తెలంగాణపై అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.గత వారం వరకు రాష్ట్రంలో వర్షాలు కురవగా.. ప్రస్తుతం భానుడు భగ్గమంటున్నాడు. అయితే రాష్ట్రంలో వర్షాల విరామానికి బ్రేక్ పడిందని.. మళ్లీ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ చాలాప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగినప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మళ్లీ జోరుగా వానలు కురిసే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ విశ్లేషణలు వెల్లడించారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఏర్పడుతున్న అల్పపీడన ప్రాంతం ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ సైతం వెల్లడించారు. దీని ప్రభావంతో రాత్రి వేళ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే ఈ వర్షాల తీవ్రత అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదని, ప్రాంతాల వారీగా వ్యత్యాసం ఉంటుందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, జనగామ, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విస్తృతంగా మోస్తరు నుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే వర్షాకాల పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రి వేళ కురిసే వర్షాలు ఒక్కసారిగా తీవ్రత పెంచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, గ్రామీణ రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.రాజధాని హైదరాబాద్లో పగటి పూట పొడి వాతావరణమే ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకు అక్కడక్కడా వర్షపు జల్లులు కురిసే అవకాశం