
యూకే ముక్కలు కాక తప్పదా ?!
1535 - 1542 హెన్రీ VIII కాలంలో వేల్స్ చట్టాల(Laws in Wales Acts) ద్వారా వేల్స్ ఇంగ్లండ్ లో విలీనం అయింది.

1535 - 1542 హెన్రీ VIII కాలంలో వేల్స్ చట్టాల(Laws in Wales Acts) ద్వారా వేల్స్ ఇంగ్లండ్ లో విలీనం అయింది.

అమెరికాలోని న్యూజెర్సీలో ఓ మహిళ తన భూమిని కాపాడుకునేందుకు ప్రభుత్వంతో న్యాయపోరాటానికి దిగారు. ఒక ప్రైవేట్ డెవలపర్ చేపట్టే భారీ హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం తన 2.4 ఎకరాల స్థలాన్ని 'ఎమినెంట్ డొమైన్' చట్టం కింద బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని మిడిల్ టౌన్షిప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, డాన్ రాబిన్సన్ అనే మహిళ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.సుమారు 23 ఏళ్ల క్రితం రాబిన్సన్ 40,000 డాలర్లకు ఈ భూమిని కొనుగోలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం 47,000 డాలర్లు పరిహారాన్ని ఆఫర్ చేస్తూ భూమిని అప్పగించాలని కోరుతోంది. అయితే, ఈ భూమిని తన పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించానని, దానిపై ఎలాంటి అప్పులు లేవని, విక్రయించే ఉద్దేశం అంతకన్నా లేదని రాబిన్సన్ స్పష్టం చేస్తున్నారు. ప్రతిపాదిత ప్రాజెక్టుకు తన భూమి ఒక చివరన ఉందని, దానిని మినహాయించి కూడా ప్రాజెక్టును పూర్తి చేసే అవకాశం ఉందని ఆమె వాదిస్తున్నారు.'ఇండియన్ ట్రెయిల్ రీడెవలప్మెంట్' పేరుతో ఒక ప్రైవేట్ సంస్థ సుమారు 340 ఇళ్లను నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల సరసమైన ధరలకే ఇళ్లు లభిస్తాయని, ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని మిడిల్ టౌన్షిప్ మేయర్ క్రిస్టోఫర్ లూస్నర్ పేర్కొన్నారు. అయితే, కేవలం ఒక ప్రైవేట్ లాభాపేక్ష సంస్థ కోసం భూమిని బలవంతంగా సేకరించడం ప్రజా ప్రయోజనం కిందకు ఎలా వస్తుందని రాబిన్సన్, ఆమె మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ డెవలపర్ల ప్రయోజనం కోసం భూసేకరణ చేపట్టడం చెల్లదని ఇటీవలే న్యూజెర్సీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా వారు గుర్తు
అమెరికాలో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో అమెరికా ప్రభుత్వం- పోలీసులు "జీరో టాలరెన్స్" వైఖరిని అవలంబిస్తారు. సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నట్లుగా, అమెరికాలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అమెరికాలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే అక్కడ సర్దుబాట్లు ఉండదు, రాజీపడే అవకాశమే లేదు. వారితో వాదించడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. చేస్తే విషయం ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు కారును ఆపిన క్షణం నుంచే తమ 'బాడీ కెమెరా' (Body Cam) ఆన్ చేసి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేస్తారు. సస్పెక్ట్కు నేలపై నడవమని చెప్పడం (Field Sobriety Test) లేదా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 0.08% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అక్కడికక్కడే చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి అరెస్ట్ చేస్తారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. DUI కేసు నమోదైతే మొదటిసారి నేరానికి కూడా భారీగా ఫైన్ తో పాటు క్రిమినల్ శిక్షలు పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం తీవ్రతను బట్టి $1,000 నుండి $10,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాదు మొదటిసారి నేరానికైనా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మద్యం మత్తులో యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా గాయాలైతే అది 'ఫెలోని' (Felony) నేరంగా మారి ఏళ్ల తరబడి జైలు శిక్షకు దారితీస్తుంది. కేసు వాదించడానికి లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులకు మరో $5,000 నుండి $15,000 వరకు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. DUI కేసు

