మహిళలకు రూ.5కే ఆటోప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan
మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan
మహిళలకు రూ.5కే ఆటో ప్రయాణం| Tirupati Auto Driver Ajith ₹5 Ride For Women| Vijay Fan

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

Vizianagaram: సీతంలో ఇండోసోల్ పూల్ క్యాంపస్ డ్రైవ్ - అర్హతలు ఇవే! Vizianagaram: సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూల్ క్యాంపస్ నియామక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్ సహకారంతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు సీతం కళాశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. బీటెక్‌లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్‌తో పాటు డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చు. 2023 నుంచి 2026 వరకు బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులతో పాటు ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులు కూడా అర్హులని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఎంపికైన వారికి విద్యార్హతను బట్టి వార్షిక వేతన ప్యాకేజీ అందించనున్నారు. బీటెక్ అభ్యర్థులకు రూ.2.16 లక్షలు, డిగ్రీ, డిప్లొమా అభ్యర్థులకు రూ.1.90 లక్షలు, ఐటీఐ అభ్యర్థులకు రూ.1.80 లక్షలు వేతనంగా నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ సోలార్ సంస్థలో ఉద్యోగం పొందేందుకు ఈ నియామక కార్యక్రమం మంచి అవకాశమని సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మూర్తి తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. మీడియా రంగంలో 9 సంవత్సరాల విస్తృతమైన క్షేత్రస్థాయి అనుభవంతో.. సమకాలీన రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన విజయనగరం ‘స్టాఫ్ రిపోర్టర్’
అమెరికాలో డ్రైవింగ్ చేయడం అనేది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాదు, అది అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో ట్రాఫిక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడిపే విషయంలో అమెరికా ప్రభుత్వం- పోలీసులు "జీరో టాలరెన్స్" వైఖరిని అవలంబిస్తారు. సోషల్ మీడియాలో నిత్యం చూస్తున్నట్లుగా, అమెరికాలో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిపోతే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అమెరికాలో మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కితే అక్కడ సర్దుబాట్లు ఉండదు, రాజీపడే అవకాశమే లేదు. వారితో వాదించడం, గొడవపడటం లాంటివి చేయకూడదు. చేస్తే విషయం ఇంకా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసులు కారును ఆపిన క్షణం నుంచే తమ 'బాడీ కెమెరా' (Body Cam) ఆన్ చేసి ప్రతీ విషయాన్ని రికార్డ్ చేస్తారు. సస్పెక్ట్కు నేలపై నడవమని చెప్పడం (Field Sobriety Test) లేదా బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహిస్తారు. రక్తంలో ఆల్కహాల్ శాతం (BAC) 0.08% లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, అక్కడికక్కడే చేతులకు సంకెళ్లు (Handcuffs) వేసి అరెస్ట్ చేస్తారు. వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. DUI కేసు నమోదైతే మొదటిసారి నేరానికి కూడా భారీగా ఫైన్ తో పాటు క్రిమినల్ శిక్షలు పడతాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం తీవ్రతను బట్టి $1,000 నుండి $10,000 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతే కాదు మొదటిసారి నేరానికైనా కొన్ని రోజుల నుండి కొన్ని నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ మద్యం మత్తులో యాక్సిడెంట్ జరిగి ఎవరికైనా గాయాలైతే అది 'ఫెలోని' (Felony) నేరంగా మారి ఏళ్ల తరబడి జైలు శిక్షకు దారితీస్తుంది. కేసు వాదించడానికి లాయర్ల ఫీజులు, కోర్టు ఖర్చులకు మరో $5,000 నుండి $15,000 వరకు అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. DUI కేసు

కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అఘాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం.. నిందితుల అరెస్టు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి ఢిల్లీలో నర్సరీ చదివే చిన్నారిపై పాఠశాల బస్సు డ్రైవర్ లైంగికదాడి న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశ రాజధాని ఢిల్లీలో మరో ‘నిర్భయ’ తరహా దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల ఓ బాలికపై ఇద్దరు దుండగులు నడుస్తున్న బస్సులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 4వ తేదీన జరిగినప్పటికీ.. వివరాలు సోమవారం వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురికి చెందిన 11వ తరగతి విద్యార్థిని.. తల్లి తిట్టిందన్న కోపంతో ఇల్లు వదిలి, ఢిల్లీ శివార్లలోని నోయిడా సెక్టార్ 63లో ఉండే తమ బంధువుల ఇంటికి బస్సులో బయల్దేరింది. చీకటి, దానికితోడు వర్షం కురుస్తుండటంతో ఆ బాలిక తాను దిగాల్సిన ప్రాంతాన్ని గుర్తించలేక, రాత్రి 9 గంటల సమయంలో సెక్టార్ 63 చేరుకోకముందే బస్సు నుంచి దిగేసింది. అక్కడి నుంచి వాళ్ల బంధువుల ఇల్లు మరో 25 కి.మీ.ల దూరం ఉండటంతో.. ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయింది. ఇంతలో ఓ స్లీపర్ బస్సు వచ్చి ఆమె ముందు ఆగింది. దాంట్లో ఉన్న కండక్టర్ తాము నోయిడా సెక్టార్ 63 వైపే వెళ్తున్నామని చెప్పటంతో, ఆ బాలిక బస్సు ఎక్కింది. బస్సులో డ్రైవర్, కండక్టర్ తప్ప ఎవరూ లేరు. బస్సు బయల్దేరిన కొంతసేపటికి, కండక్టర్ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికదాడి జరిపాడు. ఆ తర్వాత డ్రైవర్ కూడా దారుణానికి పాల్పడ్డాడు. ఇదంతా బస్సు కదులుతుండగానే జరిగింది. స్లీపర్ బస్సు కావటంతో కిటికీలకు ఉన్న తెరల వల్ల.. లోపల జరుగుతున్న అఘాయిత్యం గురించి బయట ఎవరికీ కనిపించలేదు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, ఓల్డ్

బెంగళూరు: ఓ ఆటో డ్రైవర్ తన భార్య చనిపోయి ఎనిమిదేళ్లు గడిచినా ఆమెను తలచుకుంటూ ఓ ఆచారాన్ని కొనసాగిస్తున్నాడు. తన ఆటోను పూలతో అలంకరించి, భార్య ఫొటోను తన పక్కన ఉంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ యూజర్ సూరజ్ ఎస్ కురుప్ ఈ భావోద్వేగ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. వృద్ధుడైన ఆటో డ్రైవర్‌ను చూసిన ఆయన, ఆటో ముందు భాగంలో చక్కగా అమర్చిన పూలను గమనించారు. వీడియోలో సూరజ్ తన కెమెరాను డ్రైవర్ వైపు తిప్పి, ఆ పూలు ఎవరి కోసం? అని అడిగారు. డ్రైవర్ నవ్వుతూ తన భార్య ఫొటో వైపు చూపించాడు. ఆమె ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయిందని వివరించాడు. తనకు ఓ కుమారుడు, కుమార్తె, ఆరుగురు మనవళ్లు ఉన్నారని ఆయన తెలిపారు. ఇంట్లో ఉండకుండా ఇప్పటికీ ఆటో ఎందుకు నడుపుతున్నారని సూరజ్ అడిగారు. ఇంట్లో కూర్చుంటే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందని డ్రైవర్ వివరించాడు. అందుకే ప్రతిరోజూ ఆటో నడుపుతూ, దారిలో ఎదురయ్యే వారితో మాట్లాడుతూ తనను తాను పనిలో నిమగ్నం చేసుకుంటున్నానని చెప్పాడు. పూలు, తన భార్య ఫొటో ఆయన రోజువారీ జీవితంలో భాగంగానే కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఆమె ఉనికిని తనకు దగ్గరగా ఉంచుకుంటున్నాడు. ఈ సాధారణ సంభాషణ వీడియోను చూసిన వారిని భావోద్వేగానికి గురిచేసింది. భార్య చనిపోయి అన్నేళ్లు గడిచినా ఆమె కోసం పూలు కొని, వాటిని అలంకరిస్తున్న దానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదీ చదవండి: 120 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా బతికాడు.. కొంతమంది దీనిని ఎన్నటికీ చెక్కుచెదరని ప్రేమకు అందమైన ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు, మరణం తర్వాత కూడా ఇంతే బలంగా నిలిచే ప్రేమ తమ జీవితంలో కూడా ఉండాలని కోరుకునేలా ఈ కథ ఉందని పేర్కొన్నారు. తనకు సమీపంలోనే ఆ డ్రైవర్ నివసిస్తున్నారని ఓ యూజర్ తెలిపారు. ప్రతిరోజూ ఉదయం ఇదే విధంగా ఆయన తన ఆటోను శుభ్రం

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Autos Bandh: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో మరో వర్గం కూడా భారీ ఆందోళనకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. తమ జీవనాధారంపై పొట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుండడంతో ఆటో కార్మికులకు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగనున్నారు. గతంలో పలమార్లు హెచ్చరించినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈసారి సమ్మె చేపట్టనున్నారు. దీంతో రేపు అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాల్లో ఆటోలు నిలిచిపోనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ బంద్‌లో ఏడున్నర లక్షల ఆటోలు పాల్గొనున్నాయి. రోడ్డుపై ఒక్క ఆటో కూడా కనిపించదు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి నేరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆటో కార్మికులు ఈ బంద్ చేపడుతున్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు పైన స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్ధిక సహాయం అందించకపోవడంతో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఆటో కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. వీరి ఆందోళనలకు స్కూల్ వాహనాల కార్మికులు కూడా తోడయ్యారు. ఆటో కార్మికులతోపాటు తాము బంద్‌లో పాల్గొంటామని స్కూల్ వ్యాన్ల యజమానులు ప్రకటించారు. ఈసీఐఎల్‌లో ర్యాలీ తెలంగాణలో ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి నిర్వహించనున్న ఆటో, స్కూల్ వ్యాన్ల బంద్ సందర్భంగా బీఆర్టియూ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ కేబుల్ బ్రిడ్జి నుంచి మల్లాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ

నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై.. పెంట్లవెల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూలు జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్డి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా మంత్రి స్వయంగా బకెట్లో నీరు తీసుకొని మరుగుదొడ్డిని శుభ్రం చేశారు. వివిధ సమస్యలపై వచ్చే ప్రజల అవసరాలు తీర్చడానికి ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలన్నారు. వెంటనే రూ.450తో ఒక బకెట్, జగ్గు, ఫినాయిల్ డబ్బా, బ్రష్, తెప్పించి కార్యాలయానికి అందజేశారు. ఐదు నిమిషాలు సమయం కేటాయిస్తే మన బాత్రూమ్లను మనమే శుభ్రం చేసుకోవచ్చని తహసీల్దార్ కార్యాలయ సిబ్బందికి మంత్రి సూచించారు

Kurnool: మైనర్ డ్రైవింగ్‌పై కర్నూలు ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు! ఈ వార్తకు సంబంధించిన

'మా విలేజ్ షో' నుంచి పాప్యులర్ అయిన నటుడే అంజిమామ. తనదైన యాసతో చాలా సహజంగా నటించే అంజిమామ, ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతూ ఉంటాడు. అలాంటి అంజిమామ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించాడు." కష్టపడటం నాకు మొదటి నుంచి అలవాటే. ప్లంబర్ గా .. ఎలక్ట్రీషియన్ గా .. ఆర్ ఎంపీ గా డాక్టర్ పనిచేశాను. ఆ తరువాత వాటర్ ప్లాంట్ పెట్టాను. అయినా ఎక్కడా నిలదొక్కుకోలేకపోయాను" అని అన్నారు. "ఆ తరువాత స్నేహితులతో కలిసి ఈజీమని కోసం ఒక స్కీమ్ లో పెట్టుబడి పెట్టాను. దాంతో 24 లక్షల నష్టం వచ్చింది. మంచి జీవితం కోసం .. త్వరగా ఎదగాలనే కోరికతో ఈజీమని దిశగా ఆలోచన చేయడం జరిగింది. కానీ అనుభవంతో చెబుతున్నాను. ఈజీమని దిశగా ఎవరూ వెళ్లకూడదు. ఆ దిశగా ఎవరినీ ఎంకరేజ్ చేయకూడదు. ఆ ఎఫెక్ట్ కారణంగా జీవితంలో నేను మరిన్ని కష్టాలు పడవలసి వచ్చింది" అని ఆయన చెప్పారు. " ఒక వైపున నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే, మరో వైపున హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్నాను. ఎందుకంటే నెల కాగానే ఇంటికి 50 వేలు పంపించవలసి ఉంటుంది. క్యాబ్ నడిపేటప్పుడు మాస్క్ పెట్టుకున్నా నన్ను కొంతమంది గుర్తుపడుతున్నారు. ఈ కష్టాలన్నీ ఎందుకు .. నా ఊరెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఒక ఎకరం పొలం .. నాలుగు బర్రెలు ఉంటే హాయిగా బ్రతకొచ్చని అనిపిస్తుంది" అంటూ ఆయన ఉద్వేగానికి లోనయ్యారు
బెంగళూరుకు చెందిన ఓ బీబీఏ రెండో సంవత్సరం విద్యార్థి 3 నెలల పాటు ర్యాపిడో కెప్టెన్‌గా పనిచేసి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది. కాలేజీ సెలవుల్లో పార్ట్‌టైమ్‌గా ఈ ర్యాపిడో డ్రైవర్ పని ప్రారంభించిన అతడు.. గిగ్ ఎకానమీ, రైడ్ యాప్ అల్గారిథమ్ ఎలా పనిచేస్తాయో స్వయంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేసినట్లు తెలిపాడు. మొదట ప్లాట్‌ఫామ్ పనితీరుపై పెద్దగా అవగాహన లేకపోయినా.. కొద్ది రోజుల్లోనే ఎక్కువ డిమాండ్ ఉండే ప్రాంతాలను గుర్తించి ఆదాయాన్ని పెంచుకున్నట్లు వివరించాడు.ఆ స్టూడెంట్ సాధారణంగా ఉదయం 8 గంటలకు పని ప్రారంభించి.. సాయంత్రం 4.30 గంటల వరకు రైడ్లు చేసేవాడిని అని పేర్కొన్నాడు. బాగా ఆర్డర్లు వచ్చిన రోజు పెట్రోల్ ఖర్చులు, ఇతర వ్యయాలు తొలగించిన తర్వాత సుమారు రూ.1,200 వరకు సంపాదించేవాడని చెప్పాడు. మధ్యాహ్నం సమయంలో రైడ్లు తగ్గినప్పుడు అదనపు ఆదాయం కోసం ఫుడ్ డెలివరీలు కూడా చేసేవాడిని అని తెలిపాడు.My 3-month experience doing Rapido as a side hustle in Bangalore — ₹1.2k/day, algorithm, restaurants & what I learnedఫుడ్ డెలివరీ సమయంలో కూడా తనకు ఆసక్తికరమైన అనుభవాలు ఎదురయ్యాయని అతడు చెప్పుకొచ్చాడు. కొన్ని రెస్టారెంట్లలో ఆర్డర్ వెంటనే రెడీ అయ్యేదని.. మరికొన్ని చోట్ల మాత్రం 20 నుంచి 25 నిమిషాల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని వివరించాడు. మూడు నెలల పాటు బెంగళూరులోని మెజెస్టిక్, రైల్వే స్టేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ఎక్కువగా రైడ్లు చేశానని.. ఆటో డ్రైవర్లు తనను గమనించినప్పటికీ, ఎవరూ బెదిరించలేదని చెప్పాడు.ఇక తనకు వచ్చిన ఆదాయాన్ని చూపించేందుకు ర్యాపిడో ఎర్నింగ్స్ డ్యాష్‌బోర్డ్ స్క్రీన్షాట్లను కూడా ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మే నెలలో 96 ఆర్డర్లు పూర్తి చేసి రూ.5,650 సంపాదించగా.. జూన్‌లో ఆదాయం గణనీయంగా పెరిగి రూ.16,660కు చేరింది. జూలైలో 3 నెలల ప్రయాణాన్ని ముగించే

ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్‌ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ఓ డ్రైవర్ యజమానితో గొడవ పడి జేసీబీతో పరారయ్యాడు. పోలీసులు జేసీబీతో పరారైన డ్రైవర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే సినిమా యాక్షన్ సీన్స్‌ను తలపించే సంఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు ఛేజింగ్ ఆపకపోవటంతో డ్రైవర్ జేసీబీని రోడ్డుపై వదిలి పారిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గంజాం జిల్లాలోని ఖల్లికోటె పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 15వ తేదీన యజమానితో అతడికి గొడవైంది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి జేసీబీతో అక్కడినుంచి పరారయ్యాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖల్లికోటె, రంభ, పురుషోత్తమ్‌పూర్, కబిసూర్యనగర్ ఏరియా పోలీసులు రంగంలోకి దిగారు. జేసీబీతో పరారవుతున్న డ్రైవర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పురుషోత్తమ్పూర్లోని రోడ్డుకు అడ్డంగా బారికేడ్స్ పెట్టారు. డ్రైవర్ జేసీబీని ఆపకుండా ఆ బారికేడ్స్‌ను బద్ధలు కొట్టుకుని పోయాడు. దీంతో సినిమా సీన్‌ను తలపించే ఛేజింగ్ మొదలైంది. గుడియాల్ దగ్గర జేసీబీ డ్రైవర్ ఛేజింగ్‌కు ముగింపు పలికాడు. జేసీబీని రోడ్డుపై వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు మొదలెట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టు: బాబర్ ఆజమ్‌కు బిగ్ షాక్.. పాకిస్థాన్‌కు కొత్త కెప్టెన్ IRCTC అరుణాచల మోక్ష యాత్ర.. 5 రోజుల టూర్ ప్యాకేజీ ఇదే!

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్‌గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్‌ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్‌కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్‌ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్‌తో 21 పరుగులు చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్లు వాడాలని, టీ20 ఫార్మాట్లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. డీఆర్ఎస్తో ఊహించని లైఫ్.. పడిక్కల్‌ను హగ్ చేసుకున్న రాహుల్! బుల్లెట్ త్రోతో అంపైర్‌ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దోషిగా తేలిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ విషయంలో సిడ్నీ కోర్టు మంగళవారం తన తీర్పును వెల్లడించింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దోషిగా తేలిన వార్నర్‌కు 1500 ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు లక్ష రూపాయలు) భారీ జరిమానా విధించింది. దీంతో పాటు అతను రాబోయే 12 నెలల్లో డ్రైవింగ్ చేయాలనుకుంటే ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ ఉపయోగించాలనే కండిషన్‌ను పెట్టింది. ఏమిటీ ఇగ్నిషన్ ఇంటర్‌లాక్? ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ పరికరం అనేది వాహనం ఇగ్నిషన్ సిస్టమ్‌కు అనుసంధానించబడిన ఒక చిన్న శ్వాస పరీక్షా యంత్రం. డ్రైవర్ బ్రీత్ టెస్టులో మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకున్నట్లు తేలితే, కారు స్టార్ట్ అవ్వకుండా ఇగ్నిషన్ పరికరం అడ్డుకుంటుంది. వార్నర్ ఎప్పుడైనా వాహనం నడపడానికి ముందుకు వచ్చినా, మొదట వార్నర్ ఇగ్నిషన్ ఇంటర్‌లాక్ పరికరం ద్వారా శ్వాస నమూనాను అందించాల్సి ఉంటుంది. రీడింగ్ అనుమతించబడిన పరిధిలో ఉంటేనే అతడు ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి వీలు ఉంటుంది. అసలేం జరిగింది? గత ఏప్రిల్‌లో ఈస్టర్ సండే రోజున సిడ్నీలోని మరౌబాలో వార్నర్ తన కారును వేగంగా నడుపుకుంటూ వచ్చాడు. అయితే దారిలో పోలీసులు ఏర్పాటు చేసిన ర్యాండమ్ టెస్టింగ్ సైట్‌కు కొద్ది దూరంలోనే తన వాహనాన్ని ఆపాడు. వార్నర్‌పై అనుమానంతో పోలీసులు అతనికి బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా, పరిమితికి మించి మద్యం సేవించినట్టు తేలింది. దీంతో వార్నర్‌ను అదుపులోకి తీసుకొని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన వార్నర్ తరఫున అతడి న్యాయవాది బాబీ హిల్ జూలై 27న సిడ్నీ కోర్టులో హాజరయ్యాడు. వార్నర్ ‘మిడ్ రేంజ్’లో డ్రింక్ చేశాడని కోర్టుకు వివరించాడు. అనంతరం వార్నర్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు కూడా అతని తరఫు లాయర్ కోర్టకు తెలిపాడు. ‘చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాటికి బాధ్యత వహించడం ముఖ్యం. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినా సరే, ఈ

ఒక్క క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. విధుల్లో భాగంగా వర్క్‌షాప్‌లో ఉన్న MSRTC ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్.. బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయారు. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేస్తున్నాయి.. ఇంటర్నెట్ డెస్క్: చిన్న క్షణం నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ బస్‌స్టాండ్ సమీపంలోని మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) వర్క్‌షాప్‌లో బస్సు చక్రం కింద పడి ఉద్యోగి పాండురంగ్ అన్నప్ప చవాన్ మృతి చెందారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్య సమస్యల కారణంగా చవాన్‌కు వర్క్‌షాప్ విధులు కేటాయించినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. చవాన్ ర్యాంప్ సమీపంలో తన పని ముగించుకుని తిరిగి వస్తుండగా, మరో డ్రైవర్ సికందర్ మనేర్ మరమ్మతుల కోసం బస్సును ముందుకు నడిపించాడు. బస్సు ర్యాంప్‌పై వెళ్తున్న సమయంలో చవాన్ దాని ముందు చక్రం కింద పడిపోయారు. బస్సు చక్రం ఆయనపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తోటి ఉద్యోగులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. సమాచారం అందుకున్న షాహుపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పంచనామా నిర్వహించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్క్‌షాప్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ప్రమాదం మొత్తం రికార్డయింది. పోలీసులు ఫుటేజీని స్వాధీనం చేసుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. బస్సును చూసుకోకుండా సడన్‌గా కదిలించారని చవాన్ సహోద్యోగులు ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేల తవ్వుతుండగా రూ.98 కోట్ల నిధి.. 18 ఏళ్ల కుర్రాడికి షాక్ ఇంటి వైపు దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. చివరకు ఏమైందంటే

స్వతంత్ర భారతంలో సామాన్యుడికి కనీసం స్వచ్ఛమైన తాగు నీరు కూడా దొరకడం లేదు. బయటకు వెళ్తే తాగే నీరు ఎంత కలుషితమై ఉంటుందో మనం ఊహించలేం. మినరల్ వాటర్ అనుకుని కొనుక్కొని తాగే నీరు కూడా ఒరిజినల్ కాకపోవడం మన దౌర్భాగం. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే రైల్వే స్టేషన్లలో తాగు నీటి గురించి దిమ్మతిరిగే వార్త బయటకు వచ్చింది. రోజువారీ ప్రయాణాల్లో లక్షలాది మంది ప్రజలకు దిక్కయిన భారతీయ రైల్వే వ్యవస్థలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి.దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు తాగే నీటిలో ప్రమాదకరమైన ఈ-కోలై (E. coli) బ్యాక్టీరియా ఉందని కాగ్ నివేదిక బాంబు పేల్చింది. హైదరాబాద్, కొయంబత్తూరు, ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ వంటి దిగ్గజ స్టేషన్లతో సహా పలు చోట్ల తాగే నీటి నాణ్యత అధ్వానంగా ఉందని హెచ్చరించింది. ఈ నివేదికతో తక్షణమే స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రయాణికులకు స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని అందించేందుకు ట్యాంక్ టు ట్యాప్ అనే బృహత్తర ప్రాజెక్టును అత్యవసరంగా రంగంలోకి దించారు.20,000 కేంద్రాల్లో నయా ఫిల్ట్రేషన్ ప్రాసెస్!కాగ్ హెచ్చరికల నేపధ్యంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన రైల్వే మంత్రి, యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్‌వర్క్‌లోని వాటర్ కూలర్లు , ప్రధాన నీటి కేంద్రాలతో కలిపి దాదాపు 20,000 ప్రాంతాల్లో అత్యంత ఆధునిక ట్యాంక్ టు ట్యాప్ ప్యూరిఫికేషన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. పాతబడిపోయిన నీటి ట్యాంకులను వెంటనే తొలగించి, సోర్స్ నుంచి ప్రయాణికులు ట్యాప్ వరకు ప్రతి దశలోనూ వాటర్ క్వాలిటీ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజూ ఈ నీటిని ఒక గ్లాస్ తాగితే..బీపీ, షుగర్ కంట్రోల్, కిడ్నీలు ఆరోగ్యంగా..!!కేంద్రీకృత నిఘా.. బోర్డు లెవెల్లో రోజువారీ మానిటరింగ్!ఈ ప్యూరిఫికేషన్ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా రైల్వే బోర్డు గుర్తించింది. కేవలం ఫిల్టర్లు పెట్టడమే కాకుండా, రైల్వే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) అభిమానులు కేవలం సినిమా వేడుకలు, రికార్డుల వేటకే పరిమితం కాకుండా నిరంతరం సమాజ హిత కార్యక్రమాల్లో ముందుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) సామాజిక బాధ్యతతో చేపట్టిన మరో బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్వస్థ్ నారీ వికసిత్ భారత్’ కార్యక్రమంలో భాగంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణ, హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించే దిశగా బన్నీ ఫ్యాన్స్ విశేష కృషి చేస్తున్నారు. ఈ మహోద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఏకంగా 7 రాష్ట్రాల్లో 400కు పైగా హెచ్‌పీవీ అవేర్నెస్ కార్యక్రమాలను AAFA విజయవంతంగా నిర్వహించింది. మహిళల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న సర్వైకల్ క్యాన్సర్‌ను హెచ్‌పీవీ టీకా ద్వారా ఎలా సమర్థవంతంగా అడ్డుకోవచ్చో వివరిస్తూ, ఈ డ్రైవ్ ద్వారా ఇప్పటివరకు 1 లక్ష మందికి పైగా యువతులు, బాలికలకు చేరువై వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. ‘7 రాష్ట్రాలు, 400కి పైగా కార్యక్రమాలు, 1 లక్ష మందికి పైగా బాలికలు.. ఒక ఉజ్వల భవిష్యత్తు’ అనే నినాదంతో అభిమానులంతా సమష్టిగా కదిలి ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. సినిమా రంగంలో తమ అభిమాన కథానాయకుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే, ఆయన స్ఫూర్తితో అభిమానులు కూడా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తున్నారు. భవిష్యత్ తరాలైన యువతుల ఆరోగ్య పరిరక్షణకు, క్యాన్సర్ రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడుతూ చేపట్టిన ఈ భారీ అవగాహన కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. నెటిజన్లు, పలువురు సామాజిక కార్యకర్తలు #AAFASupportsHPVDrive హ్యాష్‌ట్యాగ్‌తో అల్లు అర్జున్

హైదరాబాద్‌లో కాలుష్య రహిత రవాణాను ప్రోత్సహించడంతో పాటు ఆటో రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ)గా మార్చేందుకు ప్రత్యేక పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. జీహెచ్ఎంసీ ఆటో కార్మికులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే కాకుండా, పెరిగిపోతున్న ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ కార్యక్రమం ఆటో డ్రైవర్ల వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నూతన విధానం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. దీనిద్వారా హైదరాబాద్ పరిధిలోని దాదాపు 18,766 ఆటో రిక్షాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే రవాణా వ్యవస్థను ఆధునీకరించేందుకు ఇది ఎంతో తోడ్పడనుంది. ఈ పథకం కింద పాత ఆటోలను ఈవీ రెట్రోఫిట్మెంట్ (మార్పిడి) చేసుకోవడానికి లేదా సరికొత్త ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సాయం అందించనుంది. అర్హులైన ప్రతి ఆటో యజమానికి రూ. 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆటో డ్రైవర్లు రోజువారీ ఇంధనం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల వారి నికర ఆదాయం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నిర్ణయంతో ఆటోల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గి, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పలు ఆటో డ్రైవర్ సంఘాలు సానుకూలంగా స్వాగతిస్తున్నాయి. ఈ రకమైన సబ్సిడీ పథకం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడమే కాకుండా, కాలుష్యంతో ఇబ్బందిపడుతున్న నగరవాసులకు స్వచ్ఛమైన గాలి లభించే అవకాశాలు మెరుగుపడతాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హత నిబంధనలు అమలు మార్గదర్శకాలను

స్వాతంత్ర్య సంబరాల వేళ గుజరాత్ అటవీ శాఖ ఒక అద్భుతమైన పర్యావరణ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యమొచ్చి 80 ఏళ్లు పూర్తయిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఒకప్పుడు కళకళలాడి కాలక్రమేణా బోసిపోయిన బన్నీ గడ్డిభూములకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇందులో భాగంగా ప్రముఖ జామనగర్ వంతారా పునరావాస కేంద్రం సహకారంతో ఏకంగా 20 కృష్ణజింకలను కచ్‌లోని సహజ సిద్ధమైన అటవీ ప్రాంతంలోకి సురక్షితంగా వదిలిపెట్టారు.ఆడ, మగ జింకల కొత్త ప్రయాణంఈ విడతలో మొత్తం 5 మగ జింకలు, 15 ఆడ జింకలను అడవిలో విడిచిపెట్టారు. జామనగర్లోని వంతారా కేంద్రాం నుంచి వీటిని కచ్ ప్రాంతానికి తీసుకురావడానికి ముందు కేంద్ర జూ అథారిటీ నుంచి అన్ని అనుమతులు సాధించారు. సుదూర ప్రయాణంలో జింకలకు ఎలాంటి హాని కలగకుండా ప్రత్యేక వెటర్నరీ వైద్యుల సమక్షంలో, పూర్తి స్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే అత్యంత జాగ్రత్తగా ఇక్కడికి తరలించారు.జీవావరణ వ్యవస్థకు కొత్త ఊపిరిఒకప్పుడు ఈ బన్నీ గడ్డిభూముల్లో కృష్ణజింకలు, చింకారా, నీల్గాయ్ వంటి జంతువులు విరివిగా సంచరించేవి. అయితే కాలక్రమేణా వాటి సంఖ్య తగ్గిపోవడంతో ఇక్కడి పర్యావరణ సమతుల్యత దెబ్బతింది. ఇప్పుడు ఈ 20 జింకల రాకతో ఇక్కడ ఆహారపు గొలుసు మళ్లీ బలోపేతం కానుంది. భవిష్యత్తులో క్రూర మృగాలకు తగినంత ఆహారం లభించడంతో పాటు, గడ్డిభూముల సహజ సమతుల్యత దారిన పడుతుందని అధికారులు భావిస్తున్నారు.70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..ప్రాజెక్ట్ చీతా దిశగా మరో అడుగుభారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతా వన్యప్రాణుల సంరక్షణ లక్ష్యాలకు ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడనుంది. శాస్త్రీయ పద్ధతులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో అటవీ ప్రాంతాలను తిరిగి అభివృద్ధి చేయవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రాబోయే రోజుల్లో బన్నీ ప్రాంతం మళ్లీ పచ్చటి జీవవైవిధ్యంతో కళకళలాడుతుందని అటవీ శాఖ తీవ్ర ఆశాభావం వ్యక్తం చేస్తోంది.చీతాల రాజ్యంలో సరికొత్త రికార్డు.. స్వేచ్ఛా వనంలోకి మరో

క్రికెట్లో కొన్ని సంఘటనలు మ్యాచ్ ఫలితాన్ని మించి అభిమానుల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. అలాంటి సంఘటనే 2010 ఆగస్టు 16న శ్రీలంకలోని దంబుల్లాలో జరిగిన భారత్-శ్రీలంక వన్డేలో చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 99 పరుగులతో నాటౌట్‌గా నిలిచిపోయాడు. మ్యాచ్ గెలవడానికి భారత్‌కు ఒక్క పరుగు మాత్రమే అవసరం కాగా, శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సూరజ్ రందీవ్ వేసిన నోబాల్ కారణంగా సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యింది. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసి 46.1 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెహ్వాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 100 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 99 పరుగులకు చేరుకున్నాడు. భారత్ స్కోరు 170 వద్ద ఉండగా, జట్టు విజయానికి ఒక్క పరుగు మాత్రమే కావాల్సి వచ్చింది. మరోవైపు సెహ్వాగ్‌కు కూడా సెంచరీకి ఒక్క పరుగు అవసరం. అలాంటి సమయంలో సూరజ్ రందీవ్ బంతి వేయడానికి ముందే క్రీజ్ దాటి నోబాల్ వేశాడు. అంపైర్ నోబాల్ ప్రకటించడంతో భారత్‌కు అదనంగా ఒక పరుగు లభించింది. దీంతో మ్యాచ్ అక్కడే ముగిసిపోయింది. సెహ్వాగ్ ఆ బంతిని భారీ సిక్సర్‌గా కొట్టినా, నోబాల్‌తోనే భారత్ విజయ పరుగు పూర్తయినందున ఆ షాట్ స్కోరులో చేరలేదు. ఫలితంగా సెహ్వాగ్ 99 పరుగులతోనే నాటౌట్‌గా నిలిచిపోయాడు. ఈ సంఘటనపై వెంటనే తీవ్ర వివాదం చెలరేగింది. సెహ్వాగ్ మ్యాచ్ అనంతరం నోబాల్ కావాలనే వేసినట్లుగా భావిస్తున్నానని చెప్పాడు. స్పిన్నర్ అయినప్పకీ చాలా ముందుకు వచ్చి ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రందీవ్ సెహ్వాగ్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. శ్రీలంక క్రికెట్ అధికారులు కూడా ఈ ఘటనపై స్పందించారు. అప్పటి శ్రీలంక జట్టు సహచరుడు తిలకరత్నే దిల్షాన్ రందీవ్‌ను నోబాల్ వేయమని ప్రోత్సహించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదాన్ని శ్రీలంక క్రికెట్ తీవ్రంగా పరిగణించింది. సూరజ్ రందీవ్‌కు మ్యాచ్ ఫీజులో

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Little Boy Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ఎన్నో ఆశ్చర్యకరమైన ఘటనలకు, అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.. రోజు ఎన్నో రకాల విచిత్రమైన వీడియోలు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం. వాటిలో కొన్ని మనల్ని నవ్వు పుట్టించేలా చేస్తే మరికొన్ని మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి.. ముఖ్యంగా కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన వీడియోలైతే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంటూ ఉంటాయి. తాజాగా అలాంటి కోవాకు సంబంధించిన టాలెంటెడ్ బాలుడు వీడియో అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. భారీ ట్రాక్టర్‌తో బుడతడు.. సాధారణంగా చాలామంది పిల్లలు చిన్న వయసులో ట్రాక్టర్ బొమ్మలతో పాటు కార్ల బొమ్మలు, ప్లాస్టిక్ సైకిళ్లతో ఆడుకుంటూ ఉంటారు.. మరి కొంతమంది ప్లాస్టిక్ రిమోట్ కంట్రోల్ కార్లలో ఎక్కి.. నడిపినట్టు ఫీల్ అవుతూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న చిన్న బాలుడు మాత్రం వయస్సుకు ఏ మాత్రం వంతన లేని విధంగా ఓ పని చేసేసాడు... నేరుగా ఆ యువకుడు భారీ డాక్టర్‌ను ఎక్కి.. నడపడమే కాకుండా.. తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్ బయటపెట్టి ప్రొఫెషన్ డ్రైవర్ల అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు.. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా.. ఆ బాలుడు తన స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ ఏమాత్రం భయం లేకుండా అద్భుతంగా ట్రాక్టర్ ని కంట్రోల్ చేయడం ఈ వీడియోలో మీరు క్లియర్‌గా

హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్‌ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్‌గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్‌ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్‌నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు. ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్‌కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు. హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు) ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు) 'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు) కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని

సంచలనాలకు వేదికైన డిజిటల్ రవాణా రంగంలో ర్యాపిడో సంస్థ మరో భారీ మైలురాయిని అధిగమించింది. బెంగళూరు మహానగరంతో పాటు కర్ణాటక వ్యాప్తంగా క్యాబ్ సేవలు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర రవాణా శాఖ నుంచి అధికారిక అనుమతి లభించింది. కర్ణాటక ఆన్-డిమాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్ 2016 నిబంధనల ప్రకారం ఐదేళ్ల సుదీర్ఘ కాల పరిమితితో..ఆగస్టు 2031 వరకు ఈ లైసెన్స్‌ను మంజూరు చేశారు. కేవలం టాక్సీ క్యాబ్‌లకు మాత్రమే వర్తించే ఈ పక్కా చట్టబద్ధమైన పర్మిట్‌తో, ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన సేవలు అందడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ల భవిష్యత్తుకు పూర్తి భరోసా లభించింది.ర్యాపిడో పురిటిగడ్డ అయిన కర్ణాటకలో ఈ సంస్థ రవాణా వ్యవస్థను ఎంతలా శాసిస్తోందో గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలోని బెంగళూరు, మైసూరు, మంగళూరు, హుబ్బళ్లి, బెలగావి, బళ్లారి, తుమకూరుతో సహా దాదాపు 21 ప్రధాన నగరాల్లో ఈ సంస్థ సేవలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటివరకు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఏకంగా 3.14 లక్షల మందికి పైగా డ్రైవర్లు ఉపాధి పొందుతుండగా, 2.04 కోట్లకు పైగా వినియోగదారులు సేవలు పొందుతున్నారు. కేవలం క్యాబ్ సేవల కోసమే ఇప్పటివరకు 69 లక్షల మంది ప్రయాణికులు ఈ యాప్‌ను ఉపయోగించడం విశేషం Rapido Driver నిజాయితీ! 102 జ్వరం.. 8 గంటల లైవ్ లొకేషన్..అర్బన్ మొబిలిటీ మిషన్‌లో కీలక భాగస్వామి!ఈ చారిత్రాత్మక అనుమతితో పాటు, కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అర్బన్ మొబిలిటీ మిషన్ లో కూడా ర్యాపిడో సంస్థను భాగస్వామిగా చేర్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి, నగరాల్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా సులభమైన ప్రయాణాన్ని అందించే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నియమావళికి లోబడి పూర్తి భద్రతా ప్రమాణాలతో నడిచే ఈ క్యాబ్ సేవలు, ఐటీ సిటీలో ప్రతినిత్యం ప్రయాణించే లక్షలాది మంది ఉద్యోగులకు, సామాన్యులకు గొప్ప ఊరటనివ్వనున్నాయిఏపీలో మరో కొత్త కార్యక్రమం.. డ్రైవర్లకు మంచి అవకాశండ్రైవర్లకు మెరుగైన

హరిద్వార్: కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత హరిద్వార్‌లో భారీ వ్యర్థాల సమస్య తలెత్తింది. ఈ ఏడాది సుమారు 4.8 కోట్ల మంది కన్వర్ యాత్రికులు హరిద్వార్‌ను సందర్శించి, గంగాజలాన్ని సేకరించారు. యాత్ర ముగిసిన అనంతరం, గంగా తీరాలు, మేళా మైదానాల్లో సుమారు 7,000 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. హర్ కీ పౌరీ సహా అనేక ఘాట్ల వద్ద పారిశుధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. మహిళల కోసం ఏర్పాటు చేసిన డ్రెస్సింగ్ రూముల్లో మూత్రంతో నిండిన సీసాలు, పాత బట్టలు, చెప్పులు, వ్యర్థాల కుప్పలు దర్శనమిచ్చాయి. యాత్రికులు వదిలి వెళ్లిన కన్వర్ పరికరాలు, ఇతర చెత్త వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ అపరిశుభ్రతను కళ్లకు కడుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం ఆగస్టు 18 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్‌ను చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ నందన్ కుమార్ తెలిపారు. ఈ శుభ్రత పనుల కోసం సుమారు 1,000 మంది ప్రత్యేక పారిశుధ్య కార్మికులను నియమించారు. వ్యర్థాలను తరలించేందుకు 80కి పైగా వాహనాలను సిద్ధం చేశారు. ముందుపెన్నడూ లేని విధంగా, ఈసారి డ్రోన్ కెమెరాల సాయంతో చెత్త పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి, వెంటనే క్లీనింగ్ సిబ్బందిని పంపే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా వ్యర్థాలు నిండిన వెంటనే హెచ్చరికలు పంపే ‘సోలార్ సెన్సార్’ డస్ట్బిన్లను ప్రయోగాత్మకంగా అమర్చారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తూ, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పవిత్రమైన గంగా తీరాలను తిరిగి పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కర్నూలులో వైఎస్ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) 'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల ఇంటర్వ్యూ స్పెషల్ (ఫొటోలు) బాలనటి గ్రీష్మ నేత్రిక ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?... ఫోటోలు వైరల్ ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెరిసిన రితికా నాయక్ (ఫొటోలు) బుడ్జోడి

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (Anantha Babu)కు మరోసారి చుక్కెదురైంది. డ్రైవర్ సుబ్రహ్మణం (Driver Subrahmanyam) హత్య కేసులో సాక్షులను బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చేందుకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో అనంతాబుతో పాటు ఏ2, ఏ3గా ఉన్న కడియాల సతీశ్ (Kadiyala Satish), మహాలక్ష్మి (Mahalakshmi)కి బెయిల్‌ను నిరాకరించింది. నిందుతులకు బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) ముప్పాళ్ల సుబ్బారావు (Muppalla Subbarao) వాదించారు. పీపీ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే కోర్టు పలుమార్లు అనంతబాబుకు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే

హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే కీలకమైన పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే ప్రస్తుతం వ్యర్థాలమయంగా మారింది. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ జంక్షన్‌ను అనుసంధానించే ఈ 11.6 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌పై పగిలిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, నిర్మాణ శిథిలాలు పేరుకుపోయాయి. దీనివల్ల ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సియాసత్ కథనం ప్రకారం... పిల్లర్ నెంబర్ 87 సమీపంలో పోగుపడిన చెత్తను ఓ స్థానికుడు చిత్రీకరించి సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి తెచ్చారు. గత పది రోజులుగా ఈ పరిస్థితిని గమనిస్తున్నానని, వంతెనకు ఇరువైపులా వ్యర్థాలు పేరుకుపోయినా అధికారులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పగిలిన మద్యం సీసాలు, కాంక్రీట్ ముక్కలు, ప్లాస్టిక్ రాడ్లు, షీట్లు తదితర వ్యర్థాలు ప్రమాదకరంగా పడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.2009 అక్టోబర్ 19న ప్రారంభమైన ఈ ఎక్స్‌ప్రెస్‌వే, విమానాశ్రయానికి సిగ్నల్-రహిత ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో నిర్మించబడింది. అయితే, ప్రస్తుతం పేరుకుపోయిన ఈ చెత్త కారణంగా వాహనదారుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఫిర్యాదును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్వీకరించింది. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికారులు తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం కోసం ప్రస్తుతం 10 రోజుల ప్రత్యేక 'మాన్సూన్ డ్రైవ్' నిర్వహిస్తున్నప్పటికీ, ఎక్స్‌ప్రెస్‌వేపై పారిశుద్ధ్య పనులకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. శుభ్రతకు సంబంధించి నిర్దిష్ట అప్డేట్ రాలేదు. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఎలివేటెడ్ రోడ్లలో

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇ-డ్రైవ్ పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ దిచక్ర వాహనాలపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ.. పథకం గడువును మాత్రం 2028 మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల కేటగిరీకి గతంలో కేటాయించిన రూ.1772 కోట్ల బడ్జెట్‌ను రూ. 2,767 కోట్లకు పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 46 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ప్రయోజనం దక్కనుంది.రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి! పీఎం ఇ-డ్రైవ్ సబ్సిడీని తగ్గించిన ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం,.. ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2028 మధ్య రిజిస్టర్ అయ్యే ఎలక్ట్రిక్ టూ-వీలర్లపై సబ్సిడీ ఇవ్వబడుతుంది. దీని కింద, బ్యాటరీ సామర్థ్యం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) రూ.2,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది. అయితే ఓ వాహనానికి గరిష్ట సబ్సిడీ పరిమితిని రూ.5,000గా నిర్ణయించారు. అలాగే, ఎక్స్-షోరూమ్ ధర రూ.1.5 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మాత్రమే ఈ పథకం ప్రయోజనానికి అర్హత పొందుతాయి. సబ్సిడీ మొత్తం వాహనం ఎక్స్-షోరూమ్ ధరలో 15% లేదా రూ.5,000 (ఏది తక్కువైతే అది)కు పరిమితం చేయబడుతుంది. గతంలో, ఈ పథకం కింద సబ్సిడీ ఎక్కువగా ఉండేది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి kWhకు రూ.5,000 సబ్సిడీ ఉండేది. ఓ వాహనానికి గరిష్ట పరిమితి రూ.10,000గా ఉండేది. దీనిని ఏప్రిల్ 1, 2025 నుంచి తగ్గించడం జరిగింది.ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఈవీ తయారీని బలోపేతం చేయడం కోసం ప్రారంభించిన పీఎం ఇ-డ్రైవ్ పథకంలో ఈ మార్పులు చేశారు. సబ్సిడీ క్లెయిమ్‌లను సమర్పించడానికి చివరి గడువు డిసెంబర్ 31, 2027

2028 మార్చి 31 వరకు పీఎం ఇ-డ్రైవ్ స్కీమ్ పొడిగింపు గంటకు (kWh) ఇచ్చే ప్రోత్సాహకాన్ని సగానికి తగ్గింపు ఈ మొత్తం పథకంపై రూ.11,900 కోట్ల బడ్జెట్ కేటాయింపు PM E-Drive Scheme : ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. పీఎం ఇ-డ్రైవ్ పథకాన్ని ఇప్పుడు మార్చి 31, 2028 వరకు పొడిగించారు. అయితే, ఈవీ టీవీలర్ కొనుగోలుదారులకు లభించే సబ్సిడీని భారీగా తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) ఇచ్చే ప్రోత్సాహకాన్ని సగానికి తగ్గించింది. దాంతో ఈవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నవారు ఈ కొత్త విధానాన్ని తప్పక అర్థం చేసుకోవాలి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. పీఎం ఇ-డ్రైవ్ పథకం (PM E-Drive Scheme) ఇప్పుడు మార్చి 31, 2028 వరకు కొనసాగుతుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఈవీ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ మొత్తం పథకం కోసం ప్రభుత్వం రూ.11,900 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే, నిధుల పరిమితితోనే పథకం అందుబాటులో ఉంది. అందుకే కేటాయించిన నిధులు అయిపోతే ఈ పథకాన్ని లేదా అందులోని ఏ భాగమైనా ముందుగానే నిలిపివేయొచ్చు. Read Also : Amazon Great Freedom Sale : కొత్త ల్యాప్‌టాప్ కావాలా? ఆసుస్ వివోబుక్ 15పై ఏకంగా రూ.10వేలకుపైగా తగ్గింపు! ఈవీ టూలర్ సబ్సిడీ సగానికి తగ్గింపు : కొత్త విధానం ప్రకారం.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ఇచ్చే ప్రోత్సాహకాన్ని ప్రతి kWhకు రూ.5వేల నుంచి రూ.2,500కు తగ్గించారు. అంతేకాదు.. ప్రతి వాహనానికి గరిష్ట ప్రోత్సాహకం ఇప్పుడు రూ.5వేలుగా ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇ-టూవీలర్ గతంలో ప్రతి kWhకు రూ.5వేలు చొప్పున గరిష్టంగా రూ.10వేల వరకు ప్రోత్సాహకాన్ని అందించేవారు. కానీ, ఇప్పుడు గరిష్ట ప్రయోజనం సగానికి తగ్గింది. ఏయే ఈవీ బెనిఫిట్ పొందొచ్చు

బెంగళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ సందర్బంగా జేడీ ఎస్ మాజీ నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి అడ్డంగా దొరికిపోయారు. బెంగళూరు, ఆగస్టు 12: అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెల్ ఫోన్‌తోపాటు పెన్ డ్రైవ్ వాడుతున్నట్లు సెంట్రల్ క్రైమ్ బృందం గుర్తించింది. బెంగళూరులోని పరప్పరన అగ్రహారం సెంట్రల్ జైలులో ఈ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజ్వల్ రేవణ్ణ సెల్ ఫోన్‌తోపాటు పెన్ డ్రైవ్ వినియోగిస్తున్నట్లు కనుగొంది. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అతడికి ఇవి ఎలా అందాయనే అంశంపై విచారణకు ఆదేశించింది. మరో వైపు జైలు అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్పై సస్పెన్షన్ వేటు వేసింది. సదరు జైలులో లోపాలపై వివరణ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్ అనుష్కు కుమార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది

Electric Two Wheeler Subsidy: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ఆఫర్ మార్చి 2028 వరకు పొడిగింపు! Electric Two Wheeler Subsidy: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని వేగవంతం చేయడానికి మరియు దేశీయ తయారీ రంగాన్ని మరింత ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'పిఎం ఇ-డ్రైవ్' (PM E-DRIVE) పథకం కింద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (E-2W) కొనుగోలుపై అందించే ప్రోత్సాహకాల కాలావధిని మరో రెండేళ్ల పాటు, అంటే మార్చి 31, 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడంతో పాటు, ఛార్జింగ్ మౌలిక వసతుల కల్పన మరియు ఇవి తయారీ వ్యవస్థను బలపరచడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం బడ్జెట్ కేటాయింపు: పిఎం ఇ-డ్రైవ్ పథకం మొత్తం వ్యయాన్ని రూ. 11,900 కోట్లకు పెంచగా, అందులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీ కేటాయింపును రూ. 2,767 కోట్లకు పెంచారు. సబ్సిడీ పరిమితి: వాహనం యొక్క బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి కిలోవాట్-అవర్‌కు (kWh) రూ. 2,500 చొప్పున ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, ఏ వాహనానికైనా గరిష్ట సబ్సిడీ రూ. 5,000 మాత్రమే ఉంటుంది (ఇది ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో గరిష్టంగా 15 శాతానికి లోబడి ఉంటుంది). ధర పరిమితి: ఈ సబ్సిడీ ప్రయోజనం పొందాలంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం యొక్క గరిష్ట 'ఎక్స్-ఫ్యాక్టరీ' ధర రూ. 1.5 లక్షలు దాటకూడదు. లక్ష్యిత వాహనాలు: ఈ పథకం ద్వారా దాదాపు 45.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఆర్థిక మద్దతు లభించనుంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో లభించిన సబ్సిడీతో పోలిస్తే ప్రస్తుతం ప్రోత్సాహక మొత్తం సగం వరకు తగ్గించబడింది. అప్పట్లో kWhకి రూ. 5,000 చొప్పున గరిష్టంగా ఒక వాహనానికి రూ. 10,000 వరకు సబ్సిడీ అందించేవారు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు
మహిళా సాధికారత కోసం ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో ముఖ్మమైన ఆలోచన చేస్తోంది. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఏరియా ఆస్పత్రి వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో నూతన102 అంబులెన్సు సర్వీసులను (తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్) మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సత్యకుమార్ యాదవ్.. మరో రెండు నెలల్లో 200 కొత్త వాహనాల్ని సిద్దం చేస్తామని వెల్లడించారు. మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు గానూ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. మహిళలు అన్ని రంగాల్లో సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని మంత్రి వివరించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల నిర్వహణ సంస్థ అయిన కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్.. మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సానుకూలంగా ఉందని వివరించారు.మరోవైపు గర్భధారణ నుంచి ప్రసవం వరకు 102 వాహనాలు, అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనాలు, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సల కోసం 104 వాహనాల సేవలను అనుసంధానిస్తూ.. సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. వారివద్దకే సేవలు తీసుకెళ్లేందుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహన సేవలను ప్రసవం తర్వాత.. ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికి మాత్రమే పరిమితం చేయకుండా.. గర్భధారణ దశ నుంచే సేవలు అందించేలా విస్తరిస్తున్నట్లు తెలిపారు. యాంటీనాటల్ చెకప్‌ల

మహిళలకు ఉద్యోగావకాశాలు, ఆర్థిక స్వావలంబన కల్పించడంలో భాగంగా 102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లోనూ సమర్థంగా పనిచేస్తున్నారని.. డ్రైవింగ్ కూడా వారికి సాధ్యమేనని చెప్పారు. 102 వాహనాల నిర్వహణ సంస్థ.. కన్సార్టియం ఆఫ్ విద్యా వేదా ఫౌండేషన్ అండ్ శ్రీనివాసా టూర్స్ అండ్ ట్రావెల్స్ మహిళా డ్రైవర్ల నియామకానికి ప్రతిపాదన చేసిందని.. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా ఉందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట లోని ఏరియా ఆసుపత్రి వద్ద మంగళవారం 102 ఆధునిక అంబులెన్స్ ల సేవలను ప్రారంభించి, మంత్రి మాట్లాడారు.102.. 104.. 108.. ఒకే లక్ష్యంగర్భధారణ నుంచి ప్రసవం వరకు 102, అత్యవసర పరిస్థితుల్లో 108, గ్రామస్థాయిలో పరీక్షలు, చికిత్సలకు 104 సేవలను అనుసంధానిస్తూ సమగ్ర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరిగే అవసరం తగ్గించి.. అవసరమైన సేవలను వీలైనంత వరకు వారి వద్దకే తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.తల్లీబిడ్డలకు మరింత భరోసా102 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రసవం అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేర్చడానికే పరిమితం చేయకుండా గర్భధారణ దశ నుంచే విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. యాంటీనాటల్ చెకప్‌లకు వెళ్లే గర్భిణులు 102 సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసులను ఆసుపత్రికి తరలించడంతోపాటు రక్తహీనతతో బాధపడే గర్భిణులకు అవసరమైన చికిత్స అందేలా సేవలను విస్తరిస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 500 కొత్త 102 వాహనాలు అందుబాటులోకి తెస్తున్నామని.. తొలి విడతలో 300, మరో రెండు నెలల్లో 200 వాహనాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాహనాల్లో ఏసీ, ఆరు ఎయిర్‌బ్యాగులు, ఫుట్‌రెస్ట్, జీపీఎస్ ట్రాకింగ్, అత్యవసర ఎస్వీఎస్ బటన్ వంటి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ నరసరావుపేటలో 50 వాహనాలు ప్రారంభించారు. దీనికి అనుగుణంగా ప్రతి జిల్లాల్లోనూ 300

ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్ ల్యాండింగ్.. అదిరిపోయే ఫీచర్లతో అడ్వెంచర్ ప్రియులకు పండగే! Mahindra Thar 2026: ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా 3-డోర్ థార్ ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు 15న మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఏడాస్ (ADAS) టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, అదిరిపోయే లుక్స్‌తో వస్తున్న ఈ కొత్త మోడల్ ఎస్యూవీ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఆఫ్‌రోడింగ్ కింగ్ అనిపించుకున్న మహీంద్రా థార్ ఇప్పుడు భద్రత విషయంలోనూ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. 2026 కొత్త మోడల్లో అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను మహీంద్రా జోడిస్తోంది. విండ్ షీల్డ్ వెనుక అమర్చిన కెమెరా ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికత వల్ల ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి భద్రతా సదుపాయాలు వాహనదారునికి అందుబాటులోకి రానున్నాయి. థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ మోడళ్ల తరహాలోనే ఇది కూడా ప్రయాణికులకు గరిష్ట రక్షణను ఇస్తుంది. కొత్త థార్ ఇంటీరియర్‌ను మహీంద్రా అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది. పాత అనలాగ్ క్లస్టర్ స్థానంలో పెద్దదైన 10.25 అంగుళాల డిజిటల్ టీఎఫ్టీ (TFT) ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. నావిగేషన్, ఆఫ్ రోడ్ డేటా, ఫ్యూయల్ వివరాలను ఇది స్పష్టంగా చూపిస్తుంది. లాంగ్ డ్రైవ్‌లో అదిరిపోయే సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం హార్మన్ కార్డన్ (Harman Kardon) ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను సైతం జోడించారు. రఫ్ అండ్ టఫ్ కేరెక్టర్ కోరుకునే వారికి ఇది మ్యూజిక్ థ్రిల్‌ను రెట్టింపు చేస్తుంది. అదిరిపోయే డిజైన్.. అది కూలింగ్ ఫీచర్లు..! బయటి రూపంలోనూ కొత్త మెరుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాక్స్ మోడల్ నుంచి స్ఫూర్తి పొందిన సి-షేప్డ్ డిఆర్ఎల్లు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్లాంప్లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు వాహనానికి మరింత లగ్జరీ లుక్‌ను తీసుకొచ్చాయి. డ్యూయల్ టోన్ 18 అంగుళాల
UP Fake Lawyers Scam : న్యాయాన్ని కాపాడి బాధితులకు అండగా నిలవాల్సిన స్థానంలో చేరి.. ఏకంగా న్యాయస్థానాలనే బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నకిలీ సర్టిఫికెట్లతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దందా సాగిస్తున్న 105 మంది నకిలీ న్యాయవాదుల వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టు సంచలన ఆదేశాలతో ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్ బట్టబయలు చేసింది. దేశవ్యాప్తంగా పని చేస్తున్న న్యాయవాదుల విద్యార్హతలను తనిఖీ చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చేపట్టిన సమగ్ర వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. న్యాయ వ్యవస్థ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సాగుతున్న ఈ అక్రమార్కుల ముఠాపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది.పదో తరగతి నుంచి ఎల్ఎల్బీ వరకు అన్నీ ఫోర్జరీయే!బాధ్యతాయుతమైన కోర్టు ప్రాంగణాల్లో ఏళ్ల తరబడి చలామణి అవుతున్న ఈ కేటుగాళ్లు పక్కా ప్రణాళికతో దగాకు పాల్పడ్డారు. కేవలం న్యాయ శాస్త్రానికి సంబంధించిన ఎల్ఎల్బీ డిగ్రీ పట్టాలను మాత్రమే కాకుండా పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లను కూడా నకిలీవి సృష్టించినట్లు తనిఖీల్లో స్పష్టమైంది. దేశంలోనే పేరుగాంచిన అలహాబాద్ విశ్వవిద్యాలయం పేరుతో ఈ బోగస్ డిగ్రీ పట్టాలు తయారు చేసి ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడి అయింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబీ జిల్లాకు చెందిన అమర్‌సింగ్ అనే వ్యక్తి ఏకంగా 35 సంవత్సరాల పాటు పూర్తిగా నకిలీ ధ్రువపత్రాల ఆధారంగానే న్యాయవాదిగా చలామణి అవ్వడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.అలహాబాద్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!కోర్టుల ప్రాంగణంలోనే నకిలీ సర్టిఫికెట్లతో న్యాయవాదులుగా చలామణి కావడంపై అలహాబాద్ హైకోర్టు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ అక్రమాలపై ఏమాత్రం ఉపేక్షించవద్దని, బాధ్యులు అందరిపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రయాగ్‌రాజ్ పోలీసులు వేగంగా దర్యాప్తు ప్రారంభించారు.ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్ అధికారికంగా సమర్పించిన 105 మంది నకిలీ న్యాయవాదుల వివరాల జాబితాను విశ్లేషించి, కేవలం

ప్రపంచవ్యాప్తంగా కార్ల కంపెనీలు తమ వాహనాలను మరింత సామర్థ్యంతో మంచి మైలేజీ ఇచ్చేలా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాయి. ఈ దిశగా జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన ప్రత్యేకమైన ఇ-పవర్ హైబ్రిడ్ టెక్నాలజీతో ఓ కొత్త మైలురాయిని సాధించింది. నిస్సాన్ ఖష్కాయ్ హైబ్రిడ్ ఎస్యూవీ ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేకుండా, పెట్రోల్ రీఫిల్ చేయకుండా ఒకే ఫ్యూయల్ ట్యాంకుతో 1,980 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. అత్యంత సుదూర ప్రాంతాన్న అధిగమించిన నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఇది రికార్డు సాధించింది.e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!గొప్ప మైలేజ్విశేషమేమిటంటే, ఈ కారు ఈ రికార్డును ఏదో మూసివున్న ప్రయోగశాలలో కాకుండా, నిజమైన రహదారి, ట్రాఫిక్ పరిస్థితులలో నెలకొల్పింది. ఖష్కాయ్ 55-లీటర్ల ఇంధన ట్యాంక్ ఆధారంగా ఈ కారు లీటరుకు సుమారు 36 కిలోమీటర్ల (36 కిమీ/లీ) ఆకట్టుకునే మైలేజీని సాధించింది. ఈ ప్రయాణం 2026 జూలై 14 నుంచి 17 మధ్య కొలంబియాలో జరిగింది. ఈ వాహనం సముద్ర మట్టానికి 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న బొగోటా నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి కరేబియన్ తీరానికి చేరుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మార్గమధ్యలో హైవేలు, నగర ట్రాఫిక్, అనేక కష్టతరమైన మార్గాలు ఉన్నాయి. ఎత్తు నుంచి కిందికి దిగేటప్పుడు వాహనంలోని రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, వాలుపై బ్రేక్ వేయడం వల్ల ఉత్పత్తి అయిన శక్తిని తిరిగి విద్యుత్తుగా మార్చి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.అనుభవజ్ఞులైన డ్రైవర్ల కచ్చితమైన వేగ నియంత్రణ, నిస్సాన్ ఇ-పవర్ సిస్టమ్ కారణంగా వాహనం అంత సుదీర్ఘ దూరాలను ప్రయాణించగలిగింది.ఈ కారు ఎలాంటి బాహ్య ఛార్జింగ్ లేదా ఇంధనం నింపకుండా అత్యంత సుదూర ప్రయాణం చేసే నాన్-ప్లగ్-ఇన్ ఎక్స్టెండెడ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో ప్రవేశించింది.నిస్సాన్ ఇ-పవర్ టెక్నాలజీ ఎలా భిన్నమైనది?సాధారణంగా హైబ్రిడ్ కార్లను తిప్పడానికి

హైదరాబాద్ నగరం అనగానే చారిత్రక కట్టడాలు, సందడి ప్రదేశాలు గుర్తుకొస్తాయి. అయితే, అదే చార్మినార్ ప్రాంతంలో రాత్రి వేళ ఒక విచిత్రమైన, కలకలం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి సరిగ్గా 9 గంటల సమయం.. కంటెంట్ క్రియేటర్‌గా పనిచేస్తున్న సిద్ధేశ్వరి సుగంధ్ (సిద్ధి) అనే యువతి చార్మినార్ పరిసర ప్రాంతంలో ఇంటికి వెళ్లడానికి ఆటో కోసం వెయిట్ చేస్తోంది. చలిగా ఉండటంతో కుర్తీ, షాల్ కప్పుకుని నిలబడి ఉన్న ఆమె దగ్గరకు ఓ వ్యక్తి స్కూటర్‌పై వచ్చి ఆగాడు. "మ్యామ్.. ఎక్కడికి వెళ్లాలి? రాపిడో కావాలా? డ్రాప్ చేయమంటారా?" అంటూ చాలా నమ్మకంగా మాట కలిపాడు. ఆ వ్యక్తి అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడేసరికి సిద్ధేశ్వరి వెంటనే అప్రమత్తమైంది. అసలు తాను ఎలాంటి రాపిడో రైడ్ బుక్ చేసుకోకుండా ఇతను నేరుగా వచ్చి ఎలా అడుగుతున్నాడా అని సందేహించింది. వెంటనే ఆమె తన మొబైల్లో రికార్డింగ్ ఆన్ చేసి, అతడి వాహనాన్ని గమనించింది. విచిత్రమేమిటంటే ఆ స్కూటర్‌కు కనీసం వెహికల్ నంబర్ ప్లేట్ కూడా లేదు. "బండికి నంబర్ ఏది? నీ రాపిడో డ్రైవర్ ఐడీ కార్డు చూపించు" అని సిద్ధి గట్టిగా నిలదీసింది. దాంతో ఆ వ్యక్తి కంగారుపడుతూ నీళ్లు నమగడం మొదలుపెట్టాడు. ఐడీ కార్డు చూపించమంటే.. అప్పటికప్పుడు తన ఫోన్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి రాపిడో యాప్ డౌన్లోడ్ చేయడం ప్రారంభించాడు. తన పేరు ఇర్ఫాన్ అని చెప్పిన ఆ వ్యక్తి, క్రెడెన్షియల్స్ చూపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, విచిత్రంగా "బండి స్టార్ట్ కావడం లేదు మేడమ్" అంటూ సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. అసలు స్టార్ట్ కూడా కాని బైక్ పెట్టుకుని, ఎలాంటి బుకింగ్ లేకుండా ప్యాసింజర్లను ఎక్కించుకోవడానికి ఎలా వస్తావని ఆమె తీవ్రంగా మండిపడింది. అతడి ఫోన్ స్క్రీన్ చూస్తే అప్పుడే ఓటీపీ అడిగే లాగిన్ పేజీ కనిపిస్తోంది. అతడు అసలు రాపిడో డ్రైవరే కాదు

Tirupati: సూళ్ళూరుపేటలో దోపిడీ దొంగల అరెస్ట్ గంజాయి మత్తులో నేరాలు! Tirupati: తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జీ.చెంచుబాబు ఆధ్వర్యంలో,సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ పర్యవేక్షణలో సూళ్ళూరుపేట ఎస్సై గంటా అజయ్ కుమార్ నేరస్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 169/2026 U/s 309(4) BNS Robbery కేసులో ఈ దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై అజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. పట్టణంలో కలకలం సృష్టించిన దోపిడీ కేసును స్థానిక పోలీసులు విజయవంతంగా ఛేదించారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్తున్న వారిని కత్తితో బెదిరించి నగదు, సెల్ఫోన్లు దోచుకుంటున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 22 అంగుళాల పెద్ద కత్తి, వివో ఆండ్రోయిడ్ సెల్‌ఫోన్, రూ. 200 నగదును మధ్యవర్తులు స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీసుల వివరాల ప్రకారం...NH-16 జాతీయ రహదారిపై శ్రీచెంగాళమ్మ గుడి ఆర్చ్ సమీపంలో ఎస్సై అజయ్ కుమార్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సదరు క్రైమ్ కేసు ముద్దాయిల గురించి సమాచారం ఉండటంతో తనిఖీలు ముమ్మరం చేశారు. అటుగా వచ్చిన ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు 1) కిలివేటి జగదీష్ @ జగన్ (కోటపోలూరు), 2) ముటుకు దిలీప్ @ ఢిల్లీ (వట్రపాలెం), 3) కొల్లచెరువు లోకేష్ @ లోకి (వట్రపాలెం)లుగా తేలింది. ఈ నిందితులకు గంజాయి, మద్యం త్రాగే అలవాటు ఉంది. కూలి పనులు చేసుకునే వీరు సంపాదించే డబ్బు జల్సాలకు, మత్తు పదార్థాలకు సరిపోక సులువుగా డబ్బు సంపాదించాలనినిర్ణయించుకున్నారుఈ నెల 7వ తేదీ రాత్రి వట్రపాలెం మొదటి వీధిలో నడిచి వెళ్తున్న వ్యక్తిని ఈ ముగ్గురు మరియు పరారీలో ఉన్న అఫ్రిద్ కలిసి కత్తితో బెదిరించి సెల్‌ఫోన్, రూ. 1,000 దోచుకెళ్లారు. ఆ డబ్బుతో మద్యం

తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిపో కమిటీ డిమాండ్ భద్రాచలం, ఆగస్టు 10 : భద్రాచలం డిపోలో టిఐఎం డ్రైవర్లకు రీజినల్ మేనేజర్ గతంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ భద్రాచలం డిపో కమిటీ డిమాండ్ చేసింది. సోమవారం భద్రాచలం డిపో ఏఎంటీ విజయశ్రీ, ఆఫీస్ సూపరింటెండెంట్ విజయలక్ష్మికి టిఎంయు నాయకులు మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్.కృష్ణ మాట్లాడుతూ.. గత సంవత్సరం సెప్టెంబర్ 15, 17వ తేదీల్లో ఖమ్మం రీజినల్ మేనేజర్ కార్యాలయంలో విజిలెన్స్, రీజినల్ అధికారుల సమక్షంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలను 11 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మూడు మస్టర్లతో కూడిన డ్యూటీలను కేటాయించాలని, ఎవరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోబోమని ఇచ్చిన హామీని తక్షణమే నెరవేర్చాలని కోరారు. డిపోలోని పలు అపరిష్కృత సమస్యలపై అధికారులకు మరొక వినతిపత్రం అందజేశారు. టిఐఎం డ్రైవర్లకు 2023 నాటి డ్యూటీ చార్ట్‌ను పునరుద్ధరించాలని, ఏడీసీలపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్, కండక్టర్ చార్ట్ కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు ఓటీ డ్యూటీలు, స్పెషల్ ఆఫ్ డ్యూటీలను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. రాజధాని సర్వీసులకు అటెండర్లను కేటాయించాలని, సరిపడా సిబ్బందిని నియమించాలని, మెకానికల్ సిబ్బందికి అవసరమైన పరికరాలు (టూల్స్) అందించాలని కోరారు. అలాగే లేడీ కండక్టర్లకు నెలకు 3 రోజుల సెలవులు ఇవ్వాలని, నైట్ అవుట్ సర్వీస్‌లలో డ్రైవర్లు, కండక్టర్లకు సరైన రెస్ట్ రూమ్‌ల సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎంయూ ఖమ్మం రీజినల్ కార్యదర్శి ఆర్. కృష్ణ, భద్రాచలం డిపో కార్యదర్శి జి. యుగంధర్, చైర్మన్ ఎం.ఎస్.రావు, వైస్ ప్రెసిడెంట్ ఎ.రాంబాబు, నాయకులు శ్రీరాములు, వి.వి. రావు, ఎ.వై. నారాయణ, స్వప్నకుమారి, కె.వి.రావు పాల్గొన్నారు. [caption id="attachment_2479430" align="alignnone" width="1200"] 'భద్రాచలం టిఐఎం డ్రైవర్ల హామీలను వెంటనే నెరవేర్చాలి'[/caption]

కంప్యూటర్లోని ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ ద్వారా గూగుల్ ఫొటోస్‌లో ఆటోమేటిక్‌గా బ్యాకప్ చేసుకుంటున్నారా? అయితే ఈరోజు నుంచి ఆ సదుపాయం నిలిచిపోనుంది. 2026 ఆగస్టు 10 నుంచి ‘గూగుల్ డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’ ద్వారా గూగుల్ ఫొటోస్‌కు ఆటోమేటిక్ బ్యాకప్ ఉండదని గూగుల్ స్పష్టం చేసింది. దీంతో కంప్యూటర్లోని ఎంపిక చేసిన ఫోల్డర్ల నుంచి కొత్త ఫొటోలు, వీడియోలు ఇక గూగుల్ ఫొటోస్‌లోకి ఆటోమేటిక్‌గా అప్లోడ్ కావు.ఇప్పటివరకు ‘డ్రైవ్ ఫర్ డెస్క్‌టాప్’లో కంప్యూటర్లోని ఓ ఫోల్డర్‌ను ఎంచుకుంటే అందులోని ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోస్‌కు ఆటోమేటిక్‌గా బ్యాకప్ అయ్యేవి. ఇకపై ఈ సదుపాయం పూర్తిగా నిలిచిపోతుంది. అయితే ఇప్పటికే గూగుల్ ఫొటోస్‌లో బ్యాకప్ అయిన ఫొటోలు, వీడియోలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి సేఫ్‌గానే ఉంటాయి.అలాగే గూగుల్ డ్రైవ్ సేవ కూడా ఆగిపోవడం లేదు. కంప్యూటర్లో ఫైళ్లను డ్రైవ్‌తో సింక్ చేసుకునే సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది. డ్రైవ్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫొటోలు, వీడియోలను ఆటోమేటిక్‌గా పంపించే అనుసంధానాన్ని మాత్రమే గూగుల్ తొలగిస్తోంది.ఇక ఏం చేయాలి?కంప్యూటర్లోని ఫొటోలకు బ్యాకప్ కొనసాగించాలనుకునే వారు గూగుల్ ఫొటోస్‌లోనే కొత్తగా సెటప్ చేసుకోవాలి. గూగుల్ ఫొటోస్‌లో ‘+’ (ప్లస్) బటన్‌ను ఎంచుకుని ‘బ్యాకప్ ఫోల్డర్స్’ ఆప్షన్ ద్వారా కంప్యూటర్లోని ఫోల్డర్లను ఎంపిక చేసుకోవచ్చు.ఇప్పటికే గూగుల్ డ్రైవ్‌లో ఉన్న ఫొటోలను గూగుల్ ఫొటోస్‌లోకి నేరుగా ఇంపోర్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే పాత డ్రైవ్ అనుసంధానంతో పోలిస్తే కొత్త విధానంలో ఓ తేడా ఉంది. గూగుల్ ఫొటోస్ వెబ్సైట్ బ్రౌజర్లో

ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. హైదరాబాద్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల కోసం వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగ యువతపై అనుచితంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. వారి పట్ల అవమానకరంగామాట్లాడినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని శనివారం ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ చెప్పారు. ‘హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తే.. దరఖాస్తు చేసుకోవడానికి వేల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవడానికి తరలి రావడం వారి తప్పా? లేక ఉద్యోగాల కల్పనలో విఫలమైన ప్రభుత్వం తప్పా? ఈ ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తున్నట్టు?’ అని ఆయన ప్రశ్నించారు. విద్యార్థులు, నిరుద్యోగులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన సర్కారు 32నెలలు దాటినా అమలుకు నోచుకోలేదన్నారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా భర్తీ చేసి ఉంటే.. ఈరోజు 150 డ్రైవర్ పోస్టుల కోసం వేల మంది నిరుద్యోగులు క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చేదా?2 లక్షల ఉద్యోగాల హామీ ఒక బోగస్’అని ఎద్దేవా చేశారు. పీజీలు చేసిన యువత కూడా చిన్న పోస్టుల కోసం పోటీ పడడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు