
ఫిఫా సెమీఫైనల్స్ రేసు షురూ.. గోల్డెన్ బూట్ కోసం గట్టి ఫైట్.. రికార్డుల వేటలోస్టార్ప్లేయర్స్
ఫిఫా వరల్డ్ కప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన చివరి దశకు చేరుకుంది. చరిత్రలోనే మొదటిసారిగా 48 జట్లతో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ ప్రస్తుతం క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ రేసుకు సిద్ధమైంది. ఇప్పటివరకు జరిగిన 96 మ్యాచ్‌ల్లో ఏకంగా 280 గోల్స్ నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లలో ప్లేయర్స్ చూపించిన పర్ఫార్మెన్స్, రికార్డులు ఫుట్‌బాల్ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈసారి గోల్డెన్ బూట్ రేస్ ఎన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. నలుగురు టాప్ స్టార్ ప్లేయర్స్ మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. కైలియన్ ఎంబాపె, ఎర్లింగ్ హాలాండ్, లియోనెల్ మెస్సీ, హ్యారీ కేన్ ఈ రేసులో దూసుకుపోతున్నారు. గత శతాబ్ద కాలంలో కేవలం కొద్దిమంది ప్లేయర్స్ మాత్రమే ఒకే వరల్డ్ కప్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ గోల్స్ చేశారు. 2006లో మిరోస్లావ్ క్లోజ్ 5 గోల్స్‌తో, 2010లో థామస్ ముల్లర్ 5 గోల్స్‌తో గోల్డెన్ బూట్ గెలిచారు. 2018లో హ్యారీ కేన్ 6 గోల్స్, 2022లో ఎంబాపె 8 గోల్స్ చేయడం పెద్ద రికార్డుగా అనిపించింది. కానీ ఈ ఏడాది ఆ నంబర్స్ కేవలం స్టార్టింగ్ పాయింట్ మాత్రమేలా కనిపిస్తున్నాయి. ఈ నలుగురిలో గోల్డెన్ బూట్ ఎవరు కొడతారనేది ఇప్పుడు బిగ్గెస్ట్ సస్పెన్స్. ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగిన మైఖేల్ ఒలిసే ప్రస్తుతం ఫ్రాన్స్ జట్టు తరఫున వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు. బేయర్న్ మ్యూనిచ్ ఫార్వర్డ్ అయిన ఒలిసే చాలా సైలెంట్‌గా ఉంటాడు. లైమ్‌లైట్‌కు దూరంగా ఉండటానికి ఇష్టపడతాడు. అతనికి చెస్ ఆడటం అంటే చాలా ఇష్టం. గోల్స్ చేసినప్పుడు కూడా పెద్దగా సెలబ్రేట్ చేసుకోడు. అంతేకాదు, ఏ స్పోర్ట్స్‌వేర్ లేదా బూట్ కంపెనీలతోనూ అతనికి ఎలాంటి డీల్స్ లేవు. బేయర్న్ మ్యూనిచ్ క్లబ్ తరఫున ఒకే సీజన్లో 25 గోల్స్, 28 అసిస్ట్‌లతో అదరగొట్టిన ఒలిసే, ప్రపంచంలోని బెస్ట్ ప్లేయర్స్‌లో ఒకడిగా మారాడు. ఈ క్వార్టర్ ఫైనల్స్ రేసుకు వచ్చేసరికి
