
చీరాల భాష్యంస్కూల్ లో 'శక్తి యాప్'పై అవగాహన సదస్సు
Chirala: చీరాల భాష్యం స్కూల్లో 'శక్తి యాప్'పై అవగాహన సదస్సు చీరాల: బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డిఎస్పీ ఎమ్.డి. మోయిన్ మరియు వన్ టౌన్ సిఐ సోమశేఖర్ గార్ల సూచనలతో వన్ టౌన్ ఎస్సై శ్రీనివాసరావు శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం చీరాల భాష్యం స్కూల్ విద్యార్థినులకు ‘శక్తి యాప్ మరియు ‘సెల్ఫ్ డిఫెన్స్’ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు, అత్యవసర పరిస్థితుల్లో ‘శక్తి యాప్’ ద్వారా పోలీసులను సంప్రదించే విధానం, SOS సదుపాయం, 112 అత్యవసర నంబర్ వినియోగంపై విద్యార్థినులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసులు మరియు హెచ్.ఎం. శిరీష మాట్లాడుతూ, విద్యార్థినుల పట్ల ఆకతాయిలు చేసే వేధింపులు వారి విద్యాభ్యాసం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. బస్టాప్‌లు, స్కూల్ పరిసరాలు, ప్రజా ప్రదేశాలు, సామాజిక మాధ్యమాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, అసభ్యకర వ్యాఖ్యలు, వెంటపడటం, బెదిరింపులు వంటి వేధింపులను సహించకూడదని సూచించారు. Si శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు విద్యార్థినులు భయపడకుండా వెంటనే ‘శక్తి యాప్’లోని SOS ద్వారా లేదా 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా విద్యార్థినులు చదువుతో పాటు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, చట్టాలపై అవగాహన పెంచుకుని తమ హక్కులను తెలుసుకోవడం ఎంతో అవసరమని వివరించారు. మహిళల గౌరవం, భద్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, వేధింపులు లేని సురక్షితమైన విద్యా వాతావరణాన్ని నిర్మించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు కలిసి