
ఒక్క రెడ్ కార్డ్ .. మిలియన్ డాలర్ల పిజ్జాలుఫ్రీ
ఇంటర్నెట్ డెస్క్: డొమినోస్ పిజ్జా.. అంటే తెలియనివారుండరు. ప్రపంచవ్యాప్తంగా ఔట్లెట్లను కలిగిన సంస్థ. తాజాగా ఈ సంస్థ ఒక మిలియన్ డాలర్ల విలువైన పిజ్జాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఎందుకో తెలియాలంటే ఇది చదివేయండి మరి.. ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ (FIFA World Cup 2026) జోరుగా సాగుతోంది. రౌండ్ 32 పోటీలు జరుగుతున్నాయి. ఆతిథ్య దేశాల్లో ఒకటైన అమెరికా (USA) కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. నాకౌట్లో బోస్నియాతో అమెరికా తలపడింది. అందులో 2-0 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అమెరికా ఆటగాడు ఫోలారిన్ బలోగన్ రెడ్ కార్డును ఎదుర్కొన్నాడు. అంతకుముందు అతడొక గోల్ చేసి తన జట్టుకు లీడ్ అందించాడు. అయితే, ఆట 64వ నిమిషంలో బలోగన్‌కు రెడ్ కార్డు ఎదురుకావడంతో అతడు డగౌట్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. పది మందితోనే ఆడిన అమెరికాపై అదేమంత ప్రభావం చూపించలేదు. కానీ, అమెరికా ఆటగాడికి రెడ్ కార్డు రావడంతో పిజ్జా సంస్థ డొమినోస్ ఇప్పుడు మిలియన్ డాలర్ల విలువైన పిజ్జాలను ఫ్రీగా పంపిణీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే.. గత మే నెలలో ఈ సంస్థ ఓ ప్రకటన చేసింది. అమెరికా ప్లేయర్లలో ఎవరికైనా రెడ్‌కార్డు వస్తే తాము పిజ్జాలను ఉచితంగా పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఇప్పుడు రెడ్ కార్డు రావడంతో ఇచ్చిన మాట నిలబట్టుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీ (Dominos) చేసిన ప్రకటన ప్రకారం.. అభిమానులు ఎవరైనా సరే జూన్ 10లోగా సంస్థ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అదే విధంగా రివార్డ్స్ ప్రోగ్రామ్‌లో ఎన్రోల్ అయి ఉండాలి. ఫ్రీ ఎమర్జెన్సీ పిజ్జా కోసం ఎంపికైన వారు ఆ ఆఫర్‌ను ఈ ఏడాది చివరి వరకూ వినియోగించుకోవచ్చు. ఒక మిలియన్ డాలర్ల విలువైన దాదాపు 60వేల పిజ్జాలను ఈ ఆఫర్ కింద సంస్థ ఉచితంగా పంపిణీ చేయనుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల










.webp)




































