
BJP leader's nephew Killed | భార్యతో సంబంధంపైస్నేహితుడు అనుమానం.. బీజేపీ నేత మేనల్లుడి హత్య
BJP leader's nephew Killed | భార్యతో సంబంధంపై స్నేహితుడు అనుమానం.. బీజేపీ నేత మేనల్లుడి హత్య

BJP leader's nephew Killed | భార్యతో సంబంధంపై స్నేహితుడు అనుమానం.. బీజేపీ నేత మేనల్లుడి హత్య

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana bjp chief ramchander rao fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై నిన్న జరిగిన దాడితో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య రాజకీయాలు పీక్స్ కు చేరాయి. బాధితులను పరామర్శించేందుకు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ చందర్ రావు ప్రయత్నించారు. దీంతో పోలీసులు తార్నాకాకు భారీగా చేరుకున్నారు. బీజేపీ నేతలు సైతం అక్కడకు చేరుకొవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ చీఫ్ రాంచందర్ రావును అడ్డుకుని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.దీంతో అక్కడ బీజేపీ కార్యర్తలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు రామ చందర్ రావు ముందుకు వెళ్లగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో.. రామచందర్ రావు మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచకపు పాలనసాగుతుందని అన్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే దాడులు, అడ్డుకొవడాలు ఏంటని మండిపడ్డారు. 1000 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దపు హమీలు ఇచ్చి ప్రజలను తీవ్రంగా దగా చేసిందన్నారు. Read more: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఇవే! మరోవైపు రానున్న రోజులలో కాంగ్రెస్ కు పతనం తప్పదన్నారు. ఈ ఘటనలో బీజేపీ నేత వర్షిత్ రెడ్డి ఇల్లు, కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి నిరసనగా బీజేపీ కౌంటర్ ఎటాక్‌కు దిగడంతో తెలంగాణ

తెలంగాణ కేంద్రంగా బీజేపీ నాయకత్వం ఆలోచన మారుతోంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది. తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణ నుంచి పార్టీ నేతలకు ఎలాంటి ప్రాతినిధ్యం దక్కలేదు. ఉన్న ఇద్దరు నేతలను తప్పించారు. బీజేపీ హైకమాండ్ పక్కన పెట్టటం వెనుక కారణాల పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే సమయంలో రాజాసింగ్ ఈ పరిణామాల పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కీలక అంశాలను ప్రస్తావించారు.బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి జాతీయ పార్టీలో కొనసాగు తున్న వారిని తప్పించారు. అసలు కొత్తగా ఎవరికీ అవకాశం కల్పించ లేదు. దీని వెనుక కొత్త లెక్క లు తెర మీదకు వస్తున్నాయి. దక్షిణాదిలో తెలంగాణ పైన బీజేపీ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర పార్టీకి దిశా నిర్దేశం చేస్తోంది. వరుసగా కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తూ.. పలు వర్గాలతో మమేకం అయ్యే విధంగా కార్యాచరణ అమలు అవుతోంది. ఈ సమయంలోనే జాతీయ కమిటీలో తెలంగాణ కు అవకాశం ఇవ్వకపోటం పైన రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కీలక అంశాలను ప్రస్తావిస్తూ.. పార్టీ నేతలకు సూచనలు చేసారు. అయితే, అసలు బీజేపీ వ్యూహం మరోలా ఉందనే చర్చ పార్టీ నేతల్లో వినిపిస్తోంది. 24-కోచ్‌ల వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దం: తెలుగు రాష్ట్రాలకు ఇలా, రూట్.. షెడ్యూల్..!!పార్టీ పరిణామాల పై హైకమాండ్ ఫోకస్తాజా పరిణామాల పైన స్పందించిన రాజా సింగ్.. తెలంగాణ బీజేపీలో ప్రతిసారి గ్రూప్ రాజకీయాలు, ఢిల్లీకి ఫిర్యాదులు చేయడం చేస్తారని చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు చోటు దక్కలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నాయకులు మారాలి అని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన దూకుడుగా పోరాటం చేయాల్సిన సమయంలో హైకమాండ్ ఆశించిన విధంగా వ్యవహరించకపోవటం

LB Nagar: ఎల్.బి.నగర్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఈ వార్తకు సంబంధించిన

అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతానికి సంబంధించి ఆమె చేసిన కామెంట్స్ తమ మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపిస్తూ హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్లో స్థానిక బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనసూయ కామెంట్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ విషయంలో ఇకపై జాగ్రత్తగా ఉండాలని కూడా ఆమెను హెచ్చరించారు. ఇటీవల ఓ సందర్భంలో కొందరు వ్యక్తులు ఇతరులపై దాడులకు పాల్పడుతూ జై శ్రీరామ్ నినాదాన్ని ఉపయోగిస్తున్నారంటూ అనసూయ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారితీయడంతో పాటు, కొంతమంది నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే తన మాటలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అనసూయ ఇప్పటికే స్పష్టం చేశారు. తాను ఏ మతాన్ని, వర్గాన్ని లేదా విశ్వాసాన్ని కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, ఒక నిర్దిష్ట వర్గంలోని వ్యక్తుల ప్రవర్తనను మాత్రమే ప్రస్తావించానని వివరణ ఇచ్చారు. అనసూయ గతంలోనూ సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ పలు సందర్భాల్లో వివాదాలకు కేంద్రంగా నిలిచారు. తాజా కంప్లైంట్ తో మరోసారి ఆమె కామెంట్స్ రాజకీయ, మతపరమైన చర్చకు దారితీశాయి. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదును స్వీకరించి అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ దశలో ఫిర్యాదు మినహా అనసూయపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం లేదు. ఈ వ్యవహారంపై ఆమె నుంచి మరింత వివరణ రావాల్సి ఉంది

