
రిజిస్టర్మ్యారేజ్ చెల్లదు
హిందూ వివాహాల చెల్లుబాటుపై హైకోర్టు అత్యంత కీలకమైన, సంచలన తీర్పును వెలువరించింది. మతాచారాల ప్రకారం సాంప్రదాయక కర్మలు, సప్తపది (పవిత్ర అగ్ని సాక్షిగా వధూవరులు ఏడు అడుగులు నడవడం) వంటి క్రతువులు నిర్వహించకుండా, కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన ఆ వివాహం చట్టబద్ధంగా చెల్లదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది కేవలం పాటలు, డాన్సులు లేదా విందు, వినోదాలతో ముగిసిపోయే వేడుక కాదని, భారతీయ సమాజంలో అదొక అత్యున్నత పవిత్ర సంస్కారమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.యూకే (UK) లో నివసిస్తున్న కౌశల్ సోనార్ అనే యువకుడి అప్పీలును విచారించిన జస్టిస్ ఇలేష్ వోరా, జస్టిస్ ఆర్.టి. వాచ్ఛానీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ సంచలన తీర్పును ఇచ్చింది. కౌశల్ సోనార్ తనకు తెలియకుండా, ఎటువంటి హిందూ సాంప్రదాయాలు నిర్వహించకుండా, మోసపూరితంగా సంతకాలు సేకరించి సృష్టించిన వివాహ ధృవీకరణ పత్రాన్ని (మ్యారేజ్ సర్టిఫికేట్) సవాలు చేస్తూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.అయితే అక్కడ అతనికి చుక్కెదురు కావడంతో హైకోర్టులో అప్పీల్ చేశాడు. సదరు యువతి కూడా తామిద్దరం ఎప్పుడూ భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని, ఎలాంటి వివాహ క్రతువులు జరగలేదని కోర్టు ముందు అంగీకరించింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు ఆ వివాహాన్ని రద్దు చేసింది. Divorce: ఆ రూల్ ఇక తప్పనిసరి కాదు..హైకోర్టు సంచలన తీర్పు!హిందూ వివాహ చట్టం సెక్షన్ 7 ఏం చెబుతోంది?హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం.. ఒక హిందూ వివాహం చట్టబద్ధంగా పరిపూర్ణమై, బంధాన్ని ఏర్పరచాలంటే ఆయా సంస్కృతులు, భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఉండే సాంప్రదాయక ఆచారాలను ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు గుర్తుచేసింది. ముఖ్యంగా అగ్ని సాక్షిగా నడిచే సప్తపది అనేదే హిందూ వివాహానికి పునాది అని కోర్టు స్పష్టం చేసింది. ఏడు అడుగుల క్రతువు పూర్తయినప్పుడే ఆ వివాహానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదా లభిస్తుందని ధర్మాసనం వివరించింది. ప్రస్తుత కేసులో