
ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై మళ్లీ వడ్డన- 5 కిలోలపైనా భారం
దేశంలో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. పెంచిన రేట్లు ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 9.50 పైసల మేర పెరిగింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లపై ఎలాంటి అదనపు భారం పడలేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు ఇచ్చాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విడుదల చేసిన తాజా ధరల వివరాల ప్రకారం, ఈ పెంపు వాణిజ్య పరమైన ఎల్పీజీ వినియోగానికి మాత్రమే పరిమితమైంది. అయిదు కిలోల నాన్-డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర కూడా పెరిగింది. నిన్నటివరకు 762 రూపాయలు ఉన్న అయిదు కిలోల నాన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ధర ఇప్పుడు 764 రూపాయలకు చేరుకుంది. అయిదు కిలోల డొమెస్టిక్ సిలిండర్లు, ఎక్స్ట్రాలైట్ గ్యాస్ ధరల జోలికి వెళ్లలేదు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.ఈ పెంపుతో దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశ రాజధానిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,738 నుంచి రూ. 2,747.50కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 2,691.50 నుంచి రూ. 2,701కు పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 10.50 పైసల మేర పెరిగింది. ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2,916.50కు చేరుకుంది.నేటి నుంచి.. అరుణాచలం, తమిళనాడులోని ఇతర ఆలయాలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనికహోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారాలు, ఇతర చిరు క్యాంటీన్లు.. ఈ 19 కిలోల వాణిజ్య సిలిండర్లపైనే ఆధారపడతాయి. తాజా పెంపు పెద్ద వడ్డన కాకపోయినప్పటికీ.. ఇప్పటికే రేట్లు 2,800 రూపాయలను దాటిన నేపథ్యంలో అవి భారంగానే మారాయి. చిన్న చిన్న హోటళ్ల నిర్వహణ వ్యయంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది