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya) వార్తల్లో నిలిచారు. ఆమెకి మరో షాక్ తగిలింది. హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశారు. అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపించారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో అనసూయ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘జై శ్రీరామ్’ పేరుతో కొందరు దాడులకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మతపరమైన అంశాలపై సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అనసూయకు సూచించారు. అయితే ఈ వివాదంపై అనసూయ మాత్రం వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. విమర్శలు చేస్తున్న వారికి కూడా ఆమె ఘాటుగా స్పందించారు. తన వ్యాఖ్యల వల్ల ‘దొంగలంతా బయటకు వస్తున్నారు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. అనసూయ వ్యాఖ్యలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఆమెను విచారిస్తారా? ఈ వివాదం మరింత ముదురుతుందా? అనే అంశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Sonia Gandhi Vande Mataram Case: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో 'వందేమాతరం' గీతాలాపన వేళ తీవ్ర వివాదం చెలరేగింది. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అమర్యాదగా ప్రవర్తించారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ పరిణామాలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. జాతీయ గేయాన్ని అవమానించారనే ఆరోపణలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై కర్ణాటకలో బీజేపీ నేతలు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఢిల్లీలోని ఏఐసీసీ (కాంగ్రెస్) ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ గేయం (వందేమాతరం) పాడుతున్న సమయంలో సోనియా గాంధీ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వందేమాతరాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ కర్ణాటకలోని మంగళూరు ఉర్వా పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఆదివారం ఫిర్యాదు దాఖలు చేశారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత వందేమాతరం గీతాలాపన జరుగుతుండగా వేదికపై ఉన్న సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడుతూ, గీతాన్ని మధ్యలోనే ఆపేయాలన్నట్లుగా సైగలు చేశారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సోనియా గాంధీ చేసిన ఈ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలకు దారితీసింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మరో విషయంపై సోనియా గాంధీ మాట్లాడారని.. జాతీయ గీతం ఆపేయాలంటూ వచ్చిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. అయితే వందేమాతరం పాడే సమయంలో అలా కదలాడి, మాట్లాడాల్సిన అవసరం ఏమిటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు

ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందు లో భాగంగా ఏపీలో పార్టీ పటిష్ఠత పైన కొత్త టాస్క్ ఫిక్స్ చేస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీలో అయిదు రోజులు మకాం వేయనున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసి.. ఏపీలో పార్టీ భవిష్యత్ లక్ష్యాల పైనా స్పష్టత ఇవ్వనున్నారు.పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీకి వస్తున్నారు. అయిదు రోజుల పర్యటన ఫిక్స్ అయింది. పార్టీ ముఖ్య నేతలతో పాటుగా.. పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాగా, ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సాగుతూనే.. పార్టీ బలోపేతం పైన మేధో మథనం చేస్తున్నారు. ఇందు కోసం నేరుగా పార్టీ చీఫ్ రంగంలోకి దిగుతున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్ కి బీజేపీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం పలుకుతారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరో హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సిద్దం, ముహూర్తం ఫిక్స్..!!విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ మంత్రాంగంఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం తమకు దక్కాల్సిన సీట్ల పైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణాలో అధికారం దిశగా ఆశలు పెంచుకుంటున్న బీజేపీ ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా అవతరించాలని భావిస్తోంది. పొత్తుల్లో

Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ - పాల్గొన్న ఎంపీ ఈటల కుత్బుల్లాపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “తిరంగా ర్యాలీ”లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబూని ర్యాలీలో పాల్గొన్న ఈటల రాజేందర్, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ కలిసి జీవించే దేశం భారతదేశమని అన్నారు. మనందరం భారతమాత ముద్దుబిడ్డలమని పేర్కొన్నారు. జనగణమన, వందేమాతరం వంటి జాతీయ భావనలు అసేతు హిమాచలం భారతీయులను ఐక్యంగా ఉంచుతున్నాయని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచ పటంపై భారతదేశ ఔన్నత్యం సమున్నతంగా నిలుస్తోందన్నారు. దేశ అభివృద్ధి కోసం మోదీ కి ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి, ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మరియు ఇంచార్జి మల్లారెడ్డి, వడేపల్లి రాజేశ్వర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, జిల్లా జనరల్ సెక్రెటరీ విగ్నేష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు శేఖర్ యాదవ్, మాజీ కార్పొరేటర్ శేషగిరి రావు, కూకట్పల్లి అసెంబ్లీ ఇంచార్జ్ కాంత రావు, కన్వీనర్ శ్రీకర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల జయశేఖర్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సీనియర్ నాయకులు వేముల రమేష్, బీజేవైఎం నాయకులు శ్రీనాథ్, సాయి కిరణ్ రెడ్డి, ఆర్తిక్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో ఘనంగా 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ! Ibrahimpatnam: మున్సిపల్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ లొ మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. బూర నర్సయ్య గౌడ్ మరియు ప్రభుత్వ విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన బూర నర్సయ్య గౌడ్ గతంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో అణగదొక్కబడి ఆకలికి అలమటించామని ఎంతోమంది స్వాతంత్రం కోసం శ్రమించి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడం జరిగిందని. వచ్చిన స్వతంత్రాన్ని కాపాడుకోవాలని కోరారు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ ప్రధాని ఈ దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకు వెళుతూ ప్రగతి వైపు తీసుకు వెళుతున్నాడని ఈ సందర్భంగా చెప్పారు. భారత దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా – దేశభక్తి ప్రతి ఇంటా, త్రివర్ణ పతాకం ఎగురవేయాలని చెప్పారు. . ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. . వాయిస్ బూర నర్సయ్య గౌడ్

తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్‌లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో మోదీ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): తెలంగాణ బీజేపీ నేతలకు ఉద్యమ స్ఫూర్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. మంగళవారం పార్లమెంట్‌లోని కార్యాలయంలో తనను కలిసిన రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావుతో మోదీ మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధాని దేవెగౌడ 93 ఏళ్ల వయసులో రైతుల ప్రయోజనం కోసం రంగంలోకి దిగి నిరసన తెలిపారు. పోరాటం అంటే అదే. మన తెలంగాణ నేతలకు అంత ఉద్యమస్ఫూర్తి లేదు’’ అని పేర్కొన్నట్టు తెలిసింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి అసాధ్యుడని, తనతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర బీజేపీ నేతలను కూడా మాయ చేస్తున్నారని మోదీ వ్యాఖ్యానించినట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ ఎంతో పుంజుకోవాల్సి ఉందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. తాను రచించిన అంత్యోదయం నుంచి వికసిత్ భారత్, నరేంద్రమోదీ-భారత్‌ను విశ్వవేదికపై నిలిపిన మహానాయకుడు, జీఎస్టీ-సామాజిక న్యాయం తదితర పుస్తకాలను మోదీ మెచ్చుకున్నారని వకుళాభరణం కృష్ణమోహన్‌రావు చెప్పారు. తన పాలనపై ఇలాంటి పుస్తకాలను బీజేపీలోని సీనియర్ నేతలు ప్రచారంలోకి తేవాలన్నారని వివరించారు. ఓబీసీల కోసం ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ నేతలు తెలంగాణలో ప్రచారం చేయాల్సి ఉందని మోదీ చెప్పారని తెలిపారు. భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్ నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్

సీనియర్ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్ కుమార్ తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. సీనియర్ నటుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు శరత్ కుమార్ (Sarath Kumar) తన అభిమానులు, మద్దతుదారులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారాయి. చెన్నైలో తన మద్దతుదారులతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తన అభిమానులంతా చేతిపై ‘నాట్టామై ఫ్యామిలీ’ (Nattamai Family) అని పచ్చబొట్టు వేయించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు రాజకీయపరంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని, వారి బంధానికి గుర్తుగా ఈ పేరు ప్రతిపాదించానని తెలిపారు. తనను నేరుగా కలవడానికి ఈ పచ్చబొట్టు ఒక ‘గ్రీన్ కార్డ్’ లేదా ప్రత్యేకాధికారం (VIP పాస్) లాగా పనిచేస్తుందని శరత్ కుమార్ పేర్కొన్నారు. చేతిపై ఈ టాటూ ఉన్నవారు ఎవరైనా సరే, ఎటువంటి అడ్డంకులు లేకుండా తన్ను నేరుగా వచ్చి కలవవచ్చని వెల్లడించారు. అయితే ఇది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధన ఏమీ కాదని, ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా వేయించుకోవచ్చని స్పష్టం చేశారు. చిత్ర షూటింగ్ నిమిత్తం తనకు సమయం కుదరలేదని, బిజీగా ఉన్న షూటింగ్ షెడ్యూల్ పూర్తవ్వగానే తన చేతిపై కూడా ఈ పచ్చబొట్టును వేయించుకుంటానని ఆయన చెప్పుకొచ్చారు. దేశభక్తిని చాటుకోవడంలోనూ తాను ఎప్పుడూ ముందుంటానని తెలిపిన శరత్ కుమార్, తన కుడి భుజంపై ఇప్పటికే భారత జాతీయ పతాకాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమిళ చిత్రసీమలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘నాట్టామై’ చిత్రం శరత్ కుమార్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఇప్పుడు అదే సినిమా పేరుతో అభిమానులను ‘నాట్టామై ఫ్యామిలీ’గా ఏకం చేసేందుకు ఆయన శ్రీకారం చుట్టడం, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశమవుతోంది. మూడు రోజుల్లో