
ప్రభుత్వ డేటా భద్రత.. ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను సమీక్షించి, రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్ జరిగింది. ఇంటర్నె్ట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల్లో అమలవుతున్న సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను సమీక్షించి, రాష్ట్ర ప్రభుత్వ డేటా భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీటీఎస్ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ వర్క్‌షాప్ తాజాగా జరిగింది. ‘రాష్ట్ర డేటా భద్రత కోసం ప్రభుత్వ వ్యవస్థల్లో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ల బలోపేతం’ అంశంపై ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈ వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS ) ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సేవలను వేగంగా డిజిటలైజ్ చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పౌరుల వ్యక్తిగత సమాచారం, ఆరోగ్య వివరాలు, విద్య, భూ రికార్డులు, సంక్షేమ పథకాలు, ఆర్థిక లావాదేవీల వంటి అత్యంత కీలకమైన ప్రభుత్వ డేటాను రక్షించడం ప్రభుత్వ అత్యున్నత బాధ్యతగా మారిందని మన్నవ మోహన కృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖ ప్రస్తుతం సైబర్ భద్రతను ఏ విధంగా అమలు చేస్తోంది? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటోంది? వాటిని అధిగమించేందుకు ఎలాంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు అవసరమనే అంశాలపై ఈ వర్క్‌షాప్‌లో విస్తృతంగా చర్చించినట్లు మన్నవ మోహన కృష్ణ తెలిపారు. అన్ని శాఖల్లో అత్యుత్తమ సైబర్ సెక్యూరిటీ ప్రమాణాలు అమలు చేయడం, డేటా భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. సైబర్ దాడుల స్వరూపం రోజురోజుకూ మారుతున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు నిరంతర