
ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడుదాం
ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్లాస్టిక్‌ను నివారించి పర్యావరణాన్ని కాపాడాలని 16వ వార్డు కౌన్సిలర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
4 గోల్డ్ మెడల్స్ సాధించిన అథ్లెట్.. కూరగాయలు అమ్ముతూ.. ట్రాజెడీ స్టోరీ.. దేశం గర్వపడేలా అంతర్జాతీయ వేదికలపై 4 సార్లు స్వర్ణ పతకాలు (గోల్డ్ మెడల్స్) సాధించిన భారత స్టార్ త్రోబాల్ ప్లేయర్ అమర్దీప్ కుమార్ నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. జార్ఖండ్ రాజధాని రాంచీ వీధుల్లో కుటుంబ పోషణ కోసం కూరగాయలు అమ్ముతూ, పార్ట్‌టైమ్ క్యాబ్ నడుపుకుంటున్నాడు. స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మెడల్స్ వెనుక వేలాడుతుంటే కూరగాయలు అమ్ముతున్న అమర్దీప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించిన

Penamaluru: రాష్ట్రంలో పెనమలూరు ప్రభుత్వ బడులు టాప్-10లో నిలవాలి: ఎమ్మెల్యే ఈ వార్తకు సంబంధించిన

దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త జీవిత బీమా పథకాలను ప్రకటించింది. ఎల్ఐసీ బీమా ప్లాటినం (ప్లాన్ 770), ఎల్ఐసీ జీవన్ రక్ష (ప్లాన్ 894) పేరుతో వీటిని సంస్థ విడుదల చేసింది. ఎల్ఐసీ సీఈఓ, ఎండీ ఆర్. దొరైస్వామి ఈ కొత్త ప్లాన్లను ప్రారంభించారు. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7 నుంచి విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. బీమా ప్లాటినం (Plan 770)ను పొదుపు, జీవిత రక్షణ, భవిష్యత్ ఆదాయం కలిపిన పాలసీగా ఎల్ఐసీ రూపొందించింది. ఇది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత ప్లాన్. పరిమిత కాలంపాటు ప్రీమియం చెల్లించే విధానం ఇందులో ఉంటుంది. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి సంవత్సరం చెల్లించిన ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియానికి రూ.70 గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ప్రీమియం చెల్లింపు కాలం పూర్తయిన ఐదో సంవత్సరం చివర్లో పాలసీదారు జీవించి ఉంటే బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 70 శాతానికి సమానమైన బూస్టర్ ఇన్కమ్ బెనిఫిట్ లభిస్తుంది. అంతేకాకుండా, పాలసీ పేఔట్ పీరియడ్‌లో ప్రతి సంవత్సరం బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. పేఔట్ పీరియడ్ అంటే పాలసీ కాలవ్యవధి నుంచి ప్రీమియం చెల్లించే కాలాన్ని మినహాయించిన తర్వాత మిగిలే కాలం. బీమా ప్లాటినంలో కనీస బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.3 లక్షలు. గరిష్ఠ పరిమితిని నిర్దిష్టంగా పేర్కొనలేదు. అయితే ఎల్ఐసీ బోర్డు ఆమోదించిన అండర్‌రైటింగ్ పాలసీ నిబంధనలు వర్తిస్తాయి. బీమా మొత్తాన్ని రూ.10,000 చొప్పున పెంచుకుంటూ ఎంచుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు వ్యవధిని 7, 10, 12, 15 లేదా 18 సంవత్సరాలు ఎంచుకోవచ్చు. ఎంచుకున్న టర్మ్‌ను బట్టి ప్రవేశ వయసు కనీసం 30 రోజులు, గరిష్ఠంగా 55 సంవత్సరాల వరకు ఉంటుంది. గరిష్ఠ మెచ్యూరిటీ వయసు 75 సంవత్సరాల వరకు ఉండొచ్చు. అదనపు రక్షణ

దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్ జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్ జోన్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టును విజయపథంలో నడిపించిన తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ టెస్ట్ క్రికెట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్ట పడుతా. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. వైట్‌బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నాను. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ టెస్ట్ క్రికెట్లో నా బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా' అని తిలక్ పేర్కొన్నాడు. 'ఎప్పటికైనా భారత టెస్టు క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్ కారణంగా వైట్‌బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్‌కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టపడ్డాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే టెస్ట్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను' అని తిలక్ వెల్లడించాడు. కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్
తెలంగాణలో విమానయాన రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో సీప్లేన్ ల్యాండింగ్‌కు ఉన్న అవకాశాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధ్యయనం చేస్తోంది. దీనికి సంబంధించిన నివేదికను మరో రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని కేంద్ర శాఖ అధికారులు తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలిపారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. రాజీవ్‌గాంధీ భవన్లో జరిగిన ఈ భేటీలో తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, హెలీ టూరిజం, సీప్లేన్ సేవలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్ మామునూరు విమానాశ్రయాల పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఇచ్చిందని ఆయన వివరించారు. ఇక మిగిలిన పనులను త్వరితగతిన చేపట్టి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మామునూరు విమానాశ్రయానికి సంబంధించిన టెండర్లను రెండు వారాల్లో పిలిచి, డిసెంబర్ నాటికి ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సీఎంకు తెలిపారు. అదే నెలలో విమానాశ్రయ పనులకు శంకుస్థాపన చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించినట్లు సమాచారం.ఆదిలాబాద్ విమానాశ్రయంలో కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా కార్గో, ప్యాసింజర్ టెర్మినల్‌తో పాటు ఎంఆర్ఓ (MRO) (Maintenance, Repair and Overhaul) సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులో రన్‌వేకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు రక్షణ, పౌర విమానయాన శాఖల అధికారులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రన్‌వే అంశంపై ఉన్న సాంకేతిక అంశాలను త్వరగా పరిష్కరించి పనులు ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.తెలంగాణలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు హెలికాప్టర్ సేవలను

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Dr Subhash Chandra Case: తుది లీగల్ ఆర్డర్ లేకుండా పదిహేను రోజులుగా సాగుతున్న మీడియా ట్రయల్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (NCLAT) దృష్టికి ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్ సుభాష్ చంద్ర తీసుకువెళ్లారు. అదేవిధంగా ఈ కేసును మళ్లీ మొదటి నుంచి ఏకంగా ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీనిపై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సుభాష్ చంద్ర తరుఫున న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. NCLAT తాత్కాలిక ఛైర్మన్ జస్టిస్ యోగేష్ ఖన్నా, సాంకేతిక సభ్యులు బరుణ్ మిత్రా, అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ధర్మాసనం ముందు బుధవారం ఈ పిటిషన్లపై విచారణ జరిగింది. సుభాష్ చంద్ర తరఫున సీనియర్ న్యాయవాది సస్మిత్ పాత్ర వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి అధికారిక తుది ఉత్తర్వు అమల్లో లేదని స్పష్టం చేశారు. అయినా.. రూ.22,006 కోట్ల మేర ఉన్న క్లెయిమ్‌లకు బదులుగా ఆయన కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆయన ప్రతిష్టను దిగజార్చేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. ఈ రూ.22,006 కోట్ల రుణం సుభాష్ చంద్ర వ్యక్తిగతంగా తీసుకున్నది కాదని.. ఎస్సెల్ గ్రూప్ కంపెనీలు తీసుకున్న రుణాలకు ఆయన గ్యారెంటర్‌గా మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆయన వ్యక్తిగత ఆస్తుల నికర విలువ రూ.31.79 కోట్లు ఉండగా.. దాని ఆధారంగానే నిబంధనల ప్రకారం రూ.6.25 కోట్లు రుణదాతలకు, మరో రూ.25 లక్షలు న్యాయ ప్రక్రియ ఖర్చుల కోసం రీపేమెంట్ ప్లాన్‌ను రూపొందించారని వివరించారు. రీపేమెంట్ ప్లాన్‌ను ఆమోదిస్తూ ఎలాంటి

మొన్న సాదిక్‌ఖాన్.. నేడు గౌస్ మోహిద్దీన్.. కాకినాడలో లవ్ జిహాద్ కేసులు కలకలం రేపుతున్నాయి. సాదిక్‌ఖాన్ అరాచకాలతో ఓ ఫ్యామిలీ బలైతే.. ఇప్పుడు గౌస్ మోహిద్దీన్ బాధితులు బయటకొచ్చారు. గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మతం మార్చి మోసం చేశాడంటూ కాకినాడ ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలో లవ్ జిహాద్ కేసులు పెరుగుతున్నాయి. సాదిక్‌ఖాన్ కేసు మరువక ముందే.. గౌస్ మొహిద్దీన్ కేసు తెరపైకి వచ్చింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ గౌస్ మొహిద్దీన్ అనే వ్యక్తిపై బాల రమ్యశ్రీ అనే మహిళ కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్నాధపురానికి చెందిన గౌస్ మొహిద్దీన్ తనను 8 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకున్న తర్వాత.. మతం మార్చి చిత్రహింసలకు గురి చేశాడని కంప్లైంట్లో పేర్కొంది. ఒత్తిడి చేసి మతం మారేలా చేశాడని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు.. తనతో పాటు మరో ఐదుగురిని కూడా ఇలాగే మోసం చేసినట్టు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో లవ్ జిహాద్ల వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. ప్రేమ పేరుతో గౌస్ మొహిద్దీన్ పలువురు యువతులను మోసం చేశాడని బాధితురాలు తెలిపింది. ఒకరికి తెలియకుండా మరొకర్ని ట్రాప్ చేసి, వారితో సహజీవనం చేశాడని బాల రమ్యశ్రీ ఆరోపించింది. తనను ముస్లిం సంప్రదాయంలో వివాహం చేసుకున్న తర్వాత వేధింపులకు గురిచేశాడని వెల్లడించింది. ఎన్నోసార్లు తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తనను.. తమ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గౌస్ మోహిద్దీన్‌పై ఇప్పటికే ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నాడని.. ఇదే అదను భావించి తమ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని బాధితురాలు చెప్పింది. అయితే.. గౌస్ మొహిద్దీన్ నుంచి తనకు రక్షణ కల్పించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ ఎస్పీని కోరినట్టు తెలిపింది. “జలం… జీవం

సూర్య ప్రకాష్ జోశ్యుల ఒకవైపు హాలీవుడ్‌పై విమర్శలు. మరోవైపు కాలిఫోర్నియాపై అసహనం. మధ్యలో తనదైన రాజకీయ వ్యాఖ్యలు. ఇలా తన సోషల్ మీడియా పోస్టులో ఎప్పటిలాగే కాస్త అటూ ఇటూ మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ చివరికి హాలీవుడ్‌కు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మాట చెప్పేశారు.ఏమిటా పెద్ద మాట అంటే.. “అమెరికాలో సినిమాలు తీస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి” అని. అంటే ఓ రకంగా హాలీవుడ్‌ను ‘డిజాస్టర్’ అంటూ విమర్శించిన ట్రంపే ఇప్పుడు హాలీవుడ్‌ను కాపాడేందుకు ప్రభుత్వ డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారన్న మాట! అసలు హాలీవుడ్‌కు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి? ఒకప్పుడు భారీ సినిమాలు ఏవైనా సరే అమెరికాలోనే షూటింగ్ జరిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హాలీవుడ్ నిర్మాతలు కెమెరాలు తీసుకుని, తమ నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి లండన్‌కు వెళ్తున్నారు.మరికొందరు కెనడాకు వెళ్తున్నారు. ఇంకొందరు యూరప్‌లోని ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు “మీ సినిమా ఇక్కడ తీస్తే... మేం మీకు ట్యాక్స్‌లో రాయితీ ఇస్తాం.” అని ప్రకటిస్తున్నాయి. ఇస్తున్నాయి. సినిమా బడ్జెట్ వందల కోట్లలో ఉన్నప్పుడు చిన్న ట్యాక్స్ రాయితీ కూడా చిన్న విషయం కాదు కదా! అందుకే పెద్ద పెద్ద హాలీవుడ్ ప్రొడక్షన్లు అన్నీ అమెరికా బయటకు వెళ్లిపోతున్నాయి. దీని దెబ్బ ఎవరికి పడుతోంది? అమెరికాలోని సినిమా కార్మికులకు. టెక్నీషియన్లకు. స్టూడియోలకు. సినిమా షూటింగ్‌లపై ఆధారపడిన చిన్న వ్యాపారాలకు. ముఖ్యంగా హాలీవుడ్‌కు గుండె లాంటి లాస్ ఏంజెలెస్‌లో షూటింగ్‌లు పూర్తిగా తగ్గిపోయాయి.అదే పెద్ద సమస్యగా మారింది. ట్రంప్ ఇప్పుడు చెప్పింది ఏంటి? ట్రంప్ మాటను చాలా సింపుల్‌గా చెప్పాలంటే... “సినిమాలు అమెరికా వదిలి బయటకు వెళ్లిపోవద్దు. ఇక్కడే తీయండి. అందుకు ప్రభుత్వం కూడా కొంత ప్రోత్సాహకం ఇస్తుంది” అనేదే. అమెరికాలో సినిమా, టీవీ, ఎంటర్టైన్మెంట్ రంగాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు కలిసి వెంటనే చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు. దీని కోసం
చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్స్, కేక్స్, క్యాండీలు, జెల్లీలు తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోయి గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే ఈ షుగర్ ఫుడ్స్ తినకుండా ఉండటం మేలు. కొంతమంది గాయాలు మానేందుకు పాలు లేదా టీలో బ్రెడ్ వేసుకుని తింటారు. కానీ వైట్ బ్రెడ్‌లో కార్బోహైడ్రేట్స్ షుగర్ లెవెల్స్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. అందుకే గాయాలు తగ్గాలంటే వైట్ బ్రెడ్ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్ తినడం మంచిది. కూల్ డ్రింక్స్, సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెంచుతాయి. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ పెంచి గాయాలు మానడం ఆలస్యం చేస్తాయి. ప్రాసెస్ చేసిన బేకాన్, హాట్ డాగ్, సలామీ వంటివి తింటే గాయానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే చిప్స్ వంటి ప్యాకేజీ ఐటెమ్స్ తినడం వల్ల రక్తపోటు సమస్య ఉత్పన్నమవుతుంది. అలాగే గాయాలు మానడం కూడా ఆలస్యం అవుతుంది టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి వాటిలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది బాడీని డీహైడ్రేట్ చేసి గాయాలు మానడం ఆలస్యం చేస్తుంది. అందుకే గాయం మానాలంటే కెఫిన్ తక్కువగా తీసుకోవాలి. సాస్‌లో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వాపును మరింత పెంచుతాయి. అందుకే గాయాలు మానాలంటే ఈ సాస్ లాంటి పదార్థాలు తినకూడదు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. దీంతో గాయాలు మానడం ఆలస్యం అవుతుంది. అందుకే గాయాలు మానడం కోసం ఆల్కహాల్ తాగకపోవడమే మంచిది

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు

ప్రతీ గ్రామ పంచాయతీకి డిజిటల్ ప్రొఫైల్ జనాభా నుంచి నీటి వనరుల వరకు సమాచార సేకరణ గ్రామాభివృద్ధి కోసం మూడేళ్ల ప్రణాళికలు జిల్లాలో మొదలైన డిజిటలైజేషన్ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు వరంగల్ సిటీ: గ్రామాల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ మొదలైంది. జీపీలకు సంబంధించిన సమగ్ర సమాచారం డిజిటల్ ప్రొఫైల్‌లో నమోదు చేస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే అక్కడి అవసరాలు, వనరులు, సమస్యలపై సమగ్ర సమాచారం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల వద్ద విడివిడిగా ఉన్న సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రామపంచాయతీ ల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రతీ పంచాయతీ కి ప్రత్యేక డిజిటల్ ప్రొఫైల్‌ను రూపొందిస్తోంది. గ్రామానికి సంబంధించిన సమగ్ర సమాచారం తోపాటు ప్రస్తుత అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భవిష్యత్ ప్రణాళికలను సైతం ఇందులో పొందుపరుస్తారు. వరంగల్ జిల్లాలోని 317 గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు డిజిటలైజేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితి, కుటుంబాల సంఖ్య, వ్య వసాయ భూములు, సాగునీటి వనరులు, రహదారుల పరిస్థితి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, స్వయం సహాయక సంఘాలు, ఉపాధి కూలీలు వంటి వివరాలన్నీ ఒకే చోట తెలుసుకునే అవకాశం ఉంటుంది. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, ప్రస్తుత పనులు, భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలనూ డిజిటల్ ప్రొఫైల్‌లో పొందు పరుస్తున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృది శాఖ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఈ డిజిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అన్ని వివరాలు ప్రొఫైల్‌లో.. గ్రామపంచాయతీ ప్రొఫైల్‌లో భౌగోళిక వివరాల నుంచి ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వరకు సమాచారం పొందుపరుస్తున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన గ్రామస్థాయి ఉద్యోగులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న టోల్ ప్లాజాల్లో ( toll plaza) వాహనదారుల నుంచి ఫాస్టాగ్ ద్వారా కట్ అవుతున్న డబ్బుల్ని అక్రమ సాఫ్ట్ వేర్లు, యాప్ లు వాడి తమ ఖాతాలకు మళ్లిస్తున్న వైనం వెలుగుచూసింది. టోల్ ప్లాజాల్లో సాగుతున్న ఈ దోపిడీ ద్వారా (Toll Fraud ) మనీలాండరింగ్ సాగుతుందని గుర్తించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) రంగంలోకి దిగింది. ఇవాళ పలు రాష్ట్రాల్లో ఉన్న 14 టోల్ ప్లాజాల్లో తనిఖీలు చేపట్టింది. ఇందులో భారీగా అక్రమాలను గుర్తిస్తోంది. ఈ నేపథ్యంలో అక్రమ సాఫ్ట్ వేర్లను, సామాగ్రిని స్వాధీనం చేసుకుంటోంది. సుప్రీం సాక్షిగా కేంద్రంతో డీల్ ఓకే ..! కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..!జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిధిలోని వివిధ టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న భారీ ఆర్థిక అక్రమాలపై ఈడీ ఉక్కుపాదం మోపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఈడీ లక్నో జోనల్ కార్యాలయ అధికారులు వివిధ రాష్ట్రాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్ముకశ్మీర్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా తో పాటు దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని మొత్తం 14 కీలక ప్రదేశాలలో ఈ తనిఖీలు ఏకకాలంలో కొనసాగాయి. సీఎం విజయ్ తో వైఎస్సార్సీపీ ఎంపీ భేటీ..! తొలిసారి ఇలా..!మోసపూరిత మార్గాల్లో భారీ ఎత్తున టోల్ వసూళ్లు చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు రంగంలోకి దిగారు. నిందితుల నుంచి దొరికిన కీలక పత్రాలు, డిజిటల్ సాక్ష్యాధారాల సేకరణే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. ఈ ఏడాది జనవరి 22 నాటి ఎఫ్ఐఆర్, మే 19 నాటి ఈసీఐఆర్ ఆధారంగా కొనసాగుతున్న ఈ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. కొందరు నిందితులు అనధికారిక సాఫ్ట్వేర్ యాప్స్ ను వినియోగించి నకిలీ

ఇటీవల థియేటర్లకు వచ్చిన అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఇటీవల థియేటర్లకు వచ్చిన ప్రముఖ బ్యానర్ అన్నపూర్ణ సంస్థ నిర్మించిన సినిమా ‘పళ్ల బురుసు’ (Palla Burusu) సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి షాక్ ఇచ్చింది. బలగం సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి, సుజాత కీలక పాత్రల్లో నటించగా ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలసి నిర్మించాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని పల్లెలో శంభ అనే వృద్థుడు ఒంటరిగా జీవిస్తుంటాడు. కొడుకు, కూతురు వేరే వేరే ఊర్లలో స్థిరపడి తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు. తను పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వేప పుల్ల స్థానంలో టూత్ బ్రష్ ఉపయోగించమని సూచిస్తారు. కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)ని టూత్ బ్రష్ (పళ్ల బురుసు), మందులు తెచ్చివ్వమని అడుగుతాడు. సొంత సమస్యల్లో బిజీగా ఉన్న తిరుపతి, తండ్రి మాటను అంతగా పట్టించుకోడు. కొద్ది రోజులకే కూతురు పెళ్లి ఖాయం చేసుకుని కనీసం తండ్రిని పిలవడు. ఇది గమనించిన శంభ లోలోపల కుమిలి పోలీసులను ఆశ్రయిస్తాయి. అక్కడ కూడా పరిష్కారం దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కుతాడు. అసలు తండ్రీకొడుకుల మధ్య గ్యాప్ రావడానికి కారణమేంటి? తనకున్న ఎకరం పొలంలో తన సమాధిని తానే ఎందుకు సిద్థం చేసుకున్నాడు? చివరకు ఏం జరిగింది అన్నదే కథ. వయసు మీద పడ్డ తల్లిదండ్రుల విషయంలో ఈతరం ఎలా వ్యవహరిస్తుందో చూపిస్తూ సాగే ఈ కథలో భావోద్వేగాలు అశించినంతగా బలంగా ఉండవు. కానీ శంభా తన సమాధి తానే సిద్ధం చేసుకునే సన్నివేశాలు, క్లైమాక్స్ మాత్రం గుండెను బరువెక్కిస్తాయి. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అమెజాన్

భారతీయ జీవిత బీమా సంస్థ-ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆవిష్కరించింది. 'బీమా ప్లాటినం', 'జీవన్ రక్ష' పేర్లతో వస్తున్న ఈ పాలసీలు 2026 సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. పొదుపుతో పాటు రక్షణను కోరుకునే వారి కోసం ఒక ప్లాన్‌ను, పూర్తిస్థాయి ఆర్థిక భద్రత కోసం మరో టర్మ్ ప్లాన్‌ను ఎల్ఐసీ ప్రవేశపెట్టింది.ఎల్ఐసీ బీమా ప్లాటినంఇది పొదుపు, బీమా రక్షణ రెండింటినీ అందించే నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ ప్లాన్. ఇందులో గ్యారెంటీడ్ రిటర్న్స్ ప్రధాన ఆకర్షణ. ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ. 1,000 హామీ మొత్తానికి రూ. 70 చొప్పున 'గ్యారెంటీడ్ అడిషన్' లభిస్తాయి. కనీస హామీ మొత్తం రూ. 3 లక్షలు కాగా, గరిష్ఠ పరిమితి లేదు. మెచ్యూరిటీ సమయంలో హామీ మొత్తంతో పాటు అప్పటివరకు జమయిన గ్యారెంటీడ్ అడిషన్లు పాలసీదారుకు అందుతాయి. ఇప్పటికే ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి రిబేటు, లోన్ సౌకర్యం, అదనపు రైడర్లను జోడించుకునే వెసులుబాటు వంటి సదుపాయులు ఇందులో ఉన్నాయి.ఎల్ఐసీ జీవన్ రక్ష ఇది కుటుంబ ఆర్థిక భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్యూర్ రిస్క్ (టర్మ్) ప్లాన్. పాలసీదారుడికి ఏదైనా అవాంఛనీయ సంఘటన ఎదురైనప్పుడు వారి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్లాన్‌లో కనీస హామీ మొత్తం రూ. 5 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 24 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది. ఇందులో సింగిల్, రెగ్యులర్, లిమిటెడ్ ప్రీమియం

ఎల్ఐసీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేర్లతో తీసుకొచ్చిన ఈ పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను తీసుకొచ్చింది. ‘LIC బీమా ప్లాటినమ్’, ‘LIC జీవన్ రక్ష’ పేర్లతో వీటిని ప్రకటించింది. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. LIC బీమా ప్లాటినమ్.. పొదుపుతో పాటు బీమా రక్షణ బీమా ప్లాటినమ్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత బీమా పథకం. పొదుపు లక్ష్యంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా దీన్ని రూపొందించారు. పాలసీ వ్యవధిలో ముందుగానే నిర్ణయించిన గ్యారెంటీడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ.1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్‌కు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ఈ పాలసీని 28 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారు తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 7, 10, 12, 15 లేదా 18 ఏళ్ల ఆప్షన్లు ఉన్నాయి. పాలసీ టర్మ్‌ను 17, 20, 22, 25 లేదా 28 ఏళ్లలో ఎంచుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ సమ్ అష్యూర్డ్‌పై పరిమితి లేదని సంస్థ పేర్కొంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే.. బేసిక్ సమ్ అష్యూర్డ్‌తో పాటు అర్హత కలిగిన గ్యారెంటీడ్ అడిషన్లు అందుతాయి. పాలసీ కాలంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే.. నిబంధనల ప్రకారం వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లకు సంబంధించిన అర్హత మొత్తాల్లో ఎక్కువదాన్ని డెత్ బెనిఫిట్‌గా చెల్లిస్తారు. అదనంగా ఎల్ఐసీ పాలసీదారులకు రిబేట్లు, రుణ సదుపాయం, అవసరానికి అనుగుణంగా రైడర్లను జోడించుకునే అవకాశం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రహదారులపై ఉమ్మివేయడం, బహిరంగ ప్రదేశాల్లో, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి చర్యలకు మంగళవారం నుంచి జరిమానాలు విధించడం ప్రారంభించారు. రాష్ట్రంలోని నగరాల్లో పరిశుభ్రతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నారు. ఈ జరిమానాల ఉద్దేశం ఆదాయం సమకూర్చుకోవడం కాదని, ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమేనని పట్టణాభివృద్ధి, పురపాలక వ్యవహారాల మంత్రి అగ్నిమిత్ర పాల్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో ఉమ్మితే రూ.100 జరిమానా విధిస్తారు. చెత్తను పడేయడం లేదా అపరిశుభ్రతకు కారణమయ్యేలా చేయడంపై రూ.200 జరిమానా ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్ర విసర్జన చేసినా రూ.200 చెల్లించాలి. 125 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకానికీ ఇదే జరిమానా వర్తిస్తుంది. అయితే జరిమానాలను కఠినంగా అమలు చేసేందుకు అవసరమైన పౌర మౌలిక వసతులు ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదని ప్రభుత్వం తెలిపింది. “జరిమానాల ద్వారా డబ్బు వసూలు చేయడానికి కఠినంగా వ్యవహరించడం మా ఉద్దేశం కాదు. ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం. జరిమానాలు విధించి ప్రజల నుంచి డబ్బు తీసుకోవాలని మేము కోరుకోవడం లేదు” అని పాల్ చెప్పారు. కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాలు కూడా అందంగా మారాలని తాము కోరుకుంటున్నామని ఆమె అన్నారు. నగరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రభుత్వం ఒక్కటితో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల్లో బాధ్యతాభావం రావాలని, “ఈ నగరం కూడా తమదే” అనే భావన పెరగాలని ఆమె అన్నారు. ఏడాదిలో కొన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం మాత్రమే సరిపోదని, ప్రజలు తమ నగరం, తమ రాష్ట్రాన్ని తామే అపరిశుభ్రం చేయకూడదనే భావనను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మార్పు కనిపిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రజా మౌలిక వసతులపై దృష్టి ప్రజా మౌలిక వసతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. మార్కెట్లు, రైల్వే స్టేషన్ల సమీపంలో చెత్తబుట్టలను ఏర్పాటు చేస్తున్నారు

New LIC plans | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (LIC) రెండు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. ఎల్ఐసీ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీమా ప్లాటినమ్ (LIC Bima Platinum), జీవన్ రక్ష (LIC Jeevan Raksha) పేరిట రెండు కొత్త ప్లాన్లను ప్రకటించింది. సెప్టెంబర్ 7 నుంచి ఈ పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఆ ప్లాన్ల వివరాలు ఇవీ.. బీమా ప్లాటినమ్ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇది పొదుపుతో పాటు మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కూడా కల్పిస్తుంది. కచ్చితమైన ముందస్తు హామీతో కూడిన రాబడులు లభిస్తాయి. ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిలో ప్రతి వెయ్యి రూపాయలకు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు కనీస వయసు 28 ఏళ్లు. గరిష్ఠ వయసు 75 ఏళ్లుగా నిర్ణయించారు. 7, 10, 12, 15, 18 ప్రీమియం చెల్లింపు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 17, 20, 22, 25, 28 ఏళ్ల పాటు పాలసీ గడువు ఉంటుంది. కనీస బీమా హామీ మొత్తం రూ.3 లక్షలుగా నిర్ణయించారు. గరిష్ఠ మొత్తంపై పరిమితి లేదు. పాలసీ మెచ్యూరిటీ సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే బేసిక్ సమ్అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లు చెల్లిస్తారు. జరగరానిది ఏదైనా జరిగితే వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లలో ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. ఎల్ఐసీ పాలసీదారులకు రిబేటు లభిస్తుంది. రుణ సదుపాయం కూడా ఉంది. రైడర్లు జోడించుకోవచ్చు. బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం చొప్పున రెగ్యులర్ ఇన్కమ్ కింద ఏటా తీసుకునే వెసులుబాటూ ఉంది. ఎల్ఐసీ జీవన్ రక్ష నాన్-పార్టిసిపేటింగ్, నాన్ లింక్డ్ ప్యూర్ రిస్క్ ప్లాన్. ఇది మీ కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే అండగా నిలుస్తుంది. ఈ ప్లాస్ తీసుకోవడానికి కనీస వయసు

ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక వెలువరించింది. సముద్ర మట్టాల పెరుగుదలతో ముంబై, కోల్‌కతాలకు పెను ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆయా నగరాల్లోని లక్షలాదిమంది నిరాశ్రయులయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 1: సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌లోని కోల్‌కతా, ముంబై నగరాలతో పాటు దక్షిణాసియాలోని దాదాపు 1.4 కోట్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను, నివాసాలను కోల్పోయే తీవ్ర ప్రమాదంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి (UN) హెచ్చరించింది. ఐరాస సెక్రటరీ జనరల్ సమర్పించిన 'సముద్ర మట్టాల పెరుగుదల - ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు' అనే నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. తీవ్రమవుతున్న ముప్పు: మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, గ్లేసియర్లు కరగడం, మహాసముద్రాలు వేడెక్కడం వల్ల చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని ఐరాస స్పష్టం చేసింది. 1.4 కోట్ల మంది ఇళ్లకి ముప్పు: దక్షిణాసియాలోని లోతట్టు డెల్టా ప్రాంతాలైన కోల్‌కతా, ముంబై, ఢాకా వంటి నగరాల్లో సముద్ర జలాలు ముంచెత్తడం వల్ల దాదాపు 1.4 కోట్ల మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ప్రపంచ జనాభాపై ప్రభావం: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 77 కోట్లకు పైగా ప్రజలు (మొత్తం జనాభాలో 10 శాతం) సముద్ర మట్టానికి 5 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న తీరప్రాంతాల్లో నివసిస్తూ ప్రమాదంలో ఉన్నారని నివేదిక పేర్కొంది. మౌలిక సదుపాయాలు, ఆర్థిక నష్టం: పెరిగే సముద్ర మట్టాల వల్ల తాగునీటి వనరులు ఉప్పునీరుగా మారడం, మౌలిక సదుపాయాలు, విద్యుత్ వ్యవస్థలు, రోడ్డు రవాణా, వ్యవసాయం దెబ్బతినడమే కాకుండా తీరప్రాంత ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. రికార్డు స్థాయిలో సముద్ర మట్టాల పెరుగుదల: 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఏటా సగటున 4.7 మిమీ చొప్పున పెరిగిన సముద్ర మట్టం, 2024 లో ఏకంగా 5.9 మి.మీ పెరిగి నూతన రికార్డును నమోదు
'పెద్ది' సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. సుకుమార్ దర్శకత్వంలో 'RC 17' అనే వర్కింగ్ టైటిల్ తో అప్పట్లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది క్లారిటీ లేదు. ఇటీవల చరణ్ చేతికి సర్జరీ జరగడంతో, ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభం అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి చెర్రీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గుజరాత్లో సంచలన విజయం సాధించిన సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’. సుమారు రూ.50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన వీ ఈ గుజరాతీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన తొలి గుజరాతీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పుడీ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దీని కోసం రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నారనే ఓ వార్త బీటౌన్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మూవీలో శ్రీకృష్ణుడి పాత్ర ఉంటుంది. ఇప్పుడు తెలుగు రీమేక్ లో ఆ పాత్ర రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. 'గేమ్ ఛేంజర్' స్టోరీ ఐడియా ఇచ్చిన కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్.. ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతనేది పక్కన పెడితే.. 'శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్' అనే న్యూస్ మెగా అభిమానులను ఆకర్షిస్తోంది.'గోపాల గోపాల' మూవీలో మోడరన్ శ్రీకృష్ణ అవతార్ లో పవన్ కళ్యాణ్ కనిపించారు. బాబాయ్ పోషించిన అలాంటి పాత్రలోనే ఇప్పుడు అబ్బాయ్ చరణ్ నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికైతే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ

మన దేశంలో చాలా రకాల పక్షులు ఉన్నాయి. పక్షులు ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలసలు వెళుతూ ఉంటాయి.. వస్తూ ఉంటాయి. కానీ, కుప్పలు తెప్పలుగా ఒకే గ్రామంలో చనిపోవడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ సంఘటన అస్సాంలోని డిమా హసావో జిల్లాలోని జటింగాలో ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. పక్షులు ఇలా ఎందుకు చనిపోతున్నాయి? ఇక్కడ మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చివరలో సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య అమావాస్య లేదా చీకటి రాత్రుల్లో ఈ వింత జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల సమయంలో దట్టమైన పొగమంచు, ఈదురుగాలులు, వర్షం ఉన్నప్పుడు పక్షులు ఉన్నట్లుండి.. గ్రామంలో వెలుగుతున్న దీపాల వైపు దూసుకొచ్చు కింద పడిపోతూ ఉంటాయి. పక్షులు నిజంగా ఆత్మహత్య చేసుకుంటాయా అంటే.. చేసుకోవు. జీవశాస్త్రం ప్రకారం పక్షులకు 'ఆత్మహత్య' చేసుకునే ఉద్దేశం లేదా ఆలోచనా శక్తి ఉండదు. అసలు కారణం దిశానిర్దేశం కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది. భారీ గాలులు, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు పక్షులు ఎటు ఎగరాలో తెలియక అయోమయానికి గురవుతాయి. ఆ కారుచీకట్లో గ్రామంలోని దీపాలు లేదా గ్రామస్తులు వెలిగించిన మంటల వెలుతురు మాత్రమే వాటికి కనిపిస్తుంది. ఆ కాంతి వైపు అత్యంత వేగంగా దూసుకువచ్చే క్రమంలో.. వాతావరణంలో అస్పష్టంగా ఉండే చెట్లు, ఇళ్ల గోడలు, కరెంటు స్తంభాలను బలంగా ఢీకొడతాయి. ఆ దెబ్బకు గాయాలపాలై, స్పృహతప్పి నేలకూలుతాయి. చాలామంది ఇవి సుదూర ప్రాంతాల నుండి వచ్చే వలస పక్షులు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. పాండ్ హెరాన్, కింగ్‌ఫిషర్, టైగర్ బిట్టర్న్ వంటి సుమారు 44 రకాల స్థానిక అటవీ పక్షులే ఈ ప్రమాదానికి గురవుతాయి. వీటిలో ఎక్కువ శాతం సరిగ్గా ఎగరడం తెలియని చిన్న పక్షులు ఉంటాయి. దశాబ్దాల క్రితం, రాత్రిపూట ఆకాశం నుంచి కిందపడుతున్న పక్షులను

ఎంపీ లాడ్స్ నిధుల వినియోగంలో పార్లమెంట్ సభ్యులు తీవ్రంగా వెనుకబడ్డారంటూ 'ఎంపవర్డ్ ఇండియన్' సంస్థ విడుదల చేసిన నివేదిక సత్యదూరమని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎంపీలపై అభాండాలు వేయడం సరికాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు తన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను ఆయన గణాంకాలతో సహా మీడియాకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం తన నియోజకవర్గానికి రూ. 17.50 కోట్లు కేటాయించగా, అందులో ఏకంగా 94.1 శాతం నిధులకు (రూ. 16.47 కోట్లు) సంబంధించిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హాళ్లు, బోర్‌వెల్స్, సీసీ రోడ్ల వంటి ప్రజావసరాల కోసం గత మూడేళ్లలో 627 ప్రతిపాదనలను కలెక్టర్లకు పంపగా, వాటిలో 82.29 శాతం పనులకు ఇప్పటికే ఆమోదం లభించిందన్నారు. అంతేకాకుండా, గతంలో 16వ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న బి. వినోద్ కుమార్ ఖర్చు చేయకుండా వదిలేసిన రూ. 2.5 కోట్ల నిధులను కూడా తానే ఉపయోగించినట్లు గుర్తుచేశారు. స్థానిక సమస్యల పరిష్కారానికి కేంద్రం ఇచ్చే నిధులు చాలడం లేదని, ప్రతి ఏటా ఎంపీ లాడ్స్ కోటాను పెంచాలని ఎంపీలంతా విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో ఇలాంటి ఏకపక్ష నివేదికలు ఇవ్వడం అన్యాయమని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపు నుంచి కలెక్టర్ల ఆమోదం, పనుల అమలు వరకు అనేక దశలు ఉంటాయని... ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ నిధులన్నీ ప్రాసెస్ అయ్యాయని తెలిపారు. ప్రజల విజ్ఞప్తుల కోసం సీఎస్ఆర్ నిధులను కూడా సేకరిస్తున్నామని పేర్కొన్న ఆయన, ఇకనైనా వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు ఇవ్వాలని సదరు సంస్థకు హితవు పలికారు

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు. కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా వ్యక్తిగత ఫోన్లో ఉన్న దృశ్యాలు, వీడియోలని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ ఏఐ మార్ఫింగ్ వీడియోలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదులోని అంశాలని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే. టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 'పుష్ప'లో చీరకట్టుపై అల్లు అర్జున్ షాకింగ్
యూట్యూబ్‌లో జానపద గీతాలతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘ప్రమీల ఓ ప్రమీల’, ‘బాసింగ బలాలే’ వంటి పాపులర్ ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ తోటి డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ వివాదం కొద్దిరోజుల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదలైంది. ఇప్పటికే వివాహమై ఒక బాబు ఉన్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌తో కలిసి వేములవాడలోని ఒక హోటల్ గదిలో ఉండగా.. ఆయన భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలో ఇరువర్గాల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం, గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.* నా కెరీర్లో 'మోస్ట్ ఆల్ఫా' మూమెంట్ అదే... 'పుష్ప 2'లో లేడీ గెటప్‌పై బన్నీ ఓపెన్ కామెంట్స్ఇటీవల ఈ వివాదం మరింత ముదిరి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నమ్మించి మోసం చేశాడని మాధురి రాథోడ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మార్ఫింగ్ చేసిన నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడని, డిజిటల్ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించారు.* వెండితెరపై తమ్ముళ్లతో రొమాన్స్.. నిజ జీవితంలో అన్నలకు జోడీగా... హీరోయిన్ల క్రేజీ లవ్ స్టోరీస్మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును

మన పొరుగుదేశం నేపాల్ పై ఇటీవల ప్రకృతి కన్నెర్రజేసిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా సంభవించిన వరదలతో వందలాది ప్రాణాలు బలయ్యాయి... వేలాదిమంది గల్లంతయ్యారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అయితే ఈ వరదలు కొంతమంది విదేశీయుల ప్రాణాలను బలితీసుకున్నాయి.. ఇందులో అత్యధికులు భారతీయులే. ఈ భయంకర వరదల సమయంలో చాలామంది ఇండియన్స్ నేపాల్ లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు... వీరిలో కొందరు వరదల భారిన పడ్డారు. ఈ క్రమంలో అత్యధికమంది భారతీయులు నేపాల్ లో సందర్శించే పర్యాటక ప్రాంతాలేవో ఇక్కడ తెలుసుకుందాం. సాహస ప్రియులకు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నేపాల్‌లోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాల్లో ఒకటి. ఈ ఎవరెస్ట్ ట్రెక్కింగ్ లో పర్వత గ్రామాలు, వేలాడే వంతెనలు, హిమానీనదాలు, కఠినమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. ఈ ప్రయాణం సాధారణంగా ఖాట్మండు నుంచి లుక్లాకు విమానంలో మొదలవుతుంది. అక్కడి నుంచి షెర్పా గ్రామాలు, సాగర్మాథా నేషనల్ పార్క్ గుండా నడవాలి. మౌంట్ ఎవరెస్ట్, సమీప శిఖరాల అద్భుతమైన దృశ్యాల కోసం కాలా పత్తర్ అనే ప్రదేశంలో చాలామంది ఆగుతారు. ఇక్కడికి మార్చి నుంచి మే, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య ఎక్కువగా వెళుతుంటారు. మంచు పర్వతాల నుంచి కాస్త విరామం కావాలంటే చిత్వాన్ నేషనల్ పార్క్ మంచి ఆప్షన్..ఇది నేపాల్‌లోని కొత్త కోణాన్ని చూపిస్తుంది. దక్షిణ టెరాయ్ ప్రాంతంలో ఉన్న ఈ యునెస్కో గుర్తింపు పొందిన పార్క్ దట్టమైన అడవులు, పచ్చిక బయళ్లు, చిత్తడి నేలలకు ప్రసిద్ధి. పర్యాటకులు ఇక్కడ జీప్ సఫారీలు చేయవచ్చు… రాప్తీ నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు లేదా గైడ్లతో అడవిని అన్వేషించవచ్చు. ఈ పార్క్‌లో బెంగాల్ టైగర్లు, ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, మొసళ్లు, ఏనుగులు, అనేక పక్షి జాతులు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో థారు తెగ ప్రజల సంప్రదాయాలను కూడా తెలుసుకోవచ్చు. జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడికి వెళ్లడానికి సరైన సమయం. ఖాట్మండు లోయలో ఉన్న భక్తపూర్ ఒక
శ్రీ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్‌కు ఆగస్టు 31వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు. నాలుగు జిల్లాల ప్రజల సాగు, తాగునీటి కష్టాలు తీర్చనున్న ఈ ప్రాజెక్టుకు భూములిచ్చిన గ్రామస్తులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ముందు నుంచే ఆగస్టు నెలాఖరుకు నీళ్లు విడుదల చేస్తామని, గ్రామాలు ఖాళీ చేయాలంటూ ముంపు గ్రామాల ప్రజలకు చెబుతూ వచ్చింది. కానీ, కొందరు ఇంకా ఆ గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయలేదు. అయితే, ఇప్పుడు నీటిని విడుదల చేయడంతో ముంపు గ్రామాలకు ప్రభుత్వం రాకపోకలను నిలిపివేసింది.READ ALSO 'వెలిగొండ'లో కొట్టుకుపోయిన నలుగురు.. చెట్లెక్కి ఆర్తనాదాలు పెట్టిన ముగ్గురు, ఒకరు గల్లంతు! వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాలైన సుంకేసుల , కలనూతల, గుండంచర్లకు వెళ్లే మార్గాన్ని అధికారులు నిలిపివేశారు. అయితే, గ్రామాల్లోని తమ ఇళ్లల్లో కొన్ని లక్షల రూపాయల సామాన్లు ఉన్నాయని.. బర్రెలు, గొర్రెలు కూడా అక్కడే వదిలేశామని.. వాటిని తీసుకొచ్చుకోవడానికి చివరి అవకాశం ఇవ్వాలంటూ ముంపు ప్రాంత ప్రజలు వేడుకుంటున్నారు. కానీ, అక్కడి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం లోపలికి అనుమతించకపోవడంతో పుచ్చకాయలపల్లి- సుంకేసుల మధ్యలోని కొండవద్దే పడిగాపులు కాస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.నల్లమల సాగర్‌కు వెలిగొండ ప్రాజెక్టు నుంచి ఆగస్టు 31వ తేదీన రెండు టీఎంసీల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆగస్టు 31వ తేదీ రాత్రి సమయంలో ఒక బొలెరో వాహనం సుంకేసుల - కలనూతల రోడ్డు మార్గం నుంచి వస్తూ నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు గల్లంతవగా.. అందులోని ముగ్గురు దగ్గరలోని చెట్టు పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు, మరో వ్యక్తి ఆచూకీ మాత్రం తెలియలేదు.నీటి ప్రవాహానికి బొలెరో కొట్టుకుపోయిందని, నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారన్న వార్తలు రావడంతో అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్, మార్కాపురం డీఎస్పీతో పాటు స్థానిక

తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన బాసింగ బలాలు ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. బాసింగ బలాలు పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.సహజీవనం.. ఆపై బెదిరింపులు!పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది. అందుకే అర్ధరాత్రి మాధురి రూమ్ కు వెళ్లాను: అసలు నిజం బయటపెట్టిన ఫోక్ యాక్టర్ ఈశ్వర్ సాయిపోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో

Sircilla: సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే కఠిన చర్యలు బక్కి వెంకటయ్య! Sircilla: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, భూ వివాదాలు, ఉద్యోగుల ప్రమోషన్లు, సివిల్ రైట్స్ డే తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి నెల చివరి వారంలో సివిల్ రైట్స్ డే నిర్వహించి, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ వివాదాల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు బాగుందని బక్కి వెంకటయ్య పోలీస్ శాఖను అభినందించారు. ఇక నేరెళ్ల బాధితులు ఇచ్చిన దరఖాస్తుపై స్పందించిన కమిషన్ చైర్మన్... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే రాష్ట్ర హైపర్ కమిటీ సమావేశంలో నేరెళ్ల బాధితులకు తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని బక్కి వెంకటయ్య వెల్లడించారు

ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్ లో.. చాలా మందికి టైమ్ కి భోజనం చేసే సమయమే ఉండటం లేదు. ఇలాంటి సమయంలో.. వీకెండ్స్ లో.. వాషింగ్ మెషిన్ లో బట్టలు ఉతకడమే పెద్ద పని అనుకుంటుంటే.. మళ్లీ.. వాటికి ఐరన్ చేయడం మరో పెద్ద పని. వాషింగ్ మెషిన్ డ్రయ్యర్ చాలా స్పీడ్ గా పనిచేస్తుంది. దీని వల్ల.. బట్టలకు ఎక్కువగా ముడతలు పడిపోతూ ఉంటాయి. అయితే.. ఒకే ఒక్క సింపుల్ ట్రిక్ తో ముడతలు పడటం కాదు కదా.. ఐరన్ అవసరమే రాదు. ఆ ట్రిక్ ఏంటి..? ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం... మీరు మీ బట్టలకు ముడతలు పడకూడదు అనుకుంటే.. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మీ డ్రయ్యర్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేస్తే సరిపోతుంది. ఉతికిన లేదా పొడి బట్టలతో పాటు 2 నుండి 3 ఐస్ క్యూబ్స్‌ను వాషింగ్ మెషిన్ డ్రైయర్ లో వేయాలి. వాషింగ్ మెషిన్ పనిచేస్తున్నప్పుడు ఎక్కువ టెంపరేచర్ రిలీజ్ అవుతుంది. ఆ వేడికి ఐస్ క్యూబ్స్ త్వరగా కరిగి నీరుగా, ఆపై ఆవిరిగా మారతాయి. డ్రైయర్ లోపల తిరిగేటప్పుడు ఉత్పత్తయ్యే ఈ వేడి దుస్తుల మీద ముడతలు పడకుండా ఆపుతుంది. ఇది ఇంట్లో స్టీమ్ ఐరన్ ఎలా పనిచేస్తుందో సరిగ్గా అలాగే పనిచేసి, బట్టలు బైటికి వచ్చేసరికి ముడతలు లేకుండా ప్లాట్‌గా, నీట్‌గా మారేలా చేస్తుంది. ఈ ట్రిక్ బాగా పనిచేయాలంటే డ్రైయర్‌లో కేవలం 2 నుండి 3 దుస్తులు మాత్రమే వేయాలి (ఉదాహరణకు: 2 షర్టులు లేదా ఒక ప్యాంట్, షర్ట్). డ్రైయర్ నిండా బట్టలు వేస్తే ఆవిరి సరిగ్గా వ్యాపించక ముడతలు పోవు. బట్టల పరిమాణాన్ని బట్టి కనీసం ఐదు లేదా ఆరు ఐస్ క్యూబ్స్ వేయాలి. మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇవి సరిపోతాయి. డ్రైయర్ ఆగిపోగానే బట్టలను వెంటనే బయటకు తీసి హ్యాంగర్‌కు తగిలించాలి

కర్నూలు జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. కర్నూలు, సెప్టెంబర్ 1: జిల్లాలో తొలిసారిగా లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. గౌరిగోపాల్ హాస్పిటల్- టీఎక్స్ హాస్పిటల్ సంయుక్తంగా అరుదైన ఘనతను సొంతం చేసుకుందన్నారు. జీవనదాన్ ఆంధ్రప్రదేశ్ సహకారంతో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలిపారు. 67 ఏళ్ల అశోక్‌కు లివర్ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిందని, అలాగే 26 ఏళ్ల షేక్ జబీ ఉల్లాకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేశారని అన్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య బృందం సమన్వయంతో శస్త్రచికిత్సలు పూర్తైనట్లు వెల్లడించారు. దాదాపు 20 గంటల పాటు శ్రమించి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని మంత్రి తెలిపారు. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగే ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు ఇప్పుడు కర్నూలులో జరగడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. కర్నూలులో ఈ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరగడం వైద్య రంగంలో కీలక ముందడుగుగా అభివర్ణించారు. రాయలసీమలో ఇలాంటి అత్యాధునిక, క్లిష్టమైన శస్త్రచికిత్సలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా ఉన్నారని... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని టీజీ భరత్ అన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణులైన వైద్య బృందం కృషి అభినందనీయమన్నారు. గౌరిగోపాల్ హాస్పిటల్, టీఎక్స్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమని కొనియాడారు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి అవయవాలు దానం చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అవయవ దానం ద్వారా మరికొందరికి కొత్త జీవితాన్ని అందించడం గొప్ప మానవతా సేవగా చెప్పుకొచ్చారు. కర్నూలులోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా మంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

Visakhapatnam: విశాఖ ఉక్కు భూముల వేలం.. 19.29 ఎకరాల విక్రయానికి సిద్దం! ఈ వార్తకు సంబంధించిన

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో, విలక్షణమైన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న నటుడు బాబు మోహన్. 90లలో సిల్వర్ స్క్రీన్ పై బాబు మోహన్ హవా నడిచింది. కామెడియన్ గా బాబు మోహన్ మార్క్ తిరుగులేనిది. కొన్ని సినిమాల్లో ఆయన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు. కోట శ్రీనివాసరావుతో బాబు మోహన్ కాంబినేషన్ సూపర్ హిట్. వీరిద్దరూ కలిసి పదుల సంఖ్యలో మూవీస్ చేశారు. మామగారు మూవీలో వీరిద్దరి కామెడీ ఐకానిక్. రాజకీయాల్లోకి వచ్చాక బాబు మోహన్ సినిమాలు తగ్గించారు. ఈ మధ్య అడపాదడపా మాత్రమే నటిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ చాలా ఫిట్ గా, గ్లామర్ గా కనిపిస్తూ.. అందరికి షాక్ ఇస్తున్నాడు. దశాబ్దాలు గడిచినా, వయసు పెరుగుతున్నా ఆయన రూపంలో గానీ, ఉత్సాహంలో గానీ ఎలాంటి మార్పూ రాకపోవడం చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతుంటారు. రోజురోజుకూ ఆయనలో గ్లామర్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని, మరి ఈ వయసులోనూ ఆయన ఎంతో ఎనర్జిటిక్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం ఏమిటి? అని కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈక్రమలో రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన డైట్ చార్ట్ ను బయటపెట్టారు. సాధారణంగా మన దక్షిణ భారతదేశంలో ప్రతి ఒక్కరి రోజువారీ ఆహారంలో అన్నం (భోజనం) ప్రధాన భాగం. కానీ బాబు మోహన్ గత రెండు సంవత్సరాలుగా భోజనం చేయడం పూర్తిగా మానేశారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ జీర్ణశక్తి తగ్గడం, శరీరంలో కొవ్వు పెరగడం వంటి సమస్యలు వస్తుంటాయి. అందుకే ఆయన హెవీగా ఉండే అన్నాన్ని పక్కన పెట్టి, తేలిగ్గా జీర్ణమయ్యే సహజమైన ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన దాని ప్రకారం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎంతో తేలికైన, ఆరోగ్యకరమైన టిఫిన్‌ను బాబుమోహన్ ఎంచుకుంటారు. ఉదయాన్నే 3 లేదా 4 ఇడ్లీలు మాత్రమే

సెప్టెంబర్ తొలి వారంలో ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాల నుంచి సరికొత్త వెబ్ సిరీస్‌ల వరకు పలు ఆసక్తికరమైన టైటిల్స్ డిజిటల్ స్ట్రీమింగ్కు రానున్నాయి. క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ డ్రామాలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, రొమాంటిక్ కథలు ఇలా ప్రతి రుచికి తగ్గ కంటెంట్ ఈ వారం అందుబాటులోకి రానుంది. వీకెండ్ ప్లాన్ చేసుకునే ముందు ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఏ వెబ్ సిరీస్ బింజ్ వాచ్‌కు బెస్ట్? అన్న వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జాబితాపై ఓ లుక్ వేయండి. OTT లవర్స్‌కు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ! 🎬📺 ఈ వారం.. కొత్త ఓటీటీ సినిమాలు (𝐓𝐡𝐢𝐬 𝐖𝐞𝐞𝐤 𝐎𝐓𝐓 𝐑𝐞𝐥𝐞𝐚𝐬𝐞) Manorama Max Ananthan Kaadu (Malayalam) 𝐒𝐞𝐩 𝟐 Jio Hotstar Star Wars: The Mandalorian and Grogu (English) 𝐒𝐞𝐩 𝟐 The Court (Tamil) [Weekly Series] 𝐒𝐞𝐩𝟒 Paramount+ Scary Movie (English) 𝐒𝐞𝐩 𝟑 Sunnxt DC (Tamil, Telugu, Malayalam) - 𝐒𝐞𝐩𝟒 Zee5 Veerabhadruni Rahasyam: S1 Part 2 (Telugu) 𝐒𝐞𝐩𝟒 Sony Liv Unmadham (Malayalam, Tamil, Telugu, Kannada, Hindi) - 𝐒𝐞𝐩𝟒 Apple Tv May Day (English) 𝐒𝐞𝐩𝟒 HBO Max Fuze (English) 𝐒𝐞𝐩𝟒 MUBI Erupcja (English) 𝐒𝐞𝐩𝟒 MGM Plus A Tale Of Two Cities Series 𝐒𝐞𝐩6 Shudder Parasomnia (English) 𝐒𝐞𝐩𝟒 Hulu Signal One (English) 𝐒𝐞𝐩𝟒 Prime Video Confinement (English) Rent 𝐒𝐞𝐩𝟏 I Want Your Sex (English) Rent 𝐒𝐞𝐩𝟏 Just Play Dead (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Wrong Girls (English) Rent 𝐒𝐞𝐩𝟏 The Runner (English) 𝐒𝐞𝐩 𝟐 Dark Hollow

ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు, డేటా అనలటిక్స్‌ను విశ్లేషించడం ద్వారా ప్రభుత్వ శాఖలు అందించే పౌరసేవలను మరింత మెరుగుపరచాలని, అవసరమైన మార్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో ‘రియల్ టైమ్ గవర్నెన్స్’ (ఆర్టీజీ)పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, అల్లూరి విమానాశ్రయం వంటి కార్యక్రమాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారని, ఇదే స్ఫూర్తిని ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ కొనసాగించి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటివరకు తాను 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో 20 సార్లు పాల్గొన్నానని గుర్తుచేశారు. ఇదే క్రమంలో సంక్షేమ హాస్టళ్లలో పారిశుద్ధ్య నిర్వహణను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ప్రతి నెలా మొదటి ఆదివారం విద్యార్థుల తల్లిదండ్రులను హాస్టళ్లకు ఆహ్వానించి, అక్కడి పరిస్థితులు, భోజనం, తాగునీటి సౌకర్యాలపై వివరించాలని సూచించారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయన్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నార్తులకు సాయం అందించే దాతలను గుర్తించి ప్రోత్సహించాలని పేర్కొన్నారు.ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ సేవలను పూర్తిగా ఆన్లైన్లోనే అందించాలని చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ సహా అన్ని విభాగాలు ధ్రువపత్రాలను ఆన్లైన్లోనే జారీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీకృత సేవల విధానం ద్వారా ప్రజలకు వేగంగా నిర్ణయాలు అందేలా చూడాలని అన్నారు. పనితీరు ఆధారంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో బాధ్యులకు ర్యాంకులు ఇవ్వాలని

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్ సభ్యులకు.. కేంద్రప్రభుత్వం ఏటా రూ.5 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తున్నప్పటికీ, వాటిని... 2024 నుంచి తెలంగాణకు 394 కోట్లు.. వ్యయం 94 కోట్లు ఏపీ ఎంపీలకు రూ.554 కోట్లు.. ఖర్చు రూ.127 కోట్లు ఒక్కపైసా ఖర్చు చేయని కేంద్ర మంత్రి భూపతి రాజు, న్యూఢిల్లీ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు పార్లమెంట్ సభ్యులకు.. కేంద్రప్రభుత్వం ఏటా రూ.5 కోట్ల చొప్పున నిధులను కేటాయిస్తున్నప్పటికీ, వాటిని ఖర్చు చేయటంలో ఎంపీలు వెనుకబడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కూడా దీనికి మినహాయింపు కాదని కేంద్రం తాజాగా విడుదల చేసిన వివరాలతో వెల్లడైంది. వీరిలో కేంద్ర మంత్రులు కూడా ఉండటం విశేషం. 2024లో మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దేశంలోని 36రాష్ట్రాల ఎంపీలకు రూ.11,681 కోట్లు విడుదల చేయగా, ఆ మొత్తంలో రూ.3,964 కోట్లు మాత్రమే(33.9%) ఖర్చు పెట్టారు. నాగాలాండ్ ఎంపీలు తమకు లభించిన ఎంపీలాడ్స్ నిధుల్లో 94.6% ఖర్చు చేసి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఎంపీలు కేవలం 26.87% నిధులనే అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టారు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో ఉభయసభలకు చెందిన ఎంపీలకు రూ.394 కోట్లు కేటాయిస్తే రూ.94 కోట్లు(23.8%) వ్యయం చేశారు. 91.3% మంది ఎంపీలు పేలవమైన పనితీరు కనపరిచారని, 4.3% మంది అసలు పనులే చేయలేదని వెల్లడైంది. ఏపీ ఎంపీలకు రూ.554 కోట్లు కేటాయించగా రూ.127కోట్లు (23ు)ఖర్చు చేశారు. ఏపీలోని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ తనకు కేటాయించిన రూ.14 కోట్లలో ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీకి 7కోట్లు కేటాయించినా ఒక్క పైసా ఖర్చు చేయలేదు. ఇరాన్లో లక్ష మందికి పైగా నిరసనకారుల హత్య: ట్రంప్ సంచలన ఆరోపణలు.. భారత్, బంగ్లాదేశ్ సిరీస్‌పై బీసీబీ చీఫ్

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. IND vs SL 2nd Test Predicted Playing 11: శ్రీలంకపై టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసేందుకు టీమిండియా రెడీ అవుతోంది. తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్.. ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కొలంబోలోని ఎస్ఎస్సీ స్టేడియం వేదికగా రేపటి (ఆగస్టు 23) నుంచి రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపరుచుకోవాలని గిల్ సేన చూస్తోంది. మరోవైపు సిరీస్ సమం చేయాలంటే ఆతిథ్య శ్రీలంక తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి టెస్టులో దేవదత్ పడిక్కల్ (167), కేఎల్ రాహుల్ (82) అద్భుతంగా రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక స్పిన్నర్లు ప్రభాత్ జయసూర్య, కేశర నువాంత రాణించి భారత్ 193 పరుగులకు పరిమితమైంది. 445 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 206 రన్స్‌కు ఆలౌట్ అయింది. రెండో టెస్టులో భారత బౌలింగ్ విభాగంలో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌లో రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ స్పిన్ మాయాజాలంతో లంకను దెబ్బకొట్టగా.. కుల్దీప్ యాదవ్ మాత్రం లయ అందుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం ఒకే వికెట్ తీశాడు. కుల్దీప్ను గిల్ కేవలం మూడో స్పిన్నర్‌గా చూస్తున్నట్లు అర్థమవుతోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కుల్దీప్కు సపోర్ట్‌గా ఉన్నా.. ఇప్పటికే సిరీస్‌లో ఆధిక్యం ఉండటంతో అతనికి విశ్రాంతినిచ్చి ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌ను

భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ అంతరిక్షంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లోపల తాను స్వయంగా పండించిన తాజా ఆకుకూరలను కోసి, తోటి వ్యోమగామి జెస్సికా మీర్‌తో కలిసి రుచికరమైన వంటకం తయారు చేసుకున్నారు. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడు మరియు ఇతర సుదూర గ్రహాలపైకి చేపట్టే దీర్ఘకాలిక అంతరిక్ష యాత్రలలో తాజా ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయాలో ఈ ప్రయోగం ద్వారా నిరూపించారు. నాసాకు చెందిన ‘వెజ్జీ’ ప్లాంట్ గ్రోత్ చాంబర్లో ఈ కూరగాయలను దాదాపు నెల రోజుల పాటు శ్రమించి సాగుచేశారు. ఈ ప్రయోగంలో కేల్, వసాబి ఆవాల ఆకుకూరలను సేకరించి పరీక్షించినట్లు మీనన్ తెలిపారు. సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తికి మొక్కలు ఎలా స్పందిస్తాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పంటల పెంపకంలో మార్గనిర్దేశం చేసిన నాసా వెజ్జీ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాత సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ది మార్షియన్’లో అంగారక గ్రహంపై బంగాళాదుంపలు పండించే మార్క్ వాట్నీ పాత్రను గుర్తుచేస్తూ, ఈ ప్రయోగాన్ని చూసి ఆయన కూడా ఎంతో గర్వపడతారని చమత్కరించారు. ఈ తరహా పరిశోధనలు కేవలం వ్యోమగాములకు పౌష్టికాహారాన్ని, మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా, భవిష్యత్తులో భూమి నుండి అంతరిక్షానికి రవాణా చేయాల్సిన ఆహార భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వెన్నులో వణుకే! యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం! LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త! లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్! అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా తీవ్ర వివాదాస్పదంగా మారిన జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యవహారం ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలపై డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఎట్టకేలకు స్పందించడమే కాకుండా, తనపై దాడి చేసిన వారిపై రివర్స్ కేసు పెట్టడం ఇండస్ట్రీ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. వేములవాడలోని రెడ్డి భవన్లో ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొందరితో కలిసి వచ్చిన శరణ్య, తనను అసభ్యకర పదజాలంతో దూషించడమే కాకుండా భౌతికంగా దాడికి తెగబడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా దాడి చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ గొడవ సమయంలో తన వద్ద ఉన్న రూ. 50 వేల విలువైన ఐఫోన్‌ను దొంగిలించారని ఆమె పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం గమనార్హం. ఈ వ్యవహారంపై నిజానిజాలు తెలుసుకోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఛానళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మాధురి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు సంబంధిత వ్యక్తులపై వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో 'బాసింగా బలాలు' పాటతో ఈశ్వర్ సాయి, అనేక ప్రైవేట్ జానపద గీతాలతో మాధురి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పోలీసులు ఈ కేసు నమోదు చేయడంతో తదుపరి విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయోనని నెటిజన్లు ఎంతో ఉత్కంఠగా గమనిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ రిస్క్ ఫలించింది.. ఇరుముడి 200 కోట్లు పక్కా తమిళ ఇండస్ట్రీలో సంక్షోభం.. సెప్టెంబరు 1

రూ.350కే డిజిటల్ లోకల్ పాస్ 121 టోల్ ప్లాజాల్లో అమలు ఆన్లైన్లోనే సులభంగా దరఖాస్తు NHAI: జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే స్థానిక వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తీపి కబురు అందించింది. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే ప్రజల సౌకర్యార్థం 'డిజిటల్ లోకల్ పాస్' సేవలను దేశవ్యాప్తంగా 121 టోల్ ప్లాజాల వద్ద అందుబాటులోకి తీసుకొచ్చింది. టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే స్థానిక నివాసితులు ఇకపై ప్రతిసారీ పూర్తి టోల్, చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పాస్ ద్వారా ప్రయాణించవచ్చు. కేవలం రూ.350 రుసుముతో లభించే ఈ సౌకర్యం సొంత, వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. Gachibowli Tragedy: గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి హైవే ట్రావెల్ యాప్ ద్వారా సులభంగా ఆన్లైన్ దరఖాస్తు: ఈ డిజిటల్ పాస్ కోసం అర్హులైన వాహనదారులు ఎలాంటి భౌతిక పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండా హైవే ట్రావెల్ యాప్ ద్వారా నేరుగా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా డిగీ లాకర్ ద్వారా చిరునామాను, వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను, అనుసంధానమైన ఫాస్టాగ్ వివరాలను ఆన్లైన్లోనే క్షణాల్లో ధృవీకరిస్తారు. దీనివల్ల టోల్ ప్లాజా వద్దకు వెళ్లి అధికారులను కలవాల్సిన శ్రమ, సమయం రెండూ ఆదా అవుతాయి. బ్యారియర్‌లెస్ టోలింగ్‌కు తొలి అడుగు.. ఇ-నోటీసుల సమస్యకు పరిష్కారం: భవిష్యత్తులో అమలు చేయనున్న మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (MLFF), బ్యారియర్‌లెస్ టోలింగ్ వ్యవస్థల్లో స్థానిక వాహనదారులకు ఎదురవుతున్న ఇ-నోటీసుల సమస్యను పరిష్కరించడంలో ఈ డిజిటల్ పాస్ అత్యంత కీలక పాత్ర పోషించనుంది. వాహనాలు బూత్‌ల వద్ద ఆగకుండా ప్రయాణించే వీలుండటంతో పాటు స్థానికులకు సులువైన చెల్లింపుల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. స్థానిక వాహనదారులు ఎన్హెచ్ఏఐ అధికారిక యాప్ ద్వారా తమ వివరాలను సరిచూసుకుని ఈ పాస్‌ను పొందవచ్చని

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్‌ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు.. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు.. తన ఫోన్‌ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు.. వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం

కన్య రాశి : కన్యా రాశి వారికి ఆగస్టు చివరి వారం చాలా అద్భుతంగా గడుస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం లభిస్తుంది. తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఊహించని విధంగా మంచి జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. మకర రాశి : మకర రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. డబ్బులు చేతికి అందుతాయి. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ రాశుల వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పాలి. అంతే కాకుండా చాలా ఆనందకర వాతావరణం నెలకుంటుంది. మీన రాశి : మీన రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. పిల్లలు పోటీ పరీక్షల్లో నెగ్గుక వస్తారు. ఈ నెల చివరి వారం మొంత్తం ఆనందాలతో చాలా బాగా గడిచి పోతుంది

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ విషయంలో కీలక ప్రణాళికలు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండోదశ విస్తరణలో విమానాశ్రయాలు, రైల్వే మార్గాలు, జాతీయ రహదారులు వంటి క్లిష్ట ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక నిర్మాణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. రన్‌వే కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రణాళికలు రూపొందించబడ్డాయి.హకీంపేటలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో ప్రతిపాదన జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో హకీంపేట విమానాశ్రయం సమీపంలో సుమారు 1.65 కిలోమీటర్ల మేర అండర్‌గ్రౌండ్ మెట్రో నిర్మించాలని నిర్ణయించారు. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన హైవే టన్నెల్ వెంట ఈ మార్గాన్ని తీసుకెళ్లేలా ప్రణాళిక ఉంది. దీనివల్ల విమానాశ్రయ రన్‌వేకు సంబంధించిన పరిమితులను అధిగమించి భద్రతా ప్రమాణాలను పాటించే అవకాశం ఏర్పడుతుంది.శంషాబాద్ పరిధిలోనూ సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రో ప్రతిపాదన అలాగే నాగోల్-శంషాబాద్ కారిడార్‌లో విమానాశ్రయ పరిధిలో సుమారు 1.6 కిలోమీటర్ల భూగర్భ మెట్రోను ప్రతిపాదించారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణలో కార్గో స్టేషన్, ఎయిర్పోర్ట్ స్టేషన్ తో పాటు విమానాశ్రయ ప్రాంగణంలోనే మెట్రో డిపో ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఉన్నాయి. దీనికి పౌర విమానయాన మంత్రిత్వశాఖ అనుమతి అవసరం.శామీర్‌పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్బేగంపేట విమానాశ్రయం రన్‌వే కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎత్తు పరిమితులు అమలులో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని శామీర్‌పేట, మేడ్చల్ కారిడార్లను తక్కువ ఎత్తులో నిర్మించేలా డిజైన్ చేశారు. రైల్వే క్రాసింగ్‌లు కూడా కీలక సవాలుగా మారనున్నాయి. ఫలక్‌నుమా, ఆరాంఘర్, శంషాబాద్, గుండ్లపోచంపల్లి, లోతుకుంట, అల్వాల్ ప్రాంతాల్లో మెట్రో మార్గం రైల్వే ట్రాక్‌లను దాటాల్సి ఉంటుంది.ఆ జాతీయ రహదారుల వెంట మెట్రో స్తంభాల నిర్మాణానికి కేంద్ర అనుమతులుదీనికోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి సూత్రప్రాయ అనుమతి లభించినట్లు అధికారులు తెలిపారు. సుచిత్ర ప్రాంతంలో మాత్రం అనుమతి ఇంకా పెండింగ్‌లో ఉంది. జాతీయ రహదారుల

Madhuri Rathod : ప్రముఖ డ్యాన్సర్లు మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వివాదం గురించి అందరికీ తెలిసిన విషయమే. బాసింగ బలాలు అనే పాట ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, నిమ్మతోట వనంలో సాంగ్ ఫేమ్ మాధురి రాథోడ్ ఇద్దరూ కలిసి చాలా పాటలు చేశారు. వీరిద్దరి మధ్య రిలేషన్ గురించి చోటుచేసుకున్న ఓ ఊహించని వివాదం ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలో జరిగిన ఈ వివాదం తీవ్ర కలకలం రేపింది. ఈ వివాదంతో మాధురి రాథోడ్ పేరు మార్మోగిపోతోంది.రవితేజ కెరీర్లో సరికొత్త రికార్డ్.. ఇరుముడి’ తొలిరోజు వసూళ్లు ఎంతో తెలుసా?ఈ నేపథ్యంలో తనప అకారణంగా దాడి చేసి, అసభ్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ వేములవాడ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న రెడ్డి భవన్ లో ఉన్న సమయంలో తోటి నటుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య కొందరితో కలిసి వచ్చి అకారణంగా అసభ్యకరమైన భాషతో దూషించడమే కాకుండా దాడి కూడా చేశారని మాధురి రాథోడ్ ఫిర్యాదులో పేర్కొంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఎలాంటి కారణం లేకుండానే తనను బూతులు తిడుతూ, భౌతికంగా దాడి చేసి చేయి చేసుకుందని మాధురి రాథోడ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మాస్ మహారాజ్ ఊచకోత: ఇరుముడి సరికొత్త బాక్సాఫీస్ రికార్డు!ఈ గొడవను ఉద్దేశపూర్వకంగా వీడియోగా చిత్రీకరించారని.. అంతే కాకుండా తన వద్ద ఉన్న సుమారు రూ.50 వేల విలువైన ఐఫోన్ ను దొంగిలించారని మాధురి రాథోడ్ తీవ్ర ఆరోపణలు చేసింది. సదరు వీడియోలను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేసి తనపై అసత్య ప్రటారం చేస్తూ సమాజంలో తన పరువుకు భంగం కలిగించారని.. ఈ క్రమంలో తన వ్యక్తిగత

Hema Slams Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, ‘జై శ్రీరామ్’ నినాదంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సీనియర్ నటి హేమ తీవ్రంగా స్పందించారు. ఇటీవల అనసూయ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ.. కొంతమంది ‘జై శ్రీరామ్’ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, కేవలం నినాదాలు చేయడం కంటే ప్రవర్తన ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం మీద అనసూయ మీద విమర్శలు రావడంతో ఆ తర్వాత ఆమె స్పందిస్తూ తన మాటలను కావాలని కొందరు వక్రీకరించారని, తాను కూడా హనుమంతుడి భక్తురాలినని వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వివాదంపై నటి హేమ కూడా ఒక వీడియో సందేశం ద్వారా అనసూయకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘జై శ్రీరామ్’ అనేది కేవలం ఒక స్లోగన్ కాదని, అది కోట్లాది మంది హిందువుల గుండెల్లో నిలిచిపోయిన ఒక పవిత్రమైన మంత్రమని హేమ పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ మనమందరం అద్దాల మేడలో బతుకుతున్నామని, సోషల్ మీడియాలో మాట్లాడే ప్రతి మాటను జనాలు బూతద్దంలో చూస్తారని గుర్తుచేశారు. ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటే, ధైర్యంగా నేరుగా వారి పేర్లు చెప్పాలి తప్ప.. ఇలా మొత్తం వ్యవస్థను లేదా నినాదాన్ని తప్పుబట్టడం సరికాదని హితవు పలికారు. నోటిలో మాట వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని హితవు పలికారు. చివరగా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని హేమ హెచ్చరించారు. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదు, ఇంతకు ఇంత తిరిగి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఒకవైపు దేవుడంటే భక్తి అంటూనే, మరోవైపు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని, చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండాలని చురకలేశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టినరోజును పురస్కరించుకుని తమ్ముడు, నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు (MLC), ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కొణిదెల నాగబాబు (Konidela Nagababu) హైదరాబాద్‌లోని కోకాపేటలో ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చేసిన పనికి అంతా ఫిదా అవుతున్నారు. ఆయన చేయడమే కాకుండా, అభిమానులకు, ప్రజలకు కూడా ఆయన ఈ పని చేయాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ మెగాబ్రదర్ ఏం చేశారో తెలుసా.. తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ (కదంబవాసిని) మొక్కలను నాటారు. ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూస్తుందని నాగబాబు తెలిపారు. ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ.. అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కంటే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువునిస్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గమని తెలిపారు. అంతేకాదు, ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక్క మొక్కనైనా నాటాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ రోజు మనం చేసే ఈ చిన్న ప్రయత్నం, రేపటి సమాజానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అవుతుందని తెలుపుతూ.. ఈ చెట్లలాగే మీ కీర్తి, ప్రేరణ నిరంతరం ఎదుగుతూనే ఉండాలని కోరుతూ.. సోదరుడు

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల మూడు దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ఆగస్టు 31వ తేదీన ప్రారంభించి నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మూడో విడత పరిహారంగా రూ.250 కోట్ల చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు.48 రోజుల్లోనే రూ.768 కోట్ల పరిహారంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 48 రోజుల్లోనే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రికార్డు స్థాయిలో పరిహారం అందించింది. మూడు విడతల్లో మొత్తం 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. తొలి విడతలో 2,557 కుటుంబాలకు రూ.318 కోట్లు, రెండో విడతలో 1,622 కుటుంబాలకు రూ.200 కోట్లు అందించగా, శుక్రవారం మూడో విడతగా 2,027 కుటుంబాలకు రూ.250 కోట్లు సీఎం చేతుల మీదుగా అందజేశారు. నిర్వాసితులకు ఇంకా రూ.132 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు తొలిదశ పూర్తయితే 1.19 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుబాటులోకి వస్తుంది.గత ప్రభుత్వ డ్రామాలతోనే ఆలస్యం: సీఎంఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. "1996లో నేనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు 2026లో నా చేతుల మీదుగానే ప్రారంభించడం నా అదృష్టం. గత రెండేళ్లలో రూ.2,250

ఈ యోగం కర్కాటక రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న గురుడు మీ లగ్నంలో (మొదటి ఇల్లు) , శని తొమ్మిదవ ఇంట్లో ఉండటం వల్ల అనేక రంగాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు లాభసాటి ఒప్పందాలు కుదురుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ కాలం వృత్తి, ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. గురుడు తొమ్మిదవ ఇంట్లో, శని ఐదవ ఇంట్లో ఉండటం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, మంచి అవకాశాలు లభిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో కొత్త పరిచయాల వల్ల లాభాలు వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైన సమయం. తులారాశి వారికి నవపంచమ రాజయోగం కెరీర్ పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. గురుడు ఏడవ ఇంట్లో, శని మూడవ ఇంట్లో ఉండటం వల్ల కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత ప్రణాళికలు ఇప్పుడు అమలులోకి వచ్చి అనుకూల ఫలితాలను ఇస్తాయి. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. మేష రాశి వారికి కూడా ఈ యోగం సానుకూల మార్పులను తీసుకువస్తుంది. గురుడు నాలుగవ ఇంట్లో, శని పన్నెండవ ఇంట్లో వక్రగతిలో ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతాయి. స్నేహితులు, సన్నిహితుల నుండి సహకారం అందుతుంది. వృత్తిపరంగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీతం పెంపు లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఇంటర్నెట్ డెస్క్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2016లో ఢిల్లీలో యమునా నది పరివాహక ప్రాంతంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్.. వరల్డ్ కల్చర్ ఫెస్టివల్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం వల్ల పర్యావరణానికి నష్టం జరిగిందని వచ్చిన ఆరోపణలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) స్పందించింది. రూ.5 కోట్ల జరిమానా విధించింది (Supreme Court Art of Living). ఎన్జీటీ విధించిన జరిమానాను రవిశంకర్ నేతృత్వంలోని ఫౌండేషన్ చెల్లించింది (Art of Living Rs 5 crore refund). అలాగే అదే సమయంలో న్యాయపోరాటం కూడా ప్రారంభించింది. దాదాపు పదేళ్ల పాటు సాగిన ఈ న్యాయపోరాటంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు ఊరట లభించింది. ఫౌండేషన్ చెల్లించిన రూ.5 కోట్లను తిరిగి ఇవ్వాలని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. టెర్రరిస్టులను వేటాడాల్సిందే.. భారత్‌కు పోలాండ్ మద్దతు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మళ్లీ జైలుపాలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతన నూతన జాతీయ కార్యవర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంస్థాగత నిర్మాణం, పార్టీ విస్తరణ, భవిష్యత్ కార్యాచరణపై నూతన కార్యవర్గం చర్చించనుంది. ఈ సమావేశానికి ముందు వందేమాతరం గీతంలోని ఆరు చరణాలనూ నేతలంతా ఆలపించారు. అనంతరం రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. ప్రజా జీవితంలో ప్రధాని మోదీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ కార్యాచరణపైనా చర్చ జరగనుంది. అక్టోబర్ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం వరకు సాగిన ప్రయాణాన్ని ప్రజలకు వివరించడంపై చర్చించనున్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో తెలుగు రాష్ట్రాల నుంచి పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్ పాల్గొన్నారు. మరోవైపు, నితిన్ నబీన్ కొత్త టీమ్‌లో అనుభవం, యువ నాయకత్వం, ప్రాంతీయ, సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రాతినిధ్యం కల్పించారు. దీంతో స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, బిప్లబ్ దేవ్, సునీల్ బన్సల్ తదితరులకు కీలక బాధ్యతలు దక్కాయి. నా భర్త ఏడుస్తున్నారు.. ఆయనను విడిపించండి..: కెప్టెన్ అజయ్ పంత్ భార్య ఆవేదన.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌కు రూ.5 కోట్లు తిరిగి ఇచ్చేయండి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొంత కాలంగా స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వరుస ప్రమాదాలు.. యాజమాన్య నిర్ణయాల పైన ఆగ్రహం తో ఉన్నాయి. కాగా.. తాజాగా స్టీల్ ప్లాంట్ నుంచి మిగిలిన సీఐఎస్ఎఫ్ (CISF) భద్రతా సిబ్బందిని పూర్తిగా ఉపసంహరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేయటంతో కొత్త చర్చ మొదలైంది.విశాఖ స్టీల్ ప్లాంట్ కు భద్రతగా ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని పూర్తిగా ఉప సంహరించుకుంటూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 17 నాటికి యూనిట్‌ను పూర్తిగా ఖాళీ చేయాలని కేంద్రం 3 నెలల గడువు ఇచ్చింది. ప్రస్తుతం అక్కడ 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బంది కొనసాగుతున్నారు. కాగా, 2024 వరకు స్టీల్ ప్లాంటోలో సుమారు 1500 మంది సీఐఎస్ఎఫ్ బలగాలు ఉండగా, ఆ తర్వాత దశలవారీగా సిబ్బందిని తగ్గిస్తూ వస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో ప్లాంట్ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 2026 నవంబరు 17 నుంచి సెక్యూరిటీ, ఫైర్ వింగ్‌లలో ఉన్న బలగాలను ఉపసంహరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి సీఐఎస్ఎఫ్కు రావాల్సిన బకాయిలన్నీ ముందుగా చెల్లించాలని కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.కొండా సురేఖ పై వేటు,హైకమాండ్ నిర్ణయం..? ఆ స్థానంలో ఆయనకే ఛాన్స్..!తాజా నిర్ణయం పై కార్మిక సంఘాల్లో చర్చఈ సీఐఎస్ఎఫ్ బలగాల ఉపసంహరణను ఉక్కు పరిశ్రమ అధికారులు అధికారికంగా నిర్ధారణ చేయాల్సి ఉంది. అయితే, గతంలో 400 మంది వరకు సీఐఎస్ఎఫ్, సెక్యూరిటీ, ఫైర్ విభాగం సిబ్బందిని తొలగించగా.. వారి స్థానంలో ఏపీ స్పెషల్ ఫోర్స్ బలగాలను నియమించారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో కొనసాగుతున్న 350 మంది సెక్యూరిటీ, 120 మంది ఫైర్ సేఫ్టీ సిబ్బందిని ఉపసంహరించాలని