
టీమిండియా వరుస ఓటములు.. అసలు లోపం ఎక్కడుందో చెప్పిన గౌతమ్ గంభీర్
Gautam Gambhir : ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 125 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలుకావడం పై భారత క్రికెట్ జట్టు ముఖ్య కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారిగా పెదవి విప్పారు. జట్టు పేలవ ప్రదర్శనపై ఆయన స్పందిస్తూ.. టీమిండియా ప్రస్తుతం ఒక మార్పు లేదా రీసెట్ దశ గుండా వెళుతోందని, కాబట్టి యువ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో తమను తాము నిరూపించుకోవడానికి కొంత సమయం ఇవ్వడం ఎంతో అవసరమని అన్నారు. కేవలం అనుభవం లేకపోవడమో లేదా ఫామ్ సరిగ్గా లేకపోవడమో మాత్రమే ప్రస్తుత సమస్య కాదని, భారత జట్టు అసలు ఏ విషయంలో వెనుకబడి ఉందో గంభీర్ క్లియర్ కట్‌గా వివరించారు. గౌతమ్ గంభీర్ అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత భారత జట్టులో సాంకేతిక లోపాలకంటే కూడా గేమ్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంది. ఐర్లాండ్ పర్యటన నుంచి మొదలై ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ వరకు మన ఆటగాళ్లు మ్యాచ్ జరుగుతున్న తీరును, పిచ్ కండిషన్లను సరిగ్గా అంచనా వేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారని మండిపడ్డారు. పిచ్ ఎలా ప్రవర్తిస్తోంది, గాలి ఏ వైపు వీస్తోంది, మైదానంలో ఏ వైపు బౌండరీ పెద్దగా ఉంది, ఏ సమయంలో భారీ షాట్లకు ప్రయత్నించి రిస్క్ తీసుకోవాలి అనే చిన్న చిన్న విషయాలను గమనించడంలో ఆటగాళ్లు తప్పులు చేస్తున్నారని, టీ20 క్రికెట్లో ఇవే మ్యాచ్ ఫలితాలను మార్చేస్తాయని గంభీర్ విశ్లేషించారు. గతంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుతో ప్రస్తుత యువ జట్టును పోల్చడం ఎంతమాత్రం సరికాదని హెడ్ కోచ్ స్పష్టం చేశారు. ఇప్పుడు జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చారని, ఓపెనింగ్ జోడీ సరికొత్తగా ఉందని గుర్తు చేశారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఈ జట్టులో లేరని చెప్పారు. ఒక జట్టును పూర్తిగా రీసెట్ చేస్తున్నప్పుడు ఒడిదుడుకులు సహజమన్న ఆయన.. 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా వస్తున్నాడని, యువ
