
మేక మాంసం, గొర్రె మాంసం రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? ఏది తినడం బెటర్
సండే వచ్చిందంటే చాలు నాన్-వెజ్ ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. ఇక మటన్ ప్రియుల విషయానికి వస్తే.. మార్కెట్లో దొరికే మేక మాంసం లేదా గొర్రె మాంసం రెండింటినీ 'మటన్' అని పిలుస్తూ లాగించేస్తుంటారు. రెండింట్లోనూ ప్రోటీన్, ఐరన్, బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, కొవ్వు, కేలరీల విషయంలో ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. మరి ఆరోగ్య దృష్ట్యా ఏది బెస్ట్? ఏది తింటే మన ఒంటికి మంచిది? అసలు నిజాలేంటో చూద్దాం! మేక మాంసంలో సంతృప్త కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ప్రోటీన్ & పోషకాలు: కండరాల బలానికి కావలసిన ఉత్తమ ప్రోటీన్‌తో పాటు ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, విటమిన్ B12 ఇందులో పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొలెస్ట్రాల్: ఇతర రెడ్ మీట్స్‌తో పోలిస్తే మేక మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి ఇది మంచిదే. గొర్రె మాంసం( మటన్) లో కూడా ప్రోటీన్, ఐరన్ , విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో లభించే 'హీమ్ ఐరన్' రక్తహీనత ఉన్నవారికి త్వరగా ఐరన్‌ను అందిస్తుంది. అధిక కొవ్వు: గొర్రె మాంసంలో కొన్ని భాగాలలో సంతృప్త కొవ్వు , కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ గొర్రె మాంసంలో కొవ్వు శాతం ఎక్కువ కాబట్టి దీనిని పరిమితికి మించి తరచుగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు. తక్కువ కొవ్వు, తక్కువ కేలరీలు ఉంటూనే.. అధిక ప్రోటీన్ అందించే విషయంలో మేక మాంసం ముందు ఉంటుంది. అయితే గొర్రె మాంసంలో పోషకాలు లేవని కాదు, అందులో కొవ్వు శాతం కొంచెం ఎక్కువ. అందుకే.. ఈ రెండింటిలో మేక మాంసమే ఆరోగ్యానికి మంచిది. అయితే.. మనం సరిగా వండినప్పుడు మాత్రమే పోషకాలు మనకు అందుతాయి.మీరు