ప్రియుడిని పెళ్లాడిన ‘పవి టీచర్’.. సైమా అవార్డుతో ‘డెలులు’.. పట్టుచీరలో బుట్టబొమ్మలా నిధి అగర్వాల్
సినీ సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.
సినీ సెలబ్రెటీలు తాజాగా షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ విశేషాలు చూద్దాం.

కృతి సనన్ (Kriti Sanon) సినిమా హీరోయిన్ గా ఎంత సంపాదిస్తోందో అంతకన్నా ఎక్కువగా యాడ్స్ ద్వారా సంపాదిస్తోంది. సెలెబ్రిటీ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమెకి ఎక్కువ బ్రాండ్స్ ఉన్నాయి. ఐతే, ఇటీవల రాఖీ సందర్భంగా విడుదలైన GIVA బ్రాండ్ యాడ్ లో బ్రాలాంటి టాప్ ధరించి నటించి వివాదంలోకి ఎక్కింది. ఈ వివాదాన్ని ఆమె హ్యాండిల్ చేసిన విధానం కూడా బాలేదు. విమర్శలు వచ్చినప్పుడు హుందాగా తప్పు సవరించుకున్నా, క్రియేటివ్ టీం చెప్పినట్లు చేశాను తన తప్పు లేదని చెప్పినా సరిపోయేది. కానీ దాన్ని సమర్ధించుకొంది. ఆడవాళ్లు ఏ డ్రెస్ వేసుకోవాల్లో చెప్పొద్దు అంటూ పెద్ద లెటర్ రాసింది. కానీ, ఆమె డ్రెస్ గురించి విమర్శలు వచ్చింది ఆమె వ్యక్తిగత డ్రెస్ గురించి కాదు ఒక బ్రాండ్ యాడ్ గురించి. అదీ కూడా రాఖీ యాడ్ విషయంలో. ఈ వివాదం వల్ల నష్టం జరుగుతోంది అని గ్రహించి ఆ బ్రాండ్ ఆ యాడ్ ని వెనక్కి తీసుకొంది. కానీ కృతి సనన్ తో ఇకపై యాడ్స్ చేసే వాళ్ళు, ఆమెని అంబాసిడర్ గా తీసుకొనే బ్రాండ్స్ జాగ్రత్తగా ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. బ్రాండ్స్ నెగటివిటిని కోరుకోవు. వాటికి బిజినెస్ ముఖ్యం. అందుకే, ఆమెకి ఇకపై కొన్ని యాడ్స్ పోవచ్చు. లేదా కొత్తగా వచ్చేవి తగ్గొచ్చు అని అంటున్నారు. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది

కెమెరా ఫ్లాష్ లైట్లు ఆరిపోయాక వారి అంతరంగంలో రగిలే భావోద్వేగాల సుడిగుండాలు, వారు అనుభవించే నిశ్శబ్ద మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ మొదటిసారిగా బయటపెట్టింది. వెండితెరపై నిత్యం చిరునవ్వులు చిందిస్తూ, విద్యుత్ వెలుగుల్లో దివ్యమైన తారల్లా మెరిసిపోయే నటీనటుల జీవితం బయట నుంచి చూసే సగటు ప్రేక్షకుడికి ఒక అందమైన కలలా, ఊహల స్వర్గంలా కనిపిస్తుంది. కానీ కెమెరా ఫ్లాష్ లైట్లు ఆరిపోయాక వారి అంతరంగంలో రగిలే భావోద్వేగాల సుడిగుండాలు, వారు అనుభవించే నిశ్శబ్ద మానసిక ఒత్తిళ్లు ఎంత తీవ్రంగా ఉంటాయో జాతీయ ఉత్తమ నటి కృతి సనన్ మొదటిసారిగా బయటపెట్టింది. ‘చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తలో నాకొక బలమైన నమ్మకం, ఒక రకమైన అజ్ఞానంతో కూడిన ధైర్యం ఉండేది. సెట్ మీద నేను పోషించే పాత్రలు కేవలం కెమెరా ఆన్‌లో ఉన్నంత వరకు మాత్రమే పరిమితమని మొదట్లో అనుకునేదాన్ని. షూటింగ్ అయిపోగానే ఆ మేక్‌పతో పాటు ఆ పాత్రల భావోద్వేగాలను కాస్ట్యూమ్ రూమ్‌లోనే విప్పేసి, నా వ్యక్తిగత జీవితంలోకి ప్రశాంతంగా వెళ్లిపోగలనని గట్టిగా నమ్మేదాన్ని. కానీ, ఆ నమ్మకం ఎంతో కాలం నిలవలేదు. నేను నటించిన ‘మిమి’, ‘దో పట్టీ’ వంటి సినిమాలు నా నటనా ప్రయాణంలోనే కాదు, నా జీవితంలో అంతర్గతంగా ఉండే ఆలోచనా విధానంలోనూ మార్పు తెచ్చాయి. తీవ్రమైన మానసిక ఘర్షణలతో, నమ్మకద్రోహం, వేదన, మాతృత్వం వంటి సున్నితమైన అంశాలతో కూడిన ఆ పాత్రలు చేస్తున్నప్పుడు నాకొక చేదు నిజం బోధపడింది. మనం పైకి ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నా, మన ఆలోచనలతో ఆ పాత్రలకు సంబంధం లేదని మన మనసుకు ఎంత సర్ది చెప్పుకుంటున్నా. మనం పోషించే ప్రతీ తీవ్రమైన పాత్ర మన సుప్తచేతనావస్థ (సబ్కాన్షియ్స్ )పై ఒక నిశ్శబ్దమైన, నిగూఢమైన, లోతైన ముద్ర వేస్తూనే ఉంటుంది. షూట్ సమయంలో డైరెక్టర్ ‘కట్’ చెప్పిన వెంటనే లేదా ఒక ప్రాజెక్ట్ షూటింగ్ మొత్తం

ఫ్యాషన్ ఐకాన్ కృతి సనన్ మరోసారి తన అద్భుతమైన స్టైల్‌తో అభిమానులను ఫిదా చేశారు. ‘ది బ్రైడ్ సైడ్’ సీజన్ 6 – ‘సోలార్ ది ఫస్ట్ లైట్’ క్యాంపెయిన్ కోసం కృతి ధరించిన ‘సైరన్ బ్లూమ్’ ఐవరీ క్యూచర్ లెహంగా ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ఈ రాయల్ అవుట్‌ఫిట్‌ను తయారుచేయడానికి నిపుణులైన డిజైనర్లు సుమారు 680 గంటల సమయం కేటాయించడం విశేషం. అంతేకాకుండా 3,000 పైగా మెరిసే క్రిస్టల్స్, ఫ్లోరల్ అప్లికే మరియు సన్నని హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఈ దుస్తులను అత్యంత రమణీయంగా రూపొందించారు. మినిమల్ జ్యువెలరీ, సాఫ్ట్ మేకప్‌తో మోడర్న్ గ్లామర్‌తో ఉన్న కృతి లుక్‌పై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కృతి సనన్ ఒకవైపు గ్లామర్ ప్రపంచం, మరోవైపు వరుస భారీ ప్రాజెక్టులతో బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘డాన్ 3: ది ఫైనల్ చాప్టర్’లో కృతి సనన్ కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రం 2026 చివరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ కామెడీ సీక్వెల్ ‘నో ఎంట్రీ 2’లోనూ కృతి కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇవే కాకుండా పాన్-ఇండియా రేంజ్లో మరికొన్ని భారీ ప్రాజెక్ట్‌లు కృతి ఖాతాలో ఉన్నాయి. గతంలో మంచి విజయం సాధించిన క్రీచర్-కామెడీ హారర్ హిట్ చిత్రం సీక్వెల్ ‘భేడియా 2’లో ఆమె నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకేసారి అటు ఫ్యాషన్ ఐకాన్‌గా, ఇటు వరుస బిగ్-బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్ లీడింగ్ హీరోయిన్గా కృతి సనన్ తన సత్తా చాటుతున్నారు