
గుజరాత్ లో జైష్ ఎ-మహమ్మద్ విస్తరణవ్యూహం భగ్నం.. ఏటీఎస్ ఆపరేషన్ వెనుక ఉన్న సంచలన నిజాలు
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ (జేఈఎమ్) ఇండియాలో మళ్లీ తన కోరలు చాచడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ భారత దేశంలోని కీలక రాష్ట్రమైన గుజరాత్లో నిశ్శబ్దంగా ఒక భారీ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు ఆ సంస్థ వేసిన ఒక రహస్య ప్రణాళికను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సమర్థవంతంగా భగ్నం చేసింది. కేవలం ఒక ఉగ్రవాద ముఠాను పట్టుకోవడమే కాకుండా.. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థలకు ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను ఈ ఆపరేషన్ బహిర్గతం చేసింది. బనస్కాంత, పటాన్, నవసారి, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ వంటి వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఎనిమిది మంది ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పట్టుబడిన వారిలో కొందరు స్థానిక విద్యాసంస్థలు, మతపరమైన కేంద్రాలతో సంబంధాలు కలిగి ఉండటం, అంతర్జాలం ద్వారా యువతను తప్పుదోవ పట్టించే వ్యూహాలు అమలు చేయడం వంటి వాస్వాలు ఈ దర్యాప్తులో వెలుగుచూశాయి. సరిహద్దుల అవతల నుంచే కాకుండా.. దేశం లోపల స్థానికంగా స్లీపర్ సెల్స్, లాజిస్టికల్ సపోర్ట్ గ్రూపులను తయారు చేయడం ద్వారా జైష్ సంస్థ కొత్త కొత్త పద్ధతుల్లో విస్తరించాలని చూస్తోందని స్పష్టమవుతోంది. భారతదేశ చరిత్రలో జైష్-ఎ-మహమ్మద్ అత్యంత కిరాతకమైన దాడులకు పాల్పడిన రికార్డు ఉంది. గతంలో దేశ రాజధానిలో పార్లమెంట్‌పై జరిగిన దాడితో పాటు, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడి వెనుక ఈ సంస్థే కీలక పాత్ర పోషించింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజార్ రాసిన తీవ్రవాద గ్రంథాలు, ఆడియో, వీడియో సందేశాల ద్వారా యువత ఆలోచనా విధానాన్ని కలుషితం చేయడం జైష్ అనుసరిస్తున్న పాత పద్ధతి. అయితే.. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ రాష్ట్రం భద్రతా పరంగా ఎంతో సున్నితమైన ప్రాంతంగా ఉంటూ వస్తోంది. ఇక్కడి కమ్యూనల్ వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాద శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ, గుజరాత్ ఏటీఎస్

