
Miami Plane Crash: మయామి ఎయిర్‌పోర్ట్‌లో ఘోరప్రమాదం.. బోయింగ్ 767 విమానంలో భారీ మంటలు.. ఐదుగురు మృతి
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మయామి(Miami Plane Crash) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న మయామి(Miami Plane Crash) అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం తీవ్ర దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.

అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి... బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ

నెల్లూరు నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేశారు. నెల్లూరు, సెప్టెంబర్ 01: నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు. ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు. నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు

మహారాష్ట్రలో జీపు బోల్తా ప్రమాదం నిర్మల్ జిల్లా వాసులు నలుగురు మృతి శివయ్య దర్శనం ముగించుకుని వస్తుండగా విషాదం Maharashtra Jeep Accident: శ్రావణ సోమవారం నాడు దైవదర్శనానికి వెళ్లిన నిర్మల్ జిల్లా వాసుల ప్రయాణం విషాదాంతమైంది. మహారాష్ట్ర (Maharashtra Jeep Accident)సరిహద్దు ప్రాంతంలో జీపు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల సరిహద్దులోని తొటాంబ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని శివాలయానికి వెళ్లిన వీరంతా, తిరుగుప్రయాణంలో మహారాష్ట్రలోని సాసర్ కొండ జలపాతాన్ని సందర్శించి వస్తుండగా ఈ విషాదం జరిగింది. BC Dedicated Commission: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. బీసీ డెడికేటెడ్ కమిషన్ గడువు పెంపు.. కొత్త డెడ్‌లైన్ ఎప్పుడంటే? భైంసా ఆసుపత్రికి క్షతగాత్రులు తరలింపు: ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులలో ముగ్గురిని కుబీర్ మండలం పార్డి (బి) గ్రామానికి చెందిన తులసీరామ్, గంగన్న, గంగాబాయిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద వార్త తెలియగానే గ్రామంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను వెంటనే భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు

రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. న్యూఢిల్లీ, ఆగస్టు 22: రహదారి పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రాపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా నగర సమీపంలో పరావ్ తోలా బంకట్వాలో జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ బస్సు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి బెట్టియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. చిన్న పాప జన్మదినం సందర్భంగా ఈ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఆ కుటుంబం నిర్వహించిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఆ పాప తండ్రి కూడా మరణించారని పోలీసులు చెప్పారు. మృతులందరిని గుర్తించామని పేర్కొన్నారు. అతి వేగంతో వెళ్తున్న బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును తప్పించే క్రమంలో ఆర్కేస్ట్రా వైపు బస్సు దూసుకెళ్లిందని వివరించారు. ఈ కార్యక్రమం వద్ద ప్రజలు గుంపుగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారం మూసివేతపై కేంద్రం జోక్యం చేసుకోవాలి: మంత్రి తుమ్మల జాబ్ క్యాలెండర్‌తో యువతకు అండగా ప్రభుత్వం: మంత్రి పార్థసారథి

Husband Killed Case : వివాహేతర సంబంధాలతో భర్తల ప్రాణాలు తీస్తున్న భార్యల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. ప్రేమవివాహం చేసుకున్న మహిళ.. భర్త షాపులో పనిచేసే మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొద్దిరోజుల తరువాత భర్తను అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేసింది. భర్త మృతిని కారు ప్రమాదంగా చిత్రీకరించింది. కానీ, పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఇద్దరు మైనర్లతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఉత్తరాఖండ్ లోని రామ్‌నగర్‌కు చెందిన సంజీవ్ కుమార్ (24) టెంట్ హౌస్ వ్యాపారం నిర్వహించేవాడు. ఐదేళ్ల క్రితం సంజీవ్ కుమార్, నిషాలు ప్రేమ వివాహం చేసుకున్నారు. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ వివాహంకు ఒప్పుకోకపోవడంతో కుటుంబ సభ్యులను ఎదిరించి నిషాను ప్రేమవివాహం చేసుకున్నాడు. అయితే, కొంతకాలం తరువాత భర్త టెంట్ హౌస్‌లో పనిచేసే 17ఏళ్ల బాలుడితో నిషాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన నిషా.. అతన్ని హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. సంజీవ్ కుమార్ ను హత్య చేసేందుకు తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న బాలుడిని పురమాయించింది. దీంతో అతను మరో మైనర్ బాలుడితో కలిసి ఆగస్టు 16న తమలో ఒకరి పుట్టినరోజు వేడుకల పేరుతో నిషా భర్త సంజీవ్‌ను పార్టీకి తీసుకెళ్లేందుకు ఒప్పించారు. కారులో సంజీవ్ డ్రైవింగ్ చేస్తుండగా వెనుక సీట్లో కూర్చున్న మైనర్ బాలుడు తుపాకీతో సంజీవ్ మెడపై కాల్పులు జరిపాడు. దీంతో సంజీవ్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఇద్దరు మైనర్ బాలురు అక్కడి నుంచి పరారయ్యారు. సంజీవ్ కారు ప్రమాదంలో మరణించినట్లుగా నిషా అందరిని నమ్మించింది. పోలీసు కేసు కావడంతో నిబంధనల ప్రకారం సంజీవ్ కుమార్ కు

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి లోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఏం జరిగింది అనేది తాజాగా నిందితుల పట్టుబడడంతో వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఇద్దరు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు 8 రోజుల్లో ఈ హత్య కేసును ఛేదించారు.ఘాతుకానికి పాల్పడిన పదవ తరగతి విద్యార్థులు రూప రెడ్డి ప్రిన్సిపల్ గా ఉన్న స్కూల్లో చదువుకున్న పదో తరగతి విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడడం అందరినీ షాక్ కి గురి చేసింది. పూల్ సింగ్ తండా, పిల్యా తండాలకు చెందిన ఇద్దరు పదహారేళ్ల విద్యార్థులు స్కూల్ వసతి గృహం లోనే ఉంటూ చదువుకుంటున్నారు. సెల్ ఫోన్ వాడడం, వ్యసనాలకు బానిసలుగా మారడం వంటి కారణాలతో, ఆ విద్యార్థుల ప్రవర్తనను గుర్తించిన ప్రిన్సిపల్ రూప రెడ్డి తల్లిదండ్రులను పిలిపించింది.టెక్నాలజీని వాడి ఎలా హత్య చేయాలి? నెట్ లో సెర్చ్ చేసిన విద్యార్థులు వారి సమక్షంలో ఇద్దరు విద్యార్థులను కఠినంగా మందలించారు. దీంతో ఆమె పైన కక్ష పెంచుకున్న విద్యార్థులు ఆమె ఇంట్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని కూడా ఆలోచించి హత్య చేయాలని పథకం రూపొందించారు. దీనికోసం టెక్నాలజీని వాడి ఎలా హత్య చేయాలి? డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? వంటి అనేక పద్ధతులను వారి పరిశోధన చేసినట్టు తెలుస్తోంది.భర్త ఇంట్లో లేని రోజు హత్యకి ప్లాన్రూప రెడ్డిని హత్య చేయాలని భావించిన వారు దానిని ఆమె భర్త ఇంట్లో లేని రోజు అమలు చేయడానికి ప్లాన్ చేశారు. రూపారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతూ ఉండడంతో రూపా రెడ్డి దంపతులు తరచు హైదరాబాద్ కు వెళుతుంటారు. ఈనెల ఎనిమిదో తారీకు నుండి వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో రూప రెడ్డి ఆమె భర్త రాజేందర్

ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. నైరోబీ: ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం అధిపతి మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి కూడా ఉన్నారు. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్గిరో ప్రాంతం వైపు హెలికాప్టర్ వెళ్తోంది. హెలికాప్టర్లో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఆరుగురు ప్రయాణికులు, మరొకరు పైలట్. అయితే, బుధవారం ఉదయం 9:13 గంటల సమయంలో సంబూరు కౌంటీలోని మౌంట్ ఒలోలోక్వే వద్దకు హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు, ఘటనాస్థలిలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారినట్లు కెన్యా రెడ్‌క్రాస్ తెలిపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అమెరికా పౌరులు మృతిచెందినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతుల్లో టెలిముండో సంస్థకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ జోస్ అల్బెర్టో సువారెజ్, ఈక్వెడార్ జాతీయ నిఘా కేంద్రం డైరెక్టర్ జనరల్ మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి ఉన్నారు. హెలికాప్టర్‌ను లేడీ లోరీ హెలికాప్టర్స్ సంస్థ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై కెన్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, హెలికాప్టర్ ప్రయాణ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ బరిలో సరితా కోమటిరెడ్డి

పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో... కోల్‌కతా, ఆగస్టు 19: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని మీర్జాగాలిబ్ వీధిలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనంలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే విపత్తు నిర్వహణ బృందాలు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. సుమారు 80మందిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రతి అంతస్తులో నాలుగైదు హోటళ్లు నడుస్తున్నాయని.. గాలి, వెలుతురు లేని ఇరుకైన గదులే ప్రాణ నష్టానికి ప్రధాన కారణమని అగ్నిమాపక శాఖ మంత్రి కౌశిక్ చౌదరి పేర్కొన్నారు. ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము ఎక్స్ వేదికగా విచారం వ్యక్తం చేశారు

జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. నల్గొండ, ఆగస్టు19: జల్సాలకు డబ్బుల కోసమే ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఇద్దరు మైనర్ విద్యార్థులు హత్య చేశారని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. బుధవారం నల్గొండలో విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. నిందితుల నుంచి రక్తంతో తడిచిన రూ.1,54,000 నగదుతోపాటు ఐ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.15 రోజుల క్రితం హాస్టల్లో ఈ విద్యార్థుల బ్యాగ్‌లో సెల్ ఫోన్‌తోపాటు నగదు దొరకడంతో స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి వారిని మందలించారని తెలిపారు. ఈ విషయాన్ని వారి తల్లిదండ్రుల దృష్టికి ఆమె తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్ నుంచి ఇంటికి వారిని పంపి.. డే స్కాలర్‌గా మార్చారని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిపై వారిద్దరు పగ పెంచుకున్నారని అన్నారు. అయితే వారిద్దరిలో ఒకరు మద్యానికి బానిసగా మారారని.. దీంతో ముందే ప్లాన్ ప్రకారం రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. ఇక యూట్యూబ్‌లో డబ్బులు సంపాదించడంపై ప్లాన్ వేసుకుని.. ప్రిన్సిపాల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేశారని వివరించారు. అందుకోసం ముందే కత్తిని వారు కొనుగోలు చేశారని అన్నారు. ఈ చోరీ సమయంలో వీరిని ప్రిన్సిపాల్ గుర్తు పట్టిందని చెప్పారు. దీంతో రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేశారని వివరించారు. జల్సా చేసేందుకు నెల క్రితం వీరు గోవా కూడా వెళ్లారని తెలిపారు. వీరిద్దరికి గంజాయి టెస్ట్ నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. కొండా సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: మల్లు రవి
వివాహేతర సంబంధం ఓ కుటుంబంలో చిచ్చురేపింది. ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఓ మహిళ.. దీనిని చూసిన తన కన్న కొడుకును కూడా కడతేర్చింది. బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసిన వచ్చిన తర్వాత ఊపిరాడక తన భర్త, కుమారుడు చనిపోయారని కట్టుకథ అల్లింది. చివరకు కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. మానవత్వానికి మాయనిమచ్చలాంటి ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో చోటుచేసుకుంది. ఇద్దర్నీ హత్యచేసి సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన మహిళను, ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వివరాల్లోకి వెళ్తే.. చిక్కబనవరకు చెందిన అభినందన్ (35), హరిణి (26) భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమారుడు యదువీర్ ఉన్నాడు. కనకపుర తాలూకా హారోహళ్లికి చెందిన ప్రయివేట్ ఉద్యోగి వినయ్‌తో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన భర్త అభినందన్.. భార్యను మందలించాడు. దీనిపై ఇరువురి మధ్య పలుసార్లు గొడవ జరిగింది. ప్రవర్తన మార్చుకోకుంటే విడాకులు ఇస్తానని బెదిరించాడు. అయినా సరే ఆమె మారలేదు సరికదా.. భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలసి పథకం వేసింది.ఆదివారం రాత్రి అభినందన్ నిద్రపోయిన అనంతరం వినయ్‌ను రప్పించి తన ప్లాన్‌ను అమలు చేసింది. భర్త అభినందన్ కాళ్లను ఆమె పట్టుకోగా, తలపై కుక్కరుతో కొట్టి, గొంతు నులిమి వినయ్ హత్య చేశాడు. పెనుగులాటలో తండ్రి అరుపులు విని కుమారుడు యదువీర్ అక్కడకు వచ్చాడు. ప్రత్యక్షంగా తమ నేరాన్ని చూసిన చిన్నారి.. ఈ విషయాన్ని బయటపెడితే దొరికిపోతామని భావించిన ఇద్దరూ కలిసి గొంతును నులిమి ప్రాణాలు తీశారు. రక్తం మరకలు ఉన్న దుస్తులను మార్చి.. భర్త గుండెలపై కుమారుడ్ని నిద్రపుచ్చింది. భర్తే కొడుకును చంపి, ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది.పథకం ప్రకారం ఇంటిలోని సీసీటీవీ కెమెరాను ఆఫ్ చేసి, ప్రియుడు వినయ్ వెళ్లిన అనంతరం ఆన్ చేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు పోలీస్

రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడిని కిరాతకంగా చంపేశారు. రివర్స్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి, ఆగస్టు 18: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే అతడిని కిరాతకంగా చంపేశారు. రివర్స్ కేఫ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు బీహార్‌కు చెందిన అనికేత్‌గా గుర్తించారు. అనికేత్.. తన స్నేహితులు రోహిత్, రాహుల్, అంకిత్‌లతో కలిసి మద్యం సేవించాడు. ఈ సమయంలో స్నేహితుల మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. తీవ్ర ఆగ్రహానికి గురైన రాహుల్.. అనికేత్ తల వెనుక భాగంలో ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారకస్థితిలో ఉన్న యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనికేత్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు. జ్వరంతో ఆస్పత్రిలో చేరిన మహిళ మృతి.. బంధువుల ఆందోళన మీరు చేసిన తప్పులకి ప్రజలకు ఎందుకు శిక్ష.. పొంగులేటిపై హరీశ్ ఫైర్

శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెనుకొండ మండలం మావటూరు సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా హతమార్చారు. బాధితుడి కాళ్లను నరికివేసిన నిందితులు, అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సగం కాలిపోయిన మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.మృతుడిని కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపురానికి చెందిన అనిల్ కుమార్ (21)గా పోలీసులు గుర్తించారు. బాధితుడు పెనుకొండ పారిశ్రామిక వాడలోని కియా మోటార్స్ అనుబంధ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. రోడ్దం మండలం దొడగట్టలోని బంధువుల ఇంట్లో నివసిస్తూ ప్రతిరోజూ విధులకు హాజరయ్యేవాడు. రోజువారీ మాదిరిగానే పనికి వెళ్తుండగా, మార్గమధ్యంలో దుండగులు మాటువేసి అతనిపై దాడికి తెగబడి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పెనుకొండ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పాత కక్షలు లేదా వ్యక్తిగత వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆధారాల సేకరణ కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు

Road Accident : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భింద్ జిల్లాలో కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనం, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందగా.. మరో 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరినీ గోహద్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం గ్వాలియర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్భేరీకి చెందిన కూలీలు గ్వాలియర్‌లో వరినాట్లు పూర్తి చేసుకొని సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత తమ గ్రామానికి ట్రాలీ వాహనంలో బయలుదేరి వెళ్తున్నారు. భింద్-గ్వాలియర్ జాతీయ రహదారిపై ఛిమ్కా గ్రామం సమీపంలో రహదారిపైకి వచ్చిన పశువులను తప్పించబోయి డ్రైవర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టడంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. మరో ముగ్గురు మరణించారు

14 మందికి తీవ్రగాయాలు శ్రావణ సోమవారం, నాగపంచమి కావడంతో బిహార్‌లోని అశోక్‌ధామ్ గుడికి పోటెత్తిన జనం మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి ప్రకటన ఉజ్జయినిలోనూ తోపులాట.. 13మందికి గాయాలు లఖిసరాయ్, ఆగస్టు 17: శ్రావణ సోమవారం వేళ బిహార్‌లోని ప్రముఖ శైవ క్షేత్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్‌ధామ్ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి ఒకే రోజు రావడంతో పరమశివుడికి జలాభిషేకం చేసేందుకు ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారని అధికారులు తెలిపారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భారీ జనసందోహం కారణంగా బారికేడ్లు విరిగి భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో ప్రమాదం జరిగిందని వివరించారు. బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఉజ్జయినిలోనూ తొక్కిసలాట శ్రావణ సోమవారం, నాగుల చవితి పర్వదినాలు పురస్కరించుకుని మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. హరిసిద్ధి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల నుంచి కరెంట్ షాక్ వస్తోందంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లోని తారాపీఠ్‌లో కాళీ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు బస చేసిన హోటల్లో అగ్ని ప్రమాదం జరిగి ఎనిమిది మంది చనిపోయారు. ఇవి కూడా చదవండి పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్లో దంపతులు నివాసం ఉండగా.. భర్తను భార్య రోకలిబండతో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటి వెంకటేశ్వర్లు అనే 62 ఏళ్ల వ్యక్తి.. ఆసిఫాబాద్ జిల్లాలో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (సీటీఓ)గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజమణి హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.అయితే ఈ నెలాఖరులో వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం ఇదే అంశంపై ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.వెంకటేశ్వర్లు, రాజమణి మధ్య మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజమణి ఇంట్లో ఉన్న రోకలిబండతో భర్త వెంకటేశ్వర్లు తలపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే వెంకటేశ్వర్లును పరీక్షించిన డాక్టర్లు.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హనుమాన్ నగర్‌లోని నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వెంకటేశ్వర్లు తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు రాజమణిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు, ఆస్తి, రిటైర్మెంట్ డబ్బుల విషయంలో ఉన్న వివాదంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు

దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మెదక్, ఆగస్టు 17: దేశంలోనే మొదటిసారిగా పరిశ్రమలను విద్యార్థులను జాబ్ పోర్టల్ కనెక్ట్ చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఈరోజు(సోమవారం) జిల్లాలోని మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలోని పారిశ్రామిక ప్రాంతంలో జాబ్ పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో వెయ్యి పరిశ్రమలు ఉన్నాయని.. స్కిల్డ్ మ్యాన్ పవర్ అవసరం ఉందని అన్నారు. జిల్లా యంత్రాంగం, పరిశ్రమల యజమానులు కలిసి చేస్తున్న మంచి ప్రయత్నం ఇది అని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో, దేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందన్నారు. టామ్ కామ్ సంస్థ ద్వారా విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. స్థానిక పరిశ్రమలకు కూడా ఉద్యోగులను, స్కిల్డ్ లేబర్‌ను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు కేవలం సాఫ్ట్వేర్ పైనే దృష్టి సారించకుండా... ఇంకా చాలా రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని అన్నారు. సింగరేణి ప్రాంతం మందమర్రిలో జర్మన్ నేర్పిస్తున్నామని.. వారిలో బీ2 లెవల్ వచ్చిందన్నారు. వారి కోసం రూ.25 లక్షల జీతం ఎదురుచూస్తోందని తెలిపారు. వీసా ఖర్చులను కూడా సగం వరకూ ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. విదేశాలకు వెళ్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఏపీ శాసనమండలిలో వైసీపీ తీరుపై మంత్రులు అచ్చెన్నాయుడు, మనోహర్ ఆగ్రహం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

కడప జిల్లాలో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అమానుషమైన ఘటన వెలుగు చూసింది. సొంత రక్తసంబంధం, కలిసి పెరిగిన అనుబంధం క్షణికావేశం ముందు చిన్నబోయాయి. ఆత్మీయంగా పలకరించుకోవాల్సిన అన్నదమ్ముల మధ్య ఒక చిన్న కారణం చివరకు ప్రాణాలు తీసేంత ఘోరానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో చోటుచేసుకున్న ఈ దారుణం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బ్రహ్మంగారిమఠం ప్రాంతానికి చెందిన వెంకటసుబ్బయ్య, సురేష్ సొంత అన్నదమ్ములు. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి జీవనం సాగిస్తున్నారు. రోజూలాగే పనుల్లో నిమగ్నమయ్యే ఈ సోదరుల మధ్య శనివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. శనివారం నాడు అన్న వెంకటసుబ్బయ్య ఇంటికి చికెన్ తీసుకువచ్చాడు. శనివారం రోజున చికెన్ ఎందుకు తెచ్చావంటూ తమ్ముడు సురేష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. వారంలో శనివారం చికెన్ తెచ్చి వండడం ఏంటని తీవ్ర కోపంతో రగిలిపోయాడు. మామూలు మాటల యుద్ధంతో ప్రారంభమైన ఈ గొడవ క్షణాల్లో తీవ్రరూపం దాల్చింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు సురేష్, విచక్షణ కోల్పోయి ఇంట్లోని గొడ్డలి తీసుకుని అన్న వెంకటసుబ్బయ్యపైకి దూసుకెళ్లాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే, గొడ్డలితో అన్నపై తీవ్రంగా దాడి చేసి దారుణంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో పడిపోయిన వెంకటసుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒకే ఒక్క చికెన్ విషయంలో వచ్చిన వివాదం చివరకు ప్రాణాలను బలితీసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న బ్రహ్మంగారిమఠం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో ఉన్న మృతదేహాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో సొంత అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన తమ్ముడు సురేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. చికెన్ తెచ్చాడనే ఒక చిన్న విషయానికి సొంత సోదరుడి

ఒకప్పుడు భర్తలు భార్యలను హతమారుస్తున్న ఘటనలు జరిగేవి. ఇటీవల కాలంలో భార్యలే అత్యంత దారుణంగా భర్తలను పరలోకాలకు పంపిస్తున్న సంఘటనలు పెరిగిపోయాయి. అనుమానాలతో కొందరు, అక్రమ సంబంధాలతో కొందరు, ఆస్తి కోసం కొందరు ఇలా రకరకాలుగా దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. సినిమాలలో కూడా చూడని విధంగా క్రిమినల్ వైఫ్స్ కొత్త కొత్త ప్లాన్ లు, స్కెచ్ లతో భర్తలను చంపేస్తున్నారు.అనుమానంతో భర్తను హతమార్చిన భార్య తాజాగా అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చోడవరంలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. సుమారు మూడు దశాబ్దాల దాంపత్య జీవితం అనుమానం కారణంగా విషాదాంతంగా ముగిసింది. అనుమానం పెద్ద భూతంగా మారి భార్యను భర్తను హత్య చేసే స్థాయికి తీసుకెళ్లింది.ప్రేమ వివాహం చేసుకున్న కపుల్ రామ్మోహనరావుపేట సమీప అంబేడ్కర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్న కొండ్ల ఇందిర, ఆమె భర్త వెంకటరావు (58) లకు నలుగురు కుమార్తెలు. ఒక కూతురికి వివాహం జరిగింది. వెంకటరావు ప్రైవేటు కేబుల్ నెట్‌వర్క్‌లో ఉద్యోగం చేసేవాడు. భార్యా భర్తలు ఇద్దరూ స్థానికులే. వారిది ప్రేమ వివాహం. కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసుల సహాయంతో పెళ్లి చేసుకున్నారు.వేరే మహిళతో సంబంధం ఉందని భర్త గొంతు కోసిన ఇందిరవెంకటరావు మరో మహిళతో సంబంధం ఉందన్న అనుమానంతో దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవి. అనకాపల్లిలో ఉన్న కుమార్తె ఇంటి నుంచి శనివారం తిరిగి వచ్చాక మళ్లీ తీవ్రమైన గొడవ జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ దగ్గరకే వెంకటరావు వెళ్లి వచ్చాడని భావించి, ఆ సమయంలో పట్టరాని ఆవేశంతో ఇందిర కత్తి తీసుకుని భర్త గొంతు కోసి హత్య చేసింది. తర్వాత మృతుని తల వద్ద దీపం పెట్టి పోలీసుల ముందు లొంగిపోయింది.ఏపీలో వారికి తీపికబురు.. ఆగస్టు 20లోగా మీ ఖాతాల్లో రూ.25 వేలు!హత్యకు పాల్పడిన ఇందిర అంగన్వాడీ కార్యకర్త ఈ

ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై... రిక్టర్‌స్కేల్‌పై 7.7గా నమోదైన భూకంప తీవ్రత విరిగిపడ్డ కొండచరియలు.. వందల ఇళ్లు ధ్వంసం.. పలువురికి గాయాలు మౌమెరి(ఇండోనేషియా), ఆగస్టు 15: ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోరెస్ ద్వీపానికి సమీపంలో శనివారం ఉదయం 5.58 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. భూకంపంతో కారణంగా 47 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 2 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భూకంపంతో కొండ చరియలు విరిగి పడడం, రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. తీవ్రమైన భూప్రకంపనల కారణంగా అధికారులు తొలుత సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తర్వాత ఉపసంహరించుకున్నారు. కాగా శనివారం సాయంత్రం 4.24 గంటలకు ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రత గల మరో భూకంపం కూడా సంభవించింది. భూ ఉపరితలం నుంచి 172.5 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించడంతో పెద్దగా నష్టం వాటిల్ల లేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. కాగా ఇండోనేషియాలో 1992లో భూకంపం కారణంగా వచ్చిన సునామీతో ఫ్లోరెస్ ద్వీపం వద్ద 2,500 మంది చనిపోయారు. అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య వేడుకలు.. జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఏపీ వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు.. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలు

సాక్షి, నిజామాబాద్: ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. బస్సు టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ రోడ్డుపై నిలిపారు. దీంతో బస్సు ఎదుట డివైడర్‌పై ఇద్దరు మహిళలు కూర్చున్నారు. ఒక్కసారిగా అతివేగంతో వెనుక నుంచి బస్సును కంటైనర్ ఢీకొట్టింది. బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపై బస్సు టైర్ ఎక్కడంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలుకావడంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) ఇసుక వేస్తే రాలనంత జనం.. దద్దరిల్లిన కర్నూలు కాన్వాయ్ పై టవల్ విసిరిన అభిమాని.. జగన్ ఏం చేశాడో చూడండి జగన్ అన్న వస్తే చరిత్ర మారుతుంది! YS జగన్ పర్యటనలో వైరల్ ఫ్లెక్సీ కొద్దిసేపట్లో జైలు వద్దకు చేరుకోనున్న వైఎస్ జగన్

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. వరంగల్ జిల్లా: గీసుగొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఇవాళ (గురువారం) విషాద ఘటన చోటుచేసుకుంది. గణేశా ఎకోపెట్ క్లాత్ ఫ్యాక్టరీలో లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇద్దరు సిబ్బంది మృతిచెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అభిలాష్ (30), సూర్యప్రకాశ్ (31)గా మృతులను గుర్తించారు. అయితే, వారిద్దరూ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై ఆరా తీస్తున్నారు. లిఫ్ట్‌లో ప్రమాదం ఎలా జరిగింది? నిజంగానే షార్ట్‌సర్క్యూట్ జరిగిందా? వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్, ఆగస్టు 13: జిల్లాలోని ఆర్మూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవింద్‌పేట్ ఫ్లై ఓవర్‌పై ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ప్రైవేటు బస్సు టైర్ పంక్చర్ అవడంతో బస్సును డ్రైవర్ రోడ్డుపై నిలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు బస్సు ఎదుట ఉన్న డివైడర్‌పై కూర్చుకున్నారు. ఇదే సమయంలో అతివేగంతో దూసుకొచ్చిన కంటైనర్ లారీ.. వెనుక నుంచి బస్సును ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ముందు డివైడర్‌పై కూర్చున్న మహిళలపైకి బస్సు టైర్ ఎక్కడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రేవంత్.. నువ్వు ముఖ్యమంత్రివా లేక రియల్ ఎస్టేట్ ఏజెంటువా: హరీశ్ రావు సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత

Kalaburagi Blast : భార్య తనమాట వినడం లేదన్న కోపం.. కుటుంబం పరువు పోతోందన్న ఆవేదనతో భర్త దారుణానికి పాల్పడ్డాడు. నడుముకు జిలెటిన్ స్టిక్స్ కట్టుకొని పేల్చుకోవడంతో అతనితోపాటు అతని కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ పేలుడు ఘటనలో భార్య, కొడుకుతోపాటు ఇద్దరు బంధువులకు తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి జిల్లాలో చోటు చేసుకుంది. శివలాల్ బలీరామ్ రాఠోడ్, సవిత భార్యాభర్తలు. వారిద్దరికి కుమార్తె మీరా (15), కుమారుడు ప్రకాశ్ (12) ఉన్నారు. అయితే, కొద్దికాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భార్యపై శివలాల్ అనుమానం పెంచుకున్నాడు. ఆమె ప్రవర్తన కారణంగా కుటుంబ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తుండేవాడు. భర్త ఇబ్బందులు తాళలేక సవిత భర్తను విడిచి పిల్లలతో కలిసి కలబురగి జిల్లా ఆళంద్ తాలూకాలోని మటకి తాండాలో బంధువు సురేఖ చౌహాన్ ఇంటికి వెళ్లింది. కొద్దిరోజులుగా అక్కడే ఉంటుంది. శివలాల్ మంగళవారం జిలెటిన్ స్టిక్స్ ను నడుముకు కట్టుకుని వారింటికి వెళ్లాడు. అక్కడే పేల్చుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. శివలాల్ క్వారీలో పనిచేసేవాడని, అక్కడి నుంచి పేలుడు పదార్థాన్ని ఇంటికి తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో గొడవ జరిగిన తర్వాత పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనలో ఇంటి కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. పేలుడు శబ్దం విని స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు

దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్... భార్య, కుమారుడు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు బెంగళూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): దంపతుల మధ్య విభేదాలు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. మరో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. కలబురగి జిల్లా ఆళంద తాలూకా మటకి తండాలో శివలాల్ రాథోడ్(49) అనే వ్యక్తి ఒంటికి జిలెటిన్ స్టిక్స్ కట్టుకుని మంగళవారం పేల్చుకున్నాడు. ఈ ఘటనలో అతనితోపాటు అతని కూతురు మీరా రాథోడ్(15) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శివలాల్ భార్య సవిత, కుమారుడు ప్రకాశ్, సమీప బంధువు సురేఖ చౌహాన్, ఆమె కుమారుడు వివేక్ చౌహాన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని కలబురగి జిమ్స్ ఆస్పత్రికి తరలించారు. శివలాల్, సవిత దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దీంతో సవిత తన ఇద్దరు పిల్లలతో కలిసి సమీప బంధువు సురేఖ ఇంట్లో ఉంటున్నారు. శివలాల్ ఒంటరిగా ఉండేవారు. మంగళవారం ఉదయం తన భార్య, పిల్లలు ఉంటున్న సురేఖ ఇంటికి ఆయన వెళ్లారు. లోపలికి ప్రవేశించగానే తలుపులు మూసేసి, జిలెటిన్ స్టిక్స్‌ను పేల్చుకున్నారు. పేలుడు తీవ్రతకు శివలాల్, ఆయన కూతురు మీరా శరీరాలు ఛిద్రమయ్యాయి. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్ నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

అబుజా (నైజీరియా): ఘర్షణలతో తీవ్రంగా ప్రభావితమైన దేశ ఉత్తర ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో తిరుగుబాటుదారులు, నైజీరియా భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది పోలీసు అధికారులు మృతి చెందారని అధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం కెబ్బీ రాష్ట్రంలోని సకాబా కౌన్సిల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘర్షణలో ఇద్దరు పౌరులు, 17 మంది తిరుగుబాటుదారులు కూడా మృతి చెందారని పోలీసు ప్రతినిధి బషీర్ ఉస్మాన్ ప్రకటనలో తెలిపారు. అంటే మొత్తం కలిపి 29 మంది మృతి చెందారు. తిరుగుబాటుదారులు మోటార్‌సైకిళ్లపై ప్రయాణిస్తూ, భారీ ఆయుధాలతో ఉన్న సమయంలో భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయని ఉస్మాన్ తెలిపారు. నైజీరియా పట్టణాలు, గ్రామాలపై తరచూ దాడులు చేసే సాయుధ ముఠాలు ఎక్కువగా ఉన్న జంఫారా రాష్ట్ర సరిహద్దు సమీపంలో వారు కనిపించారని చెప్పారు. “దురదృష్టవశాత్తు ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది పోలీసు సిబ్బందిని కోల్పోయాం. ఇద్దరు గాయపడ్డారు. వారికి వైద్య చికిత్స అందుతోంది” అని పోలీసు ప్రతినిధి తెలిపారు. తిరుగుబాటుదారులు నైజీరియా ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో చురుకుగా ఉన్న సాయుధ ముఠాలకు చెందినవారు. వీరిని స్థానికంగా "బాండిట్స్" అని పిలుస్తారు. తిరుగుబాటు, హింసకు పేదరికం, నిరుద్యోగం ఎక్కువగా ఉండటం, ప్రభుత్వ నియంత్రణ బలహీనంగా ఉండటం, జాతి, భూవివాదాలు తీవ్రరూపం దాల్చడం, పశువుల కాపరులు, రైతుల మధ్య ఘర్షణలు పెరగడం వంటివి కారణాలు. ఆయుధాలు సులభంగా అందుబాటులో ఉంటున్నాయి. కొంతమంది నేర ముఠాలు గ్రామాలపై దాడులు చేసి డబ్బు వసూలు చేయడం, అపహరణలకు పాల్పడుతున్నారు. జంఫారా, కెబ్బీ, సోకోటో, కత్సీనా రాష్ట్రాల్లో ఇలాంటి సాయుధ గుంపులు తరచూ భద్రతా బలగాలపై, గ్రామాలపై దాడులు చేస్తుంటాయి. ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు) ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు) కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు) కొత్త కరెన్సీ వచ్చేస్తోంది.. 100 కోట్ల ప్లాస్టిక్ నోట్లతో కేంద్రం ట్రయల్ ఒక్క ఉద్యోగం లేని టెసారా

హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్, ఆగస్టు11: హైదర్ షాకోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ మృతి కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని నార్సింగి ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు ఓనర్ శంషాబాద్‌కు చెందిన క్రాంతి గౌడ్‌గా గుర్తించినట్లు తెలిపారు. మంగళవారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. హైదర్ షా కోటలోని తన అత్తగారింటికి బోనాల పండుగ సందర్భంగా అతడు వచ్చారని చెప్పారు. తన బావమరిది వికాస్ గౌడ్‌తో కలిసి పార్టీ చేసుకున్నారని అన్నారు. అనంతరం తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని లంగర్ హౌస్ వైపు వారంతా కారులో అతి వేగంగా బయలుదేరారని పేర్కొన్నారు. ఆ క్రమంలోనే రిటైర్డ్ ఆర్మీ జవాన్ రవీందర్‌తోపాటు బైక్‌ను కారుతో ఢీకొట్టారని తెలిపారు. అయితే రవీందర్ అక్కడికక్కడే మరణించగా.. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని చెప్పారు. ఈ కేసులో పట్టుబడిన నలుగురికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశామన్నారు. వీరంతా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిందన్నారు. అలాగే వీరికి డ్రగ్స్ పరీక్షలు కూడా నిర్వహించగా.. నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన వీరిపై 204 పార్ట్ 4 ఐపీసీతోపాటు మోటార్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు తీయొద్దని ప్రజలకు నార్సింగ్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం తెల్లవారుజామున హైదర్ షాకోట్ ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర ఎస్యూవీ 350 కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన వెళ్తున్న పాదచారులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్ గాలిలోకి ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు. అనంతరం బైక్ మీదకు

హైదరాబాద్‌లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఈ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం రాపిడో బైక్‌పై వెళ్తున్న ఇద్దరినీ ఈ కారు ఢీకొట్టింది. బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఒకరికి కాలు విరిగింది. గాయపడిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి నార్సింగి పోలీసులు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలి నలుగురు యువకులు పరారయ్యారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఢీకొట్టిన కారు శంషాబాద్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ కారు అతివేగంగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం: జిల్లాలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కట్ట సుమిద్రి, సవర జోరాగా గుర్తించారు. బాధితులంతా వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాతకోటలో విషాద ఛాయలు అలుముకోగా.. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎల్‌నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై కారు, లారీని ఢీకొని ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్: ధార్ జిల్లాలో ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బద్నావర్-ఉజ్జయిన్ రహదారి పంచకవాస వద్ద ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కారును లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనాల వద్దకు చేరుకుని క్షతగాత్రుడిని బయటకు తీశారు. అనంతరం బద్నవార్లోని సివిల్ ఆస్పత్రికి బాధితుడిని తరలించారు. సమాచారం అందుకున్న బద్నవార్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అమిత్ సింగ్ కుష్వా తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో నుజ్జునుజ్జు అయిన కారు నుంచి అతి కష్టం మీద మృతదేహాలను వెలికితీశారు. వాటిని బద్నవార్ సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ స్పందించారు. లారీ ప్రమాదవశాత్తూ కారును ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడినట్లు వెల్లడించారు. బాధితులంతా గుజరాత్‌లోని వడోదరకు చెందిన వారిగా తెలిపారు. వారంతా ఉజ్జయిన్‌లోని మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ పేర్కొన్నారు. బారామతిలో మరో విమాన ప్రమాదం.. పైలట్లకు తప్పిన ప్రాణాపాయం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉమ్మడి వ్యూహాన్ని ప్రకటిస్తాం: ఖర్గే