
కృష్ణా జలాల్లో ఏపీ వాటా 70 శాతం
కృష్ణా బోర్డుకు ఈఎన్సీ కె.నరసింహమూర్తి స్పష్టికరణ శ్రీశైలం, సాగర్, జూరాలలో కనీస నీటి మట్టానికి ఎగువన 146.55 టీఎంసీలు లభ్యత అందులో ఏపీ వాటా 115.7 టీఎంసీలు.. తెలంగాణ వాటా 30.85 టీఎంసీలు అక్టోబర్ 31 వరకు ఏపీ తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలు కేటాయించండి ఈ ఏడాది కరువు ఉన్నందున తాగునీటి అవసరాలకే అధిక ప్రాధాన్యమివ్వండి సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రా ల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టానికి (ఎండీడీఎల్) ఎగువన 146.55 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, అందులో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా లెక్కన 115.70 టీఎంసీలు లభిస్తాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణకు 30 శాతం వాటా కింద కేవలం 30.85 టీఎంసీలే ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు ఏపీ 13.62 టీఎంసీలు, తెలంగాణ 20.06 టీఎంసీలు వాడుకుంది పోగా, మిగిలిన నీటిలో అదే నిష్పత్తిలో వాటాలు ఉంటాయని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్.బిశ్వాస్కు రాష్ట్ర జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కె.నరసింహమూర్తి శుక్రవారం లేఖ రాశారు. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో అపరిష్కృతంగా ఉంది. దీంతో తాత్కాలికంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం జలాలను సర్దుబాటు చేయాలని గతంలో నిర్ణయించారు. జూరాల వాడకం సైతం లెక్కలోకి.. శ్రీశైలం నుంచి 4.38 టీఎంసీలు, సాగర్ నుంచి 6.89 టీఎంసీలు, జూరాల నుంచి 8.79 టీఎంసీలు కలిపి మొత్తం 20.06 టీఎంసీలను తెలంగాణ వాడుకోగా, తాము శ్రీశైలం నుంచి 6.45 టీఎంసీలు, సాగర్ నుంచి 7.17 టీఎంసీలు కలిపి మొత్తం 13.62 టీఎంసీలను వాడుకున్నట్టు ఏపీ పేర్కొంది. రెండు రాష్ట్రాలు కలిపి వాడుకున్న జలాలు 33.68 టీఎంసీలకు శ్రీశైలం, సాగర్, జూరాలలో ఎండీడీఎల్‌కి ఎగువన లభ్యతలో ఉన్న నీళ్లను కలిపితే మొత్తం 184.74 టీఎంసీలు అవుతాయని