
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నల్ల నువ్వులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కళ్లద్దాలు తొలగిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తీసుకోవచ్చు. చూపులో మార్పులు, కంటి నొప్పి లేదా అకస్మాత్తుగా దృష్టి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే కంటి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..

హంసలు పురాణాల్లో మాత్రమే కనిపించే కల్పిత పక్షులనే సందేహం ఎక్కువమందిలో ఉంటుంది. తెల్లటి రెక్కలు, పొడవాటి మెడ, నీటిపై నెమ్మదిగా తేలుతూ కనిపించే అందమైన హంసను నేరుగా చూడాలని ఎంతో మంది కోరుకుంటారు. హంసలు Cygnus అనే జాతికి చెందిన పెద్ద నీటి పక్షులు. ఇవి ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా ప్రాంతాల్లో వీటి జాతులు కనిపిస్తాయి. హంసలు శీతాకాలంలో వెచ్చని ప్రాంతాలకు వేల కిలోమీటర్లు వలస వెళ్తాయి. Whooper Swan, Tundra Swan, Mute Swan వంటి హంస జాతులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కొన్ని హంసలు జీవితాంతం ఒకే జోడీగా కలిసి ఉంటాయి. అందుకే ప్రేమకు గుర్తుగా రెండు హంసలను చూపిస్తూ ఉంటారు. మనదేశం హంసలకు నివాస ప్రాంతం కాదు. కానీ అరుదుగా కొన్ని హంసలు మన దేశానికి వలస వస్తూ ఉంటాయి. ఉదాహరణకు Whooper Swan భారతదేశంలో చాలా అరుదుగా కనిపించే పక్షిగా నమోదైంది. అలాగే Tundra Swan కూడా మన దేశంలో శీతాకాలంలో అరుదుగా కనిపించినట్టు చెబుతారు. అయితే ఇండియాలో హంసలను ఎప్పుడూ చూడలేమని కాదు.. కానీ చెరువులు, సరస్సుల్లో ప్రతిరోజూ కనిపించే సాధారణ పక్షుల్లా హంసల మనదేశంలో కనిపించవు. చాలా అరుదుగా ఇండియాలో హంసలు కనిపిస్తాయి. హంసలను గుంపులుగా చూడాలంటే బ్రిటన్, జపాన్, నెదర్లాండ్స్ వంటి దేశాలకు వెళ్లాలి. అక్కడ కొన్ని సరస్సుల్లో వందలాది హంసలు ఈదుతూ, ఎగురుతూ అందంగా కనిపిస్తాయి. మన పురాణాలు, సాహిత్యంలో కనిపించే ‘హంస’ అనే భావనకు, నిజ జీవితంలో కనిపించే హంసలకు కొంత తేడా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో హంసకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. కానీ మన దేశంలో కనిపించే బార్-హెడ్డెడ్ గూస్ వంటి కొన్ని పెద్ద నీటి పక్షులను కూడా సాధారణంగా హంసలా భావిస్తుంటారు. నిజానికి అవి హంసలు కాదు, గూస్ జాతికి చెందినవి. ఈ బార్-హెడ్డెడ్ గూస్ మాత్రం ఇండియాలో చాలా ముఖ్యమైన వలస పక్షి. లడఖ్