
మనిషికి ఎక్కించిన తొలి రక్తం మరో మనిషిది కాదు గొర్రెది.. రక్తమార్పిడి చికిత్స ఇలాగే మొదలైంది
ఒకప్పుడు రక్త మార్పిడి అనేది అసాధ్యమైన వైద్య ప్రక్రియగా భావించేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో సురక్షితంగా జరిగే ఈ చికిత్స వెనుక ఎన్నో సంవత్సరాల పరిశోధనలు, విజయాలు, వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి రక్తం ఎక్కించడం చాలా నార్మల్ విషయం. శతాబ్దాల క్రితం వైద్యులు రక్తం ఎలా పనిచేస్తుందో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిలో కొన్ని ప్రయోగాలు ప్రాణాలు మీదకి తీసుకొచ్చాయి. 17వ శతాబ్దంలో రక్త మార్పిడిపై పరిశోధనలు పెరిగాయి. ఆ కాలంలో మనిషికి జంతువుల రక్తాన్ని ఎక్కిస్తే ప్రాణాలు కాపాడవచ్చని కొందరు వైద్యులు భావించారు. అందుకే 1667లో ఫ్రాన్స్‌కు చెందిన వైద్యుడు జీన్-బాప్టిస్ట్ డెనిస్ ఒక ప్రయోగం చేపట్టారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ బాలుడికి గొర్రె నుంచి తీసిన రక్తాన్ని ఎక్కించారు. అయితే వెంటనే ఆ బాలుడు కోలుకోవడంతో ఈ ప్రయోగం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగినా ప్రతిసారి ఫలితాలు ఒకేలా రాలేదు. కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తగా, మరికొన్ని సందర్భాల్లో మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో జంతువుల నుంచి మనుషులకు రక్తం ఎక్కించే విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు అనేక దేశాలు ఈ ప్రయోగాలను నిలిపివేసి, అలాంటి విధానాలపై ఆంక్షలు విధించాయి. ఆ రోజుల్లో రక్త గ్రూపుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. ఏ రక్తం ఎవరికి సరిపోతుందో తెలియకపోవడంతో రక్త మార్పిడి అత్యంత ప్రమాదకరంగా మారేది. అయితే కాలక్రమేణా వైద్యరంగంలో జరిగిన పరిశోధనలు ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి. 1818లో బ్రిటన్‌కు చెందిన వైద్యుడు జేమ్స్ బ్లండెల్ విజయవంతంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి రక్తం ఎక్కించి వైద్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అనంతరం 1900లో శాస్త్రవేత్త కార్ల్ లాండ్‌స్టైనర్ రక్త గ్రూపులను కనుగొనడంతో రక్త