
యాక్షన్ మోడ్‌లో దేవరకొండ.. ఈ నెల 9న ‘రణబాలి’ టీజర్
యాక్షన్ మోడ్‌లో దేవరకొండ.. ఈ నెల 9న ‘రణబాలి’ టీజర్

యాక్షన్ మోడ్‌లో దేవరకొండ.. ఈ నెల 9న ‘రణబాలి’ టీజర్

స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన ఒక సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. విజయ్ షేర్ చేసిన ఒక అందమైన ఫ్యామిలీ ఫోటోకు రష్మిక చేసిన ఫన్నీ కామెంట్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే, వర్షాల కారణంగా షూటింగ్ రద్దు కావడంతో విజయ్ దేవరకొండ తన నివాసంలో తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి దేవరకొండల మధ్య పడుకుని సేదతీరుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. "వర్షాల వల్ల షూటింగ్ రద్దయ్యింది. చిన్నప్పటి నా ఫేవరెట్ స్పాట్లో మధ్యాహ్నం నిద్ర దొరికింది" అని ఈ చిత్రానికి క్యాప్షన్ ఇచ్చాడు. అయితే, ఈ ఫోటో తీసింది తన భార్య రష్మిక మందన్నేనని పేర్కొంటూ ఆమెకు ఫోటో క్రెడిట్స్ ఇచ్చాడు.ఈ పోస్టుపై రష్మిక వెంటనే స్పందిస్తూ తన భర్తను సరదాగా ఆటపట్టించింది. "నేను ఇంటికి వచ్చాక నా పప్పీ ఐస్ (అమాయకపు చూపులు) చూడలేకే నాకు క్రెడిట్ ఇచ్చావా?" అంటూ ఫన్నీగా ప్రశ్నించింది. అంతేకాకుండా, ఇన్నేళ్లుగా తాను తీసిన మిగతా ఫోటోలకు కూడా క్రెడిట్ ఇవ్వాలని, తన ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు నవ్వులు పూయిస్తున్నాయి.'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందిన విజయ్, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరి 26న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న తొలి చిత్రం 'రణబలి' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక ఇటీవలే 'కాక్టెయిల్ 2'లో కనిపించగా

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి దేశభక్తి ఉట్టిపడేలా ఉన్న ఒక పవర్ఫుల్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో గుర్తుంచుకోవాలని, స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మరువొద్దని ఆయన పిలుపునిచ్చారు."ఇది మనందరికీ గొప్ప పండుగ రోజు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం ఎంత కష్టపడ్డారో, మనం ఎంత దూరం ప్రయాణించామో గుర్తుంచుకోవాల్సిన రోజు. స్వేచ్ఛ కోసం చెల్లించిన మూల్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కుటుంబాలకు, దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకురండి. నా సోదరులకు, నా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని విజయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ దేశభక్తి కలిగిన 'రణబాలి' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న 'జయమ్మ' పాత్రలో కనిపించనుంది. హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం 'ది మమ్మీ'లో ఇమ్హోటెప్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో 'సర్ థియోడర్ హెక్టర్' అనే ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండటం విశేషం.ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో ముఖ్యంగా 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పాన్-ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో చోటు