
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

వైద్య రంగంలో, ముఖ్యంగా డ్రగ్ డెలివరీ (శరీరంలో నిర్దిష్ట భాగాలకు మందులను చేరవేయడం) ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు భారత శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు. బిగుసుకుపోయి, ఘనరూపంలో ఉన్న పదార్థాలను సైతం తాత్కాలికంగా ద్రవరూపంలోకి మార్చే ఒక సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఆకస్మికంగా ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా పదార్థాల 'జ్ఞాపకశక్తి' (memory imprints) ముద్రలను చెరిపివేసి, వాటిని ప్రవహించేలా చేయవచ్చని నిరూపించారు. ఈ ఆవిష్కరణతో దుష్ప్రభావాలు తగ్గించి, మరింత సమర్థవంతంగా మందులను లక్షిత కణాలకు చేర్చవచ్చని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (RRI) పరిశోధకులు ఈ కీలక ముందడుగు వేశారు. గ్లాస్ వంటి కొన్ని పదార్థాలు నిర్మాణాత్మకంగా ద్రవాలను పోలి ఉన్నప్పటికీ, యాంత్రికంగా ఘన పదార్థాల వలె ప్రవర్తిస్తాయి. అంతేకాకుండా, అవి తమ గత స్థితులను గుర్తుంచుకోగలవు. ఇలా బిగుసుకుపోయిన వ్యవస్థలను (Jammed Systems) తిరిగి ప్రవహించేలా చేయడంపై పరిశోధకులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా, మైక్రోజెల్ కణాలను ఉపయోగించి ప్రయోగాలు నిర్వహించారు. ఈ మైక్రోజెల్ కణాలను వేగంగా వేడి చేసినప్పుడు, వాటిలోని కణాల అమరికలో మార్పులు జరిగి, ఆ వ్యవస్థ తాత్కాలికంగా ద్రవరూపంలోకి మారడాన్ని గమనించారు. ఈ ప్రక్రియలో పదార్థం తన గత స్థితికి సంబంధించిన జ్ఞాపకాలను కోల్పోతుందని గుర్తించారు.ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'జర్నల్ ఆఫ్ కొలాయిడ్ అండ్ ఇంటర్ఫేస్ సైన్స్'లో ప్రచురితమయ్యాయి. RRIలో పీహెచ్డీ విద్యార్థిని, ఈ పరిశోధన పత్రం యొక్క మొదటి రచయిత సోనాలి కవాలే, ఈ ప్రయోగాల కోసం ప్రత్యేకమైన మైక్రోజెల్

కర్నూలు జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. కర్నూలు, సెప్టెంబర్ 1: జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. 67 ఏళ్ల అశోక్‌కు లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, అలాగే 26 ఏళ్ల షేక్ జబీ ఉల్లాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య బృందం సమన్వయంతో శస్త్రచికిత్సలు పూర్తైనట్లు వెల్లడించారు. దాదాపు 20 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు కర్నూలులో జరగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కర్నూలులో ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. రాయలసీమలో ఇలాంటి అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా ఉన్నారని... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని టీజీ భరత్ అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణులైన వైద్య బృందం కృషి అభినందనీయమన్నారు. గౌరిగోపాల్ హాస్పిటల్, టీఎక్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అవయవాలు దానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అవయవ దానం ద్వారా మరికొందరికి కొత్త జీవితాన్ని అందించడం గొప్ప మానవతా సేవగా చెప్పుకొచ్చారు. కర్నూలులోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా మంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
Arjun Aravind Double Murder Case : అమెరికాలోని మాసాచుసెట్స్ స్టేట్‌లో అత్యంత తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన వెలుగులోకి వచ్చింది. సబర్బన్ ప్రాంతంలోని సొంత నివాసంలోనే భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్.. చాట్‌జీపీటీలో ఎలా హత్యలు చేయాలని చూసి మరీ.. తన కన్నతల్లి, సోదరుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై తల్లి కారు తీసుకుని ఇంటికి దూరంగా పారిపోయాడు. కానీ విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే నిందితుడి కోసం తీవ్రంగా గాలించి.. తెల్లారేసరికే పట్టుకున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?బోస్టన్ నగరానికి దాదాపు 48 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాక్టన్ అనే ప్రాంతంలోని మార్తా లేన్‌లో అరవింద్, ఆయన భార్య 45 ఏళ్ల సుధా వెంకటేశన్, కుమారులు 17 ఏళ్ల అర్జున్ అరవింద్, 14 ఏళ్ల సిద్దార్థ్ అరవింద్‌లు నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారికి సొంత ఇళ్లు ఉండగా.. అర్జున్ అరవింద్ యాక్టన్-బాక్స్‌బరో రీజినల్ హైస్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే మంగళవారం రోజు సాయంత్రం 6.30 గంటల వీరి ఇంటికి ట్యూటర్ వచ్చిది. తలుపులు మూసి ఉండడం, ఎంత పిలిచినా ఎవరూ రాకపోవడంతో, ఫోన్లు చేసినా ఎవరూ ఎత్తకపోవడంతో.. ఆమె అరవింద్‌కు ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్లెవరూ తలుపులు తీయట్లేదని చెప్పింది.దీంతో అరవింద్ కూడా భార్యకు, కుమారులకు ఫోన్లు చేయడం ప్రారంభించాడు. కానీ ఆయన కాల్స్ కూడా ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హుటాహుటిన వీరి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూసే సరికి బేస్మెంట్లో సుధా వేంకటేశన్ మృతదేహం, మొదటి అంతస్తులో సిద్ధార్థ్ మృతదేహం లభ్యం అయ్యాయి. బాధితుల శరీరాలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. ఈ హత్యలకు పాల్పడింది వీరి పెద్ద కుమారుడు అర్జున్ అరవింద్ అని తేల్చారు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రస్తుత పాలనపై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తక్షణమే వరుణయాగం నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో లోకకల్యాణం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఎన్నో వైదిక కార్యక్రమాలు, హోమాలు, యాగాలు నిర్వహించామని భూమన గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో టీటీడీ పాలకులు వేద, వైదిక సంప్రదాయాలను, శతాబ్దాల ఆచారాలను పూర్తిగా పక్కనపెట్టి భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. కేవలం వీఐపీ సేవలకే ప్రాధాన్యం ఇస్తూ, ధార్మిక కార్యక్రమాలను తిలోదకాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు బుద్ధి తెచ్చుకుని, సనాతన ధర్మ పరిరక్షణతో పాటు ప్రజాక్షేమం కోసం వెంటనే మేల్కొని వరుణయాగం చేపట్టాలని భూమన డిమాండ్ చేశారు

క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో జైల్ బరో విజయవంతం బూర్గంపహాడ్, ఆగస్టు 10 : కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్బరో కార్యక్రమం బూర్గంపహాడ్ మండలంలో సోమవారం విజయవంతమైంది. వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేపట్టారు. తొలుత మండల కేంద్రంలో కార్మికులు, కర్షకులకు జరుగుతున్న అన్యాయాన్ని నినదిస్తూ ర్యాలీ నిర్వహించారు. రాస్తారోకో చేస్తుండగా భగ్నం చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాస్తారోకో చేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లుతో పాటు మరికొందరు నాయకులను లాక్కెళ్లి పోలీసు జీపులో స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు స్టేషన్ వద్దకు వెళ్లి రాస్తారోకోను భగ్నం చేసినందుకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రం నాలుగు లేబర్కోడ్లు అమలుచేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని, విద్యుత్ సవరణ బిల్లు 2025 విత్తన చట్టానికి సవరణలు ప్రతిపాదించారని దీంతో సులభతర వ్యాపారం పెట్టుబడిదారుల చేతిలో లాభాలు తెచ్చిపెట్టిందని విమర్శించారు. వీబీజీ రాంజీ చట్టాన్ని తీసుకువచ్చి ఉపాధి కార్మికుల పొట్టకొట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు ఎస్కే అబిద, సీఐటీయూ నాయకురాలు, ఐద్వా మండల కార్యదర్శి పాపినేని సరోజిని, కేవీపీఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, రైతు సంఘం మండల కార్యదర్శి నాగేశ్వరరావు, మరియమ్మ, అప్పారావు, ప్రతాప్, ఆదూరి నర్సింహారావు, కార్మికులు, కర్షకులు, వివిధ రంగాల అసంఘటిత కార్మికులు పాల్గొన్నారు. [caption id="attachment_2479205" align="alignnone" width="1200"] 'మోదీని గద్దె దింపాల్సిందే'[/caption]

నిశ్శబ్దం... ప్రశాంతమైనదేనా... శక్తిమంతమైనది కూడా. ప్రతీ ఒక్కరికి నిశ్శబ్దం ఒక రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది. నిశ్శబ్దం... ప్రశాంతమైనదేనా... శక్తిమంతమైనది కూడా. ప్రతీ ఒక్కరికి నిశ్శబ్దం ఒక రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది. మానసిక స్పష్టతను అందిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. గజిబిజీ జీవితంలో ఈ ఆయుధం దగ్గరుంటే కలిగే ప్రయోజనాలివి... నిశ్శబ్దం ప్రపంచంలో అరుదైన సంపద. అది ఏకాగ్రతను, మానసిక స్పష్టతను అందిస్తుంది. రోజూ రెండు గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే.. మెదడులోని ‘హిప్పోకాంపస్’ భాగంలో కణాల వృద్ధి మెరుగ్గా జరుగు తుందని డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. నిశ్శబ్దంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త ఉత్సాహం లభిస్తుంది. సులభంగా నిద్రలోకి జారుకుంటారు. ఆ అలవాటు నాడీవ్యవస్థను శాంతపరిచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇదొక మెంటల్ రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేచిన తరువాత పది నిమిషాల పాటు నిశ్శబ్ద వాతా వరణంలో నడక, ధ్యానం చేయడం వల్ల శరీరానికి అవసర మైన శక్తి లభిస్తుంది. మనసు ఉల్లా సంగా మారుతుంది. సైలెన్స్ క్రియేటివిటీని పెంచు తుంది. సమస్యను వేగంగా పరిష్కరించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రశాంత వాతావరణంలో మెదడు ‘డీఫాల్ట్ మోడ్ నెట్వర్క్’ యాక్టివిటీలోకి వెళుతుంది. దీనివల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఊహాశక్తి పెరుగు తుంది. కొత్త ఆలోచనలు రావడానికి, సమస్య పరిష్కారానికి ఈ మోడ్ చాలా అవసరం. నిశ్శబ్ద వాతావరణానికి, నేర్చుకోవడానికి సంబంధం ఉంది. ఎక్కువ శబ్దాలు ఉన్న చోట ఏకాగ్రత కోల్పోతారు. నేర్చుకోవడంలో ఇబ్బందిపడతారని యూపీఎంసీ హెల్త్ రిపోర్టులో పేర్కొంది. నిశ్శబ్ద వాతావరణంలో ఏదైనా సరే వేగంగా గ్రహిస్తారు. మానసిక ఒత్తిడితో అలసిపోయినప్పుడు నిశ్శబ్దం సహజ మందులా పనిచేస్తుంది. భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మనసును సర్దుబాటు చేసుకునేందుకు నిశ్శబ్దం అద్భుతమైన సాధనం. ఇది మనలోని మనతో అనుసంధానం కావడానికి సాయపడుతుంది. నిశ్శబ్దం మానసిక శక్తిని పునరుద్ధరిస్తుందని సైకాలజీ స్టడీలో తేలింది. నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గిస్తుంది