
ఆడింది 4.. గెలిచింది 0.. ఎవ్వరూ కోరుకోని చెత్త లిస్ట్ లో సర్పంచ్ సాబ్
Shreyas Iyer Captaincy: ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పోరాడి ఓడింది. ఈ ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో వెనుకబడటమే కాకుండా, భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక అత్యంత నిరాశాజనకమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విజయ రికార్డుపై ఈ ప్రభావం పడింది. భారత క్రికెట్ చరిత్రలో ఎంతో మంది దిగ్గజ కెప్టెన్లు తమదైన ముద్ర వేశారు. కానీ ప్రస్తుత టీ20 సారథి శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం కెప్టెన్సీ కెరీర్ ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చవిచూడటంతో, అయ్యర్ కెప్టెన్సీలో ఒక అవాంఛనీయ రికార్డు నమోదైంది. Video: విజయం ముంగిట భారత్.. కట్‌చేస్తే.. టీమిండియా కొంపముంచిన ఆ రెండు ఓవర్లు..! ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బ్యాటర్లు పట్టుదలగా ఆడి బోర్డుపై మంచి స్కోరును ఉంచారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 43 పరుగులతో రాణించగా, ఇషాన్ కిషన్ 49 పరుగులతో మెరిశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బాధ్యతాయుతంగా ఆడి 37 పరుగులు జోడించారు. చివరి ఓవర్లలో తిలక్ వర్మ కేవలం ఒకే ఓవర్లో 17 పరుగులు రాబట్టి, మొత్తం 24 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ప్రారంభంలోనే భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ గట్టి షాక్ ఇచ్చాడు. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్‌లను తక్కువ పరుగులకే పెవిలియన్ చేర్చాడు. అయితే హ్యారీ బ్రూక్ కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఇంగ్లండ్ వైపు మ్యాచ్‌ను తిప్పాడు. ఆ తర్వాత జాకబ్ బెథెల్ అద్భుత ఇన్నింగ్స్




.webp)





