
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూనే, మరోవైపు.. కేంద్రమంత్రులతో సమావేశం అవుతున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో చేపట్టనున్న రక్షణ ప్రాజెక్టుకు భూమి కేటాయింపు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు, అలాగే హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026, రక్షణ ఎక్స్పో-2026పై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో చర్చించారు.తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరు కావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ను సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్పో-2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులతో పాటు ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. దేశవ్యాప్తంగా రక్షణ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రక్షణ ఎక్స్పోను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు కేంద్ర రక్షణశాఖ సహకారం అందించాలని కోరారు. ఎయిర్‌షోకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు పాల్గొనేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలని.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్లకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఎక్స్‌పోలో ప్రదర్శించాలని కోరారు. త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హెచ్ఏఎల్

భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఢిల్లీ, సెప్టెంబర్ 1: భారత వైమానిక దళంలో ఓ చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. నాన్-మెడికల్ విభాగంలో 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్‌ను సాధించిన మొదటి మహిళా అధికారిణిగా శక్తి శర్మ చరిత్ర సృష్టించారు. ఇవాళ ఆమె ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. IAFలో చేరిక: జూన్ 18, 1994న భారత వైమానిక దళానికి చెందిన ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో ఆమె అధికారిణిగా విధుల్లో చేరారు. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా విశిష్ట సేవలు అందించిన ఆమె ట్రైనింగ్ సెంటర్లు, ఫీల్డ్ స్టేషన్లు, కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌లో పలు కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. విద్యా రంగానికి ప్రాధాన్యం: ఐఐటీ కాన్పూర్, పుణె యూనివర్సిటీలలో డిఫెన్స్ సహకారాన్ని పెంచేలా 'IAF చైర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేయడంలో శక్తి శర్మ ప్రముఖ పాత్ర పోషించారు. అంతేకాదు, సైనిక దళాల (Tri-services) చరిత్రలోనే ఒక సైనిక స్కూల్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా (కపూర్తలా సైనిక స్కూల్ ప్రిన్సిపాల్‌గా) వ్యవహరించిన తొలి మహిళా అధికారిణిగా కూడా ఆమె రికార్డు సాధించారు. మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంతో ఎయిర్ వైస్ మార్షల్ శక్తి శర్మ సాధించిన ఈ ఘనత సాయుధ దళాల్లోని భావి మహిళా అధికారులకు స్ఫూర్తిదాయకం. పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, ఆగస్టు 21: నగరంలోని అమీర్‌పేట్‌లో కర్ణాటక డిఫెన్స్ లిక్కర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఆర్నగర్ ఉమేష్ చంద్ర విగ్రహం వద్ద అనుమానాస్పదంగా మద్యం బాటిళ్లతో ఉన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే అతడిని తనిఖీ చేయగా.. తొలుత నాలుగు కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు పట్టుబడ్డాయి. విచారణలో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వద్ద నుంచి మద్యం తీసుకున్నట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు. దీంతో వెంటనే గోవర్ధన్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా.. దాదాపు 51 కర్ణాటక డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం 55 కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. కర్ణాటక నుంచి తక్కువ ధరకు డిఫెన్స్ మద్యం తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడింది. ఒక్కో బాటిల్‌పై రూ.300 నుంచి రూ.500 వరకు లాభం పొందుతున్నట్లు తేలింది. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని పోలీసుల అంచనా. గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు అమీర్‌పేట్ ఎక్సైజ్ సీఐ బానోత్ పటేల్ వెల్లడించారు. అన్నవరం బస్టాండ్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

న్యూదిల్లీ వేదికగా భారత్, జపాన్ దేశాల మధ్య అత్యంత కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జపాన్ రక్షణ మంత్రి షింజీరో కొయిజుమిల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ముఖ్యంగా సముద్ర భద్రతా సహకారాన్ని విస్తరించడం, ఇరు దేశాల మిలిటరీ సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ భద్రతా ముసాయిదా రూపొందింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల రక్షణ మంత్రులు కీలక రక్షణ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. 2026 నాటికి ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా భారత నౌకాదళం, జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య సమాచార మార్పిడిని మరింత వేగవంతం చేయనున్నారు. మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ పెంపొందించడం ద్వారా సముద్రంలో ఎదురయ్యే ముప్పులను ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సైనిక వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ఇదిలా ఉండగా నౌకాదళ సహకారం, యుద్ధనౌకల సందర్శనలు, ఉమ్మడి విన్యాసాలు మరియు రక్షణ పరికరాల తయారీలో భాగస్వామ్యాన్ని పెంపొందించాలని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ, మానవతా సాయం మరియు విపత్తు నిర్వహణ రంగాల్లో పూర్తిస్థాయి సహకారం అందించుకోవడానికి ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. ఫలితంగా ప్రాంతీయ భద్రతను సవాలు చేసే ఏకపక్ష చర్యలను ఇరు దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో ధర్మ గార్డియన్, జిమెక్స్ వంటి ఉమ్మడి సైనిక విన్యాసాలను మరింత విస్తరించాలని నిర్ణయించారు. వీర్ గార్డియన్ 26 పేరుతో తొలిసారిగా జపాన్ ఫైటర్ జెట్లు భారత్‌లో జరిగే వైమానిక విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి. ఇది భారత్-జపాన్ స్పెషల్ స్ట్రాటెజిక్ అండ్ గ్లోబల్ పార్టనర్‌షిప్‌లో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. ఇరు దేశాల మధ్య నౌకాదళ వేదికల ఉమ్మడి రూపకల్పన మరియు అభివృద్ధిపై కూడా

జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్-75(ఐ) ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.70,000 కోట్లు. ఇంటర్నెట్ డెస్క్: భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసే కీలక రక్షణ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. జర్మనీ సహకారంతో ఆరు అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించే ప్రాజెక్ట్-75(ఐ) ప్రతిపాదన త్వరలో కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు విలువ సుమారు రూ.70,000 కోట్లు (India Germany submarine deal). ప్రాజెక్ట్-75(ఐ) కింద భారత నౌకాదళం కోసం ఆరు అధునాతన సాంప్రదాయ జలాంతర్గాములను నిర్మించనున్నారు. వీటిని జర్మనీ సహకారంతో భారత్‌లోనే నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ముంబైకి చెందిన మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్, జర్మనీకి చెందిన థైసెన్‌క్రుప్ మెరైన్ సిస్టమ్స్ కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టనున్నాయి. దేశీయంగా జలాంతర్గాముల నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది (Rs 70000 crore submarine deal). ఈ ప్రాజెక్టులో జర్మనీ నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ అనుభవాన్ని భారత్ పొందనుంది (Germany India defence deal). ముఖ్యంగా జలాంతర్గాముల నీటి అడుగున ఎక్కువసేపు పనిచేసే సామర్థ్యాన్ని పెంచే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ వ్యవస్థ కీలక అంశంగా ఉండనుంది. ఇలాంటి సాంకేతికతతో జలాంతర్గాములు తరచుగా నీటి పైకి రాకుండానే ఎక్కువకాలం నీటి అడుగున పనిచేయగలవు. ప్రాజెక్ట్‌పై చర్చలు చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ పలు కారణాలతో ఆలస్యమవుతోంది. తాజాగా ప్రతిపాదనను తుది నిర్ణయం కోసం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ముందు ఉంచే ప్రక్రియ వేగవంతమైనట్లు సమాచారం. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. ‘‘వైబ్రంట్ సివిల్ డిఫెన్స్ నెట్వర్క్’’తో పాటు ‘‘భారీ, ఆధునిక పౌర రక్షణ స్వచ్ఛంద సేవకుల దళాన్ని’’ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆధునిక భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు పౌరులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 2025 మేలో ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో సివిల్ డిఫెన్స్ స్వచ్ఛంద సేవకులను రంగంలోకి దింపి దేశవ్యాప్తంగా కృత్రిమ విన్యాసాలు నిర్వహించారు. అసలు ఈ దళం అంటే ఏమిటి? జాతీయ భద్రత కోసం పౌర స్వచ్ఛంద సేవకుల దళాన్ని భారత్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారా? ఈ ప్రతిపాదిత దళం భారత్‌లో తొలి పౌర స్వచ్ఛంద సంస్థ కాదు. వాస్తవానికి 1968 సివిల్ డిఫెన్స్ చట్టం కింద భారత్‌లో ఇప్పటికే చట్టబద్ధమైన సివిల్ డిఫెన్స్ దళం ఉంది. సివిల్ డిఫెన్స్ దళాల ఏర్పాటు, శిక్షణ లేదా సివిల్ డిఫెన్స్ విధులకు పిలిచే పౌర స్వచ్ఛంద సేవకుల నియామకానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. 1968 సివిల్ డిఫెన్స్ నిబంధనల్లో ప్రజలను తరలించడం, కీలక మౌలిక వసతులకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాల నివారణ, ప్రజలకు అవగాహన కల్పించడం, శత్రు దాడుల నుంచి రక్షణకు ముందస్తు జాగ్రత్తలు వంటి చర్యలు ఉన్నాయి. అందువల్ల సివిల్ డిఫెన్స్ అంటే యుద్ధ సమయంలో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు, కీలక సేవలను రక్షించడం దీని ప్రధాన ఉద్దేశం. స్వచ్ఛంద సేవకులు ఏం చేయవచ్చు? సాంప్రదాయ సివిల్ డిఫెన్స్ విధుల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయపడటం, కీలక సేవలకు రక్షణ కల్పించడం, అగ్నిప్రమాదాలను ఎదుర్కోవడం, అత్యవసర సూచనలను ప్రజలకు చేరవేయడం ఉన్నాయి. ఆధునికీకరించిన వ్యవస్థలో ప్రథమ చికిత్స, గాలింపు, రక్షణ చర్యలు, అత్యవసర సమాచార వ్యవస్థలు, ప్రజల తరలింపు నిర్వహణ, ఆశ్రయ కేంద్రాల నిర్వహణ, విపత్తుల సమయంలో సహాయక చర్యలు

భారత నావికాదళం సముద్రంలో తన సార్వభౌమత్వాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు సరికొత్త రక్షణ వ్యూహాలకు పదును పెడుతోంది. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర ఎంత కీలకమో ఎర్రసముద్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ దేశాలకు స్పష్టంగా చూపించాయి.ఈ నేపథ్యంలో శత్రువు ఊహించని రీతిలో, సముద్రం మీది యుద్దనౌకల నుంచే ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న ఆత్మాహుతి డ్రోన్ల కొనుగోలుకు భారత నేవీ రంగం సిద్ధం చేస్తోంది. శత్రుదేశాల తీరప్రాంత క్షిపణి వ్యవస్థల కంటికి చిక్కకుండా, మన యుద్ధనౌకలు సురక్షిత దూరంలో ఉంటూనే వ్యూహాత్మక దాడులు చేయడానికి ఈ సాంకేతికత అద్భుతంగా తోడ్పడనుంది.గగనతలంలో నిఘా పెట్టి నాశనం చేసే సాంకేతికత!ఈ ప్రత్యేక డ్రోన్లు గాల్లోకి ఎగిరిన తర్వాత దాదాపు 9 గంటల పాటు నిరంతరాయంగా పహారా కాయగలవు. శత్రువు స్థావరాన్ని గుర్తించగానే గంటకు 200 నాట్ల వేగంతో విరుచుకుపడతాయి. పగటితో పాటు చీకట్లోనూ ఖచ్చితమైన లక్ష్యాలను గుర్తించేలా ఎలక్ట్రో-ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లను వీటిలో అమర్చనున్నారు. సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబుల్ అనుకున్న టార్గెట్‌ను నేలమట్టం చేసే అద్భుతమైన సామర్థ్యం వీటి సొంతం. అంతేకాదు, శత్రువులు ఒకవేళ శాటిలైట్ సిగ్నళ్లను జామింగ్ చేసినా తమ పనిని విజయవంతంగా ముగించే అధునాతన నావిగేషన్ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.నౌకాదళంలోకి మచిలీపట్నం! ఆంధ్రప్రదేశ్ పేరుతో సముద్రంలో సైలెంట్ కిల్లర్..ఒకే ఆపరేటర్.. ఒకేసారి 10 డ్రోన్ల నియంత్రణ!ఈ విప్లవాత్మక సాంకేతికత ద్వారా యుద్ధనౌకపై ఉన్న ఒక్క డిజిటల్ ఆపరేటర్ ఏకకాలంలో 10 డ్రోన్లను కంట్రోల్ చేసే వీలుంటుంది. అవసరాన్ని బట్టి ఈ డ్రోన్ల కంట్రోల్‌ను మరో నావికాదళ నౌకకు లేదా తీరంలో ఉన్న ల్యాండ్ స్టేషన్‌కు సులభంగా బదిలీ చేయవచ్చు. అత్యంత తీవ్రమైన గాలులు అంటే గంటకు 50 నాట్ల వేగంతో గాలి వీచినా, 95 శాతం తేమ ఉన్న కఠిన సముద్ర వాతావరణాన్ని తట్టుకుని ఇవి పనిచేస్తాయి. ఈ సిస్టమ్ యొక్క కీలక

రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ గొప్ప మనసును చాటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. అమరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాలకు ఎంపీ అండగా నిలిచారు. ఎంపీగా తనకొచ్చిన మొదటి నెల జీతం మూడు లక్షల రూపాయలను దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులైన ఆర్మీ జవాన్ల కుటుంబాల సంక్షేమం కోసం విరాళంగా అందించారు. ఈ విరాళం చెక్కును భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజయ్ స్వయంగా అందజేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణత్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. అందులో భాగంగానే ఈ చిరు సాయం చేసినట్లు విజయ్ స్పష్టం చేశారు. పదవి చేపట్టిన వెంటనే తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం వెచ్చించడం పట్ల విజయ్ను పలువురు ప్రశంసిస్తున్నారు. కారులో 25.970 కేజీల గంజాయి తరలింపు.. ఇద్దరి అరెస్ట్ విజయవాడలో వెయ్యి మంది విద్యార్థులతో తిరంగా ర్యాలీ
Jammu Kashmir Revised Ex-Gratia Norms : ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగంగా పోరాడుతూ.. దేశం కోసం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదులుకున్న భద్రతా బలగాల సిబ్బంది కుటుంబాలకు బిగ్ రిలీఫ్ కల్పించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. వీరికి మాత్రమే కాకుండా ఉగ్ర ఘటనల వల్ల ప్రభావితమైన సామాన్య పౌరులకు మరింత అండగా నిలిచేందుకు కూడా సిద్ధమైంది. ముఖ్యంగా భద్రతా సంబంధిత వ్యయం కింద అందించే ఎక్స్‌గ్రేషియా, నష్టపరిహార నిబంధనలను సమూలంగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను అధికారికంగా నోటిఫై చేసింది. దీని ప్రకారం.. వీరమరణం పొందిన డిఫెన్స్, పారామిలటరీ జవాన్లకు రూ.25 లక్షలు, అమరులుగా మారిన పోలీసులకు రూ.12 లక్షల నష్టపరిహారాన్ని అందించనున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.సైనికులు, పారామిలటరీ బలగాలకు రూ.25 లక్షలుసరిహద్దుల్లో లేదా ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్లలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు అందించే నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. జమ్మూ కాశ్మీర్ స్థానికులైన డిఫెన్స్ లేదా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బంది ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో వీరమరణం పొందితే.. ఆ ఘటన రాష్ట్రం లోపల జరిగినా లేదా వెలుపల జరిగినా.. వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. ఒకవేళ స్థానికేతరులైన జవాన్లు జమ్మూ కాశ్మీర్ భౌగోళిక సరిహద్దుల్లో జరిగిన ఉగ్ర ఘటనల్లో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది.పోలీసు అమరవీరులకు ఆర్థిక భరోసారాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తూ.. సిబ్బంది వీరమరణం పొందితే వారి కుటుంబాలకు మొత్తం రూ.12 లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తారు. ఇందులో రూ.7 లక్షలు పోలీసు వెల్ఫేర్ ఫండ్ నుంచి మంజూరు చేయగా.. మిగతా రూ.5 లక్షలను జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి అందజేస్తారు. అలాగే యాక్షన్‌లో ప్రాణాలు కోల్పోయే ప్రత్యేక పోలీసు అధికారులకు అందించే నష్టపరిహారాన్ని రూ.5 లక్షలుగా నిర్ణయించారు. ఉగ్ర దాడుల్లో తీవ్ర గాయాలపాలై శాశ్వత

పాకిస్థాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన మక్కా రక్షణ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉండగా.. పాకిస్థానీలు ఆనందంతో ఉన్నారు. ముస్లిం నాటోగా పిలవబడుతున్న ఈ రక్షణ ఒప్పందాన్ని సౌదీ అరేబియా నుంచి పాకిస్థాన్ వరకు ఘనంగా జరుపుకుంటున్నారు. ఒకవేళ భారత్ పాకిస్థాన్‌పై దాడి చేస్తే సౌదీ అరేబియా, టర్కీ రెండూ దానికి సహాయం చేస్తాయని పాకిస్థానీలు సంతోషిస్తున్నారు. ఈ రక్షణ ఒప్పందం ప్రకారం ఓ దేశంపై దాడిని మరో దేశంపై దాడిగా పరిగణిస్తారు. మక్కా రక్షణ ఒప్పందం పాకిస్థాన్ దౌత్య స్థానాన్ని గణనీయంగా బలోపేతం చేసిందనడంలో సందేహం లేదని, భవిష్యత్తులో దాని సైనిక బలాన్ని కూడా గణనీయంగా పెంచుతుందని నిపుణులు అంటున్నారు. భారత్ గురించి సౌదీ అరేబియా నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.e-Visa: ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!భారత్, సౌదీ అరేబియాల మధ్య చాలాకాలంగా బలమైన సంబంధాలు ఉన్నాయి. వేలాది మంది భారతీయులు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పలుమార్లు భారత్‌ను సందర్శించారు. మిల్లీ క్రానికల్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌తో రక్షణ ఒప్పందం కుదిరినంత మాత్రాన భవిష్యత్తులో భారత్‌తో ఘర్షణ పడటానికి సౌదీ అరేబియా లేదా టర్కీ నుంచి పాకిస్తాన్‌కు పూర్తి స్వేచ్ఛ లభించినట్లు కాదని సౌదీ నిపుణులు అంటున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రకటనలు చాలా సంయమనంతో కూడుకున్నవి. అంతేకాకుండా, సౌదీ నిపుణులు భారత్ వ్యతిరేక వాదనను తిరస్కరిస్తున్నారు.పాకిస్థాన్‌కు షాకిచ్చిన సౌదీ నిపుణుడు మక్కా ఒప్పందాన్ని ఇండియాకు వ్యతిరేకంగా చేసుకున్న దురాక్రమణ ఒప్పందంగా చూడాలన్న వాదనను సౌదీ అరేబియా నిపుణుడు బదూర్ సోషల్ మీడియాలో కొట్టిపారేశారు. సౌదీ అరేబియాకు భారత్, గ్రీస్‌లతో బలమైన వ్యూహాత్మక స్నేహం ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఉన్నత స్థాయి దౌత్యం ద్వారా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించింది, ఇది తదనంతరం కాల్పుల
Red Fort Vande Mataram : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంగణం ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒక అపూర్వమైన ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా తొలిసారిగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఎర్రకోట వద్ద ఆలపించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకునే సమయంలో ఈ గీతాలాపన జరుగుతుందని.. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని రక్షణ శాఖ వెల్లడించింది.150 ఏళ్ల ఘన చరిత్రకు నివాళి!ఈ వినూత్న నిర్ణయం వెనుక ఉన్న విశేషాలను రక్షణ కార్యదర్శి ఆర్.కె. సింగ్ వివరించారు. ప్రముఖ బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతం రూపుదిద్దుకుని 2026 నాటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా ఆ అమర గీత వారసత్వానికి, ప్రాముఖ్యతకు ఘన నివాళిగా ఎర్రకోట బురుజుల నుంచి దీనిని ఆలపించాలని నిర్ణయించారు. సాధారణంగా ఈ గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమేఆలపించే సాంప్రదాయం ఉండేది. అయితే జాతీయ గీతం ‘జనగణమన’తో సమానంగా వందేమాతరానికి గౌరవం దక్కాలని, అందులోని మొత్తం ఆరు చరణాలను ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం చాటి చెబుతోంది.ఇటీవలే వందేమాతరాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణిస్తూ పార్లమెంటు ఒక బిల్లును ఆమోదించింది. అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో ప్రాధాన్యతగా వందేమాతరం పాటించాలని కేంద్రం ఆదేశించడమే కాకుండా పలు రాష్ట్రాలు పాఠశాలల్లో దీనిని నిర్బంధం చేశాయి. అయితే ఈ గీతంలోని కొన్ని చరణాలు తమ మత విశ్వాసాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కొన్ని ముస్లిం సంస్థలు పూర్తి గీతాన్ని ఆలపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.'వికసిత్ భారత్ 2047'.. యువతదే కీలక పాత్ర!2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో యువత అందిస్తున్న సహకారాన్ని గౌరవిస్తూ ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవానికి ప్రత్యేక థీమ్‌ను ఖరారు చేశారు. ఇటీవల ప్రశ్నపత్రాల లీకేజీలపై జంతర్ మంతర్ వద్ద

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AOC recruitment 2026: దేశసేవ చేయాలని కలలు కంటున్న యువతకు ఇండియన్ ఆర్మీ చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. కేవలం పదవ తరగతి ఉత్తీర్ణతతో ఇండియన్ ఆర్మీలో భారీగా ఉద్యోగాలను రిక్రూట్ చేస్తోంది.తాజాగా భారత సైన్యం, ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ గ్రూస్ సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్ మెంట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ట్రేడ్స్ మెన్ మేట్, ఫైర్ మాన్, ఎమ్ టీఎస్ వంటి పలు విభాగాల్లో మొత్తం 2,615 ఖాళీలకు ఈ రిక్రూట్ మెంట్ నిర్వహిస్తోంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 24, 2026 నుంచి సెప్టెంబర్ 23, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అధికారిక తాత్కాలిక ఖాళీల పత్రం ప్రకారం.. ఈ ఖాళీలలో 2,313 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు, 656 ఫైర్‌మ్యాన్ పోస్టులు.. 99 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. దీంతో ఈ జాబితాలోని మొత్తం ఖాళీల సంఖ్య 3,068కి చేరుకుంది. ఈ సంఖ్యలు తాత్కాలికమైనవి అయినప్పటికీ.. వివరణాత్మక రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయినప్పుడు మారే అవకాశం ఉంటుంది. జీత భత్యాలు: పోస్టును బట్టి జీతభత్యాలు కూడా మారుతూ ఉంటాయి. ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు పే లెవల్ 1 కిందకు వస్తాయి. వీటి జీతం రూ. 18,000 నుండి రూ. 56,900 వరకు ఉంటుంది. కాగా, ఫైర్‌మ్యాన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు పే లెవల్ 2 కిందకు వస్తాయి. వీరికి జీతం రూ. 19,900 నుండి రూ. 63,200 వరకు ఉంటుంది. అర్హులు: విద్యా అర్హత పోస్టుపై ఆధారపడి ఉంటుంది. దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు ఖచ్చితమైన అర్హతా