
క్రికెట్ లో డబుల్‌హ్యాట్రిక్ అంటే ఏంటి? 6 బంతుల్లో 6 వికెట్లు తీయాలా.. అసలు రూల్స్ ఇవే
Double Hat-Trick : క్రికెట్ మ్యాచ్‌లు చూసేటప్పుడు లేదా ఆడేటప్పుడు మనం తరచుగా హ్యాట్రిక్ అనే పదాన్ని వింటూ ఉంటాం. సాధారణంగా ఒకే ఓవర్లో లేదా వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొడితే దానిని హ్యాట్రిక్ అంటారు. అలాగే బ్యాటింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు లేదా మూడు సిక్సర్లు కొట్టినా హ్యాట్రిక్ అని పిలుస్తుంటారు. అయితే, బౌలింగ్‌లో వీటన్నింటికంటే ఎంతో అరుదైన, కష్టతరమైన మరో పదం ఉంది.. అదే డబుల్ హ్యాట్రిక్. చాలా మంది డబుల్ హ్యాట్రిక్ అంటే ఒకే ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీయడమేమో అని తప్పుగా భావిస్తుంటారు. కానీ, క్రికెట్ నియమాల ప్రకారం వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొడితే దానిని డబుల్ హ్యాట్రిక్ అంటారు. మొదటి మూడు బంతుల్లో హ్యాట్రిక్ పూర్తయిన తర్వాత, ఆ తర్వాతి బంతికే నాలుగో వికెట్ తీస్తే అది డబుల్ హ్యాట్రిక్‌గా మారుతుంది. ప్రస్తుతం అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ 2026లో శ్రీలంకకు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ దాసున్ శనక ఈ అరుదైన డబుల్ హ్యాట్రిక్ రికార్డును నమోదు చేసి వార్తల్లో నిలిచాడు. సీటెల్ ఓర్కాస్ జట్టు తరఫున ఆడుతున్న శనక, టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే నమోదైన మొట్టమొదటి డబుల్ హ్యాట్రిక్ ఇదే కావడం విశేషం. ఈ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో శనక తన జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఉత్కంఠభరితమైన చివరి ఓవర్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు విజయానికి 15 పరుగులు కావాలి. క్రీజులో డెవాన్ ఫెరీరా, శుభమ్ వంటి ప్రమాదకరమైన బ్యాటర్లు ఉన్నారు. సీటెల్ ఓర్కాస్ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను దాసున్ శనకకు అప్పగించాడు. శనక వేసిన మొదటి రెండు బంతుల్లో టెక్సాస్ బ్యాటర్లు 5 పరుగులు



