.webp)
టిమ్స్ లో 6,278 ఉద్యోగాల భర్తీకిక్యాబినెట్ నిర్ణయం
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీఆర్‌జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసే అంశంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంలోని నిబంధనలపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయొద్దని ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని సమావేశంలో గుర్తుచేసుకుంది. మరోసారి తమ నిరసనను అధికారికంగా కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపే విధంగా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి, రాజ్యాంగ భావనలకు విరుద్ధమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలోని క్యాబినెట్ సబ్‌కమిటీ చేసిన సిఫారసులను మంత్రివర్గం పరిశీలించింది. ఇతర రాష్ట్రాలు కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాయా అనే అంశంపై అధికారులను ప్రశ్నించగా, అన్ని రాష్ట్రాలు అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలకు పని కల్పించే ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని 2026 జూలై 1 నుంచి రాష్ట్రంలో అమలు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే, చట్టంలోని నిబంధనలపై న్యాయపరంగా పోరాటం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నించాలని నిర్ణయించింది. 2. ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం..! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని ఇకపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అందించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు పథకాల అమలులో జవాబుదారీతనం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం