ఇన్వెస్టర్లకు పండగే.. మ్యూచువల్ ఫండ్స్ ఒకేసారి 8 కొత్త పథకాలు.. రూ.100 నుంచే పెట్టుబడి షురూ
Mutual fund NFOs: ఈవారం మ్యూచువల్ ఫండ్స్‌లో 8 కొత్త ఫండ్స్ సబ్స్క్రిప్షన్ కోసం వస్తున్నాయి. అందులో 5 ఫండ్స్ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 17వ తేదీన మొదలవుతోంది. తమ పోర్ట్ ఫోలియోల్లోని ఖాళీలను పూరించి ఇన్వెస్టర్లను ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త ఫండ్స్‌ను ఫండ్ హౌసులు తీసుకొస్తున్నాయి. ఇందులో రెండు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. నిప్పాన్ ఇండియా ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ ఓమ్ని ఫండ్ ఆఫ్ ఫండ్ (Nippon India Income Plus Arbitrage Omni FOF), క్వాంట్ ఇన్కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (Quant Income Plus Arbitrage Active FoF) సబ్స్క్రిప్షన్ కోసం ఆగస్టు 17న వస్తున్నాయి. ఆగస్టు 31 వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వీటిల్లో కనీస పెట్టుబడి రూ. 500, రూ. 5000గా నిర్ణయించారు.ఇక ఐటీఐ మల్టీ అసెట్ అలకేషన్ ఫండ్ (ITI Multi Asset Allocation Fund) సబ్స్క్రిప్షన్ సైతం ఆగస్టు 17న మొదలై ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 5000గా నిర్ణయించారు. క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ (Quantum Flexi Cap Fund) న్యూ ఫండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 21వ తేదీన మొదలై సెప్టెంబర్ 4వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో కనీస పెట్టుబడి రూ.500గా నిర్ణయించారు.ఇన్వెస్కో ఇండియా ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్ (Invesco India Pharma And Healthcare Fund) సబ్స్క్రిప్షన్ ఆగస్టు 18వ తేదీన ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000గా నిర్ణయించారు. క్వాంట్ సిల్వర్ ఈటీఎఫ్ (Quant Silver ETF) కొత్త ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఆగస్టు 17వ తేదీన ప్రారంభమై ఆగస్టు 19తోనే ముగుస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 2000గా నిర్ణయించారు.ఎడెల్వేయిస్ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్ (Edelweiss Ultra Short Term Fund)