2.5/5రొమాంటిక్ కామెడీ 'అన్బే డయానా' మూవీ రివ్యూ
Rating: 2.5 --సూర్య ప్రకాష్ జోశ్యుల మిడిల్ క్లాస్ కుర్రాడు సీతాకృష్ణ (పరి ఎలవళగన్)గత కొంతకాలంగా అంటే సినిమా ప్రారంభం అయ్యేసరికే 'మ్యాజిక్' (రమ్య రంగనాథన్)తో ప్రేమలో ఉంటాడు. అయితే ఆమె సగటు తమిళ అమ్మాయి కాదు. ఓ ఆంగ్లో ఇండియన్. దాంతో ఆమె కుటుంబ పద్దతులు వేరు. ఆమె జీవితం కూడా వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే మనవాడు పట్టువదలని ప్రేమ మార్కుడు. ఆమె వెనకాలే పడి..ఆమె తమ్ముడుకి స్పోర్ట్స్ లో తన దగ్గరే కోచింగ్ ఇచ్చి మరీ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూంటాడు. ఇక ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఆమె ఒప్పుకున్నా తన ఇంట్రో తన తల్లి తల్లి సరళ (రోజా) ని ఒప్పించటం కష్టమనే విషయం సీతాకృష్ణకు తెలుసు.ఎందుకంటే సరళ స్కూలే వేరు. ఆవిడ ఓ పిండిమర నడుపుతూ కుటుంబాన్ని ఒంటి చేత్తో లాగుతుంది. భర్త ఉద్యోగం చేస్తున్నా ఆ డబ్బులు ఇంటికి రావు అని తెలిసే ఈ పిండిమిల్లు పెట్టుకుంది. అలాగే ఆమెకు కొన్ని రూల్స్ ఉన్నాయి.తన కులం, తన మతం దాటి వెళ్ళటానికి ఇష్టపడదు. కాబట్టి ఆంగ్లో ఇండియన్ ని తన కోడలు గా ఒప్పుకోవటం కష్టమే. అయినా ఎవరి నమ్మకాలు, భ్రమలు వారికుంటాయి కదా. అలాగే సీతాకృష్ణకు కూడా తన తల్లిని ఒప్పించగలననే నమ్మకం. ఈలోగా ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా అనుకుంటాడు. దాంతో తన తల్లికి ఈ విషయాలు ఏమీ చెప్పడు. ఈలోగా ఆ తల్లి తన కొడుక్కి తన తమ్ముడు కూతురు 'తనీషా'తో పెళ్లి మాటలు మాట్లాడేస్తుంది. తన కొడుకు తన మాట జవదాడటమే పిచ్చి నమ్మకంతో. ఇలా ఎవరి వెర్షన్స్ వాళ్లు వేసుకుని కథను ముందుకు నడుపుతూంటారు. ఈలోగా మ్యాజిక్ కు మన హీరోపై ప్రేమ పుడుతుంది. అదే సమయంలో కృష్ణలో కొన్ని సందేహాలు మొదలవుతాయి. మ్యాజిక్ అందంగా ఉంది కాబట్టి ప్రేమించాడు. కానీ ఆమె స్వేచ్ఛగా ఉన్నదున్నట్లు