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్లాట్‌ఫారమ్‌లు పిల్లలు, యువకుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయంటూ అమెరికాలోని 29 రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. లాభార్జనే ధ్యేయంగా యూజర్లను అడిక్ట్ చేసే ఆల్గారిథమ్‌లు, ఇన్ఫినిట్ స్క్రోలింగ్, పుష్ నోటిఫికేషన్లను మెటా ఉద్దేశపూర్వకంగా రూపొందించిందని, చిన్నారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరించిందనేవి ప్రధాన ఆరోపణలు. అమెరికాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో విచారణకు వచ్చిన ఈ కేసు టెక్ ప్రపంచంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ విచారణ ముగింపు కేవలం అమెరికాకే పరిమితం కాకుండా భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా బిగ్టెక్ కంపెనీల నియంత్రణకు దిశానిర్దేశం చేయనుంది. అమెరికా కోర్టు మెటాపై కఠిన పరిమితులు విధిస్తే యూరోపియన్ యూనియన్, భారత్ వంటి దేశాలు కూడా తమ వద్ద ఉన్న డిజిటల్ భద్రతా చట్టాలను మరింత కఠినతరం చేసేందుకు ఇది బలమైన నమూనాగా మారుతుంది. ఇన్ఫినిట్ స్క్రోలింగ్ తొలగింపు, వయసు గుర్తింపు నిబంధనలు, ఆటోమేటిక్ టైమ్ లిమిట్స్ వంటి ప్రతిపాదనలను మెటా అమలు చేయాల్సి వస్తే ఆ మార్పులు గ్లోబల్ కోడింగ్‌లో భాగంగా ఇతర దేశాల యూజర్లకూ వర్తిస్తాయి. అత్యధిక సోషల్ మీడియా వినియోగదారులు ఉన్న భారత్‌లో ‘డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (డీపీడీపీ)’ అమలులోకి వస్తున్న తరుణంలో పిల్లల డేటా రక్షణపై ఈ తీర్పు కీలక సూచికగా నిలుస్తుంది. ఈ విచారణలో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా సాక్ష్యమివ్వనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సురక్షితమైన డిజిటల్ సమాజం వైపు ప్రపంచం వేస్తున్న అడుగుల్లో ఈ చట్టపరమైన పోరాటం ఒక కీలక మైలురాయి కానుందని నిపుణులు చెబుతున్నారు. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు.. ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) పీవీ సింధూ

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ సంగం డెయిరీ రూ. 10 కోట్ల సివిల్ పరువునష్టం దావా వేసింది. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.రైతుల నుంచి పాలు సేకరించకుండానే సంగం డెయిరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) నెయ్యి సరఫరా చేస్తోందని ఇటీవల సజ్జల ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను సంగం డెయిరీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని రైతుల నుంచి ఆవు పాలను సేకరించి, అత్యంత నాణ్యమైన నెయ్యిని టీటీడీకి అందిస్తున్నామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.ఈ నేపథ్యంలో, సంగం డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టును ఆశ్రయించారు. సజ్జల చేసిన వ్యాఖ్యలు సంస్థ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయడమే కాకుండా, టీటీడీకి సరఫరా చేసే నెయ్యి విషయంలో భక్తుల మనోభావాలను కూడా గాయపరిచాయని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ పిటిషన్లో సజ్జలతో పాటు, ఇదే తరహా ఆరోపణలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు, ఈ వ్యాఖ్యలను ప్రసారం చేసిన సాక్షి టీవీ, ఇతర సోషల్ మీడియా వేదికలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సంస్థ ప్రతిష్ఠను కాపాడుకునేందుకే న్యాయపరమైన చర్యలు చేపట్టినట్లు సంగం డెయిరీ యాజమాన్యం వెల్లడించింది

అమెరికాలోని 29 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కలిసి ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో చారిత్రాత్మక దావా వేశారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు పిల్లలు మరియు యువతను సోషల్ మీడియాకు బానిసలుగా మారుస్తున్నాయనే తీవ్రమైన ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఆగస్టు 18 నుంచి ప్రారంభమైన ఈ సుదీర్ఘ విచారణలో మెటా సంస్థకు సుమారు 200 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹19 లక్షల కోట్ల వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాలిఫోర్నియా, కొలరాడో, కెంటకీ, న్యూజెర్సీ రాష్ట్రాలు ప్రధానంగా నాయకత్వం వహిస్తున్న ఈ కేసులో మెటాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ ప్లాట్‌ఫామ్‌లలో యూజర్లు ఎక్కువ సమయం గడిపేలా ఎండ్లెస్ స్క్రోల్, ఆటోప్లే, నోటిఫికేషన్లు మరియు ప్రత్యేక అల్గారిథమ్‌లను మెటా కావాలనే డిజైన్ చేసిందని వాదిస్తున్నారు. దీనితో పాటు తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేకుండానే పిల్లల డేటాను సేకరించి సీఓపీపీఏ చట్ట నిబంధనలను సైతం ఈ సంస్థ తీవ్రంగా ఉల్లంఘించిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఫీచర్ల కారణంగానే టీనేజర్లలో ఆందోళన, డిప్రెషన్ మరియు ఆత్మహత్య ధోరణులు విపరీతంగా పెరుగుతున్నాయని రాష్ట్రాల లాయర్లు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో కాలిఫోర్నియా డిప్యూటీ అటార్నీ జనరల్ మేగన్ ఓ’నీల్ స్పందిస్తూ యూజర్లను హుక్ చేయడం, డేటా సేకరించడం మరియు నిజాలను దాచడమే మెటా వ్యాపార నమూనా అని తీవ్రంగా విమర్శించారు. ఇదిలా ఉండగా ఇన్‌స్టాగ్రామ్‌ను నేరుగా ఒక ప్రమాదకరమైన మాదకద్రవ్యంతో పోల్చిన కంపెనీ అంతర్గత చాట్లను కూడా ఈ కేసులో ప్రధాన సాక్ష్యంగా సమర్పించారు. అయితే మెటా యాజమాన్యం తమపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను చాలా గట్టిగా ఖండించింది. ఫలితంగా సోషల్ మీడియా బానిసత్వం అనేది శాస్త్రీయంగా స్థాపితమైన మానసిక రుగ్మత కాదని, తమ ప్లాట్‌ఫామ్‌లు యువతకు ఎంతో సానుకూల అనుభవాలను కూడా ఇస్తున్నాయని మెటా తరఫు న్యాయవాది పాల్ ష్మిత్

సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా ఫెడరల్ కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. ఇన్స్టాగ్రామ్ కార్యకలాపాల్లో పిల్లల భద్రతను పూర్తిగా విస్మరించి, కేవలం యూజర్ల సంఖ్య (గ్రోత్), వారి ఎంగేజ్మెంట్కే పెద్దపీట వేశారని కంపెనీ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ అర్తురో బెజర్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు. యువత మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ మెటాపై పలు అమెరికా రాష్ట్రాలు దాఖలు చేసిన కేసులో ఆయన సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది.మెటాలో ఉద్యోగుల పనితీరు, వారికి ఇచ్చే జీతభత్యాలు వంటివి పూర్తిగా ప్లాట్‌ఫామ్‌పై యూజర్లు ఎంత సమయం గడుపుతున్నారు, వారి సంఖ్య ఎంత పెరుగుతోంది అనే కొలమానాలపైనే ఆధారపడి ఉండేవని బెజర్ కోర్టుకు వివరించారు. "ఈ నేపథ్యంలో భద్రత అనేది చివరి ప్రాధాన్యతగా మిగిలిపోయింది" అని ఆయన స్పష్టం చేశారు. 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో ఇన్స్టాగ్రామ్ "డోంట్ ఆస్క్, డోంట్ టెల్" (అడగవద్దు, చెప్పవద్దు) అనే విధానాన్ని అనుసరించిందని, వారి ఉనికిని తెలిసి కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.ఇన్‌స్టాగ్రామ్‌ను 13 ఏళ్ల లోపు వయసున్న పదివేల మంది పిల్లలు వాడుతున్నారన్న విషయం కంపెనీలో చాలా మందికి తెలిసిన సాధారణ విషయమని బెజర్ పేర్కొన్నారు. నకిలీ ఖాతాలను గుర్తించడానికి మెటా వద్ద అధునాతన వ్యవస్థలు ఉన్నప్పటికీ, 13 ఏళ్ల లోపు పిల్లల వయసును గుర్తించి, వారిని నియంత్రించేందుకు ఉద్యోగులకు ఎలాంటి లక్ష్యాలు గానీ, కొలమానాలు గానీ లేవని ఆయన తెలిపారు. ఇది కంపెనీ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని అన్నారు.2023లో కాలిఫోర్నియా, కొలరాడో సహా మొత్తం

ఏదైనా ఖాతాను బ్లాక్ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్ తీసుకువచ్చిన కొత్త... మెటా, ఎక్స్‌లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఏదైనా ఖాతాను బ్లాక్ చేస్తే.. ఎవరి అభ్యర్థన మేరకు, ఏ చట్టపరమైన కారణాల వల్ల ఆ ఖాతాను తొలగించారు అనే వివరాలను యూజర్లకు వెల్లడించేలా ఎక్స్ తీసుకువచ్చిన కొత్త నిబంధనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏ సోషల్ మీడియా సంస్థ అయినా సరే, భారత్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పుడు ఇక్కడి చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. మరోవైపు, ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌నూ సహించేది లేదని మెటా సంస్థకు తేల్చి చెప్పింది. బాలల లైంగిక వేధింపుల మెటీరియల్(సీఎ్సఏఎం) వ్యాప్తికి కారణమయ్యే సోషల్ మీడియా వేదికలతో పాటు వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోల్పోతారని హెచ్చరించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి.. సుప్రీం కీలక ఆదేశాలు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం

ప్రముఖ టెక్ దిగ్గజం మెటాపై అమెరికాలో సంచలన కేసు నమోదైంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పిల్లలకు, టీనేజర్లకు హాని కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఈ విచారణ ప్రారంభమైంది. ఏకంగా 1.4 ట్రిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 133 లక్షల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ ఫెడరల్ కోర్టులో మంగళవారం ఈ కీలక విచారణ అధికారికంగా మొదలైంది. ఈ వివాదానికి బీజం 2023లో పడింది. అప్పట్లో దాదాపు 30 అమెరికన్ రాష్ట్రాలు మెటాపై ఉమ్మడిగా పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా కాలిఫోర్నియా, కొలరాడో, కెంటుకీ, మరియు న్యూజెర్సీ రాష్ట్రాలు ఈ కేసులో ప్రధాన వాదిగా నిలిచాయి. 13 ఏళ్ల లోపు పిల్లల సమాచారాన్ని తల్లిదండ్రుల అనుమతి లేకుండా సేకరించడం ద్వారా 'కాపా' చట్టాన్ని ఉల్లంఘించారని రాష్ట్రాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీచర్లపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ఫినిట్ స్క్రోల్, లైక్స్, నోటిఫికేషన్లు, మరియు రికమెండేషన్ సిస్టమ్స్ వంటి ఫీచర్లను మెటా లాభాపేక్షతో రూపొందించిందని పిటిషనర్ల వాదన. దీంతో యువత ఈ వేదికలకు బానిసలై, తీవ్రమైన ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని కోర్టుకు వివరించారు. ఇదిలా ఉండగా, మెటా ఈ ఆరోపణలను కొట్టివేస్తూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ భారీ జరిమానా పట్ల మెటా యాజమాన్యం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం మెటా మార్కెట్ విలువకు సమానమని, వాస్తవాలకు దూరంగా ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ మార్క్ జకర్బర్గ్, ఇన్స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోసెరిలను కోర్టు విచారణకు పిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే న్యూ మెక్సికో కేసులో మెటాకు సుమారు రూ. 942 కోట్ల జరిమానా పడటం గమనార్హం. రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ మరింత వేడెక్కనుంది. టెక్ దిగ్గజాలు

దేశంలో ఎన్నికల సంస్కరణల కోసం తాను ప్రతిపాదించిన 'సేవ్ అమెరికా చట్టం' ఆమోదం పొందడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపారు. అమెరికా ఫెడరల్ ఎన్నికలలో ఓటు వేయడానికి కఠినమైన ఫోటో గుర్తింపు కార్డు (ఓటర్ ఐడీ), పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేయాలని ఆయన మరోసారి డిమాండ్ చేశారు.సోమవారం తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఈ మధ్య నన్ను ప్రశ్నించారు" అని ట్రంప్ అందులో పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన భారత సార్వత్రిక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. 64.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, వారిలో ప్రతి ఒక్కరూ ఫొటో గుర్తింపు కార్డు చూపించారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు ఒక శాతం కంటే తక్కువేనని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో "మనం తక్షణమే 'సేవ్ అమెరికా చట్టాన్ని' ఆమోదించాలి" అని ట్రంప్ పిలుపునిచ్చారు.'సేఫ్‌గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ యాక్ట్'గా పిలిచే ఈ బిల్లు ప్రకారం, ఫెడరల్ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవడానికి పౌరసత్వానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఓటు వేసేటప్పుడు తప్పనిసరిగా ఫొటో ఐడీ చూపించాలి. మెయిల్-ఇన్ ఓటింగ్‌పై కూడా కఠిన నిబంధనలు ఉంటాయి. ఈ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించినా, సెనెట్‌లో మాత్రం ముందుకు కదల్లేదు. ప్రస్తుతం సెనెట్ విరామంలో

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తూ రూపొందిస్తున్న అశ్లీల కంటెంట్, డీప్‌ఫేక్ వీడియోలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన పర్సనాలిటీ రైట్స్ కాపాడాలని కోరుతూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఈ మేరకు న్యాయమూర్తి అనూప్ జైరాం భంభానీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సెలబ్రిటీల పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఈ తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలోనూ పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత హక్కుల కోసం ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జాన్వీ కపూర్ తరపున వాదించిన న్యాయవాదులు, ఆమె ప్రతిష్టను దిగజార్చేలా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో మెటా సంస్థ న్యాయస్థానానికి వివరణ ఇస్తూ, ఇప్పటికే పిటిషనర్ 4,000కు పైగా యూఆర్ఎల్స్ను సమర్పించారని వెల్లడించింది. అయితే, అందులో ఉన్న ప్రతి కంటెంట్ అభ్యంతరకరంగా లేదని మెటా తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, పిటిషన్లలో పేర్కొన్న కంటెంట్‌ను స్పష్టంగా వర్గీకరించి సమర్పించాలని కోర్టు పిటిషనర్ వైపు ఉన్న వారికి సూచించింది. మరోవైపు ఫ్యాన్ పేజీల విషయంలో కోర్టు ఒక సమతుల్య వైఖరిని ప్రదర్శించింది. ప్రతి ఫ్యాన్ పేజీని క్రిమినల్‌గా పరిగణించలేమని, కొన్ని పోస్ట్‌లు వ్యంగ్యంగా లేదా విమర్శనాత్మకంగా ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫలితంగా అన్ని ఫ్యాన్ పేజీలపై ఒకేసారి నిషేధం విధించడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసం లేదా వాణిజ్యపరంగా ఆమె పేరును వాడుకునే పేజీలపై మాత్రమే కఠిన చర్యలు ఉంటాయని కోర్టు తేల్చి చెప్పింది. ముగింపుగా, అశ్లీల కంటెంట్‌ను తొలగించేలా కోర్టు ఇచ్చిన ఆదేశాలు జాన్వీ కపూర్‌కు భారీ

హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే.. మూడు హిట్ అండ్ రన్ కేసులు నమోదు అయ్యాయి. హైదర్షా కోట్ ఘటనలో ఆర్మీ జవాన్ మృతి చెందగా.. కొండాపూర్ ప్రమాదంలో వనపర్తికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. బాలాపూర్ ఘటనలోనూ ఒకరు మృతి చెందారు. ఈ ఘటనల్లో రెండింటిలో.. నిందితులు ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రియాంక కేసు విషాదాంతమైన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరిగిన ఈ కేసులోనూ నిందితులు మద్యం సేవించిన స్థితిలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు దేశం నలుమూలాల రోజు నమోదు అవుతూనే ఉన్నాయి. ఏరకంగా చూసుకున్నా.. మద్యం మత్తులో నిర్లక్ష్యం.. కుటుంబాలకు జీవితాంతం తీరని విషాదాన్నే మిగులుస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాలు మద్యం తాగి వాహనం నడపడాన్ని సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా చూడవు. అది ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన నేరంగా పరిగణిస్తాయి. ముఖ్యంగా ప్రమాదం జరిగి మరణాలు సంభవిస్తే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయి. అమెరికాలో మద్యం సేవించి వాహనం నడపడం (DUI/DWI) తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రాష్ట్రాన్ని బట్టి చట్టాలు మారినా.. జరిమానాలు, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జైలు శిక్ష వంటి చర్యలు ఉంటాయి. ప్రమాదంలో మరణం జరిగితే కేసు తీవ్రత మరింత పెరుగుతుంది. బ్రిటన్‌లోనూ డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ మరణానికి కారణమైతే దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించి దీర్ఘకాల జైలు శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ నిషేధం, భారీ జరిమానాలు కూడా ఉంటాయి. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి దేశాల్లోనూ మద్యం సేవించి డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటారు. సింగపూర్‌లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించే విధానం ఉంది. కొన్ని సందర్భాల్లో వాహనం స్వాధీనం చేసుకునే చర్యలు కూడా ఉంటాయి. లెక్కలు చెబుతున్న భయానక నిజం

ప్రపంచీకరణ పెరిగిన ఈ రోజుల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి సమాచారం, సాంకేతికత, ఆస్తులతో పాటు ఆర్థిక వనరులు సులభంగా మారుతున్నాయి. విద్య, వైద్యం, విపత్తు సహాయం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాలలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలకు (NGOలు) విదేశీ విరాళాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. భారత్‌లో కూడా అనేక సంస్థలు ఈ విదేశీ నిధులతో సామాజిక అభివృద్ధి పనులు చేపడుతున్నాయి. అయితే, విదేశాల నుంచి వచ్చే డబ్బు ఏ పనులకు ఖర్చు అవుతోంది? దానివల్ల దేశ భద్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థలకు ఏమైనా ప్రమాదం ఉందా? అని చూడటం ప్రభుత్వాల బాధ్యత. అందుకే ఈ విదేశీ నిధులను క్రమబద్ధీకరించడానికి మన దేశంలో 'ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్' (FCRA) అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ' ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు 2026' ప్రవేశపెట్టడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ, రగడ జరుగుతోంది. ఎఫ్సీఆర్ఏ అనేది భారత్‌లోని వ్యక్తులు, సంస్థలు, ఎన్జీవోలు, ట్రస్టులు విదేశాల నుంచి విరాళాలు లేదా నిధులు స్వీకరించడాన్ని నియంత్రించే ఒక కేంద్ర చట్టం. దీనిని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుంది. ఈ చట్టం ఎవరెవరు విదేశీ నిధులు తీసుకోవచ్చు, ఏ నిబంధనలు పాటించాలి, ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టంగా చెబుతుంది. • పారదర్శకత: విదేశీ విరాళాలు పొందే ప్రతి సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. నిర్దేశిత బ్యాంకు ఖాతా ద్వారానే డబ్బులు తీసుకోవాలి. • జవాబుదారీతనం: ప్రతి ఏటా వార్షిక ఆడిట్ రిపోర్టులను ఆన్లైన్లో సమర్పించాలి. ఎంత డబ్బు వచ్చింది, ఎవరు ఇచ్చారు, దేనికి ఖర్చు చేశారో పూర్తి వివరాలు వెల్లడించాలి. • సార్వభౌమాధికార రక్షణ: దేశ భద్రతకు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేలా విదేశీ నిధులు వాడకుండా నిరోధించడం. • పరిమితులు: రాజకీయనాయకులు, ఎన్నికల అభ్యర్థులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉద్యోగులు, పత్రికా సంపాదకులు విదేశీ నిధులు తీసుకోకూడదు. ఎఫ్సీఆర్ఏ చట్టం

భారత ప్రధాన నరేంద్ర మోదీ శనివారం రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్లో మాట్లాడారు. తనకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సంభాషణ సందర్భంగా భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు చేపట్టాల్సిన కీలక చర్యలపై వారు చర్చించారు. దీనితో పాటు జేడీ వాన్స్-సెకండ్ లేడీ ఉషా వాన్స్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.రాజ్యతంత్రంలో రాచఠీవి.. మన నెమళ్లు ఇక ఐక్యరాజ్యసమితిలో విదేశీ నిధుల చట్టం వివాదం నేపథ్యం భారత్‌లోని ఎన్జీఓలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, మతపరమైన సంస్థలకు అందే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) ప్రతిపాదిత సవరణలపై ఆమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఫోన్ సంభాషణ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చట్ట సవరణలు మత సంస్థలపై ప్రభావం చూపిస్తాయని రిలే మూర్ కామెంట్ చేయగా.. చట్టసభల వ్యవహారాలు భారత అంతర్గత అంశాలని, అమెరికా సహా పలు దేశాల్లో విదేశీ నిధులను నియంత్రించే చట్టాలు అమల్లో ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ క్షణాన్ని ఆస్వాదించండి! యువతకు మోదీ బిగ్ మెసేజ్..గతంలో ఫోన్ సంభాషణను గుర్తుచేసుకున్న నేతలు మే 2025లో పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో జేడీ వాన్స్, ప్రధాని మోదీ మధ్య జరిగిన చివరి ఫోన్ సంభాషణను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భారత్‌పై పాకిస్తాన్ భారీ దాడికి ప్లాన్ చేస్తోందని జేడీ వాన్స్ హెచ్చరించగా.. మా స్పందన అంతకంటే మరింత బలంగా, తీవ్రంగా ఉంటుంది అని తానిచ్చిన సమాధానాన్ని ప్రధాని మోదీ గతంలో లోక్‌సభ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే