
Blood Sugar Control: షుగర్ ఉన్నవారు భోజనం తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు.. బ్లడ్ షుగర్ కంట్రోల్!
Blood Sugar Control: షుగర్ ఉన్నవారు భోజనం తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు.. బ్లడ్ షుగర్ కంట్రోల్!

Blood Sugar Control: షుగర్ ఉన్నవారు భోజనం తర్వాత ఈ చిన్న పని చేస్తే చాలు.. బ్లడ్ షుగర్ కంట్రోల్!

Pithapuram: ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గం కుమారపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికుల ఆధ్వర్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శ్రీ అభయ బ్లడ్ సెంటర్ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురు జనసైనికులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం నాయకులు, జనసైనికులు కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో, సేవా భావంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్న తీరు తమకు స్ఫూర్తినిస్తోందని, ఆయన ఆశయాల సాధన కోసం ఎల్లప్పుడూ ఆయన నాయకత్వంలో పనిచేస్తామని తెలిపారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, కుమారపురం గ్రామ జనసైనికులు, గ్రామస్తులు, శ్రీ అభయ బ్లడ్ సెంటర్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

ఛాతీలో నొప్పి లేదా మంట వస్తే చాలామంది గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా లక్షణాలు గుండె సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. గ్యాస్ నొప్పి, గుండెపోటు లక్షణాల మధ్య తేడాను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ డెస్క్: ఛాతీలో మంట, నొప్పి లేదా అసౌకర్యం కనిపించినప్పుడు చాలామంది దాన్ని గ్యాస్ సమస్యగా భావిస్తుంటారు. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం, వికారం వంటి లక్షణాలు ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యేనని అనుకుంటారు. అయితే ఇలాంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెకు సంబంధించిన సమస్యల్లోనూ కనిపించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఛాతీలో అసౌకర్యం కలిగినప్పుడు కారణాన్ని నిర్ధారించకుండా నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నప్పుడు సాధారణంగా పొట్ట పైభాగంలో అసౌకర్యం, ఛాతీ కింది భాగంలో నొప్పి లేదా మంట కనిపించవచ్చు. కడుపు ఉబ్బినట్లు అనిపించడం, తేన్పులు రావడం, అజీర్తి వంటి సమస్యలు కూడా ఉండొచ్చు. అయితే కేవలం లక్షణాలను బట్టి ఇది గ్యాస్ సమస్యేనని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఛాతీలో బిగుతుగా, భారంగా లేదా ఒత్తిడిగా అనిపించవచ్చు. కొందరిలో ఛాతీ నొప్పితో పాటు వికారం, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో గుండె సమస్య లక్షణాలు అజీర్తి లేదా గ్యాస్ సమస్యను పోలి ఉండే అవకాశం ఉంది. అందుకే ఛాతీ నొప్పిని కేవలం గ్యాస్ అని భావించి ఇంట్లోనే ఉండిపోవడం సరికాదని నిపుణులు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ గుండె సంబంధిత సమస్యలపై జాగ్రత్త అవసరం. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర వంటి అంశాలు ఉన్నవారు ఛాతీ సంబంధిత లక్షణాలను తేలిగ్గా తీసుకోకూడదు. ఛాతీలో కొత్తగా లేదా తీవ్రమైన నొప్పి రావడం, నొప్పి తగ్గకుండా కొనసాగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చల్లటి చెమటలు, మూర్ఛ

బ్లూ టీ.. షుగర్ ఉన్నవారు తాగొచ్చా..? బ్లూ టీ.. షుగర్ ఉన్నవారు తాగొచ్చా..? September 02 Jyothi Gadda యాంటీఆక్సిడెంట్ల నిధి: బ్లూ టీలో ఆంథోసైనిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఉచిత రాడికల్స్ నాశనం చేసి కణాల నష్టాన్ని సమర్థవంతంగా అరికడతాయి. బరువు తగ్గడానికి సహాయం: ఈ టీలో కేలరీలు మరియు ఫ్యాట్ ఉండవు. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. చర్మ, కేశ సంరక్షణ: బ్లూ టీ తాగడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మంపై ముడతలు రాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గించి, జుట్టు దృఢంగా పెరిగేందుకు సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళన నివారణ: బ్లూ టీలో ఉండే సహజ పదార్థాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన, అలసటను తగ్గించి మూడ్‌ని తక్షణమే మెరుగుపరుస్తాయి. మధుమేహ నియంత్రణ: ఈ టీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా అడ్డుకుని డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుదల: బ్లూ టీ చెడు కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూస్తూ హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది. మెదడు చురుకుదనం పెంపు: ఇందులో ఉండే అసిటైల్ కోలైన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచి, వయస్సుతో పాటు వచ్చే అల్జీమర్స్ వంటి సమస్యలను అరికడుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు: పరగడుపున బ్లూ టీ తాగడం వల్ల శరీరంలో నిలిచిపోయిన వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్! ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!

నేరేడు పండు తింటే షుగర్ అదుపులోకి వస్తుందా? ఈ వార్తకు సంబంధించిన

బెండకాయలో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే కిడ్నీలో రాళ్లు, ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు, రక్తం పలుచబడే మందులు వాడేవారు బెండకాయను తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంటర్నెట్ డెస్క్: బెండకాయ మనం రోజూ వండుకునే కూరగాయల్లో ఒకటి. ఇందులో పీచుపదార్థం, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే బెండకాయను ఆరోగ్యకరమైన కూరగాయగా భావిస్తారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బెండకాయను ఎక్కువగా తినే ముందు జాగ్రత్తగా ఉండాలి. బెండకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే పలు రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అందువల్ల సమతుల్య ఆహారంలో బెండకాయను చేర్చుకోవచ్చు. అయితే బెండకాయలో ఆక్సలేట్లు కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని ఎంత మోతాదులో తీసుకోవాలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయ తినకూడదా? కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బెండకాయను పూర్తిగా మానేయాల్సిన అవసరం సాధారణంగా ఉండదు. ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే సమస్య ఉన్నవారు ఆహారంలో ఆక్సలేట్ పరిమాణంపై శ్రద్ధ పెట్టాలి. అయితే ప్రతి వ్యక్తి పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది. రాళ్ల రకం, నీరు ఎంత తాగుతున్నారు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వైద్యులు లేదా డైటీషియన్ సరైన ఆహారాన్ని సూచిస్తారు. గౌట్ సమస్య ఉన్నవారు సాధారణంగా ప్యూరిన్లు ఎక్కువగా ఉండే ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉంటారు. అయితే బెండకాయలోని ఆక్సలేట్లు గౌట్‌ను పెంచుతాయని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. కాబట్టి బెండకాయ తింటే గౌట్ తప్పకుండా పెరుగుతుందని చెప్పడం సరైనది కాదు. గౌట్ ఉన్నవారు వైద్యులు సూచించిన ఆహారం, మందులను క్రమం తప్పకుండా పాటించడం ముఖ్యం. బెండకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది చాలామందికి జీర్ణక్రియకు సహాయపడుతుంది. కానీ కొంతమందిలో ఎక్కువ పీచుపదార్థం తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు

Anakapalli: అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు! Anakapalli: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి వేల్పులవీధి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి మాజీ మంత్రి, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ప్రోత్సాహంతో మెగా యూత్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ శ్రీ సురభి హరీష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరానికి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, సేవా కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమరశెట్టి రామ్కీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమం.. జన్మదిన వేడుక. రెండింటినీ కలిపిన ఈ కార్యక్రమం అనకాపల్లిలో జనసేన శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది

షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ పచ్చి ముక్కను రోజుకొకటి తింటే చాలుఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చే తర తరాల నాటి రెసిపీ Prasanna Yadla 01 september 2026 Pic credit - Pinterest ఉల్లిపాయను మన అన్ని కూరల్లో వేసుకుని తింటాము. ఎందుకంటే, ఇది తిన్న వెంటనే అరిగిపోతోంది ఉల్లిపాయ దీనిని తీసుకుంటే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. శరీరానికి ఎన్నో లాభాలు దీనిని ఆహారంలో దీనిని తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. పోషకాలు ఈ పచ్చి ఉల్లిపాయను మీరు రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు రక్తంలో చక్కెర స్థాయిలు ఈ ఉల్లిపాయలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉండటం బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరగకుండా చేస్తాయి గ్లైసెమిక్ ఇండెక్స్ డయాబెటిస్ తో బాధ పడేవాళ్ళు ఈ పచ్చి ఉల్లిపాయను టిఫిన్ చేసేటప్పుడు కూడా తీసుకోవచ్చు. టిఫిన్ చేసేటప్పుడు అయితే, నిపుణుల చెప్పిన దాని ప్రకారం రోజుకు సుమారు 50 గ్రాములు తీసుకుంటే ఫలితం చూస్తారు సుమారు 50 గ్రాములు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. చిరంజీవి సినీ రంగంలో సాధించిన విజయాలను, ఆయన సామాజిక సేవను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు."ప్రముఖ చలనచిత్ర నటుడు, కేంద్ర మాజీ మంత్రి, పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. 1978లో తెలుగు చిత్రసీమలో అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదిగి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని మెగాస్టార్‌గా నిలిచారు" అని చంద్రబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.అంతేకాకుండా, చిరంజీవి సామాజిక స్పృహను కూడా చంద్రబాబు ప్రశంసించారు. "రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకుని సమాజం పట్ల తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, సినీ ప్రేక్షకులను మరింతగా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు చిరంజీవికి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

విక్టరీ వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని అభిమానులు సామాజిక సేవతో ప్రత్యేకంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో 43 మంది అభిమానులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తూ అభిమానులకు తన ప్రశంసలు తెలియజేశారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా వేడుకలకే పరిమితం కాకుండా సేవను ఎంచుకోవడాన్ని ఆయన కొనియాడారు. ఆల్ ఇండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. వెంకటేష్ 1986 ఆగస్టు 14న విడుదలైన ‘కలియుగ పాండవులు’ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి కుటుంబ కథా చిత్రాలతో పాటు విభిన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తయిన సందర్భాన్ని గుర్తుండిపోయేలా చేయాలనే ఉద్దేశంతో అభిమానులు రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రక్తదాన శిబిరంలో మొత్తం 43 మంది అభిమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తం అందించారు. దీంతో ఒక సినీ మైలురాయిని అభిమానులు సామాజిక బాధ్యతతో అనుసంధానించిన ప్రత్యేక కార్యక్రమంగా ఇది నిలిచింది. ఇదిలా ఉండగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున చిరంజీవి, అభిమాన సంఘం అధ్యక్షుడు రామకృష్ణకు ప్రత్యేక అభినందన లేఖ పంపారు. వెంకటేష్ 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని రక్తదానం వంటి సేవా కార్యక్రమంతో జరుపుకోవడం అభినందనీయమని అందులో పేర్కొన్నారు. వెంకటేష్‌తో తనకున్న స్నేహాన్ని కూడా చిరంజీవి తన అభినందన సందేశంలో ప్రస్తావించినట్లు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి విభిన్న పాత్రల వరకు వెంకటేష్ ప్రేక్షకులను అలరిస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఫలితంగా అభిమానుల సేవా కార్యక్రమంతో పాటు ఇద్దరు సీనియర్ నటుల మధ్య స్నేహం కూడా మరోసారి ప్రధానంగా నిలిచింది. ఈ నేపథ్యంలో రక్తదానం చేసిన 43 మందిని ‘బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’గా అభివర్ణిస్తూ చిరంజీవి కృతజ్ఞతలు

విక్టరీ వెంకటేష్ తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా ఆయన అభిమానులు చేసిన పనికి మెగాస్టార్ చిరంజీవి ఫిదా అయ్యారు. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 40 వసంతాలు పూర్తి చేసుకున్న అరుదైన సందర్భంగా ఆయన అభిమానులు చేసిన గొప్ప సేవా కార్యక్రమంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రశంసల జల్లు కురిపించారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆల్ ఇండియా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 43 మంది వెంకటేష్ అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అభిమానాన్ని సేవగా మలిచి ప్రాణదాతలుగా నిలిచిన అభిమానులను అభినందిస్తూ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఓ అభినందన లేఖను విడుదల చేశారు. ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రామకృష్ణకు రాసిన లేఖలో చిరంజీవి తన ఆప్తమిత్రుడు వెంకటేష్‌పై ఉన్న ప్రేమాభిమానాలను పంచుకున్నారు. ‘‘నాలుగు దశాబ్దాలుగా తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ, కుటుంబ కథా చిత్రాల నుంచి విభిన్నమైన పాత్రల వరకు తనదైన ప్రత్యేకతను చాటుకున్న నా స్నేహితుడు విక్టరీ వెంకటేష్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మరెన్నో సంవత్సరాలు ప్రేక్షకులను అలరిస్తూ, మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే రక్తదానం చేసిన అభిమానులను కొనియాడుతూ.. ‘‘తమ అభిమాన కథానాయకుడి సినీ ప్రయాణంలో ఒక మైలురాయిని సమాజానికి ఉపయోగపడే రక్తదానం వంటి గొప్ప సేవా కార్యక్రమంతో జరుపుకోవడం నిజంగా అభినందనీయం. అభిమానం సేవా రూపం దాల్చినప్పుడు అది సమాజానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ శిబిరాన్ని నిర్వహించిన టీమ్‌తో పాటు.. రక్తదానం చేసిన 43 మంది ‘బ్లడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్’కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అందించిన రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుంది’’

ధనియాలు వంటల రుచిని, సువాసనను పెంచడమే కాదు.. వీటిలో ఉండే పలు పోషకాలు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డెస్క్: వంటల్లో సువాసన, రుచిని పెంచేందుకు ధనియాలను విరివిగా ఉపయోగిస్తాం. అయితే ధనియాల్లో రుచితో పాటు పలు పోషకాలు, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. అందుకే ధనియాలను నీటిలో నానబెట్టి తీసుకునే అలవాటు చాలామందిలో ఉంది. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ధనియాల నీటిని తాగితే జీర్ణక్రియకు మేలు చేస్తుందని చెబుతారు. ధనియాల నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియకు కొంత ఉపశమనం లభించవచ్చని భావిస్తారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి స్వల్ప సమస్యల్లో ఉపయోగకరంగా ఉండొచ్చు. అయితే మలబద్ధకం లేదా ఎసిడిటీకి ఇది ఖచ్చితమైన చికిత్స కాదు. ధనియాల నీరు శరీరానికి ద్రవాలను అందించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఎక్కువగా కాకుండా కొద్దిగా తీసుకోవడం మంచిది. నిద్రకు ముందు అధికంగా ద్రవాలు తాగితే మధ్యలో బాత్రూమ్కు వెళ్లాల్సి రావచ్చు. ధనియాల్లో ఉండే కొన్ని సహజ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం చూపవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే ధనియాల నీటిని మధుమేహానికి చికిత్సగా భావించకూడదు. మధుమేహానికి మందులు వాడుతున్న వారు ఇలాంటి పానీయాలను క్రమం తప్పకుండా తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ధనియాల నీరు తాగడం వల్ల నేరుగా శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు. అయితే ఇది తక్కువ కేలరీల పానీయం కావడంతో చక్కెర కలిపిన పానీయాలకు బదులుగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఎంపికగా ఉంటుంది. బరువు తగ్గడానికి సమతుల ఆహారం, వ్యాయామం, సరైన నిద్ర ముఖ్యమైనవి. ధనియాల్లోని కొన్ని సహజ సమ్మేళనాలు శరీరానికి విశ్రాంతి కలిగించడంలో సహాయపడవచ్చని చెబుతారు. అయితే ధనియాల నీరు తాగితే నిద్ర నాణ్యత ఖచ్చితంగా మెరుగుపడుతుందని నిర్ధారించడానికి తగిన ఆధారాలు లేవు. రాత్రి తేలికపాటి ధనియాల నీటిని తీసుకోవడం వల్ల కొందరికి ఉదయం జీర్ణక్రియ సాఫీగా

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు మరోసారి థియేటర్లలో మాస్ జాతర మొదలుకానుంది. చిరంజీవి కెరీర్లో మాస్ ఎంటర్టైనర్గా నిలిచిన ‘ముఠామేస్త్రీ’ (muta mestri) ఇప్పుడు సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వింటేజ్ సినిమాల రీ రిలీజ్‌లకు వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను 4K వెర్షన్లో రీ రిలీజ్ చేయనున్నారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ముఠామేస్త్రీ’ 1993లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు చిరంజీవి మాస్ ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కూలీ నాయకుడిగా మెగాస్టార్ చేసిన పాత్ర, ఆయన మేనరిజమ్స్, యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో మీనా, రోజా కథానాయికలుగా నటించారు. రాజ్-కోటి అందించిన సంగీతం అప్పట్లో విశేషంగా ఆదరణ పొందింది. పాటల్లో చిరంజీవి డ్యాన్స్, ఆయన ఎనర్జీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు అప్పటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసేలా 4K వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే ఈ సినిమాతో సెలబ్రేషన్స్ మొదలుపెట్టనున్నారు. ఆగస్టు 21న ‘ముఠామేస్త్రీ’ 4K వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు

ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే వారి డైట్ లిస్ట్‌లో యాపిల్ సైడర్ వెనిగర్ పక్కాగా కనిపిస్తుంది. ఉదయాన్నే పరగడుపున తాగాలా? భోజనానికి ముందు తీసుకోవాలా? లేక సలాడ్లలో కలుపుకోవాలా? అనే విషయంలో చాలా మందికి డౌట్లు ఉంటాయి. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ కేవలం సోషల్ మీడియా ప్రచారం మాత్రమే కాదని, దీనివల్ల కొన్ని వాస్తవ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ దానిని ఏ సమయంలో, ఏ పరిమాణంలో, ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం అత్యంత ముఖ్యం. యాపిల్స్ పులియబెట్టే ప్రక్రియలో ఇందులో ఎసిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ కాంపౌండే అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మూలకారణమని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. న్యూట్రిషన్ పరిశోధకురాలు కరోల్ జాన్స్టన్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భోజనంతో పాటు వెనిగర్ తీసుకోవడం వల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా అదుపులో ఉంటాయి. 2017లో జరిగిన మరో మెటా-ఎనాలసిస్ సైతం ఆహారం తర్వాత రక్తంలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్పందనలను తగ్గించడంలో వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుందని నిర్ధారించింది. బరువు తగ్గడంలో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? యాపిల్ సైడర్ వెనిగర్ తాగితే కొవ్వు కరిగిపోతుందని, బెల్లీ ఫ్యాట్ మాయమవుతుందని ప్రచారాలు ఉన్నప్పటికీ, అది వాస్తవం కాదు. 2009లో జపనీస్ పరిశోధకుడు టోమూ కొండో నేతృత్వంలో 175 మందిపై జరిగిన 12 వారాల అధ్యయనంలో.. ప్రతిరోజూ వెనిగర్ తీసుకున్న వారిలో శరీర బరువు, బీఎంఐ, శరీర కొవ్వులో స్వల్ప మార్పులు కనిపించాయి. అంటే సరైన ఆహార నియమాలతో పాటు దీన్ని తీసుకుంటే బరువు నియంత్రణకు కొంతవరకు మద్దతు ఇస్తుందే తప్ప, అద్భుతాలు ఏమీ చేయదని అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాలో చెప్పుకునేలా యాపిల్ సైడర్ వెనిగర్ గట్ హెల్త్‌ను పూర్తిగా బాగు చేస్తుందా అంటే ఇంకా పూర్తి ఆధారాలు లేవు. జంతువులపై చేసిన ప్రాథమిక

కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే!కాజు తింటే లావవుతారా? ప్రతిరోజూ మితంగా తింటే జరిగే హెల్త్ మ్యాజిక్ ఇదే! August 16 Jyothi Gadda బరువు నియంత్రణ: జీడిపప్పులోని ప్రోటీన్లు, ఫైబర్ కడుపును నిండుగా ఉంచి అతిగా తినకుండా నిరోధిస్తాయి. దీనిలోని మంచి కొవ్వులు జీవక్రియను పెంచి శరీర బరువును అదుపులో ఉంచుతాయి. గుండె ఆరోగ్యం: కాజులో ఉండే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రక్తపోటు అదుపు: జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను ప్రశాంతపరచి, అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. ఎముకల దృఢత్వం: కాజులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల సాంద్రతను పెంచి, ఎముకలు బలహీనపడకుండా మరియు ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడతాయి. రోగనిరోధక శక్తి: జీడిపప్పులో ఉండే జింక్, విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, రకరకాల ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ కలిగిస్తాయి. మెదడు పనితీరు: కాజులో ఉండే లినోలెయిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు కణాల ఆరోగ్యానికి దోహదపడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచి, నరాల వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. మెరిసే చర్మం: జీడిపప్పులో కాపర్ (రాగి), జింక్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తాయి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తాయి. జుట్టు ఆరోగ్యం: కాజులోని రాగి పదార్థం జుట్టుకు సహజమైన నలుపు రంగును ఇచ్చే మెలానిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే ఐరన్, జింక్ వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు ఊడటం తగ్గుతుంది. కంటి చూపు: జీడిపప్పులో లుటీన్, జీజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హానికారక కాంతి నుంచి కళ్లను కాపాడి, వయస్సుతో వచ్చే కంటి సమస్యలను

ఉసిరి నిజంగానే డయాబెటీస్‌ను తగ్గిస్తుందా? వాస్తవమేంటి?ఉసిరి నిజంగానే డయాబెటీస్‌ను తగ్గిస్తుందా? వాస్తవమేంటి? 16 August 2026 Anand T ఉసిరి వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికి తెలుసుకు. అయితే దీన్ని తినడం వల్ల మధుమేహం తగ్గుతుందని కొందరు నమ్ముతారు. మరీ దీనిలో నిజమెంతా తెలుసుకుందాం పదండి ఉసిరి నిజానికి టైప్-2 మధుమేహాన్ని ఉసిరి పూర్తిగా నయం చేయలేము, దీనితోపాటు సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కేవలం డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు అంతే. సాధారణంగా ఉసిరిలో క్రోమియం అనే ఇన్సులిన్ ఉంటుంది. ఇది నిరోధకతను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. అంతేకాదు ఇందులోని విటమిన్ సి పుస్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారిలో రోగనిరోధక శక్తిని పెంచి, అలసట, నీరసాన్ని తగ్గిస్తుంది. ఉసిరిలోని పోషకాలు క్లోమ గ్రంథి పనితీరును బెటర్ చేసి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కాసిరిగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తి మీ బాడీలో రోజంతా షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి అంటే ఉదయం పరగడుపున కొద్దిగా నీటిలో ఉసిరి రసం కలిపి తాగడం మంచిది అయితే ఉసిరి అనేది డయాబెటీస్‌ను కంట్రోల్లో ఉంచుతుంది తప్పా.. పూర్తిగా నియంత్రించలేదు. కాబట్టి వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఈ సహజ చిట్కాలు పాటిస్తూనే.. క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీరు బెటర్ అవుతున్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్

విశాఖపట్నంలోని నేవల్ క్వార్టర్స్‌లో ఉండే ఒక యువకుడు రోజూ మాదిరిగా స్పోర్ట్స్ ప్రాక్టీస్‌కు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. షూస్ వేసుకుని, పక్కనే ఉన్న తన స్పోర్ట్స్ బ్యాగులో గ్లౌస్ సర్దుకునేందుకు దానిని చేతిలోకి తీసుకున్నాడు. అయితే బ్యాగు పట్టుకునేసరికి లోపల ఏదో కదులుతున్న అలికిడి వినిపించింది. వెంటనే జిప్ తెరిచి చూసి అవాక్కయ్యాడు. బ్యాగులోపల అత్యంత ప్రమాదకరమైన ‘రక్తపింజరి’ పాము తిష్ట వేసి ఉంది. దీంతో ఆ యువకుడు భయంతో గట్టిగా కేకలు పెట్టాడు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై స్థానిక స్నేక్ క్యాచర్ నాగరాజుకు సమాచారం అందించారు. తక్షణమే అక్కడకు చేరుకున్న నాగరాజు, ఎంతో చాకచక్యంగా ఆ విషసర్పం నుంచి కుటుంబ సభ్యులను రక్షించారు. పామును సురక్షితంగా డబ్బాలో బంధింది అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ పాము కాటు వేస్తే శరీరంలో రక్తం గడ్డకట్టి, అంతర్గత రక్తస్రావంతో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. వర్షాకాలం, చలికాలంలో ఇలాంటి విషసర్పాలు ఆశ్రయం కోసం దుస్తులు, బ్యాగుల్లోకి చేరే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో! నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్ ఏటా వెయ్యి కోట్ల గుడ్లు వృథా.. భారత్‌పై ఎన్ఈసీసీ సంచలన నివేదిక! 10వ తరగతి అర్హతతో రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక! నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!

కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..!కరివేపాకు మహిమ.. ఖాళీ కడుపుతో 3 ఆకులు తింటే చాలు, బంపర్ బెనిఫిట్స్..! August 15 Jyothi Gadda జీర్ణక్రియ మెరుగుపడుతుంది: ఉదయాన్నే పచ్చి కరివేపాకులను బాగా నమలి తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర అదుపు: కరివేపాకులో ఉండే ప్రత్యేక పోషకాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు పరగడుపున తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయం: కరివేపాకులో ఉండే ఇథైల్ అసిటేట్, మహనింబిన్ వంటి రసాయనాలు శరీరంలో కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి. పరగడుపున వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కరివేపాకులో విటమిన్- బి, సి, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కుదుళ్లకు తగిన పోషణను అందించి జుట్టు రాలడాన్ని అరికడతాయి. క్రమంగా ఒత్తైన, నల్లని దృఢమైన జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇందులో విటమిన్- ఎ సమృద్ధిగా లభిస్తుంది. ఉదయాన్నే కరివేపాకు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నివారణకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇవి కాలేయాని కి రక్షణగా నిలిచి దాని పనితీరును మరింత చురుగ్గా మారుస్తాయి. కరివేపాకులో ఇనుము, ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ప్రతిరోజూ పరగడుపున నమలడం వల్ల శరీరంలో ఎర్ర రక్తకణాలు పెరిగి, అనిమియా లేదా రక్తహీనత సమస్య నుండి సులువుగా బయటపడవచ్చు. రక్తనాళాల్లో కొవ్వు నిల్వలు చేరకుండా కరివేపాకులోని భాగాలు నిరోధిస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుతుంది. మరిన్ని వెబ్ స్టోరీస్ రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!

మజ్జిగలో ఉప్పు ఎక్కువగా కలుపుతున్నారా.. ముందు ఇది తెలుసుకోండి మజ్జిగలో ఉప్పు ఎక్కువగా కలుపుతున్నారా.. ముందు ఇది తెలుసుకోండి Prasanna Yadla 15 August 2026 Pic credit - Pinterest కొందరు మజ్జిగ తాగేటప్పుడు నార్మల్ గా తాగరు. మజ్జిగలో ఉప్పు వేసుకుని తాగుతారు. మజ్జిగలో ఉప్పు ఇంకా అధిక సోడియం తీసుకోవడం వలన కొందరిలో రక్తపోటు అమాంతం పెరగొచ్చు. రక్తపోటు ఉప్పు ఎక్కువగా ఉన్న మజ్జిగను పదే పదే తాగడం కూడా అంత మంచిది కాదు మజ్జిగ ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరుతుంది. ఇంకా కొందరికి ఉబ్బరంగా కూడా ఉంటుంది . కొందరికి ఉబ్బరంగా ఈ కిడ్నీలు మీ శరీరంలోని సోడియంను కూడా ఇది నియంత్రిస్తుంది. ఇంకా కిడ్నీ సమస్యలు ఉన్నవారు కేర్ గా ఉండాలి కిడ్నీ సమస్యలు ఉప్పు తగ్గించి మజ్జిగను తీసుకుంటే ఏం కాదు, మరి ఎక్కువైతేనే సమస్య మరి ఎక్కువైతేనే సమస్య అధిక రక్తపోటు ఉన్నవారు కూడా దీనిని మితంగానే తీసుకోవాలి. అప్పుడే మంచిగా ఉంటుంది అధిక రక్తపోటు (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

మన రోజువారి ఆహారంలో అన్నం ఒక ముఖ్యమైన భాగం. అయితే, నేటి కాలంలో మధుమేహం (డయాబెటిస్) బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో అన్నం తినడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా "వేడి వేడి అన్నం తింటే షుగర్ పెరుగుతుందని తినడమే మానేస్తున్నారు". నిజంగా వేడి అన్నం తింటే డయాబెటీస్ పెరుగుతుందా? చద్దన్నంతిని బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసకోవచ్చా? శాస్త్రీయ దృక్కోణంలో వేడి అన్నం, చద్దన్నం , బ్లడ్ షుగర్ నియంత్రణకు సంబంధించిన ముఖ్య విషయాలను వివరంగా తెలుసుకుందాం. వండిన వెంటనే పొగలు కక్కే వేడి వేడి అన్నాన్ని తినడం వల్ల అందులోని పిండి పదార్థాలు (రైపిడ్లీ డైజెస్టిబుల్ స్టార్చ్) శరీరంలో చాలా వేగంగా జీర్ణమవుతాయి. ఫలితంగా రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదలవుతుంది. దీనివల్ల 'బ్లడ్ షుగర్ స్పైక్స్' (రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగడం) ఏర్పడతాయి. తరచూ ఇలా వేడి అన్నం అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరిగి, డయాబెటిస్ నిర్వహణ కష్టతరం అవుతుంది. అన్నాన్ని వండిన తర్వాత చల్లార్చడం లేదా రాత్రంతా ఫ్రిడ్జ్ లో పెట్టి చద్దన్నంగా మార్చడం వల్ల ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. ఈ ప్రక్రియలో అన్నంలోని సాధారణ స్టార్చ్ 'రెసిస్టెంట్ స్టార్చ్' (Resistant Starch) గా మారుతుంది. ఈ రెసిస్టెంట్ స్టార్చ్ చిన్నపేగులో త్వరగా జీర్ణం కాకుండా, నేరుగా పెద్దపేగుకు చేరుకుంటుంది. అక్కడి మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) కు ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. 24 గంటలు ప్రిడ్జ్ లో చల్లారిన అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీనివల్ల తిన్న తర్వాత బ్లడ్ షుగర్ వేగంగా పెరగదు. అయితే దీనికి తగినంత ఫైబర్ ను ఆడ్ చేసుకుని తినడం చాలామంచింది. పీచు పదార్ధాలు ఎక్కువగా ఉన్న కూరగాయలను దీనికి జత చేసి తింటే బ్లడ్ షుగర్ పెరగడం అనే మాట ఉండదు. అంతే కాదు ఈ రకంగా తినడం వల్ల రెసిస్టెంట్

