
ఎన్ని రికార్డులున్నా వేస్ట్.. వరల్డ్ కప్ట్రోఫీని ముద్దాడలేకపోయిన ఐదుగురు లెజెండరీ ఫుట్ బాలర్లు వీరే
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఫిఫా (FIFA) వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడటం అనేది ప్రతి ఆటగాడి కెరీర్లో ఒక అతిపెద్ద కల. ఎంతోమంది లెజెండరీ ప్లేయర్లు క్లబ్ లెవెల్లో లెక్కలేనన్ని ట్రోఫీలు గెలిచారు, రికార్డులు బద్దలు కొట్టారు, కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. కానీ, వరల్డ్ కప్ విషయానికి వస్తే మాత్రం అదృష్టం వారిని అస్సలు వరించలేదు. ఫిఫా వరల్డ్ కప్ 2026 లో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సూపర్ స్టార్ ఫుట్‌బాలర్ల వరల్డ్ కప్ కల ఎప్పటికీ నెరవేరకుండా ముగిసిపోయింది. మొదట నార్వే జట్టు బ్రెజిల్‌ను ఓడించి నేమార్ జూనియర్ గుండె పగిలేలా చేసింది. ఆ మరుసటి రోజే స్పెయిన్ జట్టు పోర్చుగల్‌ను ఓడించి, సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఎప్పటికీ మర్చిపోలేని గాయాన్ని మిగిల్చింది. క్లబ్, ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో కలిపి కెరీర్లో అత్యధికంగా 976 గోల్స్ చేసినప్పటికీ, గత ఎన్నో ఏళ్లుగా రొనాల్డో కంటున్న ఆ ఒక్క కల మాత్రం కలగానే మిగిలిపోయింది. నేమార్, రొనాల్డోలతో పాటు తమ కెరీర్లో అద్భుతమైన రికార్డులు ఉన్నా, ఎప్పుడూ వరల్డ్ కప్ గెలవలేకపోయిన ఆ ఐదుగురు లెజెండరీ ఫుట్‌బాలర్లు ఎవరో మీకు తెలసా? ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాళ్లలో క్రిస్టియానో రొనాల్డో ఒకరు. ఆయన క్లబ్ ఫుట్‌బాల్‌లో యూఈఎఫ్ఏ (UEFA) ఛాంపియన్స్ లీగ్, డొమెస్టిక్ లీగ్ టైటిల్స్, ప్రతిష్ఠాత్మక బ్యాలన్ డి ఓర్ వంటి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా పోర్చుగల్ జట్టుకు యూరో కప్, యూఈఎఫ్ఏ నేషన్స్ లీగ్ ఛాంపియన్షిప్లను కూడా అందించారు. కానీ, ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ మాత్రం ఆయనకు ఎప్పుడూ అందలేదు. 2006 నుండి 2026 వరకు రొనాల్డో మొత్తం 6 వరల్డ్ కప్‌లు ఆడారు. ఇందులో ఆయన అత్యుత్తమ ప్రదర్శన 2006 లో నమోదైంది, అప్పుడు పోర్చుగల్ సెమీఫైనల్ వరకు దూసుకెళ్లింది. 2018 లో స్పెయిన్‌పై రొనాల్డో చేసిన హాట్రిక్ గోల్స్
