
అడివి శేష్ వదిలిన అ’ ఫస్ట్ లుక్.. టైటిల్ జస్టిఫికేషన్ ఇదే
ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ సంస్థలు నిర్మిస్తోన్న మూవీ ఫస్ట్ లుక్‌ని అడివి శేష్ వదిలారు. ప్యాషనేట్ ప్రొడక్షన్ హౌస్‌లు స్టార్ బాక్స్ స్టోరీస్, రిప్పుల్ స్లైడ్ స్టూడియోస్ తొలిసారిగా ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. రాహుల్ విజయ్ (Rahul Vijay), అర్చన అయ్యర్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి ‘అ’ (AH Movie) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని కనకరావు తొనంగి, అభిషేక్, ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH నిర్మిస్తుండగా.. సాయి బాలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవైటెడ్ టైటిల్, ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌ను హీరో అడివి శేష్ (Adivi Sesh) ఆవిష్కరించారు. ఈ టైటిల్‌కు జస్టిఫికేషన్ ఇస్తూ.. చుట్టూ ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ అనే పదాలను పొందుపరిచారు. అమ్మాయిలు అదృశ్యం కావడం, ఆ తర్వాత జరిగే దర్యాప్తు చుట్టూ కథ తిరుగుతుందని ఈ పదాలు సూచిస్తున్నాయి. ఇక ‘అనుమానం, అసాంఘికం, అమానుషం’ వంటి పదాలు కథలో కనిపించేదానికంటే మరింత ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఆలోచింపజేసే పదాలతో రూపొందించిన ఈ ఇంట్రెస్టింగ్ టైటిల్ డిజైన్.. విడుదలకు ముందే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు మేకర్స్ వదిలిన హీరో రాహుల్ విజయ్ ఫస్ట్ లుక్ కూడా భారీ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్‌లో ఓ ప్రదేశంలో చేతిలో లాఠీ పట్టుకుని కూర్చుని రాహుల్ విజయ్ కనిపిస్తున్నారు. ఆయన చుట్టూ నేలంతా రక్తపు మరకలతో కనిపిస్తోంది. ఈ ఇంటెన్స్ విజువల్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో చార్మినార్ కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఈ థ్రిల్లర్ కథ హైదరాబాద్ నేపథ్యంగా