కిడ్నీ సమస్య ఉన్నవారు డయాలసిస్ కోసం తప్పనిసరిగా ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిందే. వారానికి రెండు, మూడు సార్లు డయాలసిస్ కేంద్రానికి వెళ్లాలి. గంటల తరబడి చికిత్స తీసుకోవాలి. సూదుల బాధను భరించాలి. రోజువారీ పనులకు కూడా అంతరాయం కలుగుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చే దిశగా ఓ కొత్త కృత్రిమ మూత్రపిండం ఆశలు రేపుతోంది. ‘హోల్లీ’ (Holly) పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ పరికరాన్ని శరీరంలోనే అమర్చవచ్చు. ఇది నిరంతరం రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగించేలా రూపొందిస్తున్నారు.కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడు 24 గంటలూ రక్తాన్ని శుద్ధి చేస్తుంటాయి. డయాలసిస్‌లో మాత్రం ఈ పని వారంలో కొన్ని గంటలు మాత్రమే జరుగుతుంది. 'హోల్లీ' కూడా సహజ కిడ్నీలా నిరంతరం పనిచేసేలా రూపొందిస్తున్నారు. శస్త్రచికిత్స ద్వారా దీన్ని శరీరంలో అమర్చి.. పెల్విస్ ప్రాంతంలోని రక్తనాళాలకు అనుసంధానిస్తారు. రక్తంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడం దీని ప్రధాన ఉద్దేశం.ప్రస్తుతం డయాలసిస్ కోసం రోగులు తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోంది. కొత్త పరికరం అందుబాటులోకి వస్తే ఈ అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పరికరం రోజంతా శరీరంలోనే పనిచేస్తుంది. నీటిని తొలగించే ప్రక్రియను అవసరానికి అనుగుణంగా ఉంటుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. దీంతో పని, ప్రయాణం, ఇతర రోజువారీ పనులను కొనసాగించే అవకాశం కలగొచ్చు.కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఇది కొంతకాలం ఉపయోగపడే అవకాశముంది. అయితే ఇప్పుడే డయాలసిస్‌కు పూర్తిగా ప్రత్యామ్నాయం వచ్చేసిందని చెప్పలేం. 'హోల్లీ' ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. మనుషులపై క్లినికల్ పరీక్షలు జరగాలి. ఇది సురక్షితమా?

One Cigarette a Day: కొందరు ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూనే కనిపిస్తారు.. ఇంకా కొంతమంది గతంలో కంటే.. చాలా తగ్గించానని చెబుతారు.. మరికొందరు.. రోజుకు ఒక్కటి మాత్రమే తాగుతున్నానని చెప్పుకొస్తారు.. అయితే, రోజుకు ఒక్క సిగరెట్ మాత్రమే తాగుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదని చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఒక్క సిగరెట్ తాగడం ఒత్తిడి తగ్గించుకునే అలవాటుగా భావిస్తారు. కానీ, న్యూరాలజిస్టుల ప్రకారం.. రోజుకు ఒక్క సిగరెట్ కూడా పూర్తిగా సురక్షితం కాదు. తక్కువ స్థాయిలో ధూమపానం చేసినా గుండె, రక్తనాళాలు, మెదడు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించి స్ట్రోక్ ముప్పును పెంచవచ్చు. ఒక్క సిగరెట్ మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది? సిగరెట్ పొగలో ఉండే నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ శరీరంలోని హృదయ, రక్తనాళ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. నికోటిన్ కొంతకాలం రక్తపోటు, గుండె వేగాన్ని పెంచుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తం ఆక్సిజన్‌ను సమర్థంగా తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ధూమపానం రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీయడంతో పాటు వాటిలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. కాలక్రమంలో రక్తనాళాలు ఇరుకుగా మారి, రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో రక్తం గడ్డకట్టి మెదడుకు రక్తప్రవాహం అడ్డుపడే ప్రమాదం పెరుగుతుంది. నిద్రకు ముందు సిగరెట్ తాగితే ప్రమాదం తగ్గుతుందా? సిగరెట్ తాగే సమయం మారినంత మాత్రాన దాని హానికర ప్రభావాలు తగ్గవు. నిద్రకు ముందు తాగే ఒక్క సిగరెట్ ద్వారా కూడా నికోటిన్, ఇతర విషపూరిత పదార్థాలు శరీరంలోకి చేరుతాయి. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఆందోళనకరంగా ఉంటుంది. ధూమపానం వల్ల వచ్చే స్ట్రోక్ ప్రమాదం కేవలం రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారనే దానిపైనే ఆధారపడదు. తక్కువ స్థాయిలో ధూమపానం చేసినా హృదయ, రక్తనాళ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ ప్రమాదాన్ని ఎలా తగ్గించుకోవాలి?
బీట్రూట్లో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుందని హెల్త్‌లైన్ తెలిపింది. సాల్మన్, ట్యూనా, మాకెరెల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. పాలకూర, కాలే వంటి ఆకుకూరల్లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పుగా చేస్తాయి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇందులో సల్ఫర్ ఉంటుంది. ఇది రక్తనాళాలను సడలించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ప్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాల గోడలను బలంగా ఉంచుతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరింపచేస్తాయి. దానిమ్మ తింటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనంతో పాటుగా నైట్రేట్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది. వాల్‌నట్స్‌లో ఆల్పా లినోలెనిక్ యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను వెడల్పు చేస్తాయి. దీంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) కలిసి అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఎ), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించాయి. అమెరికా స్వాతంత్య్ర 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచి ప్రాణాలను కాపాడాలనే గొప్ప లక్ష్యంతో కమ్యూనిటీని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. శ్రీనివాస్ లావు (తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్), సోహిని అయినాల (ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్), శేఖర్ కొల్లు (ఆర్ ఆర్), మధుకర్ యార్లగడ్డ (ఫౌండేషన్ ట్రస్టీ, తామా చైర్మన్), భరత్ మద్దినేని (బోర్డ్ డైరెక్టర్), సునీల్ దేవరపల్లి (సోషియల్ వెల్ఫేర్ కో ఆర్డినేటర్), సునీత పొత్నూరు (తామా ప్రెసిడెంట్ ఎలక్ట్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అట్లాంటా కాన్సుల్ జనరల్ శ్రీ రమేష్ బాబు లక్ష్మణన్ గారు హాజరయ్యారు. వారి హాజరు ఈ సేవా కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి అంకితభావంతో కృషి చేసిన చైతన్య కొర్రపాటి, దీప్తి తాళ్లూరి, మాలతి నాగభైరవ (తానా కళాశాల చైర్), ఆర్తిక (తానా మేట్రిమోనియల్ చైర్), మరియు తిరు చిల్లపల్లి తదితరులతోపాటు స్థానిక తానా, తామా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలను నాయకులు తెలియజేశారు. ఈ మహత్తర కార్యక్రమంలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలను కూడా నిర్వాహకులు తెలియజేశారు. Click here for Photogallery

ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరి నోటా వినపడుతున్న పేరు క్వినోవా. వైట్ రైస్ లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. అదే.. క్వినోవాలో అయితే... ఫైబర్, ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటాయి. మరి, అలాంటి ఈ క్వినోవాని వైట్ రైస్ స్థానంలో నెల రోజులు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపడటం దగ్గర నుంచి.. బరువు తగ్గడం వరకు ఈ 30 రోజుల్లో ఎలాంటి మార్పులు చూస్తారో ఇప్పుడు చూద్దాం.. వైట్ రైస్ తో పోలిస్తే క్వినోవా లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్ కి బదులుగా క్వినోవా తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. ఇది తిన్నప్పుడు రోజంతా పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఫలితంగా సులభంగా బరువు తగ్గుతారు. క్వినోవాలోని అధిక ఫైబర్ ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. రోజూ తగినంత నీరు తాగుతూ క్వినోవా తింటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే, ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో తినడం ప్రారంభిస్తే మొదట్లో కాస్త గ్యాస్ లేదా పొట్ట ఉబ్బరంగా అనిపించవచ్చు, కాబట్టి నెమ్మదిగా అలవాటు చేసుకోవడం మంచిది. క్వినోవా తిన్నంత మాత్రాన మ్యాజిక్‌లా బరువు తగ్గిపోరు. కానీ, ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగించడం వల్ల రోజువారీ కేలరీల వినియోగం తగ్గుతుంది. ఇది క్రమంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది.అలా అని దీనిని కూడా మరీ ఎక్కువగా తినకూడదు. క్వినోవాలోని అతిపెద్ద ప్రత్యేకత ఏంటంటే..దీని వల్ల మనకు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌ను అందిస్తుంది. శాకాహారులకు వైట్ రైస్ కంటే ఇది ఒక అద్భుతమైన, పుష్కలమైన ప్రోటీన్ మూలం. 5. బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో.. వైట్ రైస్ తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో ఉండే

టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్టైన్మెంట్ న్యూస్ అప్డేట్స్కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి! ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి. అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి ‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం బ్లడీ రోమియోపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీ భాగస్వామ్యంపై చిత్ర బృందం ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన లెనిన్ సినిమాతో భాగ్యశ్రీ తన గ్లామర్ మరియు నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చూపుతున్నారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు తాజాగా నాని సరసన నటించే భారీ అవకాశం దక్కింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. ఇదిలా ఉండగా, బ్లడీ రోమియో కథాంశం గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దర్శకుడు సుజీత్ తన మునుపటి చిత్రం ఓజీ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా చిత్రీకరణను అక్టోబర్ నెల నుంచి ప్రారంభించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఈ కీలక సన్నివేశాలను లండన్ నగరంలో చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలను సొంతం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి ఒక తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇతర ప్రాజెక్టులతో చర్చలు జరుపుతున్నప్పటికీ, నాని సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే అధికారికంగా పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. నాని మరియు సుజీత్ కలయికలో రాబోతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు