
దౌత్యంతోనే ఘర్షణలకు పరిష్కారం
ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న... ఉగ్రవాదంతో మొత్తం మానవాళికే తీవ్రమైన సవాళ్లు.. ఆపరేషన్ సిందూర్లో ఉగ్ర శిబిరాలు ధ్వంసం చేశాం 8 ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీ్సతో మోదీ ద్వైపాక్షిక చర్చలు 8 అణు ఇంధనం, సముద్ర భద్రత, కీలక ఖనిజాలతో పాటు 8 ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంత బలంగా ఎప్పుడూ లేవు: అల్బనీస్ మెల్బోర్న్, జూలై 9: ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే కాకుండా మొత్తం మానవాళికే తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, సంఘర్షణలను చర్చలు, దౌ త్యం ద్వారా మాత్రమే పరిష్కరించగలమని స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ‘ఇండో-పసిఫిక్ అనేది కేవలం రెండు మహా సముద్రాల సంగ మ స్థానం మాత్రమే కాదు. ఇది భారత్, ఆస్ట్రేలియా వంటి భావసారూప్య ప్రజాస్వామ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు ప్రతీక’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయాన వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ఆయన ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీ్సతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం భారత్లోని అణు విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరాను సులభతరం చేసే పౌర అణు ఇంధన ఒప్పందంతో పాటు సముద్ర భద్రత, కీలక ఖనిజాల రంగాలకు సంబంధించిన 18 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ), ద్వైపాక్షిక పెట్టుబడి రక్షణ విధానాన్ని ఖరారు చేసే దిశగా వేగంగా పనిచేయాలని నిర్ణయించాయి. బొగ్గు, డీజి ల్, ఇతర ద్రవ ఇంధనాలు, సహజ వాయువుల సరఫరాను కొనసాగించడం



