
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. ఈ సమస్య ఉన్నవారు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏవి తినాలి, ఏవి తినకూడదు అనే సందేహాలు తరచుగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తేలికపాటి స్నాక్‌గా ప్రాచుర్యం పొందిన..

అరవింద సమేత చిత్రంలో 5 రూపాయల కారణంగా ఎంత హింస జరిగిందో అందరికి తెలుసు. అయితే ఈ కథలో 5 నిమిషాలు వల్ల ఓ వ్యక్తి మహా కుబేరుడిగా మారారు. ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలను ఆయన సంపాదించేశారు. ఇంటర్నెట్ డెస్క్: రోజుకు 5 నిమిషాలే పని చేయాలి.. నెలకు 10 వేల డాలర్లు ( దాదాపు 9 లక్షల రూపాయలు) సంపాదించాలి. ఇది కొంచెం అతిగా అనిపిస్తోందా.. కానీ ఓ వ్యక్తి ఇది సాధ్యమని భావించారు. ప్రతిరోజూ 5 నిమిషాల పనితో నెలకు లక్షలు గడించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆయనను చూసి తోటి వారే నవ్వుకున్నారు. ఇవేమీ పట్టించుకోని ఆయన డబ్బు సంపాదించడం కోసం రోజులో 5 నిమిషాలు ఆలోచించేవారు. అలా ఓ రోజు ఒక కొత్త పరికరం కనిపెట్టాలన్న ఆలోచన ఆయనకు తట్టింది. ఆయనే మసయోషి సన్. సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా టెక్నాలజీ రంగానికి ఆయన సుపరిచితులు. 2026 సెప్టెంబరు నాటికి ఆయన సంపద అక్షరాల 5.3 లక్షల కోట్లు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఈ 5 నిమిషాల సవాలును ఆయనకు ఆయనే విసురుకున్నారు. ఇలా నిర్ణీత సమయంలోనే ఓ ఆవిష్కరణ చేయాలని పూనుకున్నారు. మసయోషి.. కొందరు పరిశోధకులు, ప్రొఫెసర్ల సహాయంతో ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ పరికరాన్ని కనిపెట్టారు. ఆ పరికరాన్ని జపాన్‌కు చెందిన ఓ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. ఈ విధంగా సన్ ప్రయాణానికి తొలి అడుగు పడింది. ఆ తరువాత ఆయన జపాన్ నుంచి వీడియో గేమ్ యంత్రాలను అమెరికాకు తీసుకొచ్చి రెస్టారెంట్లకు అమ్మేవారు. ఈ వ్యాపారంలో ఆయనకు 1.5 మిలియన్ డాలర్ల లాభం వచ్చింది. 5 నిమిషాల ఆలోచన వచ్చిన 18 నెలల్లోనే 3.2 మిలియన్ డాలర్లు ఆర్జించారు. జపాన్‌లో ఉంటున్న సన్‌కు అమెరికా వెళ్లాలని ఓ సన్నిహితుడు సలహా ఇచ్చారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలని, కంప్యూటర్లపై పట్టు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. దీంతో అమెరికా వచ్చిన సన్

రోజుకు ఐదు నిమిషాలు.. అంతే పని. కానీ నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి! ఈ మాట వింటే ఎవరికైనా నవ్వొస్తుంది. కాలేజీ రోజుల్లో ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు ఓ యువకుడు. స్నేహితులు కూడా అతడిని చూసి ఆశ్చర్యపోయారు. కానీ అతడు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఐదు నిమిషాల పని అంటే ఐదు నిమిషాలే.. ఆ సమయంలో ఏం ఆలోచించాలో నిర్ణయించుకున్నాడు. ఆ ఆలోచన ఓ చిన్న పరికరానికి దారి తీసింది. అదే అతడి జీవితాన్ని మార్చేసింది.ఆ యువకుడే మసయోషి సన్. నేడు సాఫ్ట్‌బ్యాంక్ వ్యవస్థాపకుడిగా ప్రపంచ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రభావవంతమైన పెట్టుబడిదారుల్లో ఒకరు. 2026 సెప్టెంబరు 1 నాటికి ఫోర్బ్స్ అంచనా ప్రకారం ఆయన సంపద 63.2 బిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.5.3 లక్షల కోట్లు. కానీ ఈ స్థాయికి ఆయన ప్రయాణం మాత్రం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బెర్క్లీలో ఓ విద్యార్థిగా ఉన్నప్పుడే మొదలైంది.ఐదు నిమిషాల ఆలోచన..1970ల చివర్లో బెర్క్లీలో ఆర్థికశాస్త్రం చదువుతున్న సన్ తనకు తానే ఓ సవాల్ విసిరుకున్నారు. రోజుకు ఐదు నిమిషాలు మాత్రమే కేటాయించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలి. ఉద్యోగం చేస్తే అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. అందుకే ఓ వినూత్న ఆదాయ మార్గం కోసం ఆలోచించారు.ఆ ఐదు నిమిషాల్లో ఓ ఆవిష్కరణ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌లేటర్ ఆలోచన వచ్చింది. బెర్క్లీలోని పరిశోధకులు, ప్రొఫెసర్ ఫారెస్ట్ మోజర్ సహకారంతో దాన్ని అభివృద్ధి చేశారు. చివరకు ఆ పరికరాన్ని జపాన్‌కు

కిర్గిజిస్తాన్ రాజధాని బిష్కెక్ లో ఆరంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 26వ సమ్మిట్ ఇది. సభ్య దేశాల అధినేతలు, ప్రధానులతో భేటీ అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిశారు. రష్యా అధ్యక్షుడితో జరిగిన ప్రత్యేక ద్వైపాక్షిక చర్చల్లో పరస్పర సంబంధాల బలోపేతంతో పాటు అంతర్జాతీయ శాంతి స్థాపన ప్రాధాన్యత గురించి వివరించారు.ఎస్సీఓ రౌండ్ టేబుల్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయా దేశాధినేతలతో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాదంపై పోరు, సభ్యదేశాల సార్వభౌమాధికారం, రీజినల్ కనెక్టివిటీ వంటి అంశాలపై తన వైఖరిని స్పష్టం చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడుకుంటూనే యురేషియా ప్రాంతంలోని ఇతర దేశాలతో సహకారాన్ని పెంచుకుంటోందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో రాజీపడబోమని తేల్చి చెప్పారు.సరిహద్దు దేశాల ఉగ్రవాద విధానాల గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాకిస్తాన్, ఇతర ఉగ్రవాద దేశాలు అనుసరిస్తోన్న వైఖరిని ఎండగట్టారు. ఉగ్రవాదంపై ద్వంద్వనీతిని అనుసరించవద్దని హెచ్చరించారు. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మరో వైపు దీన్ని అంతం చేస్తామంటూ మాట్లాడటం సరికాదని, ఇటువంటి వైఖరికి ఏ మాత్రం ఆస్కారం ఇవ్వకూడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించుకోవడం, తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలను వీడాలని ప్రధాని మోదీ హితవు పలికారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, వారిని పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకోవడం, షెల్టర్ జోన్ లను ఏర్పాటు చేయడం వంటి విధానాలను ఏ దేశం కూడా ప్రోత్సహించబోదని, ఈ వ్యవస్థను సమూలంగా మట్టుబెట్టాల్సిందేనని చెప్పారు.మీరు నిత్యం ధ్వేషించే మొఘల్ చక్రవర్తి పుట్టిన గడ్డ అది: ప్రధాని మోదీకి ఒవైసీ
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి

పశ్చిమ బెంగాల్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన సిలిగురి కారిడార్ రక్షణను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సిలిగురిలో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో సశస్త్ర సీమ బల్ ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయ పరిపాలనా భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. దేశ సరిహద్దులు బలోపేతం కానంత వరకూ భారత్ ఎంత మాత్రం సురక్షితంగా కాదని తేల్చి చెప్పారు. నలుమూలలా వ్యాపించి ఉన్న సరిహద్దులను మరింత పటిష్ట పర్చుకోవాల్సి ఉందని అన్నారు. సిలిగురి కారిడార్‌ను దేశంలో అత్యంత సున్నితమైన, భౌగోళిక వ్యూహాత్మక ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు దీనికి తగిన ప్రాధాన్యత దక్కలేదని పేర్కొన్నారు.దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను ప్రధాన భూభాగంతో అనుసంధానించే ఈ చికెన్స్ నెక్ ప్రాంత భద్రత దేశ సార్వభౌమాధికారానికి ఎంతో కీలకమని అమిత్ షా అన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించనున్న భారీ ఎస్ఎస్బీ పరిపాలనా భవనం సరిహద్దు రక్షణ చర్యలను నిరంతరం పర్యవేక్షించడానికి, పెద్ద ఎత్తున బలగాలను మోహరింపజేయడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. జాతీయ భద్రత విషయంలో కేంద్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్దేశంలో శాంతిభద్రతలు వర్ధిల్లాలన్నా, పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశమంతటా సురక్షిత వాతావరణం నెలకొనాలన్నా సరిహద్దు వెంబడి శత్రువుల కదలికలను పూర్తిగా అరికట్టడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా భద్రతా బలగాలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అమిత్ షా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు కంచె వేయాలని కేంద్రం భావించినప్పటికీ.. దీనికి కావలసిన భూమిని కేటాయించడంలో గత మమత బెనర్జీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. సరిహద్దుల

దేశంలో మొబైల్ కనెక్షన్ల జారీలో నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నెల 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వీటిని అమల్లోకి తీసుకుని రాబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన నిబంధనలు, మార్గదర్శకాలు సైతం రూపొందించింది.. టెలికమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ. సిమ్ కార్డుల జారీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. అంతే కఠినంగా ఈ నూతన నిబంధనలను అమలులోకి తేబోతోంది.మొబైల్ కనెక్షన్లు, సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఒక వ్యక్తి తన పేరు మీద నిర్ణీత పరిమితి కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు కలిగి ఉంటే, వారికి నూతనంగా మరో సిమ్ కార్డు జారీ చేయకూడదని కేంద్రం టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. అంటే.. పరిమితి మించిన వినియోగదారులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన సిమ్ అనేది ఇవ్వరు. వీటిని పూర్తిగా నిలిపివేయనున్నారు.తాజా టెలికాం నిబంధనల ప్రకారం.. దేశంలో ఒక పౌరుడు తన ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలపై గరిష్టంగా తొమ్మిది మొబైల్ కనెక్షన్లను మాత్రమే పొందేందుకు అనుమతి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల ప్రజల భద్రత కారణాల రీత్యా ఈ పరిమితిని గరిష్టంగా ఆరు సిమ్ కార్డులుగా నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల యూజర్లు ఆరుకు మించి ఎక్కువ సిమ్ కార్డులను పొందలేరు. వేర్వేరు టెలికాం కంపెనీల సిమ్ కార్డులను వాడుతున్నప్పటికీ కూడా మొత్తంగా ఉండాల్సిన కనెక్షన్ల సంఖ్య ఈ లిమిట్ దాటకూడదు.వరలక్ష్మీ వ్రతం వేళ.. బంగారం ప్రియులకు బిగ్ షాక్వినియోగదారులకు ఇప్పటికే వివిధ నెట్వర్క్ లలో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయనే విషయాన్ని రియల్ టైమ్ లో సరిపోల్చుకోవడానికి టెలికాం కంపెనీలన్నీ కూడా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సెంట్రలైజ్డ్ డిజిటల్ డేటాబేస్ ఆధారంగానే నూతన కనెక్షన్లు కోరేవారి అర్హతను ఆపరేటర్లు పరిశీలిస్తారు. ఇప్పటికే గరిష్ట పరిమితిని దాటిన వినియోగదారులు మరో

“రాజుల సొమ్ము రాళ్లపాలు, దొరల సొమ్ము దొంగలపాలు” అనే సామెత మన తెలుగు సంస్కృతిలో తరతరాలుగా వినిపిస్తూ వస్తోంది. పైకి చూస్తే ఇది రాజులు, దొరలు, వారి సంపద గురించి చెప్పిన మాటలా అనిపించినా, దీని వెనుక చాలా లోతైన జీవన సత్యం దాగి ఉంది. ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత సంపద కూడబెట్టినా, దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతే లేదా సరైన సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోతే చివరికి ఆ సంపదకు విలువ లేకుండా పోతుందనే విషయాన్ని ఈ సామెత సూచిస్తుంది. పూర్వకాలంలో రాజులు, జమీందారులు, దొరలు ఎంతో సంపదను కూడబెట్టేవారు. భూములు, బంగారం, ధాన్యం, పశువులు, ఆస్తులు ఇలా ఎన్నో రకాల సంపద వారి అధీనంలో ఉండేది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. రాజ్యాలు మారిపోయేవి, యుద్ధాలు జరిగేవి, పాలకులు మారేవారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్న రాజభవనాలు కూడా కాలక్రమంలో శిథిలాలుగా మారిపోయేవి. సంపదను కూడబెట్టినవారు లేకపోతే, దాన్ని కాపాడే వారూ లేకపోతే ఆ సంపద చివరికి ఇతరుల చేతుల్లోకి వెళ్లేది. అందుకే “రాజుల సొమ్ము రాళ్లపాలు” అనే మాటలో సంపద శాశ్వతం కాదనే హెచ్చరిక కనిపిస్తుంది. అదే విధంగా “దొరల సొమ్ము దొంగలపాలు” అనే భాగం కూడా మనిషి సంపాదించిన ఆస్తిని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది. ఒక వ్యక్తి ఎంతో కష్టపడి సంపాదించినా, అతని నిర్లక్ష్యం, దురాశ లేదా తప్పు నిర్ణయాల వల్ల ఆ సంపద ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో వారసత్వ సమస్యలు, అప్పులు, ఆస్తి వివాదాలు, మోసాలు వంటి కారణాలతో ఎన్నో సంవత్సరాల కష్టం వృథా అవుతుంది. సంపదను కూడబెట్టడం ఎంత ముఖ్యమో, దాన్ని కాపాడుకోవడం, సద్వినియోగం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈ సామెత వివరిస్తుంది. ఈ సామెతను కేవలం డబ్బు, బంగారం, భూములకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. మనిషికి ఉన్న జ్ఞానం, ప్రతిభ, అధికారం

జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. నల్గొండ, ఆగస్టు19: జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. నిందితుల నుంచి రక్తంతో తడిచిన రూ.1,54,000 నగదుతోపాటు ఐ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.15 రోజుల క్రితం హాస్టల్లో ఈ విద్యార్థుల బ్యాగ్‌లో సెల్ ఫోన్‌తోపాటు నగదు దొరకడంతో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి వారిని మందలించారని తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి ఆమె తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ నుంచి ఇంటికి వారిని పంపి.. డే స్కాలర్‌గా మార్చారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిపై వారిద్దరు పగ పెంచుకున్నారని అన్నారు. అయితే వారిద్దరిలో ఒకరు మద్యానికి బానిసగా మారారని.. దీంతో ముందే ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఇక యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడంపై ప్లాన్ వేసుకుని.. ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేశారని వివరించారు. అందుకోసం ముందే కత్తిని వారు కొనుగోలు చేశారని అన్నారు. ఈ చోరీ సమయంలో వీరిని ప్రిన్సిపాల్ గుర్తు పట్టిందని చెప్పారు. దీంతో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని వివరించారు. జల్సా చేసేందుకు నెల క్రితం వీరు గోవా కూడా వెళ్లారని తెలిపారు. వీరిద్దరికి గంజాయి టెస్ట్ నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి

పిల్లలు తప్పులు చేయడం సహజం. ముఖ్యంగా మగపిల్లలు ఎదుగుతున్న సమయంలో కొన్ని విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేక కొన్ని తప్పులు చేయవచ్చు. ఆ తప్పు వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చడం ఎంత ముఖ్యమో, ఆ సమయంలో తండ్రి ఉపయోగించే మాటలను జాగ్రత్తగా ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. తండ్రి చెప్పే ఒక్క మాట కొడుకులో మార్పు తీసుకురావచ్చు. అదే సమయంలో అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీయవచ్చు. అందుకే కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి కొన్ని మాటలను అస్సలు చెప్పకూడదు. అవేంటో చూద్దాం. కొడుకు ఒక తప్పు చేశాడని అతని సామర్థ్యాన్నే ప్రశ్నించడం సరైన పద్ధతి కాదు. ఇలాంటి మాటలు పిల్లవాడి మనసులో బలంగా నాటుకుపోయి, తాను నిజంగానే పనికిరానివాడిననే భావన కలిగించవచ్చు. తప్పును వ్యక్తిత్వంతో కలపకుండా, ఎలా సరిదిద్దాలో చెప్పడం ముఖ్యం. తప్పు చేసిన కొడుకును తక్కువ చేయడం కంటే, తప్పు నుంచి బయటపడే మార్గాన్ని చూపించడమే తండ్రి బాధ్యత. తండ్రి అనే కొన్ని మాటలు కొడుకుకు చాలా బాధ కలిగించవచ్చు. ముఖ్యంగా ఇతరుల ముందు ఈ మాట చెప్పడం వల్ల అవమానంగా అనిపించి, తండ్రితో తన సమస్యలను పంచుకోవడానికి కూడా భయపడే అవకాశం ఉంటుంది. తప్పు చేసినప్పుడు కొడుకు తన చర్యపై సిగ్గుపడాలి కానీ, తాను ఒక వ్యక్తిగా సిగ్గుపడాల్సిన అవసరం లేదని అతనికి అర్థమయ్యేలా చేయాలి. తప్పును ఖండించడం వేరు, మనిషిని ఖండించడం వేరు. ఈ విషయం తండ్రి గుర్తుంచుకోవాలి. పిల్లలను మరొకరితో పోల్చడం చాలా సులభం. మంచి మార్కులు వచ్చిన వారిని చూపించి, నువ్వెందుకు అలా చదవలేకపోతున్నావని అడగడం తండ్రికి సాధారణంగా అనిపించవచ్చు. కానీ కొడుకు దాన్ని ప్రోత్సాహంగా తీసుకోడు. బదులుగా తనపై తనకు నమ్మకం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లవాడికి తనదైన సామర్థ్యం, వేగం, ఆసక్తులు ఉంటాయి. కాబట్టి ఇతరులతో కాకుండా తన గత పనితీరుతో పోల్చి చెప్పడం మంచిది. ఒకసారి చేసిన తప్పును పట్టుకుని.. నువ్వు

మనుషుల నుండి ప్రాణం ఉన్న ప్రతి జీవి ఆహారం తీసుకోవడం పరిపాటి. తీసుకునే ఆహారం నుండి లభించే శక్తితోనే శరీరం నిలబడుతుంది. ఇక అన్ని ప్రాణులలోకి మనిషి చాలా విభిన్నమైన వాడు. మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అలవాట్లు ఉంటాయి. అంతేకాదు.. ఆహారం తినే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కొందరు నిదానంగా తింటారు. మరికొందరు చాలా వేగంగా తింటారు. అయితే.. వేగంగా తినే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నారు. వేగంగా ఆహారం తినే వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. వేగంగా తినడం... మన చుట్టూ చాలామంది ఉంటారు. కుటుంబ సభ్యులు అయినా, స్నేహితులు అయినా.. తెలిసిన వారు అయినా.. కలిసి భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా ఆహారం తినేటప్పుడు.. అందరూ కలిసి మొదలు పెడితే.. పక్క వాళ్లు ఇంకా సగం కూడా తినకుండానే మధ్యలోనే తమ ఆహారం పూర్తీ చేసే వారు కొందరు ఉంటారు. వారు చాలా బిజీ లైఫ్ స్టైల్ కు అలవాటు వడటం వల్ల అలా వేగంగా తినడం అలవాటు అయి ఉంటుందని అందరూ అనుకుంటారు. ఇది నిజమే అయినా ఇలా వేగంగా తినే వారి స్వభావం విభిన్నంగా ఉంటుందని వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు చెబుతున్నారు. వేగంగా తినే వారిలో ఉండే వ్యక్తిత్వ లక్షణాలు.. వేగంగా తినే వ్యక్తులు ఎక్కువగా ఫినిష్ లైన్ ను చేరుకోవడంపై దృష్టి పెడతారు. అదే మనస్తత్వం జీవితంలోని ఇతర రంగాలలో కనిపిస్తుందట. వారు చేయవలసిన పనుల లిస్ట్ నుండి పనులను మార్క్ చేయడం, సమర్థవంతంగా పనిచేయడం , ఒక పనిలో ఆలస్యం కాకుండా ఆ తరువాత సవాలును స్వీకరించడం వంటివి వీరిలో ఉంటాయట. స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఉన్నవారు తరచుగా భోజనంతో సహా రోజువారీ దినచర్యలో వేగాన్ని , సామర్థ్యాన్ని ఇష్టపడతారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు. తినడాన్ని ఆస్వాదించడం, అనుభూతి చెందడం

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పనిలో బిజీగా ఉండే వ్యక్తులు మన చుట్టూ ఎంతోమంది కనిపిస్తారు. కష్టపడటంలో వారు ఏమాత్రం వెనుకడుగు వేయరు. కానీ అంత కష్టపడినప్పటికీ చేతికి వచ్చే ఆదాయం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చెప్పే అద్భుతమైన తెలుగు సామెతే “క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు” అనే సామెత. ఈ చిన్న మాటలో ఎంతోమంది జీవితాల్లోని కష్టం, నిరాశ, ఆర్థిక పరిస్థితి దాగి ఉంది. పని ఎక్కువగా ఉండి, దానికి సరిపడే సంపాదన లేకపోయినప్పుడు ఈ సామెతను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు. మన సమాజంలో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, చిరు ఉద్యోగులు, రోజువారీ కూలీలు, రైతులు, చేతి వృత్తుల వారు తమ పనిలో ఎంతో శ్రమిస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరం పనిచేసినా, వారి సంపాదన కుటుంబ అవసరాలను పూర్తిగా తీర్చడానికి సరిపోకపోవచ్చు. పని చేయకుండా ఉండే అవకాశం ఉండదు, కానీ చేసిన పనికి వచ్చే ఆదాయం కూడా ఆశించినంతగా ఉండదు. అలాంటి పరిస్థితిని చూసినప్పుడు “క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు” అనే సామెత అక్షరాలా సరిపోతుంది. ఈ సామెతలోని “క్షణం తీరిక లేదు” అనే మాట మనిషి పడే శ్రమను సూచిస్తుంది. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పని చేయడం, నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడం దీని భావం. ఇక “దమ్మిడి ఆదాయం లేదు” అనేది ఆ శ్రమకు తగిన ఆర్థిక ఫలితం లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇక్కడ “దమ్మిడి” అనే పదం చాలా స్వల్పమైన మొత్తాన్ని సూచిస్తుంది. అంటే ఎంత కష్టపడినా చేతికి మిగిలేది చాలా తక్కువ అన్న వ్యంగ్యాన్ని ఈ సామెతలో చూడవచ్చు. ఈ సామెత కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే సంబంధించింది కాదు. ఒక పని కోసం

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాలలో లయన్స్ క్లబ్ వ్యాసరచన పోటీలు! కర్నూలు: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో “క్రిటికల్ థింకింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ఆలోచనా సామర్థ్యాన్ని, పర్యావరణ పరిరక్షణపై అవగాహనను ప్రదర్శించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయిక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్ గవర్నర్ రాయపాటి శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్, లయన్స్ క్లబ్ సభ్యులు మురారి శంకర్ అప్ప తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనా విధానం, సృజనాత్మకతతో పాటు పర్యావరణ పరిరక్షణపై బాధ్యతను పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మల్లికార్జున, విజయశేఖర్, సోమేశ్, ఉల్గోజి రావు, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్కోట్ లో తీవ్ర హింస, ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్ భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రావల్కోట్ వీధులన్నీ రక్తసిక్తం అయ్యాయి.ఈ హింస కారణంగా 400 మంది వరకు స్థానికులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళనకారులు చెబుతుండగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని తిప్పికొడుతోంది. ప్రాణనష్టం చాలా పరిమితమేనని వాదిస్తోంది.ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి సైతం పీఓకే లో నెలకొన్న అస్థిరతపై ఆరా తీసింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తోన్నాయి.ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పీఓకే నిరసనకారులతో తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సమస్యలను ఘర్షణల ద్వారా కాకుండా చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నిరసనలకు పిలుపునిచ్చిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీతో శాంతియుత వాతావరణంలో చర్చలు జరపడానికి ద్వారాలు తెరిచే ఉంచామని అన్నారు.సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్‌ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లుచర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి తాము సదా సిద్ధంగా ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా పరస్పర చర్చలతోనే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. పంతాలకు పోకుండా ఇరుపక్షాలు ఒకే చోట కూర్చుని సానుకూల వాతావరణంలో మాట్లాడుకోవాలని కోరారు. త్వరలో బాధ్యతలు చేపట్టబోయే నూతన ప్రభుత్వం కూడా నిరసనకారులతో ఈ చర్చల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పండగ సీజన్ వేళ.. ఆకాశానికి ఎగబాకిన బంగారం ధరలు: మైండ్ బ్లాక్ రేట్లు శాంతి, ఓపిక, సహనంతో తమ మనోభావాలను, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే

Gajapathinagaram: వైసీపీ డీఎస్సీ ర్యాలీ అడ్డుకత, పోలీసులతో తోపులాట! Gajapathinagaram: గజపతినగరంలో డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నాయకులు చేస్తున్న ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పోలీసులు వైసిపి నాయకులు మధ్య తోపులాట. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసన. డీఎస్సీ అభ్యర్థులే కుటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని బొత్స అప్పల నరసయ్య మండిపడ్డారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో ఉద్రిక్త వాతావరణం నడుమ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు డీఎస్సీ లో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించడంతో పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య ఏర్పడిన పరిస్థితులతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డీఎస్సీ నియామకాలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అప్పల నరసయ్య డిమాండ్ చేశారు

గరుడ పురాణం హిందూ మతంలోని 18 గొప్ప పురాణాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికీ, ఆయన వాహనమైన గరుడ పక్షికి మధ్య జరిగిన సంభాషణగా పరిగణిస్తారు. గరుడ పురాణం జీవితం, మరణం, కర్మ, పునర్జన్మ రహస్యాలను వివరిస్తుంది. జనన మరణ రహస్యాల గురించి మాత్రమే కాదు.. ప్రతిరోజూ కొన్ని పనులు చేయడం వల్ల జీవితంలో సంతోషం పెరగడంతో పాటు, అదృష్టం రెట్టింపు అవుతుంది. విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి, గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజూ కచ్చితంగా చేయాల్సిన 5 పనులు ఇవే.. ప్రతిరోజూ అందరూ స్నానం చేస్తారు.కానీ, తమకు తోచిన సమయంలో చేస్తూ ఉంటారు. కానీ, గరుడ పురాణం ప్రకారం మన రోజుని స్నానంతోనే ప్రారంభించాలి. స్నానం చేయకుండా ఏ పనులు చేయకూడదు. స్వచ్ఛమైన శరీరంలోనే స్వచ్ఛమైన మనసు ఉంటుంది. ప్రతిరోజూ స్నానం చేయని వారు జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అలా కాకుండా, ఉదయాన్నే స్నానంతోనే తమ పనులు మొదలుపెట్టేవారి జీవితం ఆనందంగా ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొన్నారు. గరుడ పురాణం ప్రకారం, క్రమం తప్పకుండా ధ్యానం చేయడం, దైవరాధన చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజూ దేవతను పూజించేవారు దురదృష్టం తొలగి, అన్ని పనుల్లోనూ విజయం పొందుతారు. గరుడ పురాణం ప్రతిరోజూ దైవ నామాన్ని జపించాలి. క్రమం తప్పకుండా జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి, ధ్యానం చేసి, భగవంతుని జపించాలి. ఇలా చేయడం వల్ల మనసుకు శాంతి లభించి, అదృష్టం ఆకర్షిస్తుంది. శుభం కలుగుతుంది. గరుడ పురాణం ప్రకారం, ప్రతిరోజూ క్రమం తప్పకుండా దానధర్మాలు చేయాలి. అలా చేయడం వల్ల ఒక వ్యక్తి శ్రేయస్సు మెరుగుపడుతుంది. అదృష్టం కలుగుతుంది. సంపద అనేక మార్గాల ద్వారా వస్తుంది. తమ శక్తి మేరకు క్రమం తప్పకుండా దానధర్మాలు చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది

సోషల్ మీడియాలో ఇప్పటికే పండగ వాతావరణం మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. కానీ ఈసారి బర్త్ డే కి ఒక రేంజ్ క్రేజ్ రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న SSMB29! జైత్రయాత్రలా సాగుతున్న దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్! గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న వారణాసి లీక్డ్ విజువల్స్ రచ్చ, రేపు రాబోతున్న అఫీషియల్ అప్డేట్ రూమర్స్.. ఇవన్నీ కలిపి ఫ్యాన్స్ కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇవ్వాల్టి ఎక్స్ప్లేనర్ వీడియోలో మనం ఈ వారణాసి లీక్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? రేపు బర్త్ డే రోజున రాజమౌళి ఎలాంటి మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు? అనే విషయాలను గురించి మాట్లాడుకుందాం.. మొదటి నుంచి SSMB29 గురించిన ప్రతీ చిన్న విషయం ఒక హాట్ టాపిక్‌గానే మారుతోంది. విజయేంద్రప్రసాద్ అందించిన కథనం ప్రకారం ఇదొక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్. 'ఇండియానా జోన్స్' తరహాలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది. అయితే, ఈ కథకు మూలం భారతదేశంలోనే.. అందులోనూ అత్యంత ప్రాచీన ఆధ్యాత్మిక నగరమైన వారణాసి నేపధ్యంలో ఉంటుందనే వార్తలు గత కొద్ది కాలంగా గట్టిగా వినిపిస్తున్నాయి. వారణాసి ఘాట్లు, గంగా హారతి బ్యాక్‌డ్రాప్, పురాతన ఆలయాల ప్రాంగణాలు.. వీటి మధ్య మహేష్ బాబు ఒక అడ్వెంచరర్ లుక్‌లో ఎలా ఉంటారనేది ఊహించుకుంటేనే ఫ్యాన్స్ కి గోస్బంప్స్ వస్తున్నాయి. ఇండియన్ మైథాలజీ అండ్ ఆధ్యాత్మిక అంశాలను అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్‌కు అనుసంధానించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' సినిమాల్లో మనం ఇది చూశాం. ఇప్పుడు మహేష్ బాబుతో వారణాసి నేపథ్యాన్ని ఎంచుకోవడం వెనుక చాలా పెద్ద కథే ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక

రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్ట రూపం దాల్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు. ఇంటర్నెట్ డెస్క్: రష్యాపై ఆంక్షల కోసం ఉద్దేశించిన బిల్లు చట్ట రూపం దాల్చి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని మాజీ దౌత్యవేత్త కేపీ ఫేబియన్ తెలిపారు. ఇప్పటికే ఆర్థికంగా ఎదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ఈ భారాన్ని భరించడం అమెరికాకు సాధ్యం కాకపోవచ్చని అన్నారు. ‘ఈ బిల్లును సెనేట్ 86-11 మెజారిటీతో ఆమోదించింది. ప్రతినిధుల సభ కూడా ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి తదుపరి ఏం జరుగుతోందో వేచి చూడాలి. ఈ బిల్లుకు ప్రతినిధుల సభ మార్పులను సూచించే అవకాశం ఉంది. అదే జరిగితే బిల్లు మరోసారి సెనేట్‌కు చేరుతుంది. ఈ బిల్లును ప్రతినిధుల సభ యథాతథంగా ఆమోదించినా కొత్త చిక్కులు వస్తాయి. ఒకవేళ ట్రంప్ ఈ చట్టం ప్రకారం, సుంకాలు విధిస్తే ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఈ పరిణామాల్ని ట్రంప్ తట్టుకోగలరా? అంటే సందేహమే. కాబట్టి సుంకాల విషయంలో భారత్ ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ఆయన అన్నారు. దివంగత నేత లిండ్సే గ్రాహం కృషి కారణంగా ఈ బిల్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ముడి చమురు ద్వారా అందే ఆదాయంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధం చేయగలుగుతున్నారని పాశ్యాత్య దేశాలు భావిస్తున్నాయి. ఈ నిధుల కట్టడికి రకరకాల మార్గాలను అమెరికా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా రష్యా చమురు కొనేవారిపై భారీ సుంకాలు విధించేలా అధ్యక్షుడికి అధికారాలు కల్పించే బిల్లును లిండ్సే గ్రాహం తెరపైకి తెచ్చారు. అయితే, సుంకాలపై అధ్యక్షుడికి పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చే ఈ బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎయిర్ఇండియా ఫ్లైట్‌లో టర్బులెన్స్ ఉదంతం.. డోప్ టెస్టులో పైలట్ ఫెయిల్!

నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. విజయవాడ, ఆగస్టు 09: నేడు ఆదివాసీలు గౌరవంగా జీవిస్తున్నారంటే అందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాన కారణమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది గతంలో ఎవరూ చూడలేదన్నారు. సీఎం చంద్రబాబు వచ్చాకే.. ఆదివాసీ దినోత్సవం సంబరంగా జరుగుతుందని గుర్తు చేశారు. నేడు గిరిజనులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు హయాంలోనే గిరిజనులకు మేలు జరిగిందని చెప్పారు. స్కూల్ అఫ్ ఎక్సలెన్సీ, కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా రెండు లక్షల మంది గిరిజనులు చదువుకొంటున్నారని వివరించారు. నేడు ప్రతి క్లాస్‌కి ఓ టీచర్ ఉన్నారంటే అందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కారణమని పేర్కొన్నారు. యాభై ఏళ్లకే గిరిజనులకు సీఎం చంద్రబాబు పెన్షన్ ఇచ్చారని అన్నారు. గత ప్రభుత్వం 18 పధకాలను రద్దు చేసి గిరిజనులు పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సీఎంగా చంద్రబాబు వచ్చాక ఆ 18 పధకాలను మళ్లీ అమలు చేశారని చెప్పారు. ఈ రెండేళ్లల్లో రాష్ట్రంలో రూ.2,500 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదార్లు, మౌలిక సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ఫీడర్ అంబులెన్స్‌ల సృష్టికర్త చంద్రబాబు అని అన్నారు. పర్మిషన్ లేని ప్రదేశాల్లో కూడా నేడు రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఆసుపత్రికి వెళ్లాలంటే కొండలు, వాగు లు దాటే పరిస్థితి ఉండేదని.. కానీ నేడు నేరుగా తండాల నుంచి ఆసుపత్రికి వెళ్లేలా రోడ్లు వేశారని వివరించారు. చంద్రబాబు సారధ్యంలో గిరిజన గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తాగునీరు కూడా లేని పరిస్థితి ఉన్న అన్ని గ్రామాలకు మంచి నీటిని సీఎం చంద్రబాబు అందించారని

క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. హైదరాబాద్, ఆగస్టు 09: క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీన మహత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో యావత్ భారతదేశం కదం తొక్కిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూతోపాటు సుభాష్ చంద్రబోస్.. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. బ్రిటిష్ వాళ్లు భారత్ విడిచి వెళ్ళిపోవడానికి ఈ ఉద్యమమే ప్రధాన కారణమని వివరించారు. కేంద్రం మొండి వైఖరికి వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం చేపట్టిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలని జెన్ జీ ఉద్యమ వీరులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాది మంది సర్వం కోల్పోయి ప్రాణత్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావటానికి గల కారణాలను యువత అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు. దేశం ఆశ్చర్యం పోయేలా తెలంగాణలో అభివృది, సంక్షేమం జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉందని