
Super El Niño | సూపర్ ఎల్ నినోతో 4.5 లక్షల మరణాలు..! ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో 15,800 చావులు!
Super El Niño | సూపర్ ఎల్ నినోతో 4.5 లక్షల మరణాలు..! ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో 15,800 చావులు!

Super El Niño | సూపర్ ఎల్ నినోతో 4.5 లక్షల మరణాలు..! ఉష్ణోగ్రతల వల్ల భారత్‌లో 15,800 చావులు!

El Nino: ఏపీకి పెరుగుతున్న ముప్పు..! చంద్రబాబు కీలక ఆదేశాలు..!

El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..

El Nino: 2009 నాటి ఘోర పరిస్థితి తర్వాత.. 17 ఏళ్లకు మళ్లీ అదే సీన్!

El Nino లోడ్ పెరిగింది, విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ హై! 15 రోజులకే నిల్వలు

El Nino Effect: ఎల్‌నినో ఎఫెక్ట్ మనపైనే కాదు.. వన్యప్రాణులపై కూడా..

Godzilla El Nino: దూసుకొస్తున్న గాడ్జిల్లా ఎల్ నినో.. పసిఫిక్‌లో మార్పులను గుర్తించిన ఇస్రో ఉపగ్రహం!

El Nino: సెప్టెంబర్ మూడో వారం నుంచి కరువు?

El Nino: ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి

El Nino: కరువు వచ్చేసిందా? 78.3 శాతం వర్షభావంతో టాప్

ఆగస్టు నెల అంటేనే వర్షాలు, పచ్చదనంతో ప్రశాంతంగా ఉండాల్సిన సమయం. కానీ, ఈ ఏడాది పరిస్థితి బొత్తిగా మారపోయింది! భానుడి భగభగలకు 125 సంవత్సరాల వాతావరణ చరిత్ర తలకిందులైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో దేశవ్యాప్తంగా కరెంట్ వాడకం అనూహ్యంగా పెరిగింది. ఫలితంగా గత ఐదేళ్లలోనే ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెలలో విద్యుత్ వినియోగం సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఒకవైపు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, మరోవైపు ఏకిపారేస్తున్న విద్యుత్ డిమాండ్‌తో దేశంలోని విద్యుత్ సరఫరా వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం 1901 తర్వాత.. అంటే గత 125 సంవత్సరాలలో భారతదేశంలో నమోదైన అత్యంత వేడి కలిగిన ఆగస్టు నెలగా ఈ ఏడాది ఆగస్టు నిలిచింది. పగటి పూట ఎండలతో పాటు రాత్రి పూట కూడా సగటు కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. ఉక్కపోత, తేమ శాతం తీవ్రంగా పెరగడంతో ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు నిరంతరాయంగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రాత్రిపూట కరెంట్ వాడకం తగ్గుతుందని భావిస్తారు, కానీ ఈసారి రాత్రివేళల్లో కూడా ఏసీల వాడకం విపరీతంగా పెరగడం విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోవడానికి ప్రధాన కారణమైంది.గత ఐదేళ్ల రికార్డులన్నీ గాల్లోకి!కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ మరియు ఎన్ఎల్డీసీ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఏకంగా 258.27 గిగావాట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో నమోదైన 229.72 గిగావాట్లతో పోలిస్తే ఇది ఏకంగా 12.4 శాతం ఎక్కువ. ఇక మొత్తం కరెంట్ వినియోగం చూసుకుంటే 169.01 బిలియన్ యూనిట్లకు చేరుకుని 12.85 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. మే నెలలో నమోదైన ఆల్ టైమ్ హై (270.82 GW) తర్వాత, ఈ స్థాయిలో కరెంట్ డిమాండ్ పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.ఎల్ నినో దెబ్బకు అమెజాన్, దాని ఉప నదులు
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో అధిక నీటి వినియోగం అవసరమయ్యే వరి, మిర్చి పంటలు సాగు చేయవద్దని రైతులకు సూచించారు. అనంతపురం కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లాలో సాగునీటి పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, రైతులకు నీటి కేటాయింపులు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పయ్యావుల.. ఎల్ నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు.1994 నుంచి తనకు HLC కాలువతో అనుబంధం ఉందని.. మూడు దశాబ్దాల అనుభవంలో ఇంతటి విపత్కర పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని పయ్యావుల తెలిపారు. సాగుకు నీరు అందించడంపై ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని, రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు సూచించామని పేర్కొన్నారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు దెబ్బతింటే, చరిత్రలో నిలిచిపోయేలా ఒకే సీజన్లో డ్యామ్‌కు ఉన్న 33 గేట్లను మార్చి రికార్డు సృష్టించామన్నారు. హెచ్ఎల్సీలో ఎనిమిది బ్రిడ్జిలు కూలిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా మారితే గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న పయ్యావుల కేశవ్.. కొత్త బ్రిడ్జిలను నిర్మించామని తెలిపారు.మరోవైపు కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు జూలై 31, 2027 వరకు సరిపడా నీటిని నిల్వ చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ముందుగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, తాగునీటికి కేటాయింపులు చేసిన తర్వాతే చెరువులకు నీరు అందించే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి, మిర్చి పంటలు సాగు చేయవద్దన్న మంత్రి..ఈసారి వరి, మిర్చి పంటలకు నీరు అందించే అవకాశం లేదని, ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాగునీటి వినియోగం

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎన్ నినో ప్రభావంతో వర్ష పాతం తక్కువగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతం కనిపిస్తోంది. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి లో వర్షాలు లేవని తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాల కు తాజా హెచ్చరికలు జారీ చేసింది.తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై ఐఎండీ తాజా అలర్ట్స్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా ప్రాంతంలోని పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. అదే విధంగా వర్షాల సమయంలో బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని తెలిపింది.వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్ఇక, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణం మారనుందని, పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.ఐఎండీ అంచనాల ప్రకారం, సెప్టెంబర్‌లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో 91 శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, అయితే వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.మరోవైపు, దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. దీనివల్ల వాతావరణంలో వేడి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ‘ఎల్ నినో’ పరిస్థితులు నెలకొనడమే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. ఈ ఎల్ నినో ప్రభావం మున్ముందు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం, జలవనరులు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి ఈశాన్య రుతుపవనాలపై అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ఐఎండీ వెల్లడించింది

ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్‌నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66

సాక్షి, హైదరాబాద్: మహా నగరంలో ఎల్‌నినో మబ్బుల్లో మాన్సూన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. సగటున 20 శాతం తక్కువగా నమోదు కాగా, తూర్పు ప్రాంతాల్లో మాత్రం లోటు 36 శాతం స్థాయికి చేరుకుందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజువారీ చినుకుల తీవ్రత తగ్గి.. 10 నుంచి 20 నిమిషాల వరకే వర్షం పరిమితమవుతోంది. ఫలితంగా భూమి సరిగా తడవకపోవడంతో భూగర్భజలాలు మరింత లోతుకు పడిపోతున్నాయి. నైరుతి రుతు పవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరం నుంచి ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తాయి. ఈ ఏడాది జూన్¯ 8న ప్రవేశించి, 23 నాటికి పూర్తిగా విస్తరించినా.. జూన్‌లో సాధారణం కంటే తక్కువగా నమోదైంది. జూలైలో కొంత మెరుగుదల కనిపించినా ఆగస్టులో మళ్లీ లోటు పెరిగింది. ఈ సీజన్లో మరో 41 రోజులు మిగిలి ఉన్నప్పటికీ సాధారణ లోటుకూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. లోతుకు భూగర్భ జలాలు.. ఐటీ, పారిశ్రామిక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఊహించని విధంగా 20 మీటర్ల కంటే ఎక్కువ లోతుకు పడిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నాటి వర్షానంతర కాలంతో తాజా నివేదికలను పోల్చి చూస్తే భూగర్భ జలమట్టాలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. అత్యధికంగా తూర్పు ప్రాంతంలో సగటు నీటి మట్టం 6.51 మీటర్లు మాత్రమే ఉండగా, ఆగస్టు నాటికి అది ఏకంగా 14.03 మీటర్లకు పడిపోయింది. బోరుబావుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడేస్తుండటమే ఈ తీవ్ర క్షీణతకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లో మిగిలి ఉన్న రోజుల్లో సుదీర్ఘ, తీవ్రమైన వర్షాలు కురిస్తేనే భూజలాలు పెరిగే అవకాశముంది. లేనిపక్షంలో క్యూర్ పరిధిలో నీటి ఒత్తిడి మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు శారీలో హీరోయిన్ ఆదితి శంకర్ అందాలు.. ఫోటోలు వరలక్ష్మీ వ్రతం స్పెషల్