
లెనిన్’తో భాగ్యం లక్ మారినట్లేనా
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిరోజూ ఎంతో మంది కొత్త తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే తొలి చూపులోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ఆ కోవకు చెందిన అందమైన భామ భాగ్యశ్రీ బోర్సే. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిరోజూ ఎంతో మంది కొత్త తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తుంటారు. అందులో కొంతమంది మాత్రమే తొలి చూపులోనే ప్రేక్షకుల మనసు దోచుకుంటారు. ఆ కోవకు చెందిన అందమైన భామ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse). రవితేజ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో తెలుగు నాట అడుగుపెట్టిందీ ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆడియెన్స్ అటెన్షన్‌ను అమాంతం తనవైపు తిప్పుకుంది. తెరపై ఆమె కనిపించిన విధానం, డాన్సులు, గ్లామర్ చూసి కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే, ఎంట్రీ అదిరిపోయినా, లక్ పరంగా మాత్రం ఈ బ్యూటీ కాస్త వెనకబడిపోయిందనే చెప్పాలి. ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిని అందుకోలేకపోయాయి. యావరేజ్, డిజాస్టర్ రిజల్ట్స్ రావడంతో అమ్మడి కెరీర్ ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారింది. టాలీవుడ్లో నిలదొక్కుకుంటుందా లేదా అన్న సందేహాలు సినీ వర్గాల్లో మొదలయ్యాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా, మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ (Lenin) చిత్రం ఈ భామ పాలిట వరంగా మారింది. ఈ భారీ ప్రాజెక్టులో భాగ్యశ్రీకి అనుకోకుండా ఆఫర్ రావడం.. అమ్మడికి అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది. కెరీర్ ఆరంభంలో ఆశించిన ఫలితాలు రాకపోయినా, ఈ సినిమా అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని తన సత్తా చాటింది. ఇప్పటివరకు లక్ మొహం చూడని ఈ ముద్దుగుమ్మకు ‘లెనిన్’ రూపంలో ఒక సాలిడ్ గ్రాండ్ హిట్ లభించింది. సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు రావడంతో పాటు, సినిమా కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతుండటం
