
కొత్త చెప్పులు కరవకుండా
ఎంతో ఇష్టపడి హీల్స్, శాండిల్స్, జూతీస్.. వంటివి కొంటుంటాం. అయితే వాటి స్ట్రాప్స్ వల్ల పాదాల చర్మం రాపిడికి గురై.. అక్కడి చర్మం ఎరుపెక్కడం, చిన్నపాటి గాయమవడం.. చాలామందికి అనుభవమే.... ఎంతో ఇష్టపడి హీల్స్, శాండిల్స్, జూతీస్.. వంటివి కొంటుంటాం. అయితే వాటి స్ట్రాప్స్ వల్ల పాదాల చర్మం రాపిడికి గురై.. అక్కడి చర్మం ఎరుపెక్కడం, చిన్నపాటి గాయమవడం.. చాలామందికి అనుభవమే. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి.. ఇవి ప్రయత్నించండి! ⚛ కొత్త చెప్పులు వేసుకునే ముందే పాదాలకు కొద్దిగా పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె.. వంటివి రాసుకుంటే.. వాటి స్ట్రాప్స్ వల్ల చర్మం రాపిడికి గురి కాదు.. తద్వారా గాయాలవకుండా జాగ్రత్తపడచ్చు. ⚛ ప్రత్యేకమైన యాంటీ షూ బైట్ జెల్స్ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని చెప్పులు, షూస్ బిగుతుగా అనిపించిన చోట చర్మంపై అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. ⚛ పొడిగా ఉన్న సబ్బును షూ స్ట్రాప్స్, పట్టీల లోపలి వైపు రుద్దాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఒక మృదువైన పొరలాగా ఏర్పడుతుంది. తద్వారా షూ వేసుకున్న తర్వాత చర్మంపై రాపిడి జరగకుండా జాగ్రత్తపడచ్చు. ⚛ సిలికాన్ జెల్ ప్యాడ్స్, హీల్ గ్రిప్స్, యాంటీ-ఫ్రిక్షన్ స్ట్రిప్స్.. వంటివి మార్కెట్లో దొరుకుతున్నాయి. షూ బిగుతుగా ఉన్న చోట వీటిని అమర్చుకోవడం, ధరించడం చేస్తే చెప్పులు కరవకుండా, సౌకర్యంగా ఉండచ్చు. ⚛ కొన్న కొత్తలో చెప్పులు బిగుతుగా ఉండడం వల్లే ఇలా పాదాలపై గాయాలవుతుంటాయి. కాబట్టి అవి కాస్త వదులుగా అయ్యేంత వరకు.. ముందుగా మందంగా ఉన్న సాక్సులు ధరించి, ఆపై చెప్పులు వేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు. ⚛ కొన్ని చెప్పుల స్ట్రాప్స్, పట్టీలు బిగుతుగా, గరుకుగా ఉంటాయి. ఇలాంటప్పుడు వాటిపై కొద్దిగా లెదర్ కండిషనర్, మాయిశ్చరైజర్.. వంటివి పూస్తే అవి త్వరగా మెత్తబడతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా