© 2026 nimisham.in

భారత్, ఆస్ట్రేలియా మధ్య బంధం ఎంత వేగంగా, ఎంత పటిష్ఠంగా ఉందో ప్రధాని నరేంద్ర మోదీ క్రికెట్ పోలికలతో చక్కగా వివరించారు. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి నిర్వహించిన వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య నిర్ణయాలు టీ20 మ్యాచ్ అంత వేగంగా జరుగుతాయని, ఈ భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత లోతైనదని, పటిష్ఠమైనదని ఆయన అభివర్ణించారు.మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియాలో పర్యటన ముగించుకుని నిన్న మెల్బోర్న్కు చేరుకున్న ప్రధాని మోదీ, ఇవాళ అల్బనీస్‌తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక, ఆర్థిక, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది.ప్రపంచ క్రీడా రాజధానిగా పేరుగాంచిన మెల్బోర్న్లో, రెండు దేశాలను కలిపే 'దౌత్య భాష' క్రికెట్ అని మోదీ అన్నారు. "మా సమావేశాలు ఒక క్రికెట్ మ్యాచ్ లాంటివి. మా ఎజెండా వన్డే ఇంటర్నేషనల్ అంత స్పష్టంగా ఉంటుంది. మా నిర్ణయాలు టీ20 మ్యాచ్ అంత వేగంగా ఉంటాయి. మా భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత శాశ్వతమైనది, లోతైనది" అని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.ఈ సదస్సులో ఒక చారిత్రాత్మక అణు సహకార ఒప్పందం కుదరడం అత్యంత కీలక పరిణామం. ఇది ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. దీంతో పాటు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లోనూ తీవ్రంగా ఖండిస్తూ ఇరు దేశాధినేతలు ఒక సంయుక్త