
ఏ హీరో ఒకే అంటారో అని వేచి చూస్తోందట! - తెలుగు సినిమాన్యూస్, రివ్యూస్
మానస వారణాసి (Manasa Varanasi) ఇటీవల మంచి గుర్తింపు పొందింది. అచ్ఛ తెలుగు అమ్మాయి. ఈ ఏడాది విడుదలైన కఫుల్ ఫ్రెండ్లీ (Couple Friendly) ఆమెకి మొదటి హిట్. ఆమె నటనకి కూడా పేరు వచ్చింది. సంక్రాంతికి హిట్ కొట్టిన హీరో శర్వానంద్ (Sharwanand) తాజాగా ‘జార్జ్ క్రిష్’ (George Krish) అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా మానస వారణాసి ని తీసుకున్నారు అని టాక్ నడుస్తోంది. కానీ ఆమె పేరు పరిశీలనకి వచ్చినప్పటికీ ఇంకా లాక్ చెయ్యలేదు. నిజానికి ఇందులో మొదట పూజా హెగ్దేను అనుకున్నారు. ఆ తర్వాత మమితా బైజు పేరు వినిపిచింది. కాయదు లోహర్, ప్రీతి ముకుందన్…ఇలా పలువురు భామలను సంప్రదించారు. కానీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ గా మానస వారణాసిని లాక్ చేసినట్టు టాక్ నడుస్తోంది. కానీ ఆమెని సైన్ చెయ్యలేదు అని ‘జార్జ్ క్రిష్’ పీఆర్ టీం తెలిపింది. మరి మానసకి నెక్స్ట్ పెద్ద ఆఫర్ ఏ హీరో సరసన వస్తుందో? ఎవరు ఒకే అంటారో?