున్న షేర్ గన్, నిమిషానికి 700 రౌండ్ల ఫైరింగ్లోపలి స్కెచ్ లేకపోతే సాధ్యమేనా?ఈ దారుణం వెనుక అసలు మాస్టర్‌మైండ్ ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. ఆర్మీ కాంపౌండ్ చుట్టూ ఉండే ఎత్తైన గోడలు, భద్రతా గేట్లు, నిరంతరం తిరిగే పెట్రోలింగ్ టీమ్‌లను దాటుకుని బయటి వ్యక్తులు రావడం దాదాపు అసాధ్యం. అసలు ఆయుధాల గది ఎక్కడ ఉంది? తాళాలు ఎవరి వద్ద ఉంటాయి? సిబ్బంది ఏ సమయంలో మారతారు? అనే పక్కా సమాచారం ఉన్న లోపలి వ్యక్తుల హస్తం లేకుండా ఈ ఆపరేషన్ సాధ్యం కాదని విచారణ అధికారులు బలంగా అనుమానిస్తున్నారు

చైనాలో మైనర్లకు ఏఐ ప్రేమికులు, వర్చువల్ భాగస్వాములు వంటి సేవలను పూర్తిగా నిషేధిస్తూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.జూలై 15 నుంచి అమలవుతున్న నిబంధనల ప్రకారం 18 ఏళ్లలోపు వారికి వర్చువల్ ప్రేమికులు, భాగస్వాములు, బంధువుల తరహా సన్నిహిత సేవలు అందించకూడదు. యువత కృత్రిమ మేధ చాట్బాట్లు, వీడియో గేమ్ పాత్రలతో భావోద్వేగ బంధాలు పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ నియంత్రణ తీసుకొచ్చారు. దీంతో మైనర్లకు కృత్రిమ మేధ సహాయకుడిగా ఉండొచ్చు కానీ ప్రేమికుడిగా మారకూడదనే స్పష్టమైన గీతను చైనా గీసింది. చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ సహా 5 ప్రభుత్వ విభాగాలు కలిసి ఈ నిబంధనలను 2026 ఏప్రిల్ 10న విడుదల చేశాయి. కృత్రిమ మేధ ఆధారిత మనిషి తరహా పరస్పర సేవల నిర్వహణకు సంబంధించిన తాత్కాలిక చర్యలుగా వీటిని రూపొందించారు. 14 ఏళ్లలోపు పిల్లలు ఇతర మనిషి తరహా కృత్రిమ మేధ సేవలు ఉపయోగించాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతి తప్పనిసరి చేశారు. సేవను ఉపయోగిస్తున్న వ్యక్తికి తాను నిజమైన మనిషితో మాట్లాడటం లేదని వ్యవస్థ స్పష్టంగా గుర్తుచేయాలి. నిరంతరంగా 2 గంటలు వినియోగించిన తర్వాత విరామం తీసుకోవాలని కూడా సూచించాలి. ఏఐ ప్రేమికులు వినియోగదారుల్లో భావోద్వేగ ఆధారపడటం లేదా వ్యసనం పెంచే విధంగా రూపొందించకూడదని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవ జీవితంలోని కుటుంబ, స్నేహ, సామాజిక సంబంధాలు దెబ్బతినేలా కృత్రిమ మేధ సేవలు ప్రోత్సహించకూడదు. దీంతో తీవ్రమైన భావోద్వేగ పరిస్థితులను గుర్తించి అవసరమైన సమయంలో జోక్యం చేసుకునే వ్యవస్థలను కూడా సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కస్టమర్ సేవలు, విద్య, పని సహాయక కృత్రిమ మేధ వ్యవస్థలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవు. ప్రధానంగా మనిషి తరహా భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించే సేవలపైనే నియంత్రణ దృష్టి పెట్టింది. కొత్త నిబంధనల నేపథ్యంలో బైట్‌డాన్స్‌కు చెందిన డౌబావో, అలీబాబా క్యూవెన్, టెన్సెంట్ యువాన్‌బావో వంటి పెద్ద వేదికలు కస్టమ్ కృత్రిమ

భారత్‌లో స్టార్‌లింక్ సేవలపై స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ మరోసారి కీలక వ్యాఖ్య చేశారు. దేశంలోని అత్యంత తక్కువ సేవలు అందుతున్న ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు స్టార్‌లింక్ సహాయపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ భారతంలో ఇంటర్నెట్ సౌకర్యాలపై పేర్కొన్న గణాంకాలతో కూడిన ఒక ఎక్స్ పోస్టుకు స్పందిస్తూ మస్క్ ఈ అభిప్రాయం వెల్లడించారు. దీంతో భారత్‌లో స్టార్‌లింక్ కమర్షియల్ సేవల ప్రారంభంపై మరోసారి ఆసక్తి పెరిగింది. ఆగస్టు 20 రాత్రి డోగ్డిజైనర్ అనే ఎక్స్ ఖాతా గ్రామీణ ఇంటర్నెట్ అంతరంపై వివరాలతో పోస్ట్ చేసింది. మే 2026 నాటికి దేశంలోని 11,256 జాబితా గ్రామాలకు ఇంకా 4జీ కవరేజీ లేదని అందులో పేర్కొంది. మార్చి 2026 నాటికి భారత్‌లో 1.093 బిలియన్ ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల వాటా 440.87 మిలియన్లుగా తెలిపింది. ప్రతి 100 మందికి గ్రామీణ సబ్స్క్రిప్షన్ సాంద్రత 48.31గా ఉంటే, పట్టణాల్లో అది 126.80గా ఉన్నట్లు వివరించింది. భారత్‌నెట్ కింద ఇప్పటికే 8.5 లక్షల కిలోమీటర్లకు పైగా ఫైబర్ ఏర్పాటు చేసినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. సుమారు 2.21 లక్షల గ్రామ పంచాయతీలను సేవలకు సిద్ధం చేసినప్పటికీ, జూన్ 2026 నాటికి 80,472 ప్రాంతాల్లోనే అనుసంధాన కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతో కఠిన భూభాగాలు, కొండ ప్రాంతాలు, దీవులు, మారుమూల గ్రామాల్లో చివరి మైలు అనుసంధానం ప్రధాన సవాలుగా కొనసాగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ పూరక సేవగా ఉపయోగపడుతుందనే వాదన ముందుకొచ్చింది. ఇదిలా ఉండగా స్టార్‌లింక్ తన రెండో తరం ఉపగ్రహ నెట్‌వర్క్‌కు అనుమతి కోరుతూ ఇన్-స్పేస్‌కు తాజా దరఖాస్తు సమర్పించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. దాదాపు 30,000 ఉపగ్రహాలతో పాటు ప్రత్యక్ష పరికర అనుసంధాన సాంకేతికతకు కూడా ఆమోదం కోరుతున్నట్లు సమాచారం. గతంలో రెండో తరం దరఖాస్తు తిరస్కరణకు గురికాగా, 2025 జూలైలో సుమారు 4,408 ఉపగ్రహాల మొదటి తరం వ్యవస్థకు అనుమతి లభించింది

భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం అంతగా లేని ప్రాంతాలకు స్టార్‌లింక్ ఉపయోగపడుతుందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు శాటిలైట్ ఇంటర్నెట్ మేలు చేస్తుందని పేర్కొన్నారు. భారత్‌లో స్టార్‌లింక్ వాణిజ్య సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.‘ఎక్స్’లో ఓ పోస్ట్‌కు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2026 మే నాటికి దేశంలో 11,256 గ్రామాలకు 4జీ సదుపాయం లేదని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ వినియోగంలో భారీ తేడా ఉందని వివరించారు.2026 మార్చి నాటికి భారత్‌లో 109.3 కోట్ల ఇంటర్నెట్ సబ్స్క్రిప్షన్లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల వాటా 44.087 కోట్లు. గ్రామీణ ప్రాంతాల్లో 100 మందికి 48.31 ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. పట్టణాల్లో ఈ సంఖ్య 126.80గా ఉంది.మారుమూల గ్రామాలు, పర్వత ప్రాంతాలు, దీవులు, విపత్తుల ప్రభావిత ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాంటి చోట్ల భౌగోళిక పరిస్థితులు, మౌలిక వసతుల కొరత వల్ల సంప్రదాయ టెలికాం సేవలు అందించడం కష్టంగా ఉంటుంది. దేశంలో భారత్‌నెట్ ద్వారా 8.5 లక్షల రూట్ కిలోమీటర్లకు పైగా ఫైబర్ వేశారు. సుమారు 2.21 లక్షల గ్రామ పంచాయతీలను సేవలకు సిద్ధం చేశారు. స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కావాలంటే నియంత్రణ అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు పూర్తి కావాలి. ఈ ప్రక్రియ పూర్తయితే మారుమూల ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది

చాణక్యుడి ప్రకారం మనిషి మనసులో ఉన్న ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరితో పంచుకోవడం మంచిది కాదు. ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయాన్ని మన దగ్గరే ఉంచుకోవాలి అనే వివేకం కూడా జీవితంలో విజయంలో ఒక భాగమే. మనిషి ఎంత తెలివైనవాడైనా, ఒకసారి చెప్పిన మాటను వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. అందుకే తెలివైన వ్యక్తి తన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరి ముందు పెట్టడు. ముఖ్యంగా ఈ 5 విషయాల్లో గోప్యత పాటిస్తాడు. అవేంటో చూద్దాం. ప్రతి మనిషికీ కొన్ని బలాలు, బలహీనతలు ఉంటాయి. మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి మన మంచిని కోరుకునేవాడు కాకపోవచ్చు. అందుకే మన భయాలు, లోపాలు, మనం ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను అందరికీ చెప్పడం మంచిది కాదు. ఒకసారి మన బలహీనత మరొకరికి తెలిసిన తర్వాత, దాన్ని మనకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఎంత సంపాదిస్తున్నారు, బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏ ఆస్తులు ఉన్నాయి వంటి విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. డబ్బు విషయంలో ఎక్కువగా మాట్లాడటం కొన్నిసార్లు అనవసరమైన సమస్యలకు కారణమవుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న కొందరు అవసరం లేని అంచనాలు పెట్టుకోవచ్చు. మరికొందరు మీ దగ్గర సహాయం కోసం పదేపదే రావచ్చు. ఇంకొందరు మీ సంపాదనను చూసి అసూయపడే అవకాశం కూడా ఉంది. మనం ఏం చేయబోతున్నాం, ఎక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాం, ఏ వ్యాపారం ప్రారంభించబోతున్నాం వంటి విషయాలను పని పూర్తయ్యేలోపు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రణాళికను పదిమందితో చర్చిస్తే పదిమంది అభిప్రాయాలు వస్తాయి. కొన్నిసార్లు అవి మనలో అనవసరమైన సందేహాలను కూడా కలిగిస్తాయి. మరికొన్ని సందర్భాల్లో మన ప్రణాళికలను ఇతరులు ముందుగానే తెలుసుకుని అడ్డంకులు సృష్టించే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ చిన్నచిన్న విభేదాలు, సమస్యలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి

హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్, ఆగస్టు 20: హైదరాబాద్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్, గ్యాంగ్‌స్టర్ షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌కు సంబంధించిన జాడలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పాక్ ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో హైదరాబాద్‌కు సంబంధాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. గతంలో అరెస్టైన ఇద్దరు యువకులకు ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా 253 మంది అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 253 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు అరెస్టైనట్లు గుర్తించారు. వీరికి గాజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల జాయిద్ ఖాన్‌కు కీలక లింకులు ఉన్నట్లు బయటపడింది. జాయిద్ ఖాన్.. ఫిబ్రవరిలో మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్‌వర్క్‌తో పరిచయం ఏర్పడిందని, అనంతరం ఐఎస్ఐ సానుభూతిపరులతో జాయిద్ ఖాన్ చాటింగ్ చేసినట్లు విచారణలో తేలింది. ఐఏఎస్ సానుభూతిపరులు హమీద్, రాణా హుస్సేన్‌లతో జాయిద్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించిన తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్.. వీరి చాటింగ్‌పై నిఘా పెట్టింది. తెలంగాణలో సెక్షన్ 22Aపై రాహుల్‌కు హరీశ్ లేఖ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు నగల బ్యాగ్‌ను పోగొట్టుకున్న బధిర అన్నాచెల్లెళ్లు.. పోలీసుల చొరవతో తిరిగి అప్పగింత

ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నైరోబీ: ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం అధిపతి మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి కూడా ఉన్నారు. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్గిరో ప్రాంతం వైపు హెలికాప్టర్ వెళ్తోంది. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఆరుగురు ప్రయాణికులు, మరొకరు పైలట్. అయితే, బుధవారం ఉదయం 9:13 గంటల సమయంలో సంబూరు కౌంటీలోని మౌంట్ ఒలోలోక్వే వద్దకు హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు, ఘటనాస్థలిలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారినట్లు కెన్యా రెడ్‌క్రాస్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అమెరికా పౌరులు మృతిచెందినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతుల్లో టెలిముండో సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ జోస్ అల్బెర్టో సువారెజ్, ఈక్వెడార్ జాతీయ నిఘా కేంద్రం డైరెక్టర్ జనరల్ మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి ఉన్నారు. హెలికాప్టర్‌ను లేడీ లోరీ హెలికాప్టర్స్ సంస్థ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై కెన్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, హెలికాప్టర్ ప్రయాణ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో సరితా కోమటిరెడ్డి
ఆమెకి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు.. కొండా సుస్మితకు రేవూరి కౌంటర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఘాటుగా సమాధానమిచ్చారు. వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, ప్రజల్లో ఉన్న మంచి పేరు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగానే సీఎం రేవంత్ తనను పరకాల అభ్యర్థిగా ప్రకటించారని రేవూరి తెలిపారు. మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ, కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేని వ్యక్తి అని, సీఎం రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోరని మండిపడ్డారు. దమ్ముంటే సీఎంపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారు. ఈ వార్తకు సంబంధించిన

డిజిటల్ మోసాలు, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర టెలికాం విభాగం (డీఓటీ) కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డుల జారీ, వినియోగంపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇందులో భాగంగా, ఒక వ్యక్తి గరిష్ఠంగా 9 సిమ్ కార్డులు మాత్రమే కలిగి ఉండాలన్న నిబంధనను పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆగస్టు 17న టెలికాం కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది.ఈ నూతన నిబంధనల అమలు కోసం 'డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్' (డీఐపీ) అనే ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరైనా తొమ్మిది సిమ్ కార్డుల పరిమితిని మించితే, వారి ఫొటోను ఈ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తారు. ఆగస్టు 23 నుంచి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. టెలికాం కంపెనీలు కొత్త సిమ్ జారీ చేసే ముందు కస్టమర్ ఫొటోను ఈ డీఐపీ డేటాతో తప్పనిసరిగా సరిపోల్చుకోవాలి. ఒకవేళ పరిమితికి మించి సిమ్ కార్డులు ఉన్నట్లు తేలితే, సదరు వ్యక్తికి కొత్త సిమ్ జారీని నిరాకరించాలి.ఆగస్టు 24 నుంచి టెలికాం ఆపరేటర్లు ఈ డీఐపీ వెబ్‌సైట్‌ను ఎప్పటికప్పుడు నవీకరించాల్సి ఉంటుంది. నవంబర్ 30 నాటికి ఈ ప్రక్రియ అంతా రియల్ టైమ్‌లో పనిచేసేలా చూడాలని డీఓటీ స్పష్టం చేసింది. నిర్ణీత పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులు వాటిని స్వచ్ఛందంగా సరెండర్ చేయాలని సూచించింది. లేనిపక్షంలో, సంబంధిత టెలికాం కంపెనీలే వాటిని నిలిపివేస్తాయి.ఇదిలా ఉండగా, ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం 'సంచార్ సాథీ'

తెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవుతెలివి ఎంత ఉన్నా.. ఈ తప్పులు చేస్తే జీవితంలో కష్టాలు తప్పవు Prasanna Yadla 16 August 2026 Pic credit - Pinterest చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చాణక్య నీతి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. ఎంతో మంది ఆసక్తి మంచి చెడులను అర్థం చేసుకోలేని వాళ్ళకి సలహా ఇచ్చినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అర్థం చేసుకోలేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళ మీ మాటలను అసలు పట్టించుకోకపోవచ్చు ఇదే మిమ్మల్ని మరి ఇబ్బంది పెడుతుంది అసలు పట్టించుకోకపోవచ్చు తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి కూడా ఏం చెప్పకండి. ఇంకా మీకు ఇబ్బందులు కూడా రావొచ్చు. మీకు ఇబ్బందులు కూడా మూర్ఖులకు సలహాలు ఇవ్వడం వలన సమయం వృథా అవుతుందని చాణక్యుడు చెబుతున్నాడు మూర్ఖులకు సలహాలు జీవిత భాగస్వామి చేసే తప్పు చేస్తే అది తన మీద కూడా పడుతుంది. జీవిత భాగస్వామి నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

విమర్శకులను, ప్రత్యర్థులను టార్గెట్ చేస్తున్నారు న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు. దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్‌కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు. రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’ ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ

టెక్నాలజీని మనం ఊహించని పనులకు కూడా వాడొచ్చని నిరూపించే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా గోవాకు చెందిన ఓ యువకుడు ఉజ్జయిని మహాకాళ్ ఆలయం వెలుపల పోగొట్టుకున్న తన చెప్పులను కనుగొనేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనం చాట్‌జీపీటీని ఉపయోగించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే.. శుభాంగ్ బోర్కర్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. ఉజ్జయిని ఆలయం వెలుపల ఉన్న షూ స్టాండ్‌లో వందలాది చెప్పుల మధ్య తనవి కనుక్కోవడం అతనికి కష్టమైంది. దీంతో అతను వినూత్నంగా ఆలోచించాడు. వెంటనే తన ఫోన్‌తో అక్కడున్న చెప్పుల రాక్స్‌ను వీడియో తీశాడు. తన చెప్పుల ఫొటోను రిఫరెన్స్‌గా ఇస్తూ, తీసిన వీడియోను చాట్‌జీపీటీకి అప్లోడ్ చేశాడు.ఆ ఫొటోలు, వీడియోను విశ్లేషించిన చాట్‌జీపీటీ, రాక్ కుడి వైపున మధ్య భాగంలో అతని చెప్పులు ఉన్నాయని కచ్చితమైన లొకేషన్‌ను సూచించింది. శుభాంగ్ అక్కడకు వెళ్లి చూడగా, అవి తన చెప్పులేనని నిర్ధారించుకున్నాడు. ఈ మొత్తం ప్రక్రియను అతను వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది.రద్దీగా ఉండే ప్రదేశంలో ఇలాంటి ఒక సాధారణ సమస్యకు టెక్నాలజీని వాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనికి కూడా ఏఐని వాడొచ్చని తాము ఎప్పుడూ ఆలోచించలేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఏఐ ఇమేజ్ అనాలిసిస్ సామర్థ్యాలకు ఒక సరదా నిదర్శనంగా నిలిచింది

కృత్రిమ మేధస్సు కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు. ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధస్సు (AI) కారణంగా భారీగా ఉద్యోగాలు కనుమరుగవుతాయన్న ఆందోళనల మధ్య మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ కారణంగా కంపెనీల పరిమాణం తగ్గినప్పటికీ, మొత్తంగా ఉద్యోగాల సంఖ్య తగ్గదని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. జుకర్‌బర్గ్ ఆగస్టు 10న మెటా వెబ్సైట్లో ఒక వ్యాసాన్ని పోస్ట్ చేశారు (Mark Zuckerberg AI Jobs). ఆ వ్యాసంలో ఏఐ భవిష్యత్తు, ఉద్యోగాలు, వ్యాపారాలపై జుకర్‌బర్గ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ఏఐ మానవుల ప్రాధాన్యతను పూర్తిగా తొలగిస్తుందని భావించడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో కంపెనీల పరిమాణం తగ్గే అవకాశం ఉందని జుకర్‌బర్గ్ అన్నారు. అయితే దాని అర్థం ఉద్యోగాలు తగ్గిపోవడం కాదని స్పష్టం చేశారు. తక్కువ మంది ఉద్యోగులతో పనిచేసే మరిన్ని చిన్న కంపెనీలు ఏర్పడొచ్చన్నారు. అవి ఏఐ సహాయంతో పెద్ద సంస్థల స్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉందని వివరించారు. చిన్న వ్యాపారాల అభివృద్ధికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. చిన్న వ్యాపారాలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా కొనసాగుతాయని, ఏఐ కారణంగా ఒక్కో చిన్న సంస్థ ప్రభావం మరింత పెరుగుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రతిసారీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయని జుకర్‌బర్గ్ గుర్తుచేశారు. ఒక తరం క్రితం యాప్ డెవలపర్లు, సామాజిక మాధ్యమ కంటెంట్ సృష్టికర్తలు, విద్యుత్ వాహన సాంకేతిక నిపుణులు, డేటా సెంటర్ ఉద్యోగాలు ఇంతగా ఉండేవి కావని పేర్కొన్నారు (AI Future Jobs). ఏఐ విస్తరణతో ప్రస్తుతం ఊహించలేని కొత్త రకాల ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని ఆయన అన్నారు (AI and Employment). ఏఐ ప్రధానంగా ఆటోమేషన్ సాధనంగా

ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎడమచేతితో పనులు చేసే వారి ప్రత్యేకతలు, అలవాట్లు, ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏడాది ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతి వాటం వారి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎడమ చేతితో రాయడం, తినడం, ఇతర పనులు చేయడం అలవాటుగా ఉన్నవారు ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ రోజును ఎడమచేతి వాటం వారు ఎదుర్కొనే ఇబ్బందులు, వారి ప్రత్యేకతలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తారు. ప్రపంచంలోని చాలా వస్తువులు, పనిముట్లు కుడిచేతి వాటం వారికి అనుకూలంగా రూపొందించబడి ఉంటాయి. దీంతో ఎడమచేతి వాటం వారు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ వారు తమకు అనుకూలమైన విధంగా వాటిని ఉపయోగిస్తూ పనులను పూర్తి చేస్తారు. లెఫ్ట్-హ్యాండర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు డీన్ ఆర్. క్యాంప్‌బెల్ 1976లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఎడమచేతి వాటం వారి ఆలోచనా విధానం, సృజనాత్మకతలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. అయితే ఎడమచేతి వాటం ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కువ తెలివితేటలు లేదా అధిక ఐక్యూ కలిగి ఉంటారని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. వారిలో సృజనాత్మకత, సమస్యలను విభిన్నంగా పరిష్కరించే సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే లక్షణాలు కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. క్రికెట్, టెన్నిస్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ఎడమచేతి వాటం ఆటగాళ్లు ప్రత్యర్థులకు భిన్నమైన సవాలుగా నిలుస్తారు. రఫెల్ నాదల్, డియెగో మారడోనా, బ్రియాన్ లారా, పీలే వంటి ప్రముఖ క్రీడాకారులు ఎడమచేతి వాటం వారిగా గుర్తింపు పొందారు. మొత్తంగా చూస్తే, ఎడమచేతి వాటం అనేది లోపం కాదు.. ఒక సహజమైన భిన్నత్వం. తమకు అనుకూలంగా లేని పరిస్థితులను అధిగమిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న ఎడమచేతి వాటం వారిని గౌరవించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీ నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్ ఇచ్చిన ఓ కీలక హెచ్చరిక అమెరికా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్ నుంచి ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అమెరికా అధికారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌ను అసలు విమానం నుంచి రహస్యంగా దించి.. మరో చిన్న మిలిటరీ జెట్‌లోకి తరలించారు. అయితే, ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొత్త చర్చ ప్రారంభమైంది. టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్ తొలుత ఎయిర్‌ఫోర్స్ వన్‌గా భావించిన విమానంలోకి ఎక్కారు. అదే విమానంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్, వైట్‌హౌస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ నుంచి వచ్చిన హెచ్చరిక నేపథ్యంలో సీక్రెట్ సర్వీస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ను ఎవరికీ తెలియకుండా మరో చిన్న సైనిక విమానంలోకి మార్చినట్లు ది వాషింగ్టన్ పోస్ట్, NPR వంటి అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం క్యాటరింగ్ వాహనాన్ని ఉపయోగించినట్లు సమాచారం. దీంతో మీడియా, కొంతమంది వైట్‌హౌస్ సిబ్బందికి తెలియకుండానే ట్రంప్ మరో విమానంలో అమెరికా బయలుదేరారు. అయితే ఇజ్రాయెల్ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్క వర్గం నుంచే వచ్చిందని, దానికి బలమైన ఆధారాలు లేవని కొందరు అమెరికా అధికారులు భావించినట్లు కథనాలు చెబుతున్నాయి. CIA విశ్లేషకులు కూడా ఈ సమాచారాన్ని అధిక విశ్వసనీయత కలిగినదిగా పరిగణించలేదని సమాచారం. టర్కీ భద్రతా సంస్థలు కూడా ఈ అంశాన్ని పరిశీలించినప్పటికీ.. అంకారాలో ట్రంప్‌ను హత్య చేసేందుకు నిర్దిష్టమైన కుట్ర ఉన్నట్లు గుర్తించలేదని అమెరికా మీడియా పేర్కొంది. అయినప్పటికీ, ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నాలను దృష్టిలో

హైదరాబాద్ వేదికగా ‘ఏఐ హబ్ స్విట్జర్లాండ్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు (కేటీఆర్) అధికారికంగా ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వస్తున్న సమాచార విప్లవాన్ని సామాన్యులకు, పరిశ్రమలకు చేరవేయడమే ఈ వేదిక ప్రధాన లక్ష్యం. ఆగస్టు 12న జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ గాండేతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులను పర్యవేక్షించేందుకు ఈ వేదికను రూపొందించారు. గతంలో సాంకేతికతకు సంబంధించి సరైన మార్గదర్శకాలు లేకపోవడంతో నిపుణులు ఇబ్బందులు పడేవారు. ఈ లోటును భర్తీ చేస్తూ, అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందించేందుకు ఈ ప్లాట్‌ఫామ్ సిద్ధమైంది. ఇది కేవలం ఒక డైరెక్టరీ మాత్రమే కాకుండా, సమగ్రమైన ఏఐ రిఫరెన్స్ లేయర్‌గా పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీంతో ఏఐ హబ్ స్విట్జర్లాండ్‌లో 125కు పైగా ధృవీకరించిన ఏఐ టూల్స్, 15 కేటగిరీలలో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా, 50కి పైగా ఎంటర్ప్రైజ్ కేస్ స్టడీలను, 23 గ్లోబల్ గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్‌లను ఈ ప్లాట్‌ఫామ్ ఒకే చోట చేరుస్తుంది. ఇదిలా ఉండగా, యూరోపియన్ యూనియన్ ఏఐ చట్టం, నిస్ట్ (NIST) ప్రమాణాల వంటి అంతర్జాతీయ నిబంధనలను కూడా ఇందులో పొందుపరిచారు. ఫలితంగా, ఏఐ హబ్ స్విట్జర్లాండ్ త్వరలోనే అంతర్జాతీయ స్థాయి థింక్ ట్యాంక్‌గా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో యూకే ఎంపీ లార్డ్ ఉదయ్ నాగరాజు నేతృత్వంలోని ‘ఏఐ పాలసీ ల్యాబ్స్’తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భారత్, యూకే, స్విట్జర్లాండ్ దేశాల మధ్య సాంకేతిక ఆవిష్కరణలను పంచుకునేందుకు మార్గం సుగమమైంది. భవిష్యత్తులో ఈ సంస్థ గ్లోబల్ కంట్రిబ్యూటర్ నెట్వర్క్ ద్వారా సాంకేతిక మూల్యాంకనాలు, శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎంటర్ప్రైజ్ ఆటోమేషన్ రంగాల్లో నిపుణుల కోసం ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నారు. ఇవి ఓపెన్ యాక్సెస్ ప్లేబుక్స్ను రూపొందించి, పరిశ్రమల్లో ఏఐ వినియోగాన్ని

Oracle Layoffs| ఇంటర్నెట్‌డెస్క్: కృత్రిమ మేధ విస్తృత వినియోగం కారణంగా మొన్నటి వరకు ఉద్యోగాలు పోగా.. ఆ టెక్నాలజీకి పెట్టిన ఖర్చును పూడ్చుకోవడం కోసం మరికొంత మంది సిబ్బందిని తొలగించుకునేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ ఇప్పుడు ఆ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నెలలో మరోసారి భారీసంఖ్యలో లేఆఫ్‌లు ప్రకటించనుందని తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీని వేగంగా అందిపుచ్చుకునేందుకు డేటా సెంటర్ల నిర్మాణం, ఏఐ చిప్‌లను కొనుగోలు చేయడం, ఓపెన్ ఏఐ వంటి ఏఐ క్లయింట్లకు మద్దతు ఇచ్చేందుకు ఒరాకిల్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు ఆ ఖర్చును భర్తీ చేసుకునేలా ఉద్యోగులను తగ్గించుకోవాలని చూస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ సంఖ్య ఎంతనేది మాత్రం వెల్లడికాలేదు. సెప్టెంబర్ ఒకటి నుంచి రెండో త్రైమాసికం ప్రారంభం కావడానికి ముందే ఈ కోతలు అమలు చేయాలని భావిస్తోంది. కొన్ని బృందాల్లో కోతలు డబుల్ డిజిట్లో ఉండనున్నట్లు సమాచారం. గతంలోనూ ఒరాకిల్ (Oracle) ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. 12 నెలల్లో 21వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు జూన్ నెలలో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధను భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని, భవిష్యత్తులోనూ ఈ కోతలు కొనసాగుతాయని నాడే పేర్కొంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు

చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్-అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో... ‘మూన్ బేస్’ మిషన్‌లో పాల్గొనాలని ఇస్రోకు నాసా ఆహ్వానం బెంగళూరు, ఆగస్టు 11: చంద్రుడిపై అన్వేషణ, మానవ అంతరిక్ష యానంలో భారత్-అమెరికా సహకారానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో భారత్ కూడా భాగస్వామి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికోసం తాము చేపడుతున్న ప్రతిష్ఠాత్మక ‘మూన్ బేస్’ మిషన్‌లో భాగస్వామి కావాలంటూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)ను అధికారికంగా ఆహ్వానించింది. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన భారత్-అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది. ఈ సమావేశంలో ఇస్రో చైర్మన్ వి నారాయణన్, భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ పాల్గొన్నారు. ఆర్టెమిస్ ఒప్పందాల కింద ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ.. నాసా తన మూన్ బేస్ కార్యక్రమంలో చేరాల్సిందిగా ఇస్రోను ఆహ్వానించినట్టు అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. ఈక్రమంలో శాస్ర్తీయ డేటాను పంచుకునే అంశంపై చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుదేశాలూ అంగీకరించాయని పేర్కొంది. భారత్ తన స్పేస్ విజన్-2047 లక్ష్యంలో భాగంగా చంద్రుడిపై మానవ కార్యకలాపాలకు సిద్ధమవుతున్న తరుణంలో నాసా నుంచి ఈ ఆహ్వానం అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాసా, ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ ఉపగ్రహ ప్రయోగం ద్వారా ఇప్పటికే ఇరు దేశాలు అంతరిక్ష సహకారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో శాస్త్రీయ పరిశోధనలు, మానవ అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన సాంకేతికతపై కలిసి పనిచేయాలని తాజాగా నిర్ణయించాయి. భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్ నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

కోర్ కంటే ఏఐఎంఎల్కే డిమాండ్ సీఎ్‌సఈలో 70, సీఎస్ఈ-ఏఐలో 84% భర్తీ ఈసీఈలో 18,286, మెకానికల్‌లో 4,865 సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో 60,757 సీట్లు భర్తీ ఐదు బ్రాంచ్‌ల్లో నిండిన సీట్లు పది లోపే అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్ విద్యలో ట్రెండ్ మారుతోంది. గతేడాది వరకు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ ఉంటే ఈ ఏడాది అనూహ్యంగా సీఎ్‌సఈ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్(ఏఐఎంఎల్)వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. ఆదివారం ఈఏపీసెట్ అడ్మిషన్ల తొలిదశ కౌన్సెలింగ్ పూర్తిచేసిన ఉన్నత విద్యాశాఖ.. విద్యార్థులకు సీట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 247 కాలేజీల్లో 1,51,312 సీట్లు కన్వీనర్ కోటాలో ఉండగా 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. 44,073 సీట్లు మిగిలిపోయాయి. దీనిలో సీఎస్ఈ కోర్లో 44,883 సీట్లు అందుబాటులో ఉండగా 31,416 (69.99శాతం)సీట్లు భర్తీ అయ్యాయి. సీఎ్‌సఈ-ఏఐఎంఎల్‌లో 18,873 సీట్లకుగాను 15,819(83.81శాతం) సీట్లలో విద్యార్థులు చేరారు. సాధారణంగా విద్యార్థులు సీఎ్‌సఈ కోర్ బ్రాంచ్‌కే మొగ్గుచూపుతారు. కానీ, ఈసారి మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐఎంల్కు ఎక్కువ ఆసక్తి చూపినట్లు అర్థమవుతోంది. అలాగే, సీఎ్‌సఈ-ఏఐ అండ్ డేటా సైన్స్‌లో 2,339 సీట్లకుగాను 1,917(81.85శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీలో 3,219 సీట్లు ఉంటే 2,553(79శాతం) నిండాయి. సీఎ్‌సఈ కాకుండా కేవలం ఏఐఎంఎల్ సీట్లు 6,309 ఉంటే 4,782(75శాతం) భర్తీ అయ్యాయి. ఇంజనీరింగ్‌లో సీఎ్‌సఈ తర్వాత ఎక్కువ డిమాండ్ ఉండే ఈసీఈలో సీట్లు మెరుగ్గానే నిండాయి. ఆ కోర్సులో 24,577 సీట్లు ఉంటే 18,286(74శాతం) సీట్లు విద్యార్థులకు కేటాయించారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో 7,388 సీట్లకుగాను 4,865(66శాతం) భర్తీ అయ్యాయి. సీఎస్ఈ డేటాసైన్స్‌లో 65శాతం, ఈఈఈలో 62శాతం, సివిల్‌లో 60శాతం, ఏఐ అండ్ డేటా సైన్స్‌లో 58శాతం, సీఎ్‌సఈ ఏఐలో 54శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్లానింగ్, ఐటీ అండ్ ఇంజనీరింగ్, సీఎస్ స్పెషల్ ఇన్ ఐఓటీ అండ్ ఆటోమేషిన్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్

మన్యం నేలలో నిధులు.. మారని మన్యం బిడ్డల రాత..! కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..! కానీ, ఆ మట్టిపై తాతల ముత్తాతల నుంచి బతుకుతున్న గిరిజనుడి జీవితంలో మాత్రం ఎలాంటి మార్పూ రాలేదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, ఇంకా అడవి తల్లి ఒడిలోనే పేదరికంతో, రోగాలతో, సరైన ఉపాధి లేక అలమటిస్తున్న మన్యం బిడ్డల కన్నీటి గాథ ఇది. అపరిమిత సంపద ఉన్న ప్రాంతంలో పుట్టి కూడా, దిక్కులేని బతుకులు ఈడుస్తున్న వారి స్థితిగతులు నేటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని పలు అంశాలపై తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్, ఏపీ మాజీ గనుల డైరెక్టర్ డాక్టర్ వి.డీ రాజగోపాల్ మధ్య ఆసక్తికర విశ్లేషణ జరిగింది దళారుల దోపిడీ నుంచి కట్టెల మోపుల వరకు... ఆరని ఆవేదనతరతరాలుగా కొండల్లో లభించే అటవీ ఉత్పత్తులను మోసుకొచ్చి వారపు సంతల్లో అమ్ముకోవడమే మన్యం ప్రజల ప్రధాన బతుకు దెరువు. గతంలో దళారులు ఆ అమాయక గిరిజనులను ఏ స్థాయిలో దోచుకున్నారో అందరికీ తెలిసిందే. పది రూపాయల విలువైన వస్తువును కేవలం పది పైసలకే కొట్టేసి, వారి రెక్కల కష్టాన్ని నట్టేట ముంచేవారు. ఆ తర్వాత గిరిజన సహకార సంస్థ (GCC) వంటివి అందుబాటులోకి వచ్చి కొంతవరకు మద్దతు ధర అందించినప్పటికీ, గిరిజనుల జీవితాల్లో రావాల్సిన పూర్తిస్థాయి ఆర్థిక విప్లవం ఇంకా రాలేదు. నేటికీ 70 ఏళ్ల వయసొచ్చిన పసితనం చావని తాతలు, అవ్వలు కొండల్లో కట్టెల మోపులు తలపై పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బతుకీడుస్తున్న దృశ్యాలు మన్యంలో గుండెలను పిండేస్తుంటాయి. మైనింగ్ భయాలు vs ప్రగతి అవకాశాలు ఏజెన్సీ ప్రాంతాల్లోని బాక్సైట్ నిల్వలను సమర్థవంతంగా, పర్యావరణానికి భంగం వాటిల్లకుండా వినియోగిస్తే అక్కడ అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి. మైనింగ్ అనగానే కేవలం పర్యావరణ విధ్వంసమనో, గిరిజనులను వెళ్లగొడతారనో భయపెట్టే

Minister TG Bharat: కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో నిఘా వ్యవస్థ విఫలమైందని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే సోషల్ మీడియాలో ఇంతియాజ్ ఫొటో పెట్టి ‘RIP’ అని పోస్ట్ చేసినా పోలీసుల దృష్టికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మంత్రులపై నిఘా పెట్టే వ్యవస్థ నేరస్థులపై ఎందుకు నిఘా పెట్టడం లేదని నిలదీశారు. మంత్రులు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను నిఘా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని, అలాంటప్పుడు నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై సమాచారం పోలీసులకు ఎందుకు అందడం లేదని టీజీ భరత్ ప్రశ్నించారు. తనకు అందుతున్న సమాచారం కూడా పోలీసులకు అందడం లేదని, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్‌ను పక్కా పథకం ప్రకారం దారుణంగా హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు. ఇంతియాజ్ గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారని, ఆ సమయంలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని వైసీపీ వర్గీయులు బెదిరించారని, ఆయన ఇంటికి వెళ్లి గొడవకు దిగారని పేర్కొన్నారు. తర్వాత ఇంతియాజ్ టీడీపీలో చేరారని మంత్రి తెలిపారు. హంద్రీ నదిలో జరుగుతున్న వైసీపీ కబ్జాలను ఇంతియాజ్ బయటపెట్టారని, వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే ఆయనను హత్య చేశారని టీజీ భరత్ ఆరోపించారు. వైసీపీపై తీవ్ర ఆరోపణలు కర్నూలులో వైసీపీకి చెందిన రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తున్నాయని మంత్రి ఆరోపించారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని విమర్శించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని, ప్రతి హత్యలోనూ వైసీపీ ప్రమేయం ఉందని తనకు సమాచారం ఉందని టీజీ భరత్ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వైసీపీ నేతల స్పందన తెలియాల్సి ఉంది. నిందితుడి వ్యాఖ్యలపై ఆందోళన జైలు నుంచి బెయిల్‌పై బయటకు వస్తున్న సమయంలో

కృత్రిమ మేధ (ఏఐ) భారత్‌లో వ్యవసాయం నుంచి వైద్యం వరకు ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతోంది. రైతులకు వాతావరణ సమాచారం అందించడం, పంట నష్టాలను తగ్గించడం, క్షయ వ్యాధిని గుర్తించడం వంటి పనుల్లో ఏఐ మంచి ఫలితాలు ఇస్తోందని ప్రపంచ బ్యాంకు తన 2026 ప్రపంచ అభివృద్ధి నివేదికలో తెలిపింది. అయితే కాల్ సెంటర్లు, సాఫ్ట్వేర్, ఆర్థిక సేవల్లో ప్రారంభ స్థాయి ఉద్యోగాలకు ఏఐ ముప్పుగా మారొచ్చని హెచ్చరించింది.తెలంగాణలో ఏఐ ఆధారిత వాతావరణ అంచనా వ్యవస్థ చిన్న రైతులకు ఉపయోగపడిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ నిర్ణయాలు మార్చుకున్నారు. కొందరు వ్యవసాయంపై పెట్టుబడిని మూడో వంతు వరకు పెంచగా.. మరికొందరికి ఒక్కో రైతుకు 560 డాలర్ల వరకు ఆదా అయింది.ఒడిశాలో 2018లో ప్రారంభమైన ‘ఆమా కృషి’ కార్యక్రమం ఇప్పుడు ‘కృషి సమృద్ధి’గా కొనసాగుతోంది. ఏఐ సలహాలతో రైతులకు సూచనలు అందిస్తోంది. 2022లో సుమారు 30 లక్షల మంది రైతులతో ఉన్న ఈ సేవ ఇప్పుడు 70 లక్షల మందికి పైగా చేరింది. ‘కిసాన్ ఈ-మిత్ర’ చాట్‌బాట్ 11 భారతీయ భాషల్లో రైతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తోంది. ఏఐ సేవలు అందుబాటులోకి వచ్చిన 186 రోజుల్లోనే 27 లక్షల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.వైద్య రంగంలోనూ ఏఐ ఉపయోగపడుతోందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. ‘కఫ్ ఎగైనెస్ట్ టీబీ’ ద్వారా దగ్గు శబ్దాన్ని పరిశీలించి క్షయ వ్యాధి పరీక్ష అవసరమైన వారిని గుర్తించినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో ఎక్స్‌రేలను పరిశీలించేందుకు ఏఐను ఉపయోగించగా.. నిపుణుల కంటే మెరుగైన ఫలితాలు

దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. దేశంలోని లక్షలాది మంది గిగ్ వర్కర్లలో అతడు కూడా ఒకడు. మామూలు స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అయితే తనకు ఎదురైన ఒక ప్రమాదాన్ని అనుకూలంగా మలుచుకున్నాడు. ఆసుపత్రి బెడ్ మీద తనలోని కథకుడిని బయటకు తీసుకొచ్చి, లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఓ డెలివరీ బాయ్ కథకుడిగా మారి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు. అతడే... అజిత్‌కుమార్. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు అ‘సామాన్యుడి’ విజయగాథ ఆద్యంతం ఆసక్తికరం... ఫరీదాబాద్‌కు చెందిన అజిత్ కుమార్ తండ్రి కుటుంబపోషణ కోసం ఢిల్లీ ఎన్సీఆర్కు వలస వెళ్లారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చిన్నాచితకా పనులు చేసేవారు. తండ్రి కష్టం చూసీచూసి, డబ్బు విలువ అజిత్‌కుమార్‌కు చిన్నతనంలోనే తెలిసొచ్చింది. అయితే అక్క పెళ్లితో కుటుంబ పరిస్థితి మరింత దిగజారిపోయింది. పెళ్లికి చేసిన అప్పుల కారణంగా ఇంటిపోషణలో తాను కూడా భాగం పంచుకోక తప్పలేదు. అప్పటికే వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు అజిత్. ఒకవైపు చదువుకుంటూనే ఇంటి అవసరాల కోసం మేకప్, మెహందీ డిజైన్స్ వేస్తూ అంతో ఇంతో సంపాదించేవాడు. అయినా కూడా అప్పులు తీరేవి కావు. సరిగ్గా అదే సమయంలో మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు... కొవిడ్ మహమ్మారి అజిత్ కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కొవిడ్ లాక్డౌన్ కారణంగా అజిత్ కాలేజీ మానేయాల్సి వచ్చింది. అప్పటికే అతడు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇల్లు గడవడం కూడా కష్టమైంది. ఏదైనా ఉద్యోగం చేయాలను కున్నాడు. ఒక స్నేహితుడు ఫుడ్ డెలివరీ ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. స్విగ్గీ డెలివరీ రైడర్‌గా పని చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో తన దగ్గర సైకిల్ మాత్రమే ఉండేది. రోజుకు 20 ఆర్డర్లను పూర్తి చేయాలంటే కనీసం 100 కిలోమీటర్లు