ఫౌజీ’పైప్రభాస్స్పెషల్ ఫోకస్.. షూటింగ్ లేకపోయినా సెట్స్ కు వెళ్లి మానిటర్ ముందు కూర్చుంటున్న రెబల్‌స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఒకేసారి మూడు భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే, ఇంకో మూవీ సెట్స్ లో అడుగుపెడుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు. మరోవైపు కొత్త కథలు వింటున్నారు. ఇంత బిజీగా ఉన్న హీరో ఎవరైనా షూటింగ్ లేకపోతే రెస్ట్ తీసుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తన షూట్ లేకపోయినా సెట్స్ కి వెళ్లి మానిటర్ ముందు కూర్చుంటున్నారట.ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’.. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2’ సినిమాల్లో నటిస్తున్నారు. మూడింటికీ డేట్స్ అడ్జెస్ట్ చేస్తూ, షూటింగులు కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకేసారి మూడు పెద్ద సినిమాలు చేస్తూ, ఇంత బిజీగా ఉన్న హీరో మరొకరు లేరనే చెప్పాలి. ఇలా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్న ప్రభాస్.. షూటింగ్ లేకపోతే విశ్రాంతి తీసుకోకుండా ‘ఫౌజీ’ సెట్స్ లోకి రవివెళ్లి కూర్చుంటున్నారట. ఈ విషయాన్ని నిర్మాత వై. శంకర్ తెలిపారు.‘ఫౌజీ’ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్కిస్తున్నారు. భీమవరంలో జరిగిన రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న వై. రవి శంకర్.. ‘ఫౌజీ’ సినిమా గురించి మాట్లాడారు. “రోజూ మార్నింగ్ 8 గంటల నుంచి ఈవెనింగ్ 6.30 గంటల వరకు ప్రభాస్ అన్న ‘ఫౌజీ’ షూటింగ్ లోనే ఉంటున్నారు. ఆయనకు వర్క్ లేకపోయినా, షూట్ కి వచ్చి మానిటర్ దగ్గర కూర్చొని మొత్తం జాగ్రత్తగా చూసుకుంటున్నారు” అని నిర్మాత రవి తెలిపారు.ప్రభాస్ గురించి మైత్రీ రవి శంకర్ చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే.. ‘ఫౌజీ’ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అర్థమవుతోంది. ఏదో తన భాగం షూటింగ్ కంప్లీట్