
సెంచరీతో చెలరేగినా తప్పని ఓటమి.. కట్ చేస్తే.. పాక్ బౌలర్ పైబ్యాట్ ఎత్తిన రోహిత్ మాజీ టీంమేట్
Kieron Pollard Fight Asif Mehmood: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ సోదర ఫ్రాంచైజీ 'ఎమ్ఐ న్యూయార్క్' తరఫున ఆడుతూ 39 ఏళ్ల వయసులోనూ మైదానాన్ని ఊపేశాడు. అయితే, ఈ అద్భుత ఇన్నింగ్స్ సమయంలోనే పాత ఐపీఎల్ గొడవలను గుర్తుచేసేలా ఒక తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. సింహం వయసు పెరిగినా వేట మారలేదు: పోలార్డ్ సంచలన శతకం.. ముంబై ఇండియన్స్ అభిమానులకు కీరన్ పోలార్డ్ అంటే ఒక భరోసా. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటిచేత్తో గెలిపించే 'క్లచ్ గాడ్'గా అతనికి పేరుంది. 2022 నవంబర్‌లో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అతనిలో కసి అస్సలు తగ్గలేదని ఆదివారం నాటి మ్యాచ్ నిరూపించింది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో పోలార్డ్ కేవలం 56 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయంగా 100 పరుగులు సాధించాడు. అతని సుదీర్ఘ టీ20 కెరీర్లో ఇది రెండో శతకం కావడం విశేషం. వయసు కేవలం అంకె మాత్రమేనని ఈ వెస్టిండీస్ పవర్‌హౌస్ మరోసారి చాటిచెప్పాడు. మైదానంలో రచ్చ రచ్చ.. స్టాక్ వివాదాన్ని గుర్తుచేసిన పోలార్డ్..! ఈ మ్యాచ్ కేవలం పోలార్డ్ సెంచరీ కోసమే కాకుండా, మైదానంలో జరిగిన ఒక తీవ్రమైన ఘర్షణ కారణంగా క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 2014 ఐపీఎల్ సీజన్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌పైకి పోలార్డ్ బ్యాట్ విసిరేంత పని చేసిన ఘటన క్రికెట్ ప్రేమికులు అంత సులువుగా మర్చిపోలేరు. సరిగ్గా అలాంటి సీన్ ఇక్కడ పునరావృతమైంది. పాకిస్తాన్ బౌలర్‌తో పొలార్డ్ గొడవకు సంబంధించిన వీడియో.. Some rivalries. Some reactions. Never get… — Star Sports (@StarSportsIndia) June 21, 2026 పోలార్డ్ 19 బంతుల్లో 21 పరుగులతో క్రీజులో ఉన్నప్పుడు, పాకిస్తాన్ సంతతికి చెందిన యూఎస్ఏ బౌలర్ ఆసిఫ్ మహమూద్ గంటకు 139.8