Shalini Damera: ఇంటి నుంచి తీసుకు వచ్చేశారా? .. షాలినీ ఎలిమినేట్ అయిందా?
Bigg Boss Telugu 10 Day 11 Promo 2 బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పలేం. ఇక తాజాగా వదిలిన ప్రోమోని చూస్తే ఇది బిల్డప్లా ఉందే.. అని అనిపిస్తుంది. ఇంట్లోకి కొంత మంది వచ్చి.. షాలినీని పట్టుకు పోతున్నట్టుగా చూపించారు. ఇంట్లో వాళ్లు సగం మంది భయపడినా.. కొంత మందికైనా ఇదంతా ప్రాంక్ అని అర్థమై ఉంటుంది. అలా సడెన్‌గా వచ్చి.. ఓ కంటెస్టెంట్‌ను బయటకు తీసుకు వెళ్తారని ఎవ్వరూ అనుకోరు. అది అసలు షో ఫార్మాట్ కూడా కాదు. బిగ్ బాస్ కాబట్టి.. ఏమైనా జరగొచ్చు, చేయొచ్చు అని అనుకునే వారు కూడా ఉంటారు.
