
పాకిస్థాన్ వెళ్లి.. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని పెళ్లాడి.. వామ్మో పెద్దప్లానే వేసింది కానీ
భారత్ కు సరిహద్దు దేశమైన పాకిస్థాన్ తో ఎప్పుడూ ప్రమాదం పొంచి ఉంటూనే ఉంటుంది. ఇప్పటికే అనేకసార్లు భారత్ పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అయితే ప్రతిసారీ భారత్ ఆ ఉగ్రమూకలను గట్టిగా బుద్ధి చెబుతూ వస్తూనే ఉంది. కానీ ఆ టెర్రరిస్టు మూకలు మాత్రం భారత్ టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తూనే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రమూకలు జరిపిన మారణహోమంలో 25 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలతో భారత్- పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇక పాకిస్థాన్ అంటే భారతీయులకు ఎప్పుడూ పడదు. అయితే రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన ఓ 38 ఏళ్ల మహిళ ఇటీవల పాకిస్థాన్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. నేపాల్ మీదుగా పాకిస్థాన్ లోకి ఎంటర్ అయ్యేందుకు యత్నించి అధికారులకు చిక్కింది. తీరా ఆమెను ఆరా తీయగా.. తాను జైషే మహ్మద్ టెర్రరిస్ట్ సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ కు సన్నిహితుడైన ఓ టెర్రరిస్ట్ కమాండర్ ను పెళ్లి చేసుకునేందుకు వెళ్తున్నట్లు బదులిచ్చింది. దాంతో ఒక్కసారిగా షాకైన పోలీసులు ఆ మహిళను కస్టడీలోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పోలీసులు, అధికారులు కంగు తిన్నారు. ఆమె పేరు బబితా ధకడ్ అలియాస్ ఖదీజా(38) ఆమె రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన మహిళ. సీతాపుర ప్రాంతంలో తన తల్లిదండ్రులతో ఆమె నివసిస్తోంది. అయితే ఆపరేషన్ సింధూర్ ఘటన జరిగిన తర్వాత పాకిస్థాన్ లోని ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉండాలని భావించి సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లో పాకిస్థాన్ ప్రొఫైల్స్ ఉన్న వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ లు