
Strait of Hormuz | అమెరికా అలా చేస్తే వారం రోజుల్లో హార్ముజ్ జలసంధిని తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన
Strait of Hormuz | అమెరికా అలా చేస్తే వారం రోజుల్లో హార్ముజ్ జలసంధిని తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన

Strait of Hormuz | అమెరికా అలా చేస్తే వారం రోజుల్లో హార్ముజ్ జలసంధిని తెరుస్తాం.. ఇరాన్ ప్రకటన

ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలను టార్గెట్ చేస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ బలగాలు సెప్టెంబర్ 1న దాడులు పూర్తి చేశాయి. నెల రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ ప్రత్యక్ష సైనిక ఘర్షణ మొదలైంది. అమెరికా వైమానిక దళాలు ఇరాన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్, రాడార్ వ్యవస్థలు, మైన్-లేయింగ్ సామర్థ్యాలు మరియు మెరైటైమ్ అసెట్స్‌పై విరుచుకుపడి వాటిని ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్ హర్ముజ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యూహాత్మక దాడుల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అమెరికా సైనిక వర్గాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించింది. ఇదిలా ఉండగా జోర్డాన్‌లోని అమెరికా మిలిటరీ స్థావరాలపై ఇరాన్ బలగాలు వరుసగా బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ చర్యలకు తగిన ప్రతీకారం తీర్చుకునే క్రమంలోనే ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ వైమానిక దాడుల ఫలితంగా ఇరాన్ సైనిక సామర్థ్యానికి భారీ గండి పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ రాడార్లు మరియు సముద్ర ఆధారిత దాడుల సామర్థ్యాలు దెబ్బతిన్నాయి. దీంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు రక్షణ కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్ అమెరికా చేసిన దాడులు చాలా పెద్దవి మరియు అత్యంత శక్తివంతమైనవి అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కనుక మళ్లీ ప్రతీకార చర్యలకు దిగితే మునుపటికంటే మరింత భారీగా కొడతామని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా వైఖరి పశ్చిమాసియాలో ఇరాన్ ఉగ్రవాద చర్యలను అణచివేయడమే లక్ష్యంగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇరాన్ స్థానిక మీడియా ఈ దాడులపై తీవ్ర నిరసన వ్యక్తం

అమెరికా, ఇరాన్‌ల మధ్య వైరం తీవ్ర స్థాయికి చేరింది. పశ్చిమాసియా ప్రాంతంలో ఇప్పటికే ఉద్రిక్తతలు రగులుతుండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మంటల్లో ఆజ్యం పోశాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) అమెరికా భూభాగంగా అభివర్ణించిన ట్రంప్, ఇరాన్ ఎలాంటి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాన్ని తయారు చేయకూడదని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.సౌత్ కరోలినాలోని మైర్టిల్ బీచ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌తో చర్చలకు తమకేమీ తొందరలేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధిని ప్రస్తుతానికి నేను అమెరికా సొంత భూభాగంగానే భావిస్తున్నాను. ఆ ప్రాంతంపై , అక్కడ ఉన్న దిగ్బంధనంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది అని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అయితే అమెరికాకు ఆమోదయోగ్యమైన షరతులకు ఆ దేశం ఇంకా సిద్ధంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, దీనికి సంబంధించిన ఒక ఏఐ (AI) చిత్రాన్ని కూడా తన ట్రూత్ సోషల్ ఖాతాలో పంచుకున్నారు. ఆ పని చేస్తే నష్టపోతారు: ప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్!చమురు రవాణాకు జీవనాడి వంటి ప్రాంతంప్రపంచ ఇంధన సరఫరాలో హోర్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్లో దాదాపు ఐదవ వంతు ఈ సరుకుల మార్గం గుండానే వెళుతుంది. అలాంటి వ్యూహాత్మక ప్రాంతంపై తమకు పూర్తి ఆధిక్యం ఉందని అమెరికా క్లెయిమ్ చేయడం అంతర్జాతీయ రాజకీయంలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు , సైనిక ఒత్తిడిని మరింత పెంచే వ్యూహంలో భాగంగానే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికాలో భాగంగానే హర్మూజ్ జలసంధి.. సంచలన ఫొటో షేర్ చేసిన ట్రంప్ట్రంప్కు భ్రమలు ఎక్కువ: తిప్పికొట్టిన ఇరాన్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదని ట్రంప్ పేర్కొన్నారు. వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒప్పందానికి రావాలని కోరుకుంటోందని ట్రంప్ తెలిపారు. అయితే, తాను సరైన ఒప్పందంగా పేర్కొంటున్న దానికి మాత్రం ఆ దేశం సిద్ధంగా లేదన్నారు. శుక్రవారం నాడు దక్షిణ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌కు బయలుదేరే ముందు జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. 'ఇరాన్ వద్ద డబ్బు లేదు. వారికి నౌకాదళం, వైమానిక దళం లేదు. ఇరాన్ తన సైనికులు, పోలీసులకూ జీతాలు చెల్లించడం లేదు. అక్కడ 350 శాతం ద్రవ్యోల్బణం ఉంది. హోర్ముజ్ జలసంధి మొత్తం ప్రాంతంపై మాకు పూర్తి నియంత్రణ ఉంది. ఇరుదేశాల మధ్య ఒప్పందానికి ఇరాన్ ఆసక్తిగా ఉంది. అయితే వాషింగ్టన్ కోరిన షరతులను ఇంకా అంగీకరించ లేదు. నా అభిప్రాయంలో సరైన ఒప్పందం చేసుకోవడానికి వారు సిద్ధంగా లేరు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం' అని పేర్కొన్నారు. కాగా, ఇటీవలే ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన ఆర్థిక చర్యలను ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరాన్ చమురు స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లు, ఆర్థిక బదిలీలు, ఎక్స్ఛేంజ్ హౌస్‌లు, షిప్ రిజిస్ట్రీలు, ఫ్రంట్ కంపెనీలతో సహా ఆ దేశ ఆర్థిక జీవనాధారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌కు ఆర్థిక, వ్యాపార, ఇతర మార్గాల్లో ప్రభుత్వ మద్దతు అందిస్తున్న దేశాలు భారీ ఆర్థిక పరిణామాలను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. అలాగే, ఇరాన్‌ను ఏకాకిని చేసి ఓడించడానికి మిత్రదేశాలన్నీ అమెరికాకు అండగా నిలబడాలని కోరారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్